England captain
-
'మ్యాచ్ పోతే పోయింది.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు'
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. బజ్‌బాల్ క్రికెట్‌తో దూకుడు ప్రదర్శిస్తున్న ఆ జట్టుకు ఆసీస్ ముకుతాడు వేసింది. అయితే మ్యాచ్ ఓటమిపై స్టోక్స్ తనదైన శైలిలో స్పందించాడు. మ్యాచ్ ఓడిపోయామన్న బాధ ఉన్నా బజ్‌బాల్ క్రికెట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ పేర్కొన్నాడు. ''మ్యాచ్ ఓడిపోయి ఉండొచ్చు.. కానీ ఒక విషయంలో సంతోషంగా ఉంది. అదేంటంటే మ్యాచ్‌ను ఆఖరి నిమిషం వరకు తీసుకెళ్లడం. ఒక గొప్ప గేమ్‌లో భాగస్వామ్యం కావడం.. మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకులు కూడా ఐదురోజుల పాటు ఎడ్జ్ ఆఫ్ సీట్ ఫీల్‌ను అనుభవించారు. ఒక టెస్టు క్రికెట్‌కు కావాల్సింది ఇదే. యాషెస్‌ను ఇరుదేశాల్లో ఎంతలా ఆదరిస్తానేది మరోసారి కనిపించింది. మ్యాచ్‌లో ఎవరో ఒకరే గెలవాలి..ఇవాళ మేం ఓటమి డెడ్‌లైన్‌ను దాటలేకపోయాం. అంతమాత్రానా మా ఆటతీరును మార్చుకోలేం. బజ్‌బాల్ క్రికెట్‌ను కంటిన్యూ చేస్తాం. ఈ మ్యాచ్‌లో మా వ్యూహాలను ఎదుర్కోవాలనే ప్లాన్‌తో ఆసీస్ వచ్చింది. మేం జస్ట్ మిస్ అయ్యాం. లేదంటే ఇక్కడ వేరే ఫలితం గురించి మాట్లాడుకునేవాళ్లం. ఈ సిరీస్‌లో ఇది తొలి మ్యాచ్ మాత్రమే. ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలిఉన్నాయి. చాలా క్రికెట్ ఆడాలి. ఇప్పుడు మా ఫోకస్ అంతా ఆ మ్యాచ్‌లపైనే. చేతిలో వికెట్లు ఉండి కూడా మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌ను తొలిరోజే డిక్లేర్ చేయడం వెనుక నాది ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు. ఈరోజు దీనికి క్లారిటీ ఇస్తున్నా. నేను ఒక కెప్టెన్‌ను కాబట్టి.. ఆ టైంలో ఆస్ట్రేలియాను మరింత ఒత్తిడిలోకి నెట్టొచ్చు అనిపించింది. అందుకే ఆ పని చేశా. ఏ ఓపెనింగ్ బ్యాటర్ కూడా ఆట ముగియడానికి 20 నిమిషాల ముందు బ్యాటింగ్‌కు వెళ్లాలని అనుకోడు. అందుకే ఆ పని చేశా. అయితే ఆ రోజు ఆసీస్ ఓపెనర్లు ఇద్దరూ ఎలాంటి పొరపాటు చేయకుండా తొలి రోజు ఆటను ముగించారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయినా కూడా.. ఇంగ్లండ్‌కు కేవలం 7 పరుగుల ఆధిక్యమే లభించింది. అదే ఇంగ్లండ్ కనుక తొలి రోజు డిక్లేర్ చేయకుండా మరికొంత సమయం ఆడి ఉంటే మరింత ఆధిక్యం లభించేదే. మేం ఆడిన విధానం, ఆసీస్ బౌలర్లపై ఎదురు దాడి చేయడం చూసి డిక్లేర్ చేయాలనే నిర్ణయం తీసుకున్నా. డిక్లేర్ చేయకపోతే ఐదో రోజు ఇంత ఎగ్జయిట్మెంట్ వచ్చేదా? చెప్పండి'' అంటూ ప్రశ్నించాడు. మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించిన ఆస్ట్రేలియా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జూన్ 28 నుంచి జూలై 2 వరకు లార్డ్స్ వేదికగా జరగనుంది. చదవండి: చావుదెబ్బ కొట్టిన ఆసీస్.. రికార్డులు బద్దలైన వేళ బజ్‌బాల్ అంటూ విర్రవీగారు.. అణిచివేసిన ఆసీస్ -
Ben Stokes: టైం అయ్యింది.. డబ్బులు ముట్టాయి, వెళ్లొస్తా..!
ఐపీఎల్ 2023లో కష్టపడకుండా అధిక లాభపడిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే..? అది సీఎస్కే స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అని చెప్పాలి. ఈ 16.25 కోట్ల ఆటగాడు సీజన్ మొత్తంలో ఆడింది రెండే మ్యాచ్‌లు. అందులో అతను చేసిన పరుగులు 16. అంటే పరుగుకు కోటి రూపాయల పై మాటే అన్న మాట. ఇంత ఘనకార్యం వెలగబెట్టిన ఈ ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ ఇప్పుడు తగుదునమ్మా అని స్వదేశానికి బయల్దేరాడు. స్వదేశంలో ఐర్లాండ్‌తో జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్ (జూన్ 1 నుంచి) ఆడేందుకు స్టోక్స్ సీఎస్కే క్యాంప్‌ను వీడాడు. ఈ విషయాన్ని సీఎస్కే యాజమాన్యమే అధికారికంగా ట్వీట్ చేసింది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు కోట్లు పోసి కొనుక్కున ఫ్రాంచైజీకి పంగనామం పెట్టడంతో స్టోక్స్‌పై సీఎస్కే అభిమానులు మండిపడుతున్నారు. కారణాలు ఏవైనా డబ్బులిచ్చాక లీగ్ అయిపోయేంత వరకు ఉండాలని చురకలంటిస్తున్నారు. View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) దేశం కోసం మాత్రమే ఆడాలనుకున్నప్పుడు.. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ లాగా ఐపీఎల్లో పేరు కూడా నమోదు చేసుకోకుండా ఉండాల్సిందంటూ మందలిస్తున్నారు. ఐపీఎల్ ఆడటానికి వచ్చినట్లు లేదు, సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వచ్చినట్లుందని అంటున్నారు. కాగా, ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒప్పందం చేసుకున్న ఆటగాడు ఆడినా ఆడకపోయినా పూర్తి డబ్బులు చెల్లించాల్సిందే. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్లో సీఎస్కే అదిరిపోయే పెర్ఫార్మెన్స్తో దూసుకుపోతుంది. ధోని సేన ప్లే ఆఫ్స్‌కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. మే 23న జరిగే క్వాలిఫయర్-1లో సీఎస్కే.. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొట్టనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌కు సంబంధించిన వివరాలు ఇవాల్టి (మే 21) మ్యాచ్‌లతో తేలిపోతాయి. లక్నో ఇదివరకే ఓ బెర్తు కన్ఫర్మ్ చేసుకోగా.. నాలుగో స్థానం కోసం ఆర్సీబీ, రాజస్థాన్, ముంబై ఇండియన్స్ పోటీపడుతున్నాయి. చదవండి: అప్పటి నుంచి అందరూ గుర్తు పడుతున్నారు.. ఆరోజు ఒక్క బాల్ మిస్ చేసినా! -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (నవంబర్) ఎవరంటే..?
Jos Buttler: నవంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ ఎగరేసుకుపోయాడు. ఈ అవార్డు కోసం సహచరుడు ఆదిల్ రషీద్, పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిదిల నుంచి పోటీ ఎదుర్కొన్న జోస్.. అత్యధిక శాతం ఓటింగ్‌తో ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగిన టీ20 వరల్డ్‌కప్-2022లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఇంగ్లండ్‌ను జగజ్జేతగా నిలిపిన బట్లర్.. తొలిసారి ఈ ఐసీసీ అవార్డును అందుకున్నాడు. వరల్డ్‌కప్ సెమీస్‌లో టీమిండియాపై ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌ను (49 బంతుల్లో 80 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) పరిగణలోకి తీసుకున్న ఐసీసీ ఈ అవార్డుకు జోస్‌ను ఎంపిక చేసింది. తనకు ఈ అవార్డు లభించడంపై బట్లర్ స్పందించాడు. తనకు ఓటు వేసి గెలిపించిన వారందరికీ అతను ధన్యవాదాలు తెలిపాడు. మరోవైపు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫిమేల్ అవార్డును పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాటర్ సిద్రా అమీన్ గెలుచుకుంది. అమీన్.. నవంబర్‌లో ఐర్లాండ్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో విశేషంగా రాణించి ఈ అవార్డుకు ఎంపికైంది. కాగా, ఈ అవార్డుకు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా పాకిస్తాన్ ఆటగాళ్లు ఎంపిక కావడం విశేషం. సెప్టెంబర్‌లో పాక్ ఓపెనింగ్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఈ అవార్డును గెలుచుకోగా, అక్టోబర్‌లో పాక్ మహిళా క్రికెటర్ నిదా దార్ ఈ అవార్డును దక్కించుకుంది. -
పాకిస్తానీల మనసులు దోచుకున్న బెన్ స్టోక్స్.. ఫిదా అయిన ఫ్యాన్స్
3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు 17 ఏళ్ల సుదర్ఘీ విరామం తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్.. డిసెంబర్ 1 నుంచి రావల్పిండి వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం డిసెంబర్ 9 నుంచి రెండో టెస్ట్ (ముల్తాన్), 17 నుంచి మూడో టెస్ట్ మ్యాచ్ (కరాచీ) ఆడుతుంది. ఇంగ్లండ్-పాక్‌ల మధ్య మరో రెండు రోజుల్లో తొలి టెస్ట్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం క్రికెట్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఇటీవల పాకిస్తాన్లో వరదలు ఊహించని భీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రకృతి సృష్టించిన ఈ మహా విళయంతో పాక్‌లోని చాలా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో పాక్‌లో వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుకు వచ్చాడు. I’m donating my match fees from this Test series to the Pakistan Flood appeal ❤️🇵🇰 pic.twitter.com/BgvY0VQ2GG — Ben Stokes (@benstokes38) November 28, 2022 తనవంతు సాయంగా పాక్‌తో ఆడే టెస్ట్ సిరీస్ ద్వారా వచ్చే మ్యాచ్ ఫీజ్ మొత్తాన్ని వరద బాధితులకు విరాళంగా ఇవ్వనున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించాడు. క్రికెట్ నాకు చాలా ఇచ్చింది, అందులో కొంత కష్టకాలంలో ఉన్న ప్రజలకు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది, నేను చేస్తున్న ఈ చిన్న సాయం వరద బాధితులకు ఏదో ఓ రకంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా అంటూ ఓ నోట్లో రాసుకొచ్చాడు. ఇంగ్లండ్ కెప్టెన్ చూపిన ఔదార్యం గురించి తెలిసి క్రికెట్ అభిమానులు అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పాకిస్తానీలయితే స్టోక్స్‌ను ఆకాశానికెత్తుతున్నారు. రాజువయ్యా, మహరాజువయ్యా అంటూ కొనియాడుతున్నారు. టీ20 వరల్డ్‌కప్-2022 ఫైనల్లో అద్భుతంగా ఆడి టైటిల్ తమకు దక్కకుండా చేసినా స్టోక్స్‌ను శభాష్ అంటున్నారు. నీ దయా గుణానికి హ్యాట్సాఫ్ అంటూ సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. -
T20 World Cup 2022: అహో హేల్స్...
‘నేను మళ్లీ ప్రపంచకప్ ఆడతానని అనుకోలేదు’... సెమీస్ ముగిసిన తర్వాత అలెక్స్ హేల్స్ వ్యాఖ్య ఇది. బహుశా భారత అభిమానులు కూడా అదే జరిగి ఉంటే బాగుండేదని అనుకొని ఉంటారు! మూడేళ్ల పాటు ఆటకు దూరమై పునరాగమనంలో మళ్లీ చెలరేగుతున్న హేల్స్ కథ కూడా ఎంతో ఆసక్తికరం. ► ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీలలో ఎంత గొప్ప ప్రదర్శన ఇచ్చినా మూడేళ్ల పాటు అతనికి టీమ్‌లో చోటు దక్కలేదు. ఆ బాధను అధిగమించి అతను ప్రపంచవ్యాప్తంగా టి20 లీగ్‌లలో ఆడుతూ వచ్చాడు. చివరకు ఈ ఏడాది జూన్‌లో మోర్గాన్ రిటైర్ అయ్యాడు... సెప్టెంబర్‌లో హేల్స్‌కు టీమ్‌లో స్థానం లభించింది. పాకిస్తాన్ పర్యటనలో ఆకట్టుకున్న అతను వరల్డ్ కప్‌లో కీలక ఇన్నింగ్స్‌లతో తానేంటో నిరూపించాడు. ► పాక్ టూర్ తర్వాత కూడా ఇంగ్లండ్ వరల్డ్ కప్ జట్టులో హేల్స్‌కు స్థానం దక్కలేదు. అయితే బెయిర్‌స్టో అనూహ్యంగా గాయపడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో హేల్స్‌ను టీమ్‌లోకి తీసుకోవాల్సి వచ్చింది. అది ఎంత సరైన నిర్ణయమో ఇంగ్లండ్‌కు ఇప్పుడు తెలిసింది. ఈ టోర్నీలో నాలుగు ప్రధాన జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, భారత్‌లతో జరిగిన మ్యాచ్‌లలో అతను 84, 52, 47, 86 నాటౌట్ పరుగులు సాధించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. –సాక్షి క్రీడావిభాగం -
భారత్‌తో సెమీఫైనల్.. ఇంగ్లండ్‌కు భారీ షాక్! కెప్టెన్ దూరం!
భారత మహిళలతో సెమీ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ హీథర్ నైట్ గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్-2022 నుంచి వైదొలిగింది. అదే విధంగా త్వరలో జరగనున్న ది హండ్రెడ్ లీగ్‌కు కూడా ఆమె దూరమైంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. "ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్ హీథర్ నైట్ గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్, ది హండ్రెడ్ లీగ్‌కు దూరం కానుంది. దక్షిణాఫ్రికా సిరీస్‌లో గాయపడ్డ నైట్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆమె ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంది. అదే విధంగా మిగితా మ్యాచ్‌లకు కూడా నాట్ స్కివర్ కెప్టెన్‌గా కొనసాగనుంది" అని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ట్విటర్లో పేర్కొంది. కాగా కామన్వెల్త్ గేమ్స్‌కు ప్రకటించిన ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా నైట్ ఎంపికైనప్పటికీ.. ఇప్పటి వరకు బెంచ్‌కే పరిమితమైంది. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి సెమీఫైనల్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా శనివారం(ఆగస్టు 6) జరగనుంది. తుది జట్లు(అంచనా) ఇంగ్లండ్ మహిళల జట్టు: డేనియల్ వ్యాట్, సోఫియా డంక్లీ, ఆలిస్ క్యాప్సే, నటాలీ స్కివర్ (కెప్టెన్), అమీ జోన్స్ (వికెట్ కీపర్), మైయా బౌచియర్, కేథరీన్ బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్, ఫ్రెయా కెంప్, ఇస్సీ వాంగ్, సారా గ్లెన్ భారత మహిళల జట్టు: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), యస్తికా భాటియా (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, స్నేహ రాణా, మేఘనా సింగ్, రేణుకా సింగ్ England Women’s captain Heather Knight has been ruled out of the Commonwealth Games and The Hundred. The hip injury she sustained in the first Vitality IT20 against South Africa has failed to settle down as expected and Knight will continue to receive treatment. pic.twitter.com/iTJA17nXkU — England Cricket (@englandcricket) August 3, 2022 చదవండి: Chris Gayle: క్రిస్ గేల్ అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ యునివర్స్ బాస్ మెరుపులు! -
ఇంగ్లండ్ కొత్త కెప్టెన్‌గా జోస్ బట్లర్
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా జోస్ బట్లర్ ఎంపికయ్యాడు. జూన్ 28న ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి ఇయాన్ మోర్గాన్ తప్పుకోవడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇవాళ (జూన్ 30) బట్లర్‌ను కొత్త సారధిగా ప్రకటించింది. గత పదేళ్లుగా ఇంగ్లండ్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా కొనసాగుతున్న బట్లర్ ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇంగ్లండ్ నూతన కెప్టెన్‌గా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన బట్లర్.. ఈసీబీకి, మాజీ సారధి మోర్గాన్‌ను ధన్యవాదాలు తెలిపాడు. గత ఏడేళ్లుగా ఇంగ్లండ్ జట్టును అద్భుతంగా ముందుండి నడిపించిన మోర్గాన్‌ను ప్రత్యేకంగా కొనియాడాడు. మోర్గాన్ నుంచి బాధ్యతలు చేపట్టడం గొప్ప గౌరవమని అన్నాడు. ఇంగ్లండ్ తరఫున 57 టెస్ట్‌లు, 151 వన్డేలు, 88 టీ20 ఆడిన బట్లర్ తొమ్మిది వేలకు పైగా పరుగులు సాధించాడు. బట్లర్ తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తం 13 సెంచరీలు, 54 హాఫ్ సెంచరీలు సాధించాడు. చదవండి: రోహిత్ ఔట్, టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా.. బీసీసీఐ అధికారిక ప్రకటన -
కొత్త అవతారమెత్తబోతున్న మోర్గాన్.. ఇండియాతో సిరీస్ నుంచి..?
ఇంగ్లండ్ తాజా మాజీ సారధి ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీకి రిటైర్మెంట్ ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే ఓ ఆసక్తికర ప్రకటన చేశాడు. జూన్ 28న ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారిక ప్రకటన చేసిన మోర్గాన్.. కొద్ది నిమిషాల్లోనే తన ఫ్యూచర్ ప్లాన్‌ను వెల్లడించాడు. ఇండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి కామెంటేటర్‌గా మారబోతున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని మోర్గాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ‘స్కై’ నెట్వర్క్ ధృవీకరించింది. మోర్గాన్ తమ కామెంటరీ టీమ్‌లో చేరబోతున్నడని ప్రకటన విడుదల చేసింది. స్వదేశంలో ఇంగ్లండ్ ఆడబోయే తదుపరి సిరీస్‌ల నుంచి మోర్గాన్ స్కై నెట్‌వర్క్‌లో భాగస్వామిగా ఉంటాడని పేర్కొంది. మొత్తానికి ఇంగ్లండ్ తరఫున క్రికెటర్‌గా 13 ఏళ్ల కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టిన నిమిషాల వ్యవధిలోనే మోర్గాన్ మరో పనిని వెతుక్కున్నాడు. త్వరలో జరుగబోయే ఇండియా, సౌతాఫ్రికా సిరీస్‌ల నుంచి మోర్గాన్ కామెంటేటర్‌గా తన కెరీర్ మొదలుపెట్టనున్నాడు. ఐర్లాండ్ తరఫున కెరీర్ ప్రారంభించి ఇంగ్లండ్ క్రికెట్‌కు ఎనలేని సేవలనందించిన మోర్గాన్.. తన హయాంలో ఇంగ్లండ్‌కు వన్డే ప్రపంచకప్ (2019) అందించాడు. ఏడేళ్ల పాటు ఇంగ్లండ్ కెప్టెన్‌గా సేవలందించిన మోర్గాన్.. కెరీర్ మొత్తంలో (ఐర్లాండ్‌తో కలుపుకుని) 16 టెస్ట్‌లు, 248 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 2 శతకాలు, 3 అర్ధశతకాల సాయంతో 700 పరుగులు, వన్డేల్లో 14 సెంచరీలు, హాఫ్ సెంచరీల సాయంతో 7701 పరుగులు, టీ20ల్లో 14 హాఫ్ సెంచరీల సాయంతో 2458 పరుగులు చేశాడు. చదవండి: Ind Vs Eng: ఇంగ్లండ్‌తో టెస్టుకు కెప్టెన్ బుమ్రా! బౌలర్లకు మెదడు తక్కువా? -
రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించిన ఇంగ్లండ్ కెప్టెన్
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు. తక్షణమే తన నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నాడు. తాను సాధించిన దాని గురించి గర్వపడుతున్నానని, గొప్ప వ్యక్తులతో తన జ్ఞాపకాలు చిరకాలం గుర్తుపెట్టుకుంటానని తెలిపాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మంగళవారం ట్విటర్ వేదికగా ధృవీకరించింది. You’ve changed English cricket forever. An innovator 🏏 A motivator 💪 A champion 🏆 Your legacy will live on...#ThankYouMorgs ❤️ pic.twitter.com/a32SSvCDXI — England Cricket (@englandcricket) June 28, 2022 మోర్గాన్.. ఇంగ్లీష్ క్రికెట్ రూపురేఖలను మార్చిన గొప్ప క్రికెటర్ అని కొనియాడింది. మోర్గాన్ ఓ ఇన్నోవేటర్, ఓ మోటివేటర్, ఓ ఛాంపియన్ అంటూ ఆకాశానికెత్తింది. నీ వారసత్వం ఇలానే కొనసాగుతుంది.. థ్యాంక్యూ మోర్గాన్ అంటూ ట్విట్లో పేర్కొంది. కాగా, మోర్గాన్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడని బ్రిటిష్ మీడియాలో గత కొన్ని రోజులుగా కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. "I'm hugely proud of what I have achieved, but what I will cherish and remember most are the memories I made with some of the greatest people I know."#ThankYouMorgs 👏 — England Cricket (@englandcricket) June 28, 2022 ఐర్లాండ్ జట్టు తరఫున అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన మోర్గాన్.. ఇంగ్లండ్ తరఫున తన 13 ఏళ్ల కెరీర్లో 225 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక పరుగుల రికార్డులు మోర్గాన్ పేరిటే నమోదై ఉన్నాయి. 2019లో ఇంగ్లండ్‌కు తొలి వన్డే ప్రపంచకప్ అందించిన 35 ఏళ్ల మోర్గాన్.. గత సంవత్సరకాలంగా ఫిట్నెస్ సమస్యలు, ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. తాజాగా నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన అతను ఖాతా కూడా తెరవకుండానే వెనుదిరిగాడు. ఏడేళ్ల పాటు ఇంగ్లండ్ కెప్టెన్‌గా సేవలందించిన మోర్గాన్.. కెరీర్ మొత్తంలో (ఐర్లాండ్‌తో కలుపుకుని) 16 టెస్ట్‌లు, 248 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 2 శతకాలు, 3 అర్ధశతకాల సాయంతో 700 పరుగులు, వన్డేల్లో 14 సెంచరీలు, హాఫ్ సెంచరీల సాయంతో 7701 పరుగులు, టీ20ల్లో 14 హాఫ్ సెంచరీల సాయంతో 2458 పరుగులు చేశాడు. చదవండి: అతన్ని ఓపెనర్‌గా పంపండి.. సెహ్వాగ్‌లా సక్సెస్ అవుతాడు..! -
ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం..!
టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలం పేలవ ప్రదర్శన కనబరుస్తున్న కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు బ్రిటిష్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గార్డియన్ నివేదిక ప్రకారం.. జూలై తొలి వారంలో అంతర్జాతీయ క్రికెట్‌కు మోర్గాన్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక మోర్గాన్ సారథ్యంలోనే 2019 వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. కాగా తాజాగా నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన మెర్గాన్ కేవలం ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మెర్గాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. గాయం కారణంగా అఖరి వన్డేకు మోర్గాన్ దూరమ్యాడు. మోర్గాన్ రిటైర్మెంట్ ప్రకటిస్తే.. ఒక వేళ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటే అతడి స్థానంలో వికెట్ కీపర్ జోస్ బట్లర్ ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అదే విధంగా 2015 నుంచి ఇంగ్లండ్ వైస్ కెప్టెన్‌గా బట్లర్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక ఇంగ్లండ్-భారత మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జూలై 7 న ప్రారంభం కానుంది. చదవండి: Ranji Trophy 2022: 'కెప్టెన్ పెళ్లికి రెండు రోజుల సెలవు మాత్రమే ఇచ్చాను' -
ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. కెప్టెన్‌కు అస్వస్థత
న్యూజిలాండ్‌తో గురువారం (జూన్ 23) నుంచి ప్రారంభంకాబోయే మూడో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ అస్వస్థతకు గురైనట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారులు వెల్లడించారు. జట్టు సభ్యులంతా మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నా.. స్టోక్స్ మాత్రం జట్టుకు దూరంగా ఉన్నాడు. అతనికి కోవిడ్ టెస్ట్ చేయగా నెగటివ్ రిపోర్ట్ వచ్చిందని ఈసీబీ అధికారులు తెలిపారు. స్టోక్స్ కివీస్‌తో మూడు టెస్ట్‌తో పాటు టీమిండియాతో జులై 1 నుంచి ప్రారంభంకాబోయే రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడని బ్రిటిష్ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. స్టోక్స్‌కు డిప్యూటీగా ఈసీబీ ఎవరినీ నియమించకపోవడంతో కివీస్‌తో టెస్ట్‌కు జో రూట్ సారధ్యం వహిస్తాడని సమాచారం. కాగా, కెప్టెన్‌గా వరుస వైఫల్యాలను ఎదుర్కొన్న జో రూట్ ఇటీవలే ఇంగ్లండ్ కెప్టెన్సీ పగ్గాలను స్టోక్స్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. స్టోక్స్ సారధ్యంలో తొలి సిరీస్‌లోనే ఇంగ్లండ్ అద్భుత ఫలితాలను (కివీస్‌పై 2-0తో సిరీస్ విజయం) రాబట్టింది. చదవండి: అదో భయానక పరిస్థితి.. పాకిస్థాన్ లీగ్‌పై ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
'అతడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.. భారత జట్టులోకి తిరిగి వస్తాడు'
భారత టెస్టు జట్టు నుంచి ఉద్వాసనకు గురైన సీనియర్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో అదరగొడుతున్నాడు. ససెక్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజారా ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు 717 పరుగులు సాధించాడు. పుజారా ఇన్నింగ్స్‌లలో నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి. కాగా కౌంటీల్లో నిలకడగా రాణిస్తున్న పుజారా తిరిగి భారత టెస్టు జట్టులోకి వస్తాడని టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు." టీమిండియా ఇంగ్లండ్‌లో ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. గతేడాది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు ముందు, న్యూజిలాండ్ ఇంగ్లండ్‌లో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడింది. కాబట్టి వారు అక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డారు. దీంతో సౌతాంప్టన్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇప్పడు పుజారా కూడా అదే చేస్తున్నాడు. అక్కడ పరిస్థితుల్లో, ఇంగ్లండ్ బౌలర్లకు తిరేకంగా బ్యాటింగ్ చేయడం అలవాటు చేసుకున్నాడు. అయితే కౌంటీ పేస్ అటాక్‌కి, టెస్ట్ బౌలింగ్‌కు చాలా తేడా ఉంటుంది. అయితే ఒక బ్యాటర్ రిథమ్‌లో ఉన్నప్పుడు అదేం పెద్ద సమస్య కాదు. అతడు మళ్లీ తిరిగి భారత టెస్టు జట్టులోకి వస్తాడన్న నమ్మకం నాకు ఉంది" అని స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. చదవండి: పుజారా కౌంటీ ఫామ్‌పై ఆసక్తికర ట్వీట్ చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ -
వైరల్‌గా మారిన ఇంగ్లండ్ కొత్త కెప్టెన్ చర్య
ఇంగ్లండ్ టెస్టు కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ కౌంటీ క్రికెట్లో సూపర్ ఫామ్ కనబరుస్తున్న సంగతి తెలిసిందే. వోర్సెస్టర్షైర్తో మ్యాచ్‌లో డుర్హమ్ తరపున 88 బంతుల్లోనే 161 పరుగుల ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆ తర్వాత అదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ గ్లామోర్గాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్టోక్స్ 110 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 82 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ఒక రకంగా స్టోక్స్‌కు మంచి ప్రాక్టీస్ లభించినట్లే. ఇక విషయంలోకి వెళితే.. గ్లామోర్గాన్స్ బౌలర్ మార్నస్ లబుషేన్ వేసిన ఒక బంతి స్టోక్స్ నడుము కింది భాగంలో తగిలింది. దీంతో స్టోక్స్ క్రీజులోనే కిందపడిపోయాడు. అయితే ఇదంతా ఫన్నీగా మాత్రమే. వాస్తవానికి స్టోక్స్‌కు పెద్దగా దెబ్బలు తగల్లేదు. తన కాలును స్ట్రెచ్ చేసుకోవడానికే స్టోక్స్ క్రీజులో పడిపోయాడు. అయితే స్టోక్స్‌కు దెబ్బ తగిలిందేమోనని పరిగెత్తుకొచ్చిన లబుషేన్ అసలు విషయం తెలుసుకొని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత పైకి లేచిన స్టోక్స్ తన బ్యాటింగ్ కంటిన్యూ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టోక్స్ 33 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ఇంగ్లండ్ కొత్త కోచ్‌గా బ్రెండన్ మెక్కల్లమ్ ఎంపికయిన సంగతి తెలిసిందే. కొత్త కెప్టెన్, కొత్త కోచ్ కలయికలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ సరికొత్తగా సిద్ధమవనుంది. ఇరుజట్ల మధ్య తొలి టెస్టు లార్డ్స్ వేదికగా జూన్ 2న ప్రారంభం కానుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన డుర్హమ్ 311 పరుగులకు ఆలౌటైంది. స్టోక్స్ 2, కీగన్ పీటర్సన్ 7, లీస్ 44 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన గ్లామోర్గాన్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. చదవండి: Harpreet Bhatia Forgery Case: అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగం.. రంజీ క్రికెటర్‌పై చీటింగ్ కేసు Man down 😬 Ben Stokes is floored after inside edging a Labuschagne short ball into the unmentionables#LVCountyChamp pic.twitter.com/0y3bAxCIBo — LV= Insurance County Championship (@CountyChamp) May 12, 2022 -
జో రూట్ సంచలన నిర్ణయం.. ఇంగ్లండ్ కెప్టెన్సీకి గుడ్‌బై
ఇంగ్లండ్ టెస్టు సారథి జో రూట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్సీ బాద్యతల నుంచి తప్పుకుంటున్నట్లు రూట్ శుక్రవారం ప్రకటించాడు. యాషెస్ సిరీస్‌లో ఘోరపరాభవం, వెస్టిండీస్ పర్యటనలో ఓటమి అనంతరం రూట్ కెప్టెన్సీ వైదొలగాలని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే రూట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వెటరన్ బ్యాటర్ అలిస్టర్ కుక్ రాజీనామా చేసిన తర్వాత 2017లో జో రూట్ ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రూట్ (64మ్యాచ్‌లు) రికార్డు సృష్టించాడు. తన ఐదేళ్ల కెప్టెన్సీ లో ఇంగ్లండ్‌కు 27 విజయాలు అందించి అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రికార్డును కూడా రూట్ కలిగి ఉన్నాడు."నా దేశానికి కెప్టెన్‌గా వ్యవహరించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇంగ్లండ్ వంటి జట్టకు కెప్టెన్‌గా మరి కొంత కాలం కొనసాగాలని భావించాను. కానీ ఇటీవల కాలంలో అనూహ్య పరిణమాలు చోటు చేసుకున్నాయి. కెప్టెన్సీ ఒత్తిడి నా ఆటపై ప్రభావం చూపింది. ఇంగ్లండ్ తదుపరి కెప్టెన్‌గా ఎవరు ఎంపికైన నా వంతు సహాయం చేయడానికి నేను ఎప్పుడు సిద్దంగా ఉంటాను. నాకు ఇన్నాళ్లు మద్దతుగా నిలిచిన అభిమానులకు, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు దన్యవాదాలు" అని రూట్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022 RR Vs GT: "అది ఒక చెత్త నిర్ణయం.. అశ్విన్ ఆ స్థానంలో బ్యాటింగ్‌కు అవసరమా" -
Joe Root: ‘నంబర్‌వన్’ రూట్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజా టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో ఇప్పటివరకు టాప్ ర్యాంక్‌లో ఉన్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (901 రేటింగ్ పాయింట్లు)ను వెనక్కి నెట్టి ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (916 రేటింగ్ పాయింట్లు) అగ్రస్థానానికి చేరుకున్నాడు. రూట్ 2015 డిసెంబర్ తర్వాత మళ్లీ నంబర్‌వన్‌గా నిలవడం ఇదే తొలిసారి. మరోవైపు భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఒక స్థానం మెరుగుపర్చుకొని ఐదో ర్యాంక్‌కు ఎగబాకాడు. ఈ క్రమంలో కోహ్లి (6వ ర్యాంక్)ను వెనక్కి నెట్టాడు. 2017 నవంబర్ తర్వాత భారత్ నుంచి మరో బ్యాట్స్‌మన్ కోహ్లికంటే మెరుగైన ర్యాంక్‌లో ఉండటం ఇదే మొదటిసారి. -
టీమిండియా ఆటగాళ్లకు ఆ కోరిక ఎక్కువే: మోర్గాన్
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ లీగ్‌లు జరిగినా, వాటిల్లో పాల్గొనేందుకు టీమిండియా ఆటగాళ్లు ఎక్కువగా ఇష్టపడతారని ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సారథి ఇయాన్ మోర్గాన్ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌లో నిర్వహించే 'ది హండ్రెడ్' బాల్ క్రికెట్ లీగ్‌లో పాల్గొనాలని చాలా మంది భారత క్రికెటర్లు కోరుకుంటున్నారని ఆయన వెల్లడించారు. ఓ క్రీడా ఛానెల్లో నిర్వహించిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా టీమిండియా క్రికెటర్లు కొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు చాలా ఇష్టపడతారని, అక్కడి సంప్రదాయాలు తెలుసుకునేందుకు వారు ఎక్కువగా ఆసక్తి చూపుతారని అన్నారు. టీమిండియా క్రికెటర్లు ఆడితే ఆయా లీగ్‌లకు అదనపు ఆకర్షణ వస్తుందని, దాంతో వ్యాపారం కూడా బాగా పెరుగుతుందని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే, కొన్ని లీగ్‌ల వల్ల్ల ఆయా దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వివిధ క్రికెట్ టోర్నీల కారణంగా కొన్ని దేశాలు అత్యుత్తమ జట్లను బరిలోకి దింపలేకపోతున్నాయని పేర్కొన్నాడు. దీనిపై ఐసీసీ దృష్టిసారించాలని ఆయన కోరాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మూడు క్రికెట్ ఫార్మాట్ల మధ్య పెద్ద తేడా లేకుండా పోయిందని, దేనికి దక్కాల్సిన ప్రాధాన్యత దానికి దక్కడం లేదని ఆయన వాపోయాడు. అయితే, టీ20 క్రికెట్ యువ క్రికెటర్లకు బాగా ఉపయోగపడుతుందని, వారి కెరీర్ బిల్డప్ చేసుకునేందుకు ఈ ఫార్మాట్ బాగా ఉపయోగపడుతుందని తెలిపాడు. వన్డే, టెస్ట్ ఫార్మాట్ల పరిస్థితి ఇందుకు భిన్నమని.. ఈ ఫార్మాట్లలో ఆడటాన్ని ప్రధాన క్రికెటర్లు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తాయని ఆయన చెప్పుకొచ్చాడు. కాగా, వంద బంతుల క్రికెట్ లీగ్‌ను(ది హండ్రెడ్ లీగ్) ఇంగ్లాండ్ గతేడాదే నిర్వహించాలని భావించింది. కరోనా కారణంగా అది సాధ్యపడకపోవడంతో ఈ ఏడాది నిర్వహించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) భావిస్తోంది. చదవండి: వైరల్ వీడియో: నేటి ధోని, నాటి ధోనితో ఏమన్నాడంటే.. -
'ఐపీఎల్ మాకు మేలు చేసింది.. డబ్బుతో వెలకట్టలేం'
అహ్మదాబాద్: ఇంగ్లండ్ వన్డే, టీ20 కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఐపీఎల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ వల్ల మాకు లాభమే కలిగింది కానీ ఏనాడు నష్టం జరగలేదని తెలిపాడు. ఐపీఎల్ వల్ల కలిగిన అనుభవాన్ని తాము డబ్బుతో వెలకట్టలేమని మోర్గాన్ స్పష్టం చేశాడు. టీమిండియాతో కొన్ని గంటల వ్యవధిలో తొలి టీ20 మ్యాచ్ ఆరంభం కానున్న సమయంలో మోర్గాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తి కలిగించింది. ''ఒక రకంగా మేము ఐపీఎల్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాలి. 2019 ప్రపంచకప్ సాధించడం మొదలు.. టీ20ల్లో నంబర్‌వన్‌గా నిలబడ్డామంటే దానికి ఐపీఎల్ లాంటి లీగ్‌లే కారణమని చెప్పొచ్చు. రానున్న రెండు టీ20 ప్రపంచకప్ దృష్టిలో పెట్టుకొని మేము ఐపీఎల్ ఆడడం వల్ల మాకు ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఏర్పడనుంది.మా ఆటగాళ్లు ఐపీఎల్లో కంటిన్యూ అవడం వల్ల బ్యాటింగ్ ఎలా చేయాలనే దానిపై క్లారిటీతో పాటు ఆత్మవిశ్వాసాన్ని మెండుగా సంపాదించినట్లవుతుంది. అందుకే ఐపీఎల్‌ను దేనితో వెలకట్టలేం. డబ్బులు మాకు మొదటి ప్రాధాన్యం కాదు.. ఆటలో మరిన్ని మెళుకువలు నేర్చుకోవాలంటే ఐపీఎల్లో పాల్గొనాల్సి ఉంటుంది.''అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇయాన్ మోర్గాన్ ప్రస్తుతం ఐపీఎల్లో కేకేఆర్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్లో ఇప్పటివరకు 66 మ్యాచ్‌లాడిన మోర్గాన్ 1272 పరుగులు సాధించాడు. ఇక ఇంగ్లండ్ తరపున 242 వన్డేల్లో 7598 పరుగులు, 97 టీ20ల్లో 2278 పరుగులు, 16 టెస్టుల్లో 241 పరుగులు సాధించాడు. కాగా ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9న మొదలై.. మే 30న ముగియనుంది. చదవండి: త్రో వేయడంలో కన్ఫ్యూజన్.. అసలు మజా అక్కడే 'నేను నీలాగా కావాలంటే ఎన్ని ఆమ్లెట్స్ తినాలి' -
తన రూటే సపరేటు...
సుమారు ఎనిమిదేళ్ల క్రితం... ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. తొలి మూడు మ్యాచ్‌ల్లో అవకాశం దక్కించుకోలేకపోయిన ఆ కుర్రాడు చివరి టెస్టులో బరిలోకి దిగాడు. నెమ్మదైన పిచ్‌పై టీమిండియా స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ 229 బంతులు ఆడిన అతను అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. భారత గడ్డపై తొలి మ్యాచ్‌లోనే అతను కనబర్చిన పట్టుదల చూసి ఇంగ్లండ్ భవిష్యత్తు తార అంటూ ప్రశంసలు కురిశాయి. తర్వాతి రోజుల్లో తనపై అంచనాలను నిలబెట్టుకుంటూ అత్యుత్తమ టెస్టు క్రికెటర్లలో ఒకడిగా ఎదిగిన ఆ కుర్రాడే జోసెఫ్ ఎడ్వర్డ్ రూట్... నాగపూర్‌లో మొదలైన రూట్ ప్రస్థానం ఇప్పుడు చెన్నైలో వందో టెస్టు వరకు చేరింది. ఈతరం ఫ్యాబ్–4లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న రూట్ అందరికంటే ముందుగా టెస్టు మ్యాచ్‌ల సెంచరీ మైలురాయిని చేరుకోవడం విశేషం. సాక్షి క్రీడా విభాగం భారీగా పరుగుల వరద పారించి ఒకే సిరీస్‌తో స్టార్‌గా మారిపోయిన రికార్డు అతనికి లేదు. రూట్ పేరు చెప్పగానే విధ్వంసక ఇన్నింగ్స్‌లు గానీ ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన ప్రదర్శనలు గానీ సగటు క్రికెట్ అభిమానికి గుర్తుకు రావు. అయినా సరే రూట్ సాధించిన ఘనతలు అతని విలువేమిటో చెబుతాయి. అతని కెరీర్ గ్రాఫ్ ఆసాంతం ఒకే రీతిలో, నిలకడగా సాగిపోయింది. క్రీజ్‌లో సుదీర్ఘ సమయం నిలిచే పట్టుదల, ఏకాగ్రత, ఓపిక, చూడచక్కటి కళాత్మక షాట్లు ... ఇలా సగటు టెస్టు బ్యాట్స్‌మన్‌కు కావాల్సిన లక్షణాలన్నీ రూట్లో ఉన్నాయి. మెరుపు షాట్లు లేకపోయినా... చూస్తుండగానే చకచకా పరుగులు రాబట్టగలిగే శైలితోనే అతను అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. టెస్టుల్లో రూట్ 19 సెంచరీలు చేస్తే ఇంగ్లండ్ ఒక్కసారి కూడా ఓడిపోలేదంటే (15 విజయాలు, 4 ‘డ్రా’) జట్టులో అతని ప్రాధాన్యత అర్థమవుతుంది. వైఫల్యాల నుంచి... కెరీర్ ఆరంభంలో రూట్‌కు ఆరో స్థానంలోనే బ్యాటింగ్ చేసే అవకాశాలు వచ్చాయి. అదే స్థానంలో తన సొంత మైదానం హెడింగ్లీలో సెంచరీ అనంతరం అతని ప్రదర్శనను చూసిన ఇంగ్లండ్ సెలక్టర్లు ఓపెనర్‌గా అవకాశాలు ఇచ్చారు. అయితే 2013–14లో ఆసీస్ గడ్డపై జరిగిన యాషెస్ సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. చివరి టెస్టులో అతనికి చోటు కూడా దక్కలేదు. అయితే కొద్ది రోజులకే లార్డ్స్ మైదానంలో శ్రీలంకపై చేసిన సెంచరీతో రూట్ కెరీర్ మలుపు తిరిగింది. తర్వాతి ఏడాదే భారత్‌పై చేసిన రెండు సెంచరీలతో రూట్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. ముఖ్యంగా ఇంగ్లండ్ బోర్డుతో గొడవల అనంతరం కెవిన్ పీటర్సన్ కెరీర్ అనూహ్యంగా ముగిసిపోవడంతో ఆ స్థానాన్ని ఆక్రమించిన అతను జట్టులో పాతుకుపోయాడు. 2015 ఏడాదిలో టెస్టుల్లో 1,385 పరుగులు చేయడం రూట్ కెరీర్లో హైలైట్‌గా నిలిచింది. అతడిని ఐసీసీ బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ను కూడా చేసింది. ఉపఖండంలోనూ... సాధారణంగా ఇంగ్లండ్ క్రికెటర్లకు ఆసియా దేశాల్లో పేలవ రికార్డు ఉంటుంది. అయితే స్పిన్‌ను సమర్థంగా ఆడగల నైపుణ్యం ఉన్న రూట్ దీనికి భిన్నం. ముఖ్యంగా స్వీప్ షాట్ రూట్‌కు ఉపఖండంలో భారీగా పరుగులు తెచ్చి పెట్టింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో 2 టెస్టుల్లోనే చేసిన 426 పరుగులు అతని సామర్థ్యాన్ని చూపించాయి. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో ఆసియా ఖండం లో అందరికంటే ఎక్కువ సగటు రూట్ (54.13)దే కాగా, కనీసం 8 వేల పరుగులు చేసిన వారిలో కూడా అతనే అత్యుత్తమం. కెరీర్లో 99 టెస్టుల తర్వాత చూస్తే రూట్ చేసినన్ని పరుగులు మరే ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ కూడా చేయలేదు. 2016లో భారత గడ్డపై ఇంగ్లండ్ జట్టు 0–4తో చిత్తుగా ఓడిన సిరీస్‌లోనూ 49.10 సగటుతో 491 పరుగులు చేసిన రూట్ జట్టు తరఫున టాప్‌స్కోరర్‌గా నిలిచి తన సత్తా ఏమిటో చూపించాడు. ఇదే సిరీస్ తర్వాత రూట్ ఇంగ్లండ్ 80వ టెస్టు కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు. వారితో పోలిస్తే... ఫ్యాబ్–4లో సహజంగానే కోహ్లి, స్మిత్, విలియమ్సన్‌లతో రూట్‌కు పోలిక ఉంటోంది. అయితే గణాంకాలపరంగా చూస్తే ఈ ముగ్గురికంటే అతను ఒకింత వెనుకబడినట్లే అనిపిస్తోంది. సాధించిన సెంచరీల సంఖ్య, సగటులో స్మిత్ (61.80/27), విలియమ్సన్ (54.31/24), కోహ్లి (53.41/27)లతో పోలిస్తే రూట్ (49.39/19) రికార్డు గొప్పగా కనిపించదు. కానీ ఇంగ్లండ్ క్రికెట్‌కు సంబంధించి అతను సాధించిన రికార్డులు మాత్రం అతడిని ఆ దేశపు బెస్ట్ బ్యాట్స్‌మన్ జాబితాలో నిలబెట్టాయి. ప్రస్తుతం 30 ఏళ్ల వయసు, ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా టెస్టుకు దూరం కాని ఫిట్నెస్, ఇంగ్లండ్ జట్టు ఎక్కువ సంఖ్యలో ఆడే టెస్టులు... ఇవన్నీ చూస్తే ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగుల అలిస్టర్ కుక్ (12,472 పరుగులు) రికార్డును రూట్ (8,249) తొందరలోనే అందుకోగలడు. -
సెంచరీతో ఆదుకున్న రూట్
గాలె: శ్రీలంక, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతోన్న రెండో టెస్టు మూడోరోజు ఆటలో లంక లెఫ్టార్మ్ స్పిన్నర్ లసిత్ ఎంబుల్డేనియా (7/132), కెరీర్లో 99వ టెస్టు ఆడుతున్న ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (309 బంతుల్లో 186; 18 ఫోర్లు)ల పోరాటం హైలైట్‌గా నిలిచింది. లసిత్ స్పిన్ ధాటికి సహచరులంతా పరుగులు చేయడానికి తడబడుతుంటే... అతన్ని సమర్థంగా ఎదుర్కొన్న జో రూట్ వరుసగా రెండో టెస్టులో శతకాన్ని నమోదు చేశాడు. దీంతో 98/2 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ ఆటముగిసే సమయానికి 9 వికెట్లకు 339 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇంకా 42 పరుగులు వెనుకబడి ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 67తో ఆదివారం బరిలో దిగిన రూట్ టెస్టుల్లో 19వ సెంచరీని సాధించాడు. దీంతోపాటు ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు (8,238) చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరాడు. తొలి మూడు స్థానాల్లో అలిస్టర్ కుక్ (12,472), గ్రాహమ్ గూచ్ (8,900), అలెక్ స్టీవార్ట్ (8,463) ఉన్నారు. జాస్ బట్లర్ (55; 7 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. కెరీర్లో తొమ్మిదో టెస్టు ఆడుతోన్న ఎంబుల్డేనియా ఈ మ్యాచ్‌లో స్యామ్ కరన్ (13) వికెట్‌తో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ఘనతను మూడోసారి అందుకున్నాడు. ఆ తర్వాత డామ్ బెస్ (32; 4 ఫోర్లు), మార్క్ వుడ్ (1)లను కూడా పెవిలియన్ పంపి తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశాడు. శ్రీలంక ప్లేయర్ తిరిమన్నె ఐదు క్యాచ్‌లు అందుకున్నాడు. తద్వారా వికెట్ కీపర్లు కాకుండా టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన శ్రీలంక ఫీల్డర్‌గా గుర్తింపు పొందాడు. -
వైద్య సహాయకురాలిగా హెథర్ నైట్
లండన్: ప్రపంచాన్ని విలవిల్లాడిస్తోన్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రముఖులు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తుంటే ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హెథర్ నైట్ మరో అడుగు ముందుకు వేసి సేవ మార్గాన్ని ఎంచుకుంది. తమ దేశ ‘జాతీయ ఆరోగ్య సేవా సంస్థ’ (ఎన్హెచ్ఎస్)లో వలంటీర్‌గా సేవలందించేందుకు తన సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నట్లు ఆమె తెలిపింది. యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో ప్రాణాంతక వైరస్‌ను అరికట్టేందుకు నిరంతం శ్రమిస్తోన్న వైద్య వ్యవస్థకు తన సహాయాన్ని అందించనున్నట్లు 29 ఏళ్ల హెథర్ నైట్ పేర్కొంది. ఇందులో భాగంగా ఆమె చికిత్సకు అవసరమైన మందుల రవాణా చేయడంతోపాటు కరోనా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించనుంది. ‘ఎన్హెచ్ఎస్ వలంటీర్ పథకంలో నేను చేరాను. ప్రస్తుతం ఏ పనీ లేకుండా ఉన్నాను. నా దగ్గర బోలెడంత ఖాళీ సమయం ఉంది. సాధ్యమైనంత వరకు సేవ చేస్తా. నా సోదరుడు, అతని భార్య ఇద్దరూ డాక్టర్లే. ఇంకా నాకు ఎన్హెచ్ఎస్లో పనిచేసే స్నేహితులు కూడా ఉన్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో రోగుల కోసం వైద్యులు ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాను. అందుకే వారికి సహాయపడాలని ఈ నిర్ణయం తీసుకున్నా’ అని ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్న హెథర్ నైట్ వివరించింది. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల టి20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ సెమీస్‌లో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. అనంతరం హెథర్ యూకే నిబంధనల ప్రకారం ఐసోలేషన్లోకి వెళ్లింది. ప్రస్తుతం యూకేలో 14,543కి పైగా కోవిడ్–19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం వలంటీర్ పథకాన్ని ప్రవేశపెట్టగా... 5 లక్షల మంది ఇందులో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. -
ఇంగ్లండ్ కెప్టెన్‌గా మోర్గాన్
లండన్: స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే 15 మంది సభ్యులుగల ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు. ఈ మెగా ఈవెంట్లో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా మోర్గాన్ వ్యవహరిస్తాడు. ఇంగ్లండ్ జట్టు: మోర్గాన్ (కెప్టెన్), జేసన్ రాయ్, అలెక్స్ హేల్స్, జో రూట్, బెయిర్‌స్టో, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, టామ్ కరన్, ఆదిల్ రషీద్, జో డెన్లీ, ప్లంకెట్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్. -
రూట్ భారీ సెంచరీ
లండన్: ఇంగ్లండ్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లోనే జో రూట్ సత్తా చాటాడు. లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికాతో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో భారీ సెంచరీతో చెలరేగాడు. రూట్ (227 బంతుల్లో 184 బ్యాటింగ్; 26 ఫోర్లు, 1 సిక్స్) ప్రదర్శనతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 87 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. రూట్‌తో పాటు మొయిన్ అలీ (61 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అభేద్యంగా 167 పరుగులు జత చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, ఫిలాండర్ (3/37) ధాటికి 76 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కుక్ (3), జెన్నింగ్స్ (8), బాలెన్స్ (20), బెయిర్ స్టో (10) విఫలమయ్యారు. ఈ దశలో రూట్, బెన్ స్టోక్స్ (56) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 114 పరుగులు జోడించారు. -
'అంచనాలు లేకుండా వచ్చాం, సెమీస్ చేరాం'
న్యూఢిల్లీ: తాము ఎటువంటి అంచనాలు లేకుండానే టీ20 వరల్డ్ కప్ కు వచ్చామని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. ప్రత్యేకంగా ఒక లక్ష్యం పెట్టుకోలేదని చెప్పాడు. తమకు అందుబాటులో వనరులతో సమర్థవంతంగా ఆడాలన్న ఉద్దేశంతో బరిలోకి దిగామని అన్నాడు. శ్రీలంకతో శనివారం రాత్రి మ్యాచ్ ముగిసిన తర్వాత మోర్గాన్ విలేకరులతో మాట్లాడాడు. సెమీఫైనల్ కు అర్హత సాధించాలని ముందుగా లక్ష్యం నిర్దేశించుకున్నారా అని ఈ సందర్భంగా అడగ్గా... 'నిజం చెప్పాలంటే గొప్ప లక్ష్యాలు ఏవీ పెట్టుకోలేదు. అంచనాలు, అడ్డంకులు, నియంత్రణలు లాంటివి సెట్ చేసుకోలేదు. మా సామర్థ్యం మేరకు బెస్ట్ గా ఆడాలనుకున్నాం. అలా ఆడితే మంచి పొజిషన్ లో ఉంటామని అనున్నామ'ని మోర్గాన్ బదులిచ్చాడు. ఒత్తిడి సమయాల్లో తమ జట్టు రాణించిన తీరు పట్ల అతడు సంతృప్తి వ్యక్తం చేశాడు. తీవ్ర ఒత్తిడిలోనూ విజయాలు సాధించడంతో ఆత్మవిశ్వాసం పెరిగిందని, మున్ముందు మరింత కష్టపడాల్సి ఉంటుందని అన్నాడు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో 10 పరుగులతో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకను ఓడించి ఇంగ్లండ్ మూడో విజయంతో సగర్వంగా సెమీస్‌కు చేరింది.