'టీమిండియాను తక్కువ అంచనా వేయొద్దు' | Don't underestimate India after Test loss, Hussey | Sakshi
Sakshi News home page

'టీమిండియాను తక్కువ అంచనా వేయొద్దు'

Published Tue, Jan 13 2015 11:04 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

'టీమిండియాను తక్కువ అంచనా వేయొద్దు'

'టీమిండియాను తక్కువ అంచనా వేయొద్దు'

సిడ్నీ: వచ్చే ప్రపంచకప్ లో టీమిండియాను తక్కు వ అంచనా వేయొద్దని ఆసీస్ మాజీ ఆటగాడు మైకేల్  హస్సీ హెచ్చరించాడు. ఈ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆసీస్ 2-0 తేడాతో గెలిచినా..  టీమిండియా ఆటను తక్కువగా చూడొద్దని ఆసీస్ కు స్పష్టం చేశాడు. త్వరలో ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచకప్ లో టీమిండియా రాణించే అవకాశం ఉందన్నాడు.టీమిండియా రెండు నెలలపాటు ఆస్ట్రేలియాలో ఉన్న సంగతిని హస్సీ ఈ సందర్భంగా గుర్తు చేశాడు.

 

ఈ నేపథ్యంలో ఆసీస్ లోని పిచ్ లను భారత్ అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ టెస్ట్ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఆటపై ఒక అభిప్రాయానికి రావొద్దని ఆసీస్ కు సూచించాడు. డిఫెండింగ్ చాంఫియన్ షిప్ హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా అంచనాలు మించి రాణించే అవకాశం లేకపోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement