మరో విజయం ఊరిస్తోంది..! | Third Test from today | Sakshi
Sakshi News home page

మరో విజయం ఊరిస్తోంది..!

Published Fri, Nov 25 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM

మరో విజయం ఊరిస్తోంది..!

మరో విజయం ఊరిస్తోంది..!

మళ్లీ స్పిన్ వికెట్ సిద్ధం
ఆత్మవిశ్వాసంతో భారత్
ఒత్తిడిలో ఇంగ్లండ్
నేటినుంచి మూడో టెస్టు

తొలి టెస్టు తర్వాత ఇంగ్లండ్ ఆట చూసి ‘సిరీస్‌లో భారత్‌కు గట్టిపోటీ ఖాయం’ అనిపించింది. కానీ భారత గడ్డపై ఆడటం ఎంత కష్టమో కుక్‌సేనకు వైజాగ్‌లో తెలిసొచ్చింది. స్పిన్ పిచ్‌పై ఆడలేక చేతులెత్తేసిన కుక్ బృందం భారీ విజయాన్ని భారత్‌కు అందించింది. ఇది ఒక్కసారిగా సిరీస్‌లో అంచనాలను మార్చేసింది. ఎప్పటిలాగే సొంతగడ్డపై మన టీమ్ మళ్లీ ఫేవరెట్‌గా మారిపోరుుంది.మొహాలీ పిచ్ పేసర్లకు స్వర్గధామంలాంటిది అనేది ఒకప్పటి మాట.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలంగా మారి ఇప్పుడు పూర్తిగా స్పిన్‌పరమైపోరుుంది. కాబట్టి మరోసారి మన స్పిన్ చక్రబంధంలో తిప్పేసేందుకు అశ్విన్ అండ్ కంపెనీ సిద్ధంగా ఉంది. మళ్లీ టాస్ గెలిస్తే ఈ టెస్టు కూడా విశాఖ మ్యాచ్ స్క్రీన్‌ప్లేలోనే సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ సిరీస్ కోల్పోని పటిష్ట స్థితిలో నిలుస్తుంది. 

మొహాలీ: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌కు ఒక్కసారిగా అన్నీ అనుకూలంగా మారిపోయారుు. రాజ్‌కోట్‌లో డ్రా అనంతరం విశాఖపట్నంలో దక్కిన భారీ విజయంతో జట్టు ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆశించినట్లుగానే మరో స్పిన్ వికెట్ కూడా సిద్ధమైంది. ఇక్కడి పీసీఏ మైదానంలో గత 11 టెస్టులలో ఒక్కటి కూడా ఓడని రికార్డు భారత్‌కు ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో నేటినుంచి (శనివారం) జరిగే మూడో టెస్టుకు కోహ్లి సేన సిద్ధమైంది. సిరీస్‌లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్... ఇక్కడా గెలిచి దానిని మరింత పెంచుకోవాలని పట్టుదలగా ఉంది. మరో వైపు రెండు టెస్టుల్లోనూ ఇంగ్లండ్ ఆట ‘పోరాటానికి’ పరిమితమైంది తప్ప వారికి అనుకూల ఫలితం రాలేదు. 2012లో 0-1తో వెనుకబడి సిరీస్‌ను గెలవగలిగిన ఇంగ్లండ్, ఈ మ్యాచ్‌లో అత్యుత్తమ ఆటతీరు కనబర్చాల్సి ఉంటుంది.

ముగ్గురు స్పిన్నర్లతోనే...
గాయపడిన సాహా స్థానంలో పార్థివ్ పటేల్... ఇది మినహా మన జట్టులో మరో మార్పు ఉండకపోవచ్చు. మూడో స్పిన్నర్ ఎంపికపై ముందుగా సందేహం తలెత్తినా మ్యాచ్‌కు ముందు రోజు పిచ్ పరిస్థితి చూస్తే జయంత్ ఆడటం కూడా ఖాయంగా కనిపిస్తోంది. ఏడాది క్రితం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్, జడేజా చెరో 8 వికెట్లతో చెలరేగారు. ఇప్పుడు మళ్లీ అదే ప్రదర్శన పునరావృతం చేసేందుకు వారిద్దరూ సన్నద్ధమయ్యారు. వీరిని ఎదుర్కోవడం ఇంగ్లండ్‌కు శక్తికి మించిన పని కావచ్చు. మిగతా సిరీస్ కోసం భువనేశ్వర్‌ను ఎంపిక చేసినా షమీ, ఉమేశ్ చక్కటి ప్రదర్శన ఇవ్వడంతో అతనికి తుది జట్టులో అవకాశం కష్టం. సిరీస్‌లో 337 పరుగులతో చెలరేగిన విరాట్ కోహ్లిపైనే ప్రత్యర్థి గురి పెట్టిందనడంలో సందేహం లేదు. అతడిని అడ్డుకోకపోతే కష్టమని ఇంగ్లండ్‌కు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. మరో వైపు పుజారా కూడా వరుస సెంచరీలతో చక్కటి ఫామ్‌లో ఉన్నాడు. విజయ్, రాహుల్ తమ గత వైఫల్యాన్ని సరిదిద్దుకోవాల్సి ఉంది. అరుుతే నాలుగు ఇన్నింగ్‌‌సలలో కలిపి 63 పరుగులే చేసిన రహానే కాస్త ఆందోళన పెంచుతున్నాడు. జట్టు గెలవాలంటే అతను కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లో ఒకరు తరచుగా విఫలం కావడం మంచి పరిణామం కాదు. కేవలం కోహ్లి, పుజారాలనే నమ్ముకోకుండా మిగతావారు బ్యాటింగ్‌లో రాణించాల్సి ఉంది. అశ్విన్ బ్యాటింగ్ జట్టుకు అదనపు ప్రయోజనాన్ని ఇస్తుండటం సంతోషం. ఎనిమిదేళ్ల తర్వాత పార్థివ్ టెస్టు ఆడుతుండటం విశేషం.

వారిద్దరే కీలకం
స్టోక్స్ దూకుడుగా ఆడగలడు, అలీ స్పిన్‌ను ఎదుర్కోగలడు... బెరుుర్‌స్టో ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ కాగా హమీద్ డిఫెన్‌‌స దుర్బేధ్యం... ఇంగ్లండ్ బ్యాటింగ్ బలగం చూస్తే ఈ జాబితా బాగానే ఉందనిపిస్తుంది. కానీ వాస్తవంగా చూస్తే భారత్‌లో ఆ జట్టు నిలవాలన్నా, గెలుపుపై కనీసం ఆశలు పెంచుకోవాలన్నా ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఆటనే ప్రధానమనడంలో సందేహం లేదు. వారి బలమంతా కుక్, రూట్ ప్రదర్శనపైనే ఆధారపడి ఉంది. ఉపఖండంలో అత్యుత్తమ రికార్డు ఉన్న కుక్, ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లలో ఒకడైన రూట్ మరింత మెరుగ్గా ఆడాలని జట్టు ఆశిస్తోంది. వైజాగ్ టెస్టు తొలి ఇన్నింగ్‌‌సలో రూట్ నిర్లక్ష్యపూరిత షాట్ మ్యాచ్ గమనాన్ని మారిస్తే, రెండో ఇన్నింగ్‌‌సలో కుక్ ఉన్నంత వరకు ‘డ్రా’పై నమ్మకంగా ఉన్న ఇంగ్లండ్ అతను అవుటయ్యాక కుప్పకూలింది. కాబట్టి భారత్ కోణంలో కూడా ఈ రెండు వికెట్లు ఎంతో కీలకమైనవి. పరిమిత ఓవర్లలో మంచి పేరున్నా... ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పెద్దగా ఆకట్టుకోని బట్లర్ తుది జట్టులోకి వచ్చాడు. ఏడాది క్రితం తన చివరి టెస్టు ఆడిన అతను ఏ మాత్రం ఆకట్టుకోగలడో చూడాలి. అరుుతే డకెట్, బలాన్‌‌సల వైఫల్యం నేపథ్యంలో ఇంగ్లండ్‌కు మరో ప్రత్యామ్నాయం లేకుండా పోరుుంది. గత టెస్టులో పిచ్ అనుకూలంగా లేకపోరుునా అద్భుతంగా బౌలింగ్ చేసిన బ్రాడ్ ఈ టెస్టుకు దూరం కావడం ఇంగ్లండ్‌కు పెద్ద దెబ్బ. అతని స్థానంలో వోక్స్ వస్తున్నాడు. గాయపడ్డ అన్సారీ స్థానంలో 39 ఏళ్ల ఆఫ్‌స్పిన్నర్ గారెత్ బ్యాటీ ఆడతాడు. అలీ, రషీద్ వికెట్లు తీసినా అనుకున్న స్థారుులో భారత బ్యాటింగ్‌ను కట్టడి చేయడం వారి వల్ల కావడం లేదు. ప్రస్తుతానికై తే ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తే కాస్త మ్యాచ్‌పై నమ్మకం పెట్టుకోవచ్చు.

జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), విజయ్, రాహుల్, పుజారా, రహానే, అశ్విన్, పార్థివ్, జడేజా, జయంత్, షమీ, ఉమేశ్.
ఇంగ్లండ్: కుక్ (కెప్టెన్), హమీద్, రూట్, అలీ, స్టోక్స్, బెరుుర్‌స్టో, బట్లర్, వోక్స్, రషీద్, బ్యాటీ, అండర్సన్.

‘గత రెండేళ్లలో అత్యుత్తమ ఆటను ప్రదర్శించి టెస్టులు గెలిచాం. దానిని కొనసాగించాల్సి ఉంది. ఆటగాళ్లంతా అంచనాలను అందుకోవడం పట్ల కెప్టెన్‌గా నేను సంతృప్తిగా ఉన్నాను. గాలే టెస్టులో ఓటమి తర్వాతే ప్రతీ మ్యాచ్‌కు ఆటగాళ్లను మారుస్తూ వస్తున్నాను. వ్యక్తుల కంటే జట్టు గెలుపే ముఖ్యమని అప్పుడే అందరికీ అర్థమవుతుంది. టెస్టు సిరీస్‌పైనుంచి నా ఏకాగ్రతను చెడగొట్టేందుకే బాల్ ట్యాంపరింగ్ వివాదం సృష్టించారు. ఓడిపోరుునప్పుడే ఇలాంటివి అన్నీ బయటికి వస్తారుు. నేనేదైనా తప్పు చేస్తే ఐసీసీ నేరుగా నన్నే ప్రశ్నించేది. నా దృష్టిలో ఒక పత్రికలో వచ్చిన వార్తకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. మేం ఐసీసీనే గౌరవిస్తాం. కొంత మంది సిరీస్ నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ అది సాధ్యం కాదు’  - విరాట్ కోహ్లి, భారత కెప్టెన్

పిచ్, వాతావరణం
పిచ్ పొడిగా ఉంది. ఇప్పటికే మొత్తం పచ్చికను తొలిగిం చారు. ఆరంభంలో కూడా సీమర్లకు అనుకూలించదు. మ్యాచ్ సాగిన కొద్దీ స్పిన్నర్లదే రాజ్యం. ఉత్తరాదిన వాతావరణం చల్లగా ఉన్నా, వర్షసూచన మాత్రం లేదు. తక్కువ వెలుతురు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement