world cup team
-
భారత టీ20 వరల్డ్‌కప్ జట్టు.. ఇద్దరు విధ్వంసకర వీరులకు చోటు..?
కరీబియన్ దీవులు, యూఎస్ఏ వేదికలుగా ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్ కోసం భారత క్రికెట్ జట్టును ఈ నెలాఖరులోగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో ప్రదర్శనల ఆధారంగా పలు ఎంపికలు ఉంటాయని తెలుస్తుంది. ప్రముఖ వార్త సంస్థ కథనం మేరకు.. భారత సెలెక్టర్లు 20 మందితో కూడిన భారత జట్టును ఇదివరకే ఎంపిక చేశారని సమాచారం. ఇందులో 15 మంది రెగ్యులర్ సభ్యులు ఉండగా.. ఐదుగురు స్టాండ్ బైలు అని తెలుస్తుంది. అందరూ ఊహించిన విధంగానే ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనుండగా.. సీనియర్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా చోటు దక్కించుకున్నారని సమాచారం. ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు విధ్వంకర వీరులు శివమ్ దూబే, రింకూ సింగ్‌లు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకన్నారని తెలుస్తుంది. భారత వరల్డ్‌కప్ జట్టుపై ఇది కేవలం ప్రచారం మాత్రమే. అధికారిక ప్రకటన వెలుడాల్సి ఉంది. టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు (నివేదికల ప్రకారం).. రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్. -
సచిన్ ప్రపంచకప్ జట్టులో ఐదుగురు భారత ఆటగాళ్లు
న్యూఢిల్లీ: బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన ప్రపంచ కప్ ఆల్ స్టార్స్ ఎలెవెన్ జట్టును ప్రకటించాడు. ఈ జాబితాలో ఐదుగురు టీమిండియా సభ్యులకు చోటు దక్కింది. అయితే, వికెట్ కీపర్‌గా భారత వెటరన్ మహేంద్ర సింగ్ ధోనికి బదులుగా ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టోను సచిన్ ఎంచుకున్నాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లి సహా మెగా టోర్నీ టాప్ స్కోరర్ రోహిత్ శర్మ, పేసర్ బుమ్రా, ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు అతడు స్థానం కల్పించాడు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఈ జట్టుకు సారథిగా ఉన్నాడు. సచిన్ వరల్డ్ కప్ జట్టు సభ్యులు: రోహిత్ శర్మ, బెయిర్‌స్టో (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), కోహ్లి, షకీబ్ అల్ హసన్, బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మిచెల్ స్టార్క్, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్. -
'టీమిండియాను తక్కువ అంచనా వేయొద్దు'
సిడ్నీ: వచ్చే ప్రపంచకప్ లో టీమిండియాను తక్కు వ అంచనా వేయొద్దని ఆసీస్ మాజీ ఆటగాడు మైకేల్ హస్సీ హెచ్చరించాడు. ఈ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆసీస్ 2-0 తేడాతో గెలిచినా.. టీమిండియా ఆటను తక్కువగా చూడొద్దని ఆసీస్ కు స్పష్టం చేశాడు. త్వరలో ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచకప్ లో టీమిండియా రాణించే అవకాశం ఉందన్నాడు.టీమిండియా రెండు నెలలపాటు ఆస్ట్రేలియాలో ఉన్న సంగతిని హస్సీ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ లోని పిచ్ లను భారత్ అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ టెస్ట్ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఆటపై ఒక అభిప్రాయానికి రావొద్దని ఆసీస్ కు సూచించాడు. డిఫెండింగ్ చాంఫియన్ షిప్ హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా అంచనాలు మించి రాణించే అవకాశం లేకపోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. -
'క్లార్క్ కు కోలుకోవడానికి ఎక్కువ సమయం కావాలి'
సిడ్నీ: ఆసీస్ ఆటగాడు మైకేల్ క్లార్క్ గాయం నుంచి తిరిగి కోలుకోవడానికి మరింత ఎక్కువ సమయం కావాలిని మాజీ ఆటగాడు మైకేల్ హస్సీ అభిప్రాయపడ్డాడు. క్లార్క్ కు మరో రెండు నుంచి మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని హస్సీ ఈ సందర్భంగా తెలిపాడు. ప్రపంచకప్ ఆరంభంలో పెద్దగా అద్బుతాలు ఏమీ ఉండవని.. అసలైన పోటీ క్వార్టర్ ఫైనల్ మరియు సెమీ ఫైనల్లోనే ఉంటుందని స్పష్టం చేశాడు. ఆసీస్ క్రికెటర్లు మరింత మంచి క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నట్లు హస్సీ తెలిపాడు.' క్లార్క్ కచ్చితంగా కీలక ఆటగాడు. కెప్టెన్ కూడా. ఆసీస్ కు అతని అవసరం చాలా ఉంది. అందువల్ల క్లార్క్ ఎక్కువ సమయం విశ్రాంతి కల్పిస్తే ప్రధాన మ్యాచ్ లకు అందుబాటులోకి వస్తాడు' అని హస్సీ తెలిపాడు. తొలి నాలుగు మ్యాచ్ లకు అందుబాటులోకి రాకపోయినా పెద్దగా ఇబ్బందేమీ లేదన్నాడు. ప్రస్తుతం ప్రపంచకప్ కు ఎంపికైన క్లార్క్ ఫిబ్రవరి 21 లోపు తన ఫిట్ నెస్ ను నిరూపించుకోవాలి. 15 మందితో కూడిన జట్టు సభ్యుల జాబితాను ఆదివారం ప్రకటించారు. అదే నెల 14న వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అదే రోజు తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో ఆస్ట్రేలియా ఆడుతుంది. ప్రస్తుతం క్లార్క్ ఫిట్ నెస్ ఆసీస్ డైలామాలో పడింది. ఒకవేళ క్లార్క్ ఫిట్ నెస్ ను నిరూపించుకోకపోతే ప్రపంచకప్ టోర్నీ మొత్తానికి దూరం కావాల్సి వస్తుంది. టీమిండియాతో డిసెంబర్ 9 వ తేదీన జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో క్లార్క్ గాయం తిరగబెట్టడంతో టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిన సంగతి తెలిసిందే. -
విండీస్ సెలక్టర్లపై గేల్ ధ్వజం
బ్రేవో, పొలార్డ్‌లకు మద్దతు జొహన్నెస్‌బర్గ్: వెస్టిండీస్ ప్రపంచకప్ జట్టులో డ్వేన్ బ్రేవో, కీరన్ పొలార్డ్‌లకు చోటివ్వకపోవడాన్ని విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ తప్పుపట్టాడు. ఈ చర్య హాస్యాస్పదంగా ఉందని సెలక్టర్లపై ధ్వజమెత్తాడు. ‘ఆ ఇద్దరు ఆటగాళ్లు జట్టులో ఎందుకుండకూడదు? బ్రేవో, పొలార్డ్ లేకుండా మాది పటిష్టమైన జట్టు అనిపించుకోదు. ఇది నిజంగా విచారకరం. ఇద్దరు కీలక ఆల్రౌండర్లను టోర్నీకి ముందే మేం కోల్పోవడం గట్టి ఎదురుదెబ్బగానే భావించాలి. దీని వెనుకాల చరిత్ర నాకు తెలీదు. కానీ నా దృష్టిలో అత్యంత చెత్త నిర్ణయం ఇది. వచ్చే ప్రపంచకప్ కోసం సిద్ధంగా ఉండేందుకు ఈ జట్టును ఎంపిక చేశారని బ్రేవో నాతో చెప్పాడు. అంటే ఈ వరల్డ్‌కప్‌ను గెలుచుకోవాల్సిన అవసరం లేదనా వారి ఉద్దేశం. మా క్రికెట్ ఎటు వెళుతుందో అర్థం కావడం లేదు. వన్డే ఫార్మాట్లో మా అతి పెద్ద ఆటగాళ్లు ఇద్దరు లేకుండా ప్రపంచకప్‌కు వెళ్లాల్సి ఉంది. ఇది మమ్మల్ని గాయపరిచింది’ అని గేల్ ఘాటుగా స్పందించాడు. -
కుక్ మరో వ్యాపకం
లండన్: వన్డే కెప్టెన్‌గా ఉద్వాసనకు గురవ్వడంతో పాటు ప్రపంచకప్ జట్టులో కూడా చోటు కోల్పోయిన ఇంగ్లండ్ క్రికెటర్ అలిస్టర్ కుక్ ఇప్పుడు తన రూట్ మార్చాడు. ఈ షాక్ నుంచి తేరుకునేందుకు మరో ఆటను ఎంచుకున్నాడు. ఇందులో తన సహచరుడు జేమ్స్ అండర్సన్‌ను ఓడించి సత్తా నిరూపించుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ డార్ట్స్ చాంపియన్‌షిప్ ఐదో రోజు ఆటకు ముందు జరిగిన వన్ లెగ్ షూటౌట్లో అతను పాల్గొన్నాడు. ఇందులో కుక్ తొలి టర్న్‌లో 60 పాయింట్లు సాధించాడు. అయితే బ్యాటింగ్ ను ఎడమ చేతితో చేసే అతను ఇక్కడ చిన్నపాటి బాణాలను మాత్రం కుడి చేతితోనే విసిరాడు. ఓవరాల్‌గా అండర్సన్ 134 పాయింట్లు సాధించగా కుక్ 140 పాయింట్లతో నెగ్గాడు.