Jos Buttler Named ICC Player Of The November Month - Sakshi
Sakshi News home page

ICC Player of The Month: ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ నవంబర్‌ ఎవరంటే..?

Published Mon, Dec 12 2022 6:59 PM | Last Updated on Mon, Dec 12 2022 10:00 PM

Jos Buttler Named ICC Player Of The November Month - Sakshi

Jos Buttler: నవంబర్‌ నెల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ ఎగరేసుకుపోయాడు. ఈ అవార్డు కోసం సహచరుడు ఆదిల్‌ రషీద్‌, పాకిస్తాన్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిదిల నుంచి పోటీ ఎదుర్కొన్న జోస్‌.. అత్యధిక శాతం ఓటింగ్‌తో ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు.

అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌-2022లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఇంగ్లండ్‌ను జగజ్జేతగా నిలిపిన బట్లర్‌.. తొలిసారి ఈ ఐసీసీ అవార్డును అందుకున్నాడు. వరల్డ్‌కప్‌ సెమీస్‌లో టీమిండియాపై ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌ను (49 బంతుల్లో 80 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) పరిగణలోకి తీసుకున్న ఐసీసీ ఈ అవార్డుకు జోస్‌ను ఎంపిక చేసింది. తనకు ఈ అవార్డు లభించడంపై బట్లర్‌ స్పందించాడు. తనకు ఓటు వేసి గెలిపించిన వారందరికీ అతను ధన్యవాదాలు తెలిపాడు.

మరోవైపు ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ ఫిమేల్‌ అవార్డును పాకిస్తాన్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ సిద్రా అమీన్‌ గెలుచుకుంది. అమీన్‌.. నవంబర్‌లో ఐర్లాండ్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో విశేషంగా రాణించి ఈ అవార్డుకు ఎంపికైంది. కాగా, ఈ అవార్డుకు సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో కూడా పాకిస్తాన్‌ ఆటగాళ్లు ఎంపిక కావడం విశేషం. సెప్టెంబర్‌లో పాక్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ ఈ అవార్డును గెలుచుకోగా, అక్టోబర్‌లో పాక్‌ మహిళా క్రికెటర్‌ నిదా దార్‌ ఈ అవార్డును దక్కించుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement