శ్రీలంక విజయ లక్ష్యం 362 | Sri Lanka a victory target of 362 | Sakshi
Sakshi News home page

శ్రీలంక విజయ లక్ష్యం 362

Published Mon, Jun 13 2016 12:40 AM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM

Sri Lanka a victory target of 362

లార్డ్స్: మూడో టెస్టులో ఇంగ్లండ్ జట్టు శ్రీలంక ముందు 362 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. 109/4 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆదివారం ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 7 వికెట్లకు 233 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

అలెక్స్ హేల్స్ (94) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కెప్టెన్ కుక్ (49 నాటౌట్) రాణించాడు. ఏకంగా 79 ఇన్నింగ్స్‌ల తర్వాత కుక్ ఈ మ్యాచ్‌లో సిక్సర్ కొట్టడం విశేషం. లంక బౌలర్లలో ఎరాంగా, ప్రదీప్ చెరో 3 వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనలో లంక 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement