Michael Hussey
-
ప్లేఆఫ్ ముంగిట ధోని ఫిట్‌నెస్‌పై హస్సీ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే రెండో జట్టుగా ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 77 పరుగుల విజయంతో 17 పాయింట్లు ఖాతాలో వేసుకున్న సీఎస్కే గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-1 ఆడనుంది. కేకేఆర్‌తో మ్యాచ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ విజయం దిశగా పయనిస్తున్నప్పటికి అనుకున్న ఓవర్లలో పూర్తి చేయకపోవడంతో రన్‌రేట్ సీఎస్కే కంటే తక్కువ ఉంది. దీంతో సీఎస్కే రెండో స్థానంలో నిలచి సొంత ప్రేక్షకుల మధ్య క్వాలిఫయర్-1 ఆడనుంది. ఇదిలా ఉంటే ధోని ఫిట్‌నెస్‌పై సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్ ఆరంభం నుంచి ధోని మోకాలి సమస్యతో బాధపడుతున్నాడని.. అందుకే పరుగులు తీసేందుకు ఇష్టపడడం లేదని తెలిపాడు. సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్ మిడ్ ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో మైక్ హస్సీ కామెంటేటర్‌తో మాట్లాడాడు. ధోని మోకాలి సమస్య వంద శాతం సమసిపోలేదు. ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అందుకే ఎక్కువగా పరుగు పెట్టేందుకు ఇష్టపడడం లేదు. బ్యాటింగ్‌కు కూడా ఆఖరి 2-3 ఓవర్లలో రావడానికి కారణం కూడా అదే. నొప్పిని భరిస్తూనే తన పనిని పూర్తి చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇంత బాధపెట్టుకొని కూడా అతను తన టార్గెట్‌ను మిస్ అవకుండా బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకొని సక్సెస్ అవుతున్నాడు అని చెప్పాడు. కాగా ధోని విషయంలో హస్సీ చేసిన వ్యాఖ్యలు నిజమే. ధోని కూడా మ్యాచ్‌ల్లో చాలాసార్లు తన మోకాలికి బ్యాండేజీ లేదా ఐస్‌క్యాప్ పెట్టుకోవడం కనిపించింది. అంతేకాదు ధోనికి ఈ సీజన్ చివరిదని రూమర్లు కూడా వచ్చాయి. కానీ రూమర్లను స్వయంగా కొట్టిపారేసిన ధోని 2024 ఐపీఎల్ కూడా ఆడొచ్చని పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. ఇక హస్సీ వ్యాఖ్యలు సీఎస్కే అభిమానులను ఆందోళనలో పడేసింది. ఒకవేళ ప్లేఆఫ్ సమయానికి ధోనికి మోకాలి సమస్య ఎక్కువై మ్యాచ్‌కు దూరమైతే సీఎస్కే పరిస్థితి ఏంటని తెగ బాధపడుతున్నారు. ''దయచేసి అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని.. ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సమయంలో ధోని ఫిట్‌నెస్‌పై ఆందోళన కలిగించేలా మాట్లాడడం సరికాదని'' అభిమానులు పేర్కొన్నారు. చదవండి: జడేజాపై సీరియస్ అయిన ధోని! -
టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్ కీలక నిర్ణయం!
టీ20 ప్రపంచకప్-2022కు ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు 'కోచింగ్ కన్సల్టెంట్స్'గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు మైఖేల్ హస్సీ, డేవిడ్ సేకర్లను ఈసీబీ నియమించింది. ఈ మెగా ఈవెంట్లో వీరిద్దరూ ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్ మాథ్యూ మాట్‌తో కలిసి పనిచేయనున్నారు. కాగా ఇప్పటికే రిచర్డ్ డాసన్, కార్ల్ హాప్కిన్సన్ రూపంలో ఇంగ్లండ్‌కు ఇద్దరు అసిస్టెంట్ కోచ్‌లు ఉన్నారు. కాగా మైఖేల్ హస్సీ, డేవిడ్‌కు సేకర్‌లకు గతంలో కోచ్‌లగా పనిచేసిన అనుభవం ఉంది. మైఖేల్ హస్సీ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తుండగా.. ఇక సేకర్ 2010 నుంచి 2015 వరకు ఇంగ్లండ్ బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇక ఇప్పటికే ఈ పొట్టి ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ జట్టుకు ఈసీబీ ప్రకటించింది. ఈ మెగా టోర్నీకి ముందు ఇంగ్లండ్ పాకిస్తాన్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లీష్ జట్టు ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ నుంచే ఇంగ్లండ్ జట్టుతో హస్సీ,సేకర్ల ప్రయాణం ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), మోయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లీ, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, అలెక్స్ హేల్స్. రిజర్వ్: లియామ్ డాసన్, రిచర్డ్ గ్లీసన్, టైమల్ మిల్స్. చదవండి: T20 World Cup 2022: 'ఆ ముగ్గురు ఐపీఎల్లో అదరగొట్టారు.. భారత జట్టులో ఉండాల్సింది' -
కరోనా: కోలుకున్న హస్సీ.. సాహాకు వింత అనుభవం
ఢిల్లీ: ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు.. సీఎస్‌కు బ్యాటింగ్ కోచ్ మైకెల్ హస్సీ కరోనా నుంచి కోలుకున్నాడు. తాజాగా నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో హస్సీకి నెగెటివ్‌గా తేలింది. కాగా హస్సీ ఆదివారం ఆస్ట్రేలియాకు వెళ్లనున్నట్లు సమాచారం. కాగా హస్సీకి రెండుసార్లు కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు. ''హస్సీకి నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో కోవిడ్ నెగెటివ్‌గా తేలింది. ప్రస్తుతం అతను కోలుకున్నాడు. హస్సీ ఆసీస్ వెళ్లే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. మే 15 వరకు ఆస్ట్రేలియా భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో హస్సీ ట్రావెల్ బ్యాన్ ముగిసేవరకు ఇక్కడే ఉంటాడు. ఒకవేళ ఆస్ట్రేలియా విమానాల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు పెట్టకపోతే ఆదివారం హస్సీ ఆసీస్‌కు బయల్దేరుతాడు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తిరిగి ఆంక్షలు పెడితే మాత్రం హస్సీ మాల్దీవ్స్‌కు వెళ్లి అక్కడి నుంచి ఆసీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అతను ఆసీస్ వెళ్లే వరకు జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాది'' అంటూ ముగించాడు. కాగా ఐపీఎల్ 14వ సీజన్ రద్దు తర్వాత కామెంటేటర్ మైకెల్ స్లేటర్ సహా 40 మంది ఆసీస్ ఆటగాళ్లు మాల్దీవ్స్‌కు వెళ్లి అక్కడి నుంచి ఆసీస్ చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక టీమిండియా వికెట్‌కీపర్.. ఎస్ఆర్హెచ్ ఆటగాడు వృద్ధిమాన్ సాహాకు కోవిడ్ పరీక్షలో వింత అనుభవం ఎదురైంది. ఐపీఎల్ 14వ సీజన్ నడుస్తుండగానే సాహాకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో వెంటనే క్వారంటైన్‌కు వెళ్లిపోయాడు. ఇటీవలే 15 రోజుల ఐసోలేషన్ పూర్తి చేసుకున్న సాహా మరోసారి కోవిడ్ పరీక్ష చేయించుకున్నాడు. తొలిసారి పాజిటివ్ రావడంతో మరోసారి పరీక్ష చేయించుకున్నాడు. అయితే రెండోసారి నెగెటివ్ అని వచ్చింది. దీంతో సాహా మరో 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండడనున్నట్లు స్వయంగా వెల్లడించాడు. కాగా ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌కు ఎంపిక చేసిన టీమిండియా జట్టును బీసీసీఐ ముంబైలో ఏర్పాటు చేసిన బయోబబూల్‌లో ఉంచనుంది. చదవండి: మైకెల్ హస్సీకి మళ్లీ కరోనా పాజిటివ్ -
Michael Hussey: మైకెల్ హస్సీకి మళ్లీ కరోనా పాజిటివ్
ఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీకి మళ్లీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శనివారం నిర్వహించిన పరీక్షల్లో ఆస్ట్రేలియా క్రికెటర్‌కు కరోనా నెగెటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. వైరస్ నుంచి కోలుకుంటున్న సమయంలో తాజాగా మంగళవారం మళ్లీ పాజిటివ్ రావడంతో మరికొన్ని రోజులు హస్సీ భారత్‌లోనే ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆసీస్ మాజీ ఆటగాడు చెన్నైలోని ఓ హోటల్లో ఐసోలేషన్‌లో ఉంటూ కోలుకుంటున్నాడు. హస్సీతో పాటు చెన్నై బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, బస్ క్లీనర్‌కు మే 3న కరోనా సోకింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ 2021 సీజన్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. కాగా ఈ సీజన్లో ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు జరగ్గా.. మరో 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. చదవండి: ఇండియా గురించే ఆలోచిస్తున్నా: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ -
'తొందరపడ్డావు.. కొంచెం ఆగుంటే బాగుండేది'
సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 3వ ఓవర్లోనే ఔట్అయిన సంగతి తెలిసిందే. 5 పరుగులు చేసిన వార్నర్ సిరాజ్ బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వార్నర్ అవుట్ కావడంపై ఆసీస్ మాజీ ఆటగాడు మార్క్‌వా అసంతృప్తి వ్యక్తం చేశాడు.వార్నర్ ఔట్ అయిన విధానం నాకు నచ్చలేదు. ఒక లూజ్ షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. మ్యాచ్ ఆరంభమైన 20 నిమిషాలకే ఆ షాట్ ఎందుకు ఆడాడో అర్థం కాలేదు. టెస్టు మ్యాచ్‌లో ఆరంభం నుంచి దూకుడు అవసరం లేదనే విషయం వార్నర్‌కు తెలుసు... అయినా తొందరపడ్డాడు. కాస్త ఓపికగా వ్యవహరించి ఉంటే బాగుండేది. ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని వదిలేయకుండా ఒక లూజ్ షాట్ ఆడి వికెట్ సమర్పించుకోవడం కరెక్ట్ కాదు అంటూ మార్క్‌వా చెప్పుకొచ్చాడు. (చదవండి: రిషభ్ పంత్‌పై ట్రోలింగ్.. సైనీ తొలి వికెట్!) మరో మాజీ ఆటగాడు మైకెల్ హస్సీ కూడా వార్నర్ షాట్‌పై పెదవి విరిచాడు. వార్నర్ బాడీ లాంగ్వేజ్‌లో చాలా తేడా కనిపించింది. అతను వంద శాతం ఫిట్‌గా లేకున్నా మ్యాచ్‌లోకి బరిలోకి దిగాడనిపిస్తుంది. షాట్ ఎంపికలో వార్నర్ పొరపాటు స్పష్టంగా తెలుస్తుందంటూ తెలిపాడు. కాగా టీమిండియాతో జరిగిన రెండో వన్డే అనంతరం గాయపడిన వార్నర్ చివరి వన్డేతో పాటు మూడు టీ20ల సిరీస్‌కు దూరమయ్యాడు. మొదట టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని భావించినా గాయం తీవ్రత తగ్గకపోవడంతో తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్నాడు.(చదవండి: మహ్మద్ సిరాజ్ కంటతడి) అయితే మూడో టెస్టుకు ఎంపిక చేసే సమయానికి వార్నర్ 100శాతం ఫిట్‌గా లేకున్నా క్రికెట్ ఆస్రేలియా అతన్ని తుది జట్టులోకి తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. తాజాగా వార్నర్ మూడో టెస్టులో త్వరగా ఔట్ కావడంతో మరోసారి అతని ఫిట్‌నెస్‌పై సందేహాలు తలెత్తాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆస్ట్రేలియా 55 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. లబుషేన్ 67 పరుగులతో, స్టీవ్ స్మిత్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. -
'పాంటింగ్ గెలుపు కోసం చూస్తాడు.. ధోని మాత్రం'
సిడ్నీ : ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పై ప్రశంసల వర్షం కురిపించాడు. కెప్టెన్సీ విషయంలో రికీ పాంటింగ్ కంటే ధోనినే బెటర్‌గా కనిపిస్తాడని హస్సీ పేర్కొన్నాడు. ఇటీవల ఒక ఇన్స్టాగ్రాం లైవ్ చాట్‌లో పాల్గొన్న హస్సీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. రికీ పాంటింగ్ సారధ్యంలో 2007 ప్రపంచకప్, 2006, 2009 చాంపియన్స్ ట్రోపీ గెలవడంలో హస్సీ కీలక పాత్ర పోషించాడు. ఇటు ఎంఎస్ ధోని సారధ్యంలోనూ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలోనూ హస్సీ ప్రముఖ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరు కెప్టెన్సీలో ఆడిన మీరు ఎవరిని ఉత్తమ కెప్టెన్‌గా ఎంపిక చేసుకుంటారనే ప్రశ్న హస్సీకి ఎదురైంది. (‘ఆ బ్యాట్‌తో ధోని ఆడొద్దన్నాడు’) దీనికి హస్సీ స్పందిస్తూ' నా దృష్టిలో పాంటింగ్, ధోనిలిద్దరు అత్యుత్తమ కెప్టెన్లే. కానీ నాయకత్వ విషయంలో ఇద్దరి మధ్య చాలా వత్యాసాలు కనిపిస్తాయి. ముందుగా పాంటింగ్ విషయానికి వస్తే.. అతడికి నాయకత్వం వహించడం అంటే ఇష్టం. గెలవడం అంటే ఇంకా ఇష్టం. ప్రతి విషయంలోనూ కచ్చితత్వాన్ని కోరుకుంటాడు. చివరికి ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా జట్టును ముందుండి నడిపిస్తాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అతడే ఆ కష్టాన్ని ముందుగా ఎదుర్కొంటాడు. ఆటగాళ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాడు. (దక్షిణాఫ్రికా క్రికెటర్‌కు కరోనా పాజిటివ్) ఇదే లక్షణం ధోనిలోనూ కనబడుతుంది. మ్యాచ్ ఆసాంతం ధోని ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. అనవసరంగా ఒత్తిడికి లోనయ్యే నిర్ణయాలను తీసుకోడు. బౌలర్లకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ వారికి ఒత్తిడి తగ్గిస్తాడు. అయితే కొన్ని సార్లు ధోనీ తీసుకునే నిర్ణయాలు షాక్‌కు గురిచేస్తాయి. అయితే ఆ నిర్ణయాలు కచ్చితంగా పనిచేస్తూ ఫలితాలను రాబడతాయి. ధోనీకి తనపై తనకున్న నమ్మకమే అతను తీసుకునే నిర్ణయంలోనూ కనబడుతుంది. ఈ విషయంలో మాత్రం నేను పాంటింగ్ కంటే ధోనినే అత్యుత్తమమని చెప్పగలను' అంటూ పేర్కొన్నాడు. 2012లో ఆటకు రిటైర్మంట్ ప్రకటించిన మైక్ హస్సీ ఆస్ట్రేలియా తరపున 185 వన్డేలు, 79 టెస్టులు, 38 టీ20లు ఆడాడు. ఇక ఐపీఎల్లో చెన్నె సూపర్‌కింగ్స్ తరపున ఆడిన హస్సీ 2018 నుంచి అదే జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు. (ధావన్ ఒక ఇడియట్..స్ట్రైక్ తీసుకోనన్నాడు..!) -
‘అతడు లేకున్నా.. కప్ గెలిచి తీరుతుంది’
సౌతాంప్టన్ : డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ అరంగేట్రం నుంచే టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా ఐసీసీ వంటి మెగా టోర్నీల్లో అతడికి అద్భుత రికార్డు ఉంది. మొత్తం ఆరు సెంచరీలు (చాంపియన్స్ ట్రోఫీలో 3, ప్రపంచ కప్‌లలో 3) బాదాడు. అన్నింటికి మించి ధావన్–రోహిత్ శర్మ ప్రపంచ అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ. వీరిద్దరు ఎన్నో చక్కటి ఆరంభాలు ఇచ్చారు. ఒకరు విఫలమైనా మరొకరు రాణిస్తూ... వన్‌డౌన్‌లో వచ్చే కెప్టెన్ కోహ్లికి అండగా నిలుస్తున్నారు. అయితే ప్రపంచకప్ మిగతా మ్యాచ్‌లకు ధావన్ దూరమవడం కచ్చితంగా టీమిండియాపై ప్రభావం చూపుతుందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ మాత్రం పై వ్యాఖ్యలను కొట్టిపారేశాడు. ‘శిఖర్ ధావన్ గాయం కారణంగా దూరమవడంతో టీమిండియాకు వచ్చిన పెద్ద నష్టమేమి లేదు. ఎందుకంటే ఆ జట్టులో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. అతడి స్థానాన్ని భర్తీ చేసే సమర్థులు ఉన్నారు. దీంతో ధావన్ దూరం అయినా ప్రపంచకప్ టీమిండియాదే. ధావన్ దూరం కావడంతో రోహిత్, కోహ్లిపై మరింత భారం పడుతుంది. రెండో ఓపెనర్‌గా రాహుల్ ముందు పెద్ద బాధ్యతే ఉంది. రాహుల్ నిరూపించుకనే సమయం వచ్చింది’అంటూ హస్సీ పేర్కొన్నాడు. ఇక గాయం కారణంగా ధావన్ దూరం కావడంతో పంత్ జట్టులోకి చేరాడు. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో మూడు విజయాలతో జోరు మీదున్న కోహ్లి సేన ఆరెంజ్ జెర్సీతో శనివారం అఫ్గానిస్తాతో తలపడనుంది. చదవండి: నేను వెళ్తున్నా.. ధావన్ భావోద్వేగం ‘ధావన్ గొప్ప పోరాటయోధుడు’ -
‘ధోనికి విశ్రాంతి ఇస్తే అది చాలా పెద్ద రిస్క్’
చెన్నై: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనికి విశ్రాంతి ఇస్తే అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ పేర్కొన్నాడు. ఒకవేళ ధోనికి విశ్రాంతి ఇస్తే మాత్రం అది చాలా పెద్ద రిస్క్ తీసుకోవడమేనన్నాడు. గత వారం సన్ రైజర్స్ హైదరాబాద్ జరిగిన మ్యాచ్‌లో ధోని విశ్రాంతి తీసుకోగా, ఆ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయింది. అయితే ఆమ్యాచ్ నుంచి ధోని విశ్రాంతి తీసుకోవడానికి వెన్నునొప్పి బాధించడమేనని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో హస్సీ స్పందించాడు. ‘ధోని అప్పుడప్పుడు వెన్ను నొప్పితో కొంత ఇబ్బంది పడుతున్నాడు. కానీ, అది అంత తీవ్రమైందేమి కాదు. ఒక్క మ్యాచ్ నుంచి కూడా విశ్రాంతి తీసుకోవాలనుకోవట్లేదని ధోనినే చెప్పాడు. ప్రస్తుతం ధోనీ వందశాతం ఫిట్‌గా ఉన్నాడు. అందుకే ఈ సీజన్లో ధోని బ్యాట్‌తోనూ బాగా రాణిస్తున్నాడు. అటు సారథిగా, ఇటు ఆటగాడిగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ధోనికి విశ్రాంతి ఇస్తే అది జట్టుపై ప్రభావం చూపుతుంది. ఇక వాట్సన్ విషయంలో ధోని, ఫ్లెమింగ్ చూపించిన నమ్మకం చాలా గొప్పది. వరుసగా విఫలమైనా సరే వాట్సన్‌కు మళ్లీ మళ్లీ అవకాశాలు కల్పించారు. అందుకు తగ్గ ప్రతిఫలం పొందారు. ఐపీఎల్‌లాంటి లీగ్‌లో ఒక ఆటగాడికి అన్ని అవకాశాలు ఇవ్వడం సాధారణ విషయం కాదు. బ్యాట్స్‌మెన్ ఏ నంబర్లో వచ్చినా మంచి భాగస్వామ్యాలు చేయడం ముఖ్యం. అదే మేము నమ్ముతున్నాం’ అని హస్సీ పేర్కొన్నాడు. -
చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ముంబై ఇండియన్స్‌తో శనివారం వాంఖేడే మైదానంలో జరిగిన ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన జాదవ్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మ్యాచ్ చివరిలో వచ్చి కీలక షాట్లతో జట్టుకు విజయాన్ని అందించాడు. చివరి ఓవర్లో 7 పరుగులు అవసరం కాగా సిక్స్, ఫోర్ బాది సత్తా చాటాడు. తొడ నరాలు పట్టేయడంతో జాదవ్ ఐపీఎల్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మిడిలార్డర్లో కీలక బ్యాట్స్‌మన్ అయిన జాదవ్ గాయంతో తప్పుకోవడం తమ జట్టుకు పెద్ద నష్టమని బ్యాటింగ్ కోచ్ మైకేల్ హసీ పేర్కొన్నాడు. జనవరిలో జరిగిన వేలంలో రూ. 7.8 కోట్లకు అతడిని చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. తర్వాతి మ్యాచ్‌లో జాదవ్ స్థానంలో ఎవరిని ఆడిస్తారో చూడాలి. మంగళవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సూపర్ కింగ్స్ తలపడనుంది. -
విరాట్‌ను స్లెడ్జ్ చేస్తే.. ఇక అంతే!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లిని రెచ్చగొట్టి వికెట్ సాధించాలనుకునే ఆస్ట్రేలియా ప్రణాళికతో ఆ దేశ మాజీ క్రికెటర్ మైక్ హస్సీ విభేదించాడు. భారత్ పర్యటనలో విరాట్ ను స్లెడ్జ్ చేసి ఏదో సాధించాలనుకుంటున్న తమ జట్టు ఆ ప్రయత్నాన్ని మానుకుంటే మంచిదని హితవు పలికాడు. ఆటలో దూకుడుకు మారుపేరైన విరాట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఆసీస్ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నాడు. గత డిసెంబర్లో ఒక ఇంటర్య్వూలో స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. తమ జట్టు సభ్యులు కోహ్లి దూకుడును చూడాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే అతన్ని రెచ్చగొట్టేందుకు కూడా వెనుకాడమన్నాడు. అయితే దీనిపై తాజాగా స్పందించిన హస్సీ.. ఆ ప్రయత్నాన్ని ఆసీస్ మానుకోవం మంచిదని సూచించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లపై స్లెడ్జ్ చేస్తూ లబ్ది పొందడం జట్టు ప్రణాళికలో భాగమే అయినప్పటికీ, విరాట్ కోహ్లి దగ్గర మాత్రం ఆ ఆటలు సాగవనే విషయం స్మిత్ సేన గుర్తుంచుకుని ముందుకు సాగితేనే మంచి ఫలితాలు వస్తాయన్నాడు. 'త్వరలో భారత్ తో తలపడబోయే టెస్టు సిరీస్ లో విరాట్‌ను రెచ్చగొట్టే యత్నం చేయొద్దు. అతను నిజమైన హీరో. పోరాడే తత్వం, పోటీని ప్రేమించే తత్వం కోహ్లికున్న లక్షణాలు. ఎంతటి క్లిష్ట సమయంలోనైనా కోహ్లి దూకుడును కొనసాగించడానికే ఇష్టపడతాడు. అటు వంటి ఆటగాడ్ని స్లెడ్జ్ చేస్తే ఇంకా రెచ్చిపోతాడు. దాంతో ఆసీస్‌కు నష్టమే జరుగుతుంది. కోహ్లిని రెచ్చగొట్టాలనే స్మిత్ సేన ప్రణాళిక మంచిది కాదు.. నేనైతే అతన్ని రెచ్చగొట్టే యత్నం చేయను. భారత్ తో జరగబోయే సిరీస్‌లో మైండ్ గేమ్ ను ఆసీస్ వదిలిపెట్టి ఆటలో ప్రణాళికలపై దృష్టి పెడితేనే మంచిది' అని హస్సీ అభిప్రాయపడ్డాడు. -
అమ్ముడుపోని స్టార్స్
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్‌కు ఈసారి నిరాశే ఎదురైంది. రూ. 50 లక్షల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి వచ్చినా ఒక్క ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. మైకేల్ హస్సీ (రూ. 2 కోట్లు), జయవర్ధనే (రూ. 1.5 కోట్లు), దిల్షాన్ (రూ. 1.5 కోట్లు), బ్రాడ్ హాడిన్ (రూ. 1.5 కోట్లు), బెయిలీ (రూ. 1 కోటి), ఆమ్లా (రూ. 1 కో టి), డారెన్ స్యామీ (రూ. 50 లక్షలు), అజంతా మెండిస్ (రూ. 50 లక్షలు), ఫిలాండర్ (రూ. 50 లక్షలు), మార్లన్ శామ్యూల్స్ (రూ. 50 లక్షలు)లాంటి అంతర్జాతీయ ఆటగాళ్ల వైపు కనీసం చూసే సాహసం కూడా ఫ్రాంచైజీలు చేయకపోవడం గమనార్హం. భారత దేశవాళీ స్టార్లలో కూడా కొందరికి అదరణ కరువైంది. ముఖ్యంగా మనోజ్ తివారి (రూ. 1 కోటి), చతేశ్వర్ పుజారా (రూ. 50 లక్షలు), బద్రీనాథ్ (రూ. 50 లక్షలు), ప్రజ్ఞాన్ ఓజా (రూ. 50 లక్షలు), మునాఫ్ పటేల్ (రూ. 50 లక్షలు), రాహుల్ శర్మ (రూ. 30 లక్షలు), అభినవ్ ముకుంద్ (రూ. 30 లక్షలు), అభిషేక్ నాయర్ (రూ. 30 లక్షలు)లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ♦ అత్యధికంగా ఢిల్లీ జట్టులో 27 మంది, పంజాబ్, కోల్‌కతాల్లో ♦ అత్యల్పంగా 22 మంది క్రికెటర్లు ఉన్నారు. -
'టీమిండియాను తక్కువ అంచనా వేయొద్దు'
సిడ్నీ: వచ్చే ప్రపంచకప్ లో టీమిండియాను తక్కు వ అంచనా వేయొద్దని ఆసీస్ మాజీ ఆటగాడు మైకేల్ హస్సీ హెచ్చరించాడు. ఈ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆసీస్ 2-0 తేడాతో గెలిచినా.. టీమిండియా ఆటను తక్కువగా చూడొద్దని ఆసీస్ కు స్పష్టం చేశాడు. త్వరలో ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచకప్ లో టీమిండియా రాణించే అవకాశం ఉందన్నాడు.టీమిండియా రెండు నెలలపాటు ఆస్ట్రేలియాలో ఉన్న సంగతిని హస్సీ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ లోని పిచ్ లను భారత్ అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ టెస్ట్ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఆటపై ఒక అభిప్రాయానికి రావొద్దని ఆసీస్ కు సూచించాడు. డిఫెండింగ్ చాంఫియన్ షిప్ హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా అంచనాలు మించి రాణించే అవకాశం లేకపోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. -
చెన్నైని నడిపించింది గురునాథే: హస్సీ
న్యూఢిల్లీ: తన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఎలాంటి సంబంధం లేదని, కేవలం క్రికెట్ అంటే మక్కువ కారణంగానే స్టేడియంలో కనిపించేవాడని బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ చెబుతున్నప్పటికీ వాస్తవాలు వేరేలా ఉన్నాయి. సాక్షాత్తూ చెన్నై జట్టు ఆటగాడే గురునాథ్ గురించి నిజం చెప్పేశాడు. సీఎస్కే జట్టును గురునాథ్ నడిపించేవాడని ఓపెనర్ మైక్ హస్సీ కుండబద్దలు కొట్టాడు. తను రాసిన ‘అండర్నీత్ ది సదరన్ క్రాస్’ అనే పుస్తకంలో ఈ విషయాలు చెప్పాడు. ‘మా జట్టు ఓనర్ ఇండియా సిమెంట్స్ చీఫ్ ఎన్.శ్రీనివాసన్. ఆయన బీసీసీఐకి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతో జట్టుపై పూర్తి బాధ్యతలను గురునాథ్‌కు అప్పగించారు. కెప్లెర్ వెస్సెల్స్‌తో కలిసి గురునాథ్ జట్టును నడిపించాడు’ అని ఆ పుస్తకంలో వివరించాడు. ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్‌లో గురునాథ్‌పై ముంబై పోలీసులు చార్జిషీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ గురునాథ్‌కు జట్టుకు ఎలాంటి సంబంధం లేదని శ్రీనివాసన్ చెబుతూ వస్తున్నారు. -
చెన్నై జట్టును నడిపించింది గురునాథే: హస్సీ
న్యూఢిల్లీ: తన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్‌కు చెన్నై సూపర్ కింగ్ జట్టుతో ఎలాంటి సంబంధం లేదని, కేవలం క్రికెట్ అంటే మక్కువ కారణంగానే స్టేడియంలో కనిపించేవాడని బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ చెబుతున్నప్పటికీ వాస్తవాలు వేరేలా ఉన్నాయి. సాక్షాత్తూ చెన్నైజట్టు ఆటగాడే గురునాథ్ గురించి నిజం చెప్పేశాడు. సీఎస్కే జట్టును గురునాథ్ నడిపించేవాడని ఓపెనర్ మైక్ హస్సీ కుండబద్దలు కొట్టాడు. తను రాసిన ‘అండర్నీత్ ది సదరన్ క్రాస్’ అనే పుస్తకంలో ఈ విషయాలు చెప్పాడు. ‘మా జట్టు ఓనర్ ఇండియా సిమెంట్స చీఫ్ ఎన్.శ్రీనివాసన్. ఆయన బీసీసీఐకి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతో జట్టుపై పూర్తి బాధ్యతలను గురునాథ్‌కు అప్పగించారు. కెప్లెర్ వెస్సెల్సతో కలిసి గురునాథ్ జట్టును నడిపించాడు’ అని ఆ పుస్తకంలో వివరించాడు. ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్‌లో గురునాథ్‌పై ముంబై పోలీసులు చార్జిషీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. జట్టుకు సంబంధించిన కీలక విషయాలను బుకీలకు చేరవేశాడని పోలీసులు పేర్కొన్నారు. అయినప్పటికీ గురునాథ్‌కు జట్టుకు ఎలాంటి సబంధం లేదని శ్రీనివాసన్ చెబుతూ వస్తున్నారు.