మనం చదువు లేదా డ్యాన్స్ ఏదైనా కష్టపడి నేర్చుకుంటే ఏదో పెద్ద సాధించేశాం అనుకుంటాం. చాలా గర్వంగా కూడా ఫీలవ్వుతాం. తన తోటి వాళ్లకంటే మనమే బెటర్ అయితే ఇక మన ఆనందానికీ హద్దులే ఉండవు. కానీ ఇలాంటి అవకాశాలు ఏమిలేని కటిక దారిద్యం అనుభవిస్తున్న కడు పేదవారికి వారికి బతుకు పోరాటమే ఎన్నో అసామాన్యమైన నైపుణ్యాలనును అలవోకగా నేర్చకునేలా చేస్తుంది. అందుకు నిదర్శనం ఈ నీరజ అనే పనమ్మాయి కథ..!
పొట్టకూటి కోసం హైదరాబాద్ మహానగరానికి వచ్చిన వేలాది మందిలో నీరజ అనే మహిళ ఒకరు. ఆమె పనిమ్మాయిగా ఇళ్లల్లో పనిచేసే పొట్ట పోషించుకుంటోంది. ఇక్కడ నీరజ ఏదో ఒక్క ఇంట్లో కాదు, రెండు మూడు ఇళ్లల్లో పనిచేస్తుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే..ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్లాలంటే కనీసం అరగంట పడుతుంది. అంటే రోజు మొత్తంలో రెండు గంటల నడకకే పట్టేస్తుంది. ఇంత ఇబ్బంది ఉన్నా ఆమె పని మానదు. పైగా ఈ బతుకు పోరులో ఈ పాట్లు తప్పవని రాజీపడిపోయింది నీరజ. ఇక్కడే అసలే కథ మొదలయ్యింది. తనకు వేళకింత వండిపెట్టే పనమ్మాయికి కష్టం తగ్గించాలని అనుకున్నాడో యజమాని.
ఏమ్మా..! నువ్వు సైకిల్ నేర్చుకోవచ్చు కదా..! రోజూ నడుచుకుంటూ ఇంతలా కష్టపడకపోతే అన్నాడు యజమాని. ఆ మాటకు నీరజ ..చాల్లేండి సారు..ఇప్పుడూ ఈ వయసులో నేను నేర్చుకోవడం చూస్తే ఎవ్వరైన నవ్వరూ అంటూ నవ్వేసి ఊరుకుంది నీరజ. అయితే ఆ యజమాని మాత్రం వీలు చిక్కినప్పుడల్లా ‘‘సైకిల్ ఎప్పుడు నేర్చుకుంటున్నావు’ అని పోరు పెడుతూనే ఉండేవాడు. కొన్ని నెలలు తర్వాత ఆయన చేత అస్తమాను చెప్పించుకోవడం ఎందుకు? అస్సలు నేను ప్రయ్నత్నిస్తే ఏమవుతుంది అనుకుంది. వెంటనే యజమానితో నేర్చకుంటాను సార్ అని చెప్పేసింది.
దీంతో ఆయన సైకిల్‌కు అయ్యే ఖర్చులో కొంత యజమాని పెట్టుకోగా మిగతా డబ్బు నీరజ పెట్టుకుని ఓ మంచి సైకిల్ కొనుక్కుంది. అలా పనులు అయిపోయాక అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోనే సైకిల్ తొక్కడం ప్రాక్టీస్ చేసేది. కొంతకాలానికి పర్ఫెక్ట్ అయిపోయింది. అయితే ఇందులో ఏముంది అని అని తేలిగ్గా తీసేయకండి. ఎందుకంటే..నీరజకు ఈ సైకిల్ పుణ్యామా అని రోజు మొత్తం మీద దాదాపు రెండు గంటల నడక తప్పింది. పైగా సులభంగా ఇంటింటికి వెళ్లి తొందరగా పనిచేసుకోగలుగుతోంది.
ఇంకాస్త సమయం అనుకూలిస్తే ఇంకొక్క రెండిళ్లలో కూడా పనిచేసుకునే వెసులుబాటు దక్కుతుంది. నాలుగురాళ్లు వెనకేసుకోగలుగుతుంది కూడా. ఇక్కడ నైపుణ్యం అంటే ఏదో కోచింగ్ సెంటర్‌లు, కాలేజ్‌ల్లో నేర్చుకున్నదే అనుకుంటే పొరబడ్డట్టే. ఒక్కోసారి మన చుట్టు ఇలా చిన్న చితక పనులు చేసి బతికేవాళ్లకు ఆ యజమానిలా ప్రోత్సహం అందిస్తే వాళ్లు కూడా ఈజీగా నైపుణ్యాన్ని అందిపుచ్చుకోగలరు, సాధించగలరు అనేందుకు ఉదహారణ ఇది. అందుకు సంబంధించిన వీడియోని నరేష్ అనే హైదరాబాదీ ట్వీటర్‌లో షేర్ చేయడంతో ఈ విషయం వైరల్‌గా మారింది.
My cook Neeraja, walks 25 minutes each way to work. She works another 2 homes too. Totally she spends almost 1.5 to 2 hours commuting daily by walk. Inspired by @sselvan I encouraged her to cycle. Her initial response was that everybody in her neighbourhood will laugh and tease… pic.twitter.com/ydse28ic5x
— Naresh (@TopDriverIndia) April 17, 2024
Comments
Please login to add a commentAdd a comment