కుక్ మరో వ్యాపకం | Alastair Cook aims to 'enjoy cricket again' after losing ODI captaincy | Sakshi
Sakshi News home page

కుక్ మరో వ్యాపకం

Published Wed, Dec 24 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

కుక్ మరో వ్యాపకం

కుక్ మరో వ్యాపకం

లండన్: వన్డే కెప్టెన్‌గా ఉద్వాసనకు గురవ్వడంతో పాటు ప్రపంచకప్ జట్టులో కూడా చోటు కోల్పోయిన ఇంగ్లండ్ క్రికెటర్ అలిస్టర్ కుక్ ఇప్పుడు తన రూట్ మార్చాడు. ఈ షాక్ నుంచి తేరుకునేందుకు మరో ఆటను ఎంచుకున్నాడు. ఇందులో తన సహచరుడు జేమ్స్ అండర్సన్‌ను ఓడించి సత్తా నిరూపించుకున్నాడు.
 
  ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ డార్ట్స్ చాంపియన్‌షిప్ ఐదో రోజు ఆటకు ముందు జరిగిన వన్ లెగ్ షూటౌట్‌లో అతను పాల్గొన్నాడు. ఇందులో కుక్ తొలి టర్న్‌లో 60 పాయింట్లు సాధించాడు. అయితే బ్యాటింగ్ ను ఎడమ చేతితో చేసే అతను ఇక్కడ చిన్నపాటి బాణాలను మాత్రం కుడి చేతితోనే విసిరాడు. ఓవరాల్‌గా అండర్సన్ 134 పాయింట్లు సాధించగా కుక్ 140 పాయింట్లతో నెగ్గాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement