రూట్ భారీ సెంచరీ
లండన్: ఇంగ్లండ్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లోనే జో రూట్ సత్తా చాటాడు. లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికాతో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో భారీ సెంచరీతో చెలరేగాడు. రూట్ (227 బంతుల్లో 184 బ్యాటింగ్; 26 ఫోర్లు, 1 సిక్స్) ప్రదర్శనతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 87 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. రూట్‌తో పాటు మొయిన్ అలీ (61 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు.
వీరిద్దరు ఆరో వికెట్‌కు అభేద్యంగా 167 పరుగులు జత చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, ఫిలాండర్ (3/37) ధాటికి 76 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కుక్ (3), జెన్నింగ్స్ (8), బాలెన్స్ (20), బెయిర్ స్టో (10) విఫలమయ్యారు. ఈ దశలో రూట్, బెన్ స్టోక్స్ (56) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 114 పరుగులు జోడించారు.