
మైఖేల్ హస్సీ, డేవిడ్ సేకర్
టీ20 ప్రపంచకప్-2022కు ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు 'కోచింగ్ కన్సల్టెంట్స్'గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు మైఖేల్ హస్సీ, డేవిడ్ సేకర్‌లను ఈసీబీ నియమించింది. ఈ మెగా ఈవెంట్‌లో వీరిద్దరూ ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్ మాథ్యూ మాట్‌తో కలిసి పనిచేయనున్నారు.
కాగా ఇప్పటికే రిచర్డ్ డాసన్, కార్ల్ హాప్కిన్సన్ రూపంలో ఇంగ్లండ్‌కు ఇద్దరు అసిస్టెంట్ కోచ్‌లు ఉన్నారు. కాగా మైఖేల్ హస్సీ, డేవిడ్‌కు సేకర్‌లకు గతంలో కోచ్‌లగా పనిచేసిన అనుభవం ఉంది. మైఖేల్ హస్సీ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తుండగా.. ఇక సేకర్ 2010 నుంచి 2015 వరకు ఇంగ్లండ్ బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు.
ఇక ఇప్పటికే ఈ పొట్టి ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ జట్టుకు ఈసీబీ ప్రకటించింది. ఈ మెగా టోర్నీకి ముందు ఇంగ్లండ్ పాకిస్తాన్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లీష్ జట్టు ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ నుంచే ఇంగ్లండ్ జట్టుతో హస్సీ,సేకర్‌ల ప్రయాణం ప్రారంభం కానుంది.
టీ20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), మోయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లీ, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, అలెక్స్ హేల్స్.
రిజర్వ్: లియామ్ డాసన్, రిచర్డ్ గ్లీసన్, టైమల్ మిల్స్.
చదవండి: T20 World Cup 2022: 'ఆ ముగ్గురు ఐపీఎల్‌లో అదరగొట్టారు.. భారత జట్టులో ఉండాల్సింది'
Comments
Please login to add a commentAdd a comment