Root
-
Dock Bridge : ప్రకృతి ఆధారిత వేళ్ల వంతెన..!
ఇది వేళ్లాడే వంతెన. ఉంగాట్ నది మీద ఉంది. అభివృద్ధి చెందిన నగరాలన్నీ నగరం మధ్యలో ఉన్న చెరువు మీద ఇనుప చువ్వలతో వేళ్లాడే వంతెనలను కడుతున్నాయి. కానీ ఉంగాట్ నది మీద కనిపించేవి వేళ్లతో కట్టిన వంతెనలు. అది కూడా చెట్టు నుంచి వేరు చేసిన వేళ్లు కాదు, సజీవంగా ఉన్న వేళ్ల వంతెనలు. ఈ నైపుణ్యం ప్రపంచంలో మనదేశానికే సొంతం, అది కూడా మేఘాలయ వంటి మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించిన నైపుణ్యం. ఈ నది డాకీ పట్టణం నుంచి ప్రవహిస్తోంది. వంతెన డాకీ పట్టణంలో ఉంది. అందుకే డాకీ రూట్ బ్రిడ్జిగా వ్యవహారంలోకి వచ్చింది. ఇలాంటి వంతెనలు డాకీ పట్టణంలో మాత్రమే కాదు. మేఘాలయలో చాలా చోట్ల విస్తారంగా ఉంటాయి. కానీ మేఘాలయ పర్యటనకు వెళ్లిన వాళ్లు తప్పకుండా డాకీ పట్టణంలోని రూట్ బ్రిడ్జి మీద నడిచి మురిసిపోతారు. ఎందుకంటే ఇది దేశానికి చివరి వంతెన. డాకీ దాటితే బంగ్లాదేశ్‌లో అడుగుపెడతాం. మనిషికి జీవన నైపుణ్యాలు అవసరాన్ని బట్టి వృద్ధి చెందుతాయనడానికి నిదర్శనం ఈ వంతెనలు. ఇనుము, సిమెంటు వంటి భవన నిర్మాణ సామగ్రిని తరలించడం సాధ్యం కాని చోట్ల ప్రకృతి ఇచ్చిన మెటీరియల్‌తో జనం తమకు అవసరమైన విధంగా మలుచుకోవడం అంటే ఇదే. మేఘాలయలో నివసించే ఖాసీ, జైంతియా తెగల వాళ్లు నదికి రెండు వైపులా ఉన్న రబ్బరు చెట్ల వేళ్లను ఒకదానితో మరొక దానిని జడలాగ అల్లుతూ ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుతో కలుపుతారు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరడానికి వంతెన రెడీ. సిమెంటు వంతెనలు ఎప్పుడు కూలిపోతాయో తెలియదు కానీ ఈ వేళ్ల వంతెనలను ఒకసారి అల్లితే వందేళ్లకు కూడా చెరగవు, పైగా మరింత దృఢమవుతూ ఉంటాయి. మరీ లేత వేళ్లను కాకుండా ఒక మోస్తరు ముదురు వేళ్లతో వంతెన అల్లుతారు. కాలం గడిచే కొద్దీ చెట్టు పెద్దదవుతుంది, వేళ్లు శక్తిపుంజుకుంటూ ఉంటాయి. మరో విచిత్రం ఏమిటంటే... ఈ వేళ్లు నది నీటిని అందుకోవడానికి మాన్గ్రోవ్లాగ పిల్ల వేళ్లను పెంచుకుంటాయి. కొత్త వంతెనలు మనం నడిచేటప్పుడు బరువుకు తగినట్లు ఊగుతుంటాయి. ముదురు వంతెనలు కదలవు. ఈ వంతెనల మీద నుంచి రాకపోకలు సాగించేది మనుషుల మాత్రమే కాదు, జింకలు, చిరుతపులులతోపాటు ఇతర జంతువులు కూడా ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు వంతెనల మీదనే వెళ్తాయి. ఇప్పటి వరకు వంతెన గొప్పదనాన్నే మాట్లాడుకున్నాం. కానీ ఉంగాట్ నదికి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన విశేషణం ఉంది. మనదేశంలో అత్యంత పరిశుభ్రమైన నదుల్లో ఉంగాట్ నది ఒకటి. ఈ నదిలో పడవలో విహరిస్తుంటే నీటి కింద నేల అద్దంలో కనిపించినంత స్వచ్ఛంగా ఉంటుంది. వేళ్ల వంతెన మీద నడవడంతోపాటు పడవ ఎక్కి ఈ నదిలో విహరించడం కూడా గొప్ప అనుభూతి.రాముడు కూడా కట్టాడునది మీద చెట్ల వేళ్లతో వంతెన నిర్మించే నైపుణ్యం ఇతిహాస కాలం నాటిదని చెబుతారు. వనవాస కాలంలో సీతారామ లక్ష్మణులు అడవుల్లో నివసించినట్లు చెప్పుకుంటాం. గంగానది తీరాన నివసించిన రోజుల్లో ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు చేరడానికి రాముడు, లక్ష్మణుడు నదిలో ఈదుతూ వెళ్లేవారని, ప్రతిరోజూ నది దాటడం సీతమ్మకు కష్టం కావడంతో ఆమె కోసం వంతెన నిర్మించారని చెబుతారు. గంగానది మీద రిషికేశ్ దగ్గర రామ్‌ఝాలా, లక్ష్మణ్ ఝాలా ఉన్నాయి. బ్రిటిష్ పాలన కాలంలో ఈ వంతెనలను ఇనుముతో పునర్నిర్మించారు. రిషికేశ్‌లో గంగానది మీద ఇప్పుడు మనకు కనిపించేవి కొత్త నిర్మాణాలు. వాకా మంజూలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: తాత మొండి పట్టుదల ఎంత పనిచేసింది..! ఏకంగా ఇంటి చుట్టూ..) -
రూట్ బ్రిడ్జ్ యునెస్కో జాబితాలో...
మేఘాలయ రాష్ట్రంలో సర్వసాధారణంగా కనిపించే లివింగ్ రూట్ బ్రిడ్జీల గురించి మనకు తెలిసిందే. ఆ రాష్ట్రానికే మన దేశానికీ ప్రకృతి పరంగా గుర్తింపు తెచ్చిన ఈ రూట్ బ్రిడ్జ్‌లకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా ఇవ్వడం కోసం ప్రతినిధుల బృందం తరలి వచ్చింది. ప్రస్తుతం యునెస్కో తాత్కాలిక జాబితాలో ఉన్న లివింగ్ రూట్ బ్రిడ్జ్‌లను ప్రపంచ ప్రసిద్ధ వారసత్వ జాబితాలోకి చేరనుందని మేఘాలయ పర్యాటక మంత్రి పాల్ తెలియజేస్తున్నారు. 42వ యునెస్కో జనరల్ కాన్ఫరె ్స ప్రెసిడెంట్, రొమేనియా రాయబారి అయిన సిమోనా–మిరేలా మికులేస్కుతో లింగ్డో, జింగ్కీంగ్ జ్రీ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో గుర్తించడం కోసం సమావేశం జరి΄ారు. ఈ సమావేశంలో యునెస్కో భారత రాయబారి, శాశ్వత ప్రతినిధి కూడా ఉన్నారు. -
షిల్లాంగ్ వేళ్ల వంతెన.. చూడాల్సిందే
ఇది కంప్యూటర్లో చేసిన గ్రాఫిక్ కాదు. ప్రకృతి చేసిన విన్యాసం. అక్వేరియంలో చేపలకు బదులు పడవ బొమ్మను వదిలినట్లు అనిపిస్తోంది కదూ! కానీ ఇది బొమ్మ పడవ కాదు, నిజమైన పడవ. అందులో ఉన్న మనుషులు ఆ సరస్సు సౌందర్యాన్ని వీక్షించడానికి వచ్చిన పర్యాటకులు. ఆ సరస్సు పేరు ఉమియా లేక్. ఇది మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నగరానికి పదిహేను కిలోమీటర్ల దూరాన ఉంది. ఇది 220 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన సరస్సు. ఈ సరస్సులో నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో పదాల్లో చెప్పాల్సిన పని లేదు, ఈ ఫొటో చెప్పేస్తోంది. ఉమియా సరస్సులో తేలుతున్న పడవ మెత్త చీపురు ఇక్కడిదే.. మేఘాలయలో కమలా తోటలు ఎక్కువ. క్యాబేజీ, క్యాలిఫ్లవర్ పంట చేలు విస్తారంగా కనిపిస్తాయి. కొండ వాలులో రకరకాల అడవి చెట్లు ఉంటాయి. వాటన్నింటిలో చీపురు చెట్లు ఎక్కువ. పట్టు కుచ్చులా మెత్తగా ఉండే చీపురును మనం కొండ చీపురు కట్ట అంటాం. ఆ చెట్లు పెరిగేది ఇక్కడే. వేళ్ల వంతెన మీద పర్యాటకుల సందడి చెట్ల వేళ్లతో వంతెన... టెక్నాలజీ అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో మన ఇంజనీర్లు చెరువుల మీద సస్పెన్షన్ బ్రిడ్జి కడుతున్నారు. వీటిని మనిషి మేధోవికాసానికి పరాకాష్టలుగా చెప్పుకుంటాం. షిల్లాంగ్ వాసులు మనసుతో వంతెనలు కట్టారు. ఉన్న వనరులను అవసరమైనట్లు మలుచుకోవడానికి మేధతోపాటు సున్నితమైన మనసు కూడా ఉండాలి. చుట్టూ అన్ని చెట్లు ఉన్నప్పటికీ చెట్లను నరికి వంతెన కట్టాలనే ఆలోచన చేయలేదు. మహా వృక్షాల వేళ్లను తాళ్లుగా అల్లి వంతెనగా అమర్చారు. వేళ్లను చెట్ల నుంచి వేరు చేయలేదు. కాబట్టి అవి చెట్టుకు బలాన్నిస్తూనే ఉంటాయి. మనుషులను చేరవేసే వాహకాలుగా కూడా పని చేస్తుంటాయి. పెద్ద చెట్లకయితే రెండు వరుసల వంతెనలు కూడా అల్లుతారు. వంతెన నిండుగా మనుషులు ఎక్కి ఊయల ఊగినట్లు ఊగినా సరే పట్టు సడలవు. ఇదే మంచికాలం... మేఘాలయలో రోడ్లు ఎండాకాలంలో వేస్తే వర్షాకాలంలో కొట్టుకుపోతాయి. సెప్టెంబరు, అక్టోబర్ నెలల్లో వెళ్తే గతుకుల రోడ్ల తిప్పలు తప్పవు. ఏటా నవంబర్ నుంచి రోడ్డు పనులు మొదలై డిసెంబర్‌కి పూర్తవుతాయి. మేఘాలయ రాష్ట్రం మేఘాలమయం కావడంతో రాష్ట్రం మొత్తంలో ఒక్క ఎయిర్‌పోర్టు కూడా లేదు. షిల్లాంగ్ చేరాలంటే పొరుగున ఉన్న అస్సాం రాష్ట్రం, గువాహటి ఎయిర్‌పోర్టులో దిగి రోడ్డు మార్గంలో ప్రయాణించాలి. గువాహటి నుంచి షిల్లాంగ్ వెళ్లే ప్రయాణంలో మేఘాలయ జీవన చిత్రం కళ్లకు కడుతుంది. కాబట్టి అస్సాంలో దిగడం ఏ మాత్రం వృథా కాదు. షిల్లాంగ్ టూర్లో బారాపానీ, నెహ్రూ పార్క్, నోహ్స్గితలాంగ్ జలపాతం, నోహ్కాలికాల్ జలపాతం, మావ్సమాల్ గుహలు, మావ్లాయ్నాంగ్ విలేజ్, ఎలిఫెంట్ ఫాల్స్, షిల్లాంగ్ పీక్ చూడాల్సిన ప్రదేశాలు. -
తీవ్ర ఒత్తిడిలో ఇంగ్లండ్
లండన్: కొంత ప్రతిఘటన ఎదుర్కొన్నా సిరీస్ ట్రోఫీని నిలబెట్టుకున్న ఆస్ట్రేలియా... ఇప్పుడు యాషెస్‌ను పూర్తి ఆధిక్యంతో కైవసం చేసుకోవడంపై దృష్టి సారించింది. ఇదే సమయంలో గురువారం నుంచి ఆరంభమయ్యే చివరిదైన ఐదో టెస్టు ఇంగ్లండ్‌కు ప్రాణ సంకటంగా మారింది. ప్రస్తుతం 1–2తో వెనుకబడి ఉన్న ఆతిథ్య జట్టు ఆఖరి మ్యాచ్‌లోనైనా నెగ్గి సొంతగడ్డపై పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. జోరు మీదున్న కంగారూలను ముఖ్యంగా మాజీ కెపె్టన్ స్టీవ్ స్మిత్‌ను నిలువరిస్తేనే ఇంగ్లండ్ కోరిక నెరవేరే వీలుంది. ఇప్పటికే తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జేసన్ రాయ్‌పై వేటు వేసి ఆల్‌రౌండర్ స్యామ్ కరన్‌కు చోటిచి్చంది. ఓవర్టన్ను తప్పించి క్రిస్ వోక్స్‌ను తీసుకుంది. ఆసీస్ సైతం బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్‌ను పక్కనపెట్టి ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ను ఆడించనుంది. ఎడంచేతి వాటం పేసర్ స్టార్క్ స్థానంలో సిడిల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ టెస్టులోనూ విజయం సాధిస్తే 2001 తర్వాత ఆ్రస్టేలియా... ఇంగ్లండ్ గడ్డపై యాషెస్‌ను గెలిచినట్లవుతుంది. స్మిత్ వీరగాథ; వార్నర్, రూట్ వైఫల్యాల బాధ పరుగులు 671... సగటు 134.20... ఐదు ఇన్నింగ్స్‌ల్లో స్మిత్ ప్రదర్శన ఇది. ఇదే ఊపులో అతడు టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి సైతం ఎగబాకాడు. సిరీస్‌లో రెండు జట్ల మధ్య ప్రధాన తేడా స్మిత్ అని దీంతోనే తెలిసిపోతోంది. తోడుగా లబషేన్, అడపాదడపా వేడ్, కెపె్టన్ పైన్, లోయరార్డర్ రాణిస్తుండటంతో ఆసీస్ గట్టెక్కుతోంది. ఓపెనర్ వార్నర్ (మొత్తం 79 పరుగులు) అధ్వాన ఫామ్ నుంచి బయటపడితే వారి బ్యాటింగ్ మరింత బలోపేతం అవుతుంది. సిరీస్‌లో ఉమ్మడిగా 42 వికెట్లు పడగొట్టిన కమిన్స్–హాజల్‌వుడ్ పేస్ ద్వయాన్ని ఎదుర్కొనాలంటే ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు శక్తికి మించి పోరాడక తప్పేలా లేదు. జట్టుకు మూలస్తంభమైన కెప్టెన్ రూట్ పరుగులు సాధిస్తే మిగతావారిలోనూ ఆత్మవిశ్వాసం వస్తుంది. అయితే, అతడే ఫామ్ వెదుకులాటలో ఉండటం ఇంగ్లండ్‌ను దెబ్బతీస్తోంది. గాయంతో బాధపడుతున్న స్టోక్స్ బ్యాటింగ్‌కే పరిమితం కానున్నాడు. కరన్ రూపంలో నాణ్యమైన ఆల్‌రౌండర్ చేరిక జట్టు రాతను మార్చే వీలుంది. పేసర్లు బ్రాడ్, ఆర్చర్ మరింత పకడ్బందీగా బంతులేసి... బ్యాటింగ్‌లో బట్లర్, బెయిర్‌స్టో విలువైన ఇన్నింగ్స్ ఆడితేనే ఇంగ్లండ్‌కు గెలుపు అవకాశాలుంటాయి. లేదంటే ఐదేళ్ల తర్వాత స్వదేశంలో ప్రత్యర్థి జట్టుకు సిరీస్‌కు కోల్పోతుంది. 2014లో ఆ జట్టు శ్రీలంక చేతిలో 1–0తో పరాజయం పాలైంది. -
రూట్ సెంచరీ: ఇంగ్లండ్ 324/9
క్యాండీ: కెప్టెన్ జో రూట్ (124; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకంతో మెరవడంతో... శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. రోరీ బర్న్స్ (59; 7 ఫోర్లు), ఫోక్స్ (51 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలు సాధించారు. లంక స్పిన్నర్ అఖిల ధనంజయ (6/106) చెలరేగాడు. మరో వికెట్ చేతిలో ఉన్న ఇంగ్లండ్ ప్రస్తుతం 278 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
'రూట్' మూసేశారు...
ఐదు టెస్టుల సిరీస్‌కు ఆరంభం ఎలా ఉండాలని భారత్ ఆశించిందో సరిగ్గా అలాగే జరిగింది. మనోళ్లు బౌలింగ్‌లో అదరగొట్టడంతో బర్మింగ్‌హామ్ కాస్తా బాంబే మైదానంలా కనిపించింది. అశ్విన్ బంతులకు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేస్తుంటే ఆడుతోంది ఇండియాలోనే అనిపించింది. సొంతగడ్డపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని అంతా తమకు అనుకూలంగా మార్చుకున్నట్లు కనిపించిన ఇంగ్లండ్‌ను మొదటి రోజే దెబ్బ తీసి కోహ్లి సేన సిరీస్‌లో సవాల్ విసిరింది. ఒక దశలో ఇంగ్లండ్ స్కోరు 216/3. రూట్, బెయిర్‌స్టో అలవోకగా బ్యాటింగ్ చేస్తూ 104 పరుగులు జోడించారు. కానీ రూట్ చేసిన పొరపాటుకు ఆ జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. లేని పరుగుకు ప్రయత్నించి అతను రనౌట్ కావడంతో భారత్‌కు ‘దారి’ తెరచుకుంది. ఈ అవకాశాన్ని టీమిండియా వృథా చేయలేదు. 1000వ టెస్టు జ్ఞాపికను సరిగా అందుకోలేక ఈసీబీ చైర్మన్ పడేసి రెండు ముక్కలు చేయగానే మొదలైన అశుభం ఇంగ్లండ్‌ను రోజంతా వెంటాడినట్లుంది. బర్మింగ్‌హామ్: అంచనాలకు మించి రాణించిన భారత్ తొలి రోజు ఇంగ్లండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. భారత్ బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ బుధవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. జో రూట్ (156 బంతుల్లో 80; 9 ఫోర్లు), బెయిర్‌స్టో (88 బంతుల్లో 70; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయడం మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. అశ్విన్ 4 వికెట్లు పడగొట్టాడు. ఆఖరి ఓవర్లో కరన్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ దినేశ్ కార్తీక్ వదిలేయడంతో భారత్‌కు చివరి వికెట్ దక్కలేదు. చివరి సెషన్లోనే భారత్ ఆరు వికెట్లు తీయడం విశేషం. బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోయిన పిచ్‌పై ఇంగ్లండ్ స్వయంకృతంతో కుప్పకూలింది. ఇదే వికెట్‌పై రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్ సత్తా చాటితే ఈ టెస్టుపై పట్టు బిగించడం కష్టం కాబోదు. రూట్ జోరు... టాస్ గెలిచిన ఇంగ్లండ్‌కు తొలి రోజు ఆశించిన ఆరంభం లభించలేదు. సీనియర్ బ్యాట్స్‌మెన్ కుక్ (13) తన ఆటతో మళ్లీ నిరాశపర్చాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లోనే అశ్విన్‌ను బౌలింగ్‌కు దించి భారత్ ఫలితం సాధించింది. తన రెండో ఓవర్లోనే అశ్విన్ చక్కటి బంతితో కుక్‌ను బౌల్డ్ చేశాడు. కుక్‌ను అశ్విన్ ఔట్ చేయడం ఇది ఎనిమిదో సారి కావడం విశేషం. అంతకుముందు ఇషాంత్ బౌలింగ్‌లో 9 పరుగుల వద్ద నాలుగో స్లిప్‌లో రహానే క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన కీటన్ జెన్నింగ్స్ (98 బంతుల్లో 42; 4 ఫోర్లు), కెప్టెన్ రూట్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదుర్కొన్నా వీరిద్దరు ఎలాంటి ప్రమాదం లేకుండా తొలి సెషన్‌ను ముగించగలిగారు. అయితే లంచ్ తర్వాత షమీ జోరుతో పరిస్థితి ఒక్కసారిగా భారత్‌కు అనుకూలంగా కనిపించింది. రెండో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం తర్వాత జెన్నింగ్స్ దురదృష్టవశాత్తూ వెనుదిరిగాడు. షమీ వేసిన బంతిని జెన్నింగ్స్ డిఫెన్స్ ఆడగా... అతని కాలికి తగిలి స్టంప్‌పై పడిన బంతి మెల్లగా బెయిల్‌ను గిరాటేసింది. కొద్ది సేపటికి మలాన్ (8) కూడా షమీ బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ దశలో రూట్, బెయిర్‌స్టో సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో 107 బంతుల్లో రూట్ అర్ధ సెంచరీ పూర్తయింది. రెండో సెషన్లో మరో వికెట్ తీసేందుకు భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. టపటపా... చివరి సెషన్‌ను ఇంగ్లండ్ దూకుడుగా ప్రారంభించింది. పాండ్యా ఓవర్లలో రూట్, బెయిర్‌స్టో వరుసగా రెండేసి ఫోర్లు బాదారు. ఈ క్రమంలో 72 బంతుల్లోనే బెయిర్‌స్టో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అయితే ఈ భాగస్వామ్యం వంద పరుగులు దాటిన తర్వాత ఇంగ్లండ్ చేజేతులా వికెట్లు అందించి భారత్ శిబిరంలో ఆనందం నింపింది. రూట్ రనౌట్ జట్టు పతనానికి దారి తీసింది. అశ్విన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో మిడ్ వికెట్ దిశగా ఆడగా సింగిల్ పూర్తయింది. అయితే వీరిద్దరు లేని రెండో పరుగు కోసం సాహసం చేశారు. చురుగ్గా స్పందించిన కోహ్లి బంతిని అందుకొని నాన్‌స్ట్రయికింగ్ వికెట్లపై నేరుగా కొట్టడంతో రూట్ వెనుదిరిగాడు. కోహ్లి ‘డ్రాప్ ద మైక్’ సంబరాలతో రూట్‌ను సాగనంపాడు. కొద్ది సేపటికే ఉమేశ్ బంతిని బెయిర్‌స్టో వికెట్లపైకి ఆడుకోగా... బట్లర్ (0)ను అశ్విన్ ఎల్బీగా ఔట్ చేశాడు. ఈ దశలో ఆదుకునే ప్రయత్నం చేసిన స్టోక్స్ (21) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. చివర్లో స్యామ్ కరన్ (24 బ్యాటింగ్) కొద్దిగా పోరాడటంతో ఇంగ్లండ్ ఆలౌట్ కాలేదు. పుజారా పనికి రాడా! ‘జట్టులో నా స్థానంపై ఢోకా లేదు’... తొలి టెస్టుకు ముందు చతేశ్వర్ పుజారా చెప్పిన మాట తప్పని తేలేందుకు ఎక్కువ రోజులు పట్టలేదు. కేఎల్ రాహుల్‌ను మూడో స్థానంలో ఆడించేందుకు భారత టీమ్ మేనేజ్మెంట్ పుజారాను పక్కన పెట్టింది. సాంకేతికంగా మంచి నైపుణ్యం ఉన్న ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న టెస్టు స్పెషలిస్ట్‌ను ఆడించకపోవడం అనూహ్యమే. నిజానికి తాజా ఫామ్‌ను బట్టి చూస్తే ధావన్ స్థానంలో రాహుల్ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉందనిపించింది. కానీ ఎడమచేతి వాటం కావడం ధావన్‌కు కలిసొచ్చింది. డిఫెన్స్ బలంగా ఉన్నా... పుజారా అతి నెమ్మదిగా ఆడే శైలిపై ఎప్పటినుంచో కోహ్లి, శాస్త్రికి సందేహాలు ఉన్నాయి. రాహుల్‌కు కూడా మంచి టెక్నిక్ ఉండటంతో పాటు అవసరమైతే ధాటిగా ఆడగలడు కాబట్టి అతనికి ప్రాధాన్యత లభించింది. ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్‌కు ముందు సన్నాహకంగా బాగుంటుందని కౌంటీల్లో ఆడిన పుజారాకు అదే నష్టం చేసినట్లుంది. ఎందుకంటే ఈ సీజన్లో కౌంటీల్లో ఆడిన 12 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను కేవలం 14.33 సగటుతో 172 పరుగులు మాత్రమే చేశాడు. పైగా 12 ఇన్నింగ్స్‌లో 8 సార్లు బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం పుజారా డిఫెన్స్‌పై కూడా సందేహాలు రేకెత్తించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టెస్టులో అతను పట్టుదలగా ఆడి చేసిన అర్ధ సెంచరీ భారత్ విజయానికి బాటలు పరచిన విషయాన్ని మరుగున పడేసింది. పుజారాను పక్కన పెట్టే స్థాయిలో అతను విఫలం కాలేదనేది వాస్తవం. పైగా ముగ్గురు ప్రధాన పేసర్లు తుది జట్టులో ఉన్నప్పుడు పాండ్యా అవసరం పెద్దగా లేదు. అతడిని తప్పించైనా రెగ్యులర్ బ్యాట్స్‌మన్ పుజారాకు చోటు కల్పిస్తే సరిపోయేది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పథకం పక్కదారి
చింతపల్లి : గ్రామీణ ప్రాంతాల్లోని గొల్ల, కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రాయితీ గొర్రెల పథకం కొందరికి కాసులపంట పండిస్తుంది. దళారులు లబ్ధిదారుల నుంచి యూనిట్‌కు రూ. 2వేలు వసూలు చేస్తున్నారు. అధికారులు నాణ్యమైనవి పంపిణీ చేయకపోవడంతో గొర్రెలు మృత్యువాతపడుతున్నాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. మరికొందరు అక్రమంగా విక్రయిస్తున్నా అడ్డుకట్ట వేసే వారు కరువవుతున్నారు. చింతపల్లి మండలంలోని 20 గ్రామపంచాయతీల్లో మొదటి దశలో 1105 మంది లబ్ధిదారులు, 2వ విడతలో 1104 మంది లబ్ధిదారులకు రాయితీ గొర్రెలను అందించేందుకు అధికారులు ముందుకొచ్చారు. మొదటి విడతగా 13 గ్రామాలను ఎంపిక చేసి 395 మంది లబ్ధిదారులకు లా టరీ పద్ధతిలో ఎంపిక చేసి 8,295 గొర్రెలను పంపిణీ చేశారు. ప్రతి లబ్ధిదారుడికి కచ్చితంగా 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందించాల్సి ఉంది. అధికారులు మాత్రం తక్కువ ధరకు గొర్రెలను కొనుగోలు చేసి 15 గొర్రెలు, 5 పాలు తాగే వయసున్న గొర్రెలను అంటగట్టారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో గొర్రెలను ఇంటికి తెచ్చిన తర్వాత వయసు మీరిన చిన్న గొర్రెలు మృత్యువాతపడుతున్నాయని చెబుతున్నారు. సకాలంలో వైద్యం అందక మరణిస్తున్నాయి. ఇప్పటికే 900 గొర్రెలకు పైగా మృతి చెందినట్లు సమాచారం. 200 యూనిట్లు మాయం.. మండలంలో మొదటి విడతలో 395 మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. ఇప్పటికే 200 యూనిట్లు విక్రయాలు జరిగినట్లు సమాచారం. ఎప్పటికప్పుడు పశువైద్య అధికారులు గ్రామాలకు వెళ్లి తనిఖీ చేస్తే జీవాలు కనిపించకపోవడంతో కంగుతింటున్నారు. బయటి మార్కెట్లో గొర్రెలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్న అధికారులు పేపర్ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. లబ్ధిదారులు రూ.31,250 చెల్లిస్తే 21 గొర్రెలను అధికారులు అందిస్తున్నారు. బయటి మార్కెట్లో రూ. 80వేలకుపైగా వస్తుండడంతో మండలంలో అక్రమ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు ఇదే అదునుగా చేసుకుని దళారులకు ఒత్తాసు పలుకుతూ గొర్రెల విక్రయానికి సహకరిస్తున్నట్లు సమాచారం. ఒక్కో రైతు వద్ద రూ. 2వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో నెల రోజుల క్రితం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా అధికారులకు ఖంగుతినే పరిస్థితి కనిపించింది. విక్రయదారులు అధికారులు వస్తున్నారనే సమాచారంతో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిన సంఘటనలతో పాటు రెండు, మూడు గొర్రెల గుంపును అధికారులు వచ్చే ముందు వారి ఇంటి ముందు ఉంచుకుంటుండడంతో అధికారులు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. -
రూట్ భారీ సెంచరీ
లండన్: ఇంగ్లండ్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లోనే జో రూట్ సత్తా చాటాడు. లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికాతో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో భారీ సెంచరీతో చెలరేగాడు. రూట్ (227 బంతుల్లో 184 బ్యాటింగ్; 26 ఫోర్లు, 1 సిక్స్) ప్రదర్శనతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 87 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. రూట్‌తో పాటు మొయిన్ అలీ (61 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అభేద్యంగా 167 పరుగులు జత చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, ఫిలాండర్ (3/37) ధాటికి 76 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కుక్ (3), జెన్నింగ్స్ (8), బాలెన్స్ (20), బెయిర్ స్టో (10) విఫలమయ్యారు. ఈ దశలో రూట్, బెన్ స్టోక్స్ (56) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 114 పరుగులు జోడించారు. -
ఆ రికార్డును ఇద్దరూ మిస్సయ్యారు!
చెన్నై: దాదాపు పుష్కరకాలానికి పైగా ఉన్న ఒక అరుదైన రికార్డుకు ఇద్దరు ఇంగ్లండ్ క్రికెటర్లు అత్యంత చేరువగా వచ్చినా దాన్ని మాత్రం అందుకోలేకపోయారు. ఇంగ్లండ్ తరపున ఒక ఏడాది అత్యధిక పరుగులు రికార్డును నెలకొల్పే అవకాశాన్ని తొలుత జో రూట్ కోల్పోగా, ఆ తరువాత దాన్ని బెయిర్ స్టో కూడా మిస్సయ్యాడు. 2002లో ఇంగ్లండ్ జట్టు తరపున టెస్టుల్లో ఒక క్యాలెండర్ అత్యధిక పరుగులు చేసిన రికార్డు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్(1481) పేరిట ఉంది. అదే ఆ జట్టు తరపున ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగుల రికార్డుగా ఉంది. అయితేఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జో రూట్ ఆ రికార్డుకు పది పరుగుల దూరంలో నిలిచిపోగా, బెయిర్ స్టో 12 పరుగుల దూరంలో ఆ మైలురాయిని చేరుకునే కోల్పోయాడు. 2016లో జో రూట్ మూడు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీ సాయంతో 1471 పరుగులు నమోదు చేయగా, బెయిర్ స్టో 3 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలతో 1469 పరుగులు నమోదు చేశాడు. దాంతో ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లండ్ ఆటగాళ్లలో రూట్, బెయిర్ స్టోలు వరుసగా రెండు,మూడు స్థానాల్లో నిలిచారు. ఈ మ్యాచ్ లో స్టో 49 పరుగులు చేసి అవుట్ కాగా,రూట్ 88 పరుగులు చేసి అవుటయ్యాడు. -
తొలి టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు
-
శతక్కొట్టారు
తొలి టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు స్టోక్స్, మొయిన్ సెంచరీలు ధీటుగా స్పందించిన భారత ఓపెనర్లు ఒకరిని మించి మరొకరు... రూట్ చూపించిన దారిలో మొరుున్ అలీ, స్టోక్స్ కూడా చెలరేగిపోయారు. అద్భుతమైన నిలకడతో సెంచరీలు చేశారు. భారత గడ్డపై బ్యాటింగ్ చేయడం ఇంత సులభమా అని మిగిలిన జట్లు అసూయ పడేలా ఇంగ్లండ్ పరుగుల వర్షం కురిపించింది. ఫలితంగా భారత్‌తో తొలి టెస్టులో భారీస్కోరుతో ఇంగ్లండ్ బలమైన స్థితికి చేరింది. తొలి రోజు మూడు క్యాచ్‌లు వదిలేసినా రెండో రోజూ భారత జట్టు తప్పులు దిద్దుకోలేదు. మరో రెండు క్యాచ్‌లు వదిలేయడంతో పాటు ఫీల్డింగ్‌లోనూ నత్తల్లా కదిలారు. ఒక్క పరుగు వచ్చే చోట మనోళ్లు రెండేసి ఇచ్చేశారు. ఫలితంగా కోహ్లి కెప్టెన్ అయ్యాక స్వదేశంలో భారత్ తొలిసారి ఆత్మరక్షణలో పడింది. మన ఓపెనర్లు ఆచితూచి ఆడి వికెట్ పడకుండా ఓ సెషన్‌తో ధీటుగా స్పందించినా... పిచ్‌పై అప్పుడే టర్న్ మొదలైంది. ఇక మూడో రోజు భారత బ్యాట్స్‌మెన్ ఏం చేస్తారనే అంశంపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. రాజ్‌కోట్: భారత గడ్డపై తమ రికార్డులు తామే అందుకుంటూ ఇంగ్లండ్ జట్టు దూసుకుపోతోంది. నాలుగేళ్ల క్రితం కోల్‌కతా టెస్టులో 500 పైచిలుకు పరుగులు చేసిన ఇంగ్లండ్... మరోసారి సులభంగా ఐదొందలు చేసింది. ఈ మధ్య కాలంలో మరే జట్లూ భారత్‌పై భారత్‌లో ఐదొందలు చేయలేదు. స్టోక్స్ (235 బంతుల్లో 128; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ తో సెంచరీ చేయగా... ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ మొయిన్ అలీ (213 బంతుల్లో 117; 13 ఫోర్లు) కూడా సెంచరీ చేశాడు. తొలి రోజు రూట్ కూడా సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురి శతకాలతో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ భారీస్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో కుక్‌సేన 159.3 ఓవర్లలో 537 పరుగులు చేసి ఆలౌటరుుంది. బెరుుర్‌స్టో (57 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడగా... టెరుులెండర్ అన్సారీ (83 బంతుల్లో 32; 3 ఫోర్లు) కూడా ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీయగా... షమీ, ఉమేశ్, అశ్విన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి 23 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. గంభీర్ (68 బంతుల్లో 28 బ్యాటింగ్; 4 ఫోర్లు), విజయ్ (70 బంతుల్లో 25 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగులు వెనకబడి ఉంది. సెషన్ 1: వేగంగా పరుగులు కొత్త బంతి తీసుకుని భారత్ రోజును ప్రారంభించగా... ఆడిన మూడో బంతిని సింగిల్ తీసి మొరుున్ అలీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత అలీ ఒక్కసారిగా వేగం పెంచి ఉమేశ్ వేసిన ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టాడు. రెండో ఎండ్‌లో స్టోక్స్ జాగ్రత్తగా ఆడుతూనే చెత్త బంతుల్ని వదలకుండా బౌండరీకి పంపాడు. షమీ ఓ చక్కటి బంతితో మొరుున్ను అట్ చేశాడు. స్టోక్స్, మొరుున్ ఐదో వికెట్‌కు 62 పరుగులు జత చేశారు. బెరుుర్‌స్టో ఆరంభంలో నెమ్మదిగా ఆడి కుదురుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మిశ్రా బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో ఇన్నింగ్స వేగం పెంచాడు. మరో ఎండ్‌లో స్టోక్స్ 89 బంతుల్లో అర్ధసెంచరీ మార్కును చేరుకున్నాడు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే ఉమేశ్ బౌలింగ్‌లో స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ సాహా వదిలేశాడు. ఉమేశ్ తర్వాతి ఓవర్లోనూ స్టోక్స్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను సాహా మరోసారి జారవిడిచాడు. బెరుుర్‌స్టో మరో సిక్సర్‌తో పాటు చకచకా బౌండరీలతో దూసుకుపోతున్న సమయంలో షమీ ఈ జోరుకు బ్రేక్ వేశాడు. కీపర్‌కు క్యాచ్ ఇచ్చి బెరుుర్‌స్టో వెనుదిరిగాడు. స్టోక్స్, బెరుుర్‌స్టో ఆరో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. ఈ సెషన్లో నాలుగుకు పైగా రన్‌రేట్‌తో ఇంగ్లండ్ వేగంగా పరుగులు చేసింది. ఓవర్లు: 30 పరుగులు: 139 వికెట్లు: 2 సెషన్ 2: ఎట్టకేలకు ఆలౌట్ లంచ్ తర్వాత తొలి ఓవర్లోనే జడేజా బౌలింగ్‌లో వోక్స్ అవుటయ్యాడు. అదే జోరులో జడేజా... రషీద్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు. అరుుతే ఈ దశలో స్టోక్స్‌కు స్పిన్నర్ అన్సారీ అండగా నిలిచాడు. జడేజా బౌలింగ్‌లో బౌండరీతో స్టోక్స్ 173 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. కెరీర్లో ఇది తనకు నాలుగో సెంచరీ. అన్సారీ నెమ్మదిగా ఆడినా స్టోక్స్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యంలో భాగమయ్యాడు. ఉమేశ్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇవ్వడం ద్వారా స్టోక్స్ వెనుదిరిగాడు. దీంతో విరామం ఇవ్వకుండా కొంతసేపు సెషన్‌ను పొడిగించారు. ఆ తర్వాత కొద్దిసేపు భారత బౌలర్ల ఓపికను పరీక్షించిన అన్సారీ... చివరకు మిశ్రా బౌలింగ్‌లో ఎల్బీగా అవుటయ్యాడు. ఈ సెషన్లో పరుగులు చాలా నెమ్మదించారుు. ఓవర్లు: 36.3 పరుగులు: 87 వికెట్లు: 4 సెషన్ 3: ఓపెనర్ల జాగ్రత్త ప్రత్యర్థి భారీ స్కోరు చేయడంతో భారత ఓపెనర్లు గంభీర్, విజయ్ కూడా జాగ్రత్తగా ఇన్నింగ్‌సను మొదలుపెట్టారు. ఇద్దరూ ఆరంభంలో చెరో బౌండరీ కొట్టినా... ఆ తర్వాత జోరు తగ్గింది. ముఖ్యంగా స్పిన్నర్లు బౌలింగ్‌కు వచ్చాక బౌండరీలు రావడం కష్టమరుుంది. చివర్లో కాస్త టర్న్ కనిపించినా... బ్యాటింగ్ చేయడం కష్టంగా మాత్రం లేదు. అరుుతే వికెట్ పడకుండా రోజును ముగించాలనే లక్ష్యంతో భారత ఓపెనర్లు ఆడినట్లు కనిపించారు. ఓవర్లు: 23 పరుగులు: 63 వికెట్లు: 0 ‘కొన్నిసార్లు క్యాచ్‌లు జారిపోతుంటారుు. అది ఆటలో భాగంగా చూడాలి. ఇది అందరి వైఫల్యం. దీనికి అశ్విన్ ఒక్కడినే బాధ్యుడిని చేయకూడదు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం దురదృష్టం. మూడో రోజు నుంచి స్పిన్నర్లకు పిచ్ సహకారం లభిస్తుందని అనుకుంటున్నా. మేం ఆశావహ దృక్పథంతో ఆడతాం’ - రవీంద్ర జడేజా ► 4 భారత గడ్డపై 1990 తర్వాత ఒక విదేశీ జట్టులోని ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేయడం ఇది నాలుగోసారి. 2002లో వెస్టిండీస్, 2003లో న్యూజిలాండ్, 2009లో శ్రీలంక మాత్రమే ఈ ఘనత సాధించారుు. ► 5 ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ముగ్గురు ఒకే ఇన్నింగ్సలో సెంచరీ చేసి ఐదేళ్లరుుంది. చివరిసారిగా స్వదేశంలో శ్రీలంకపై 2011లో ఈ ఘనత సాధించారు. ► 31 భారత్‌లో ఇంగ్లండ్‌కు గత 31 సంవత్సరాలలో ఇదే అత్యధిక స్కోరు. 1985లో ఆ జట్టు చెన్నైలో జరిగిన టెస్టులో ఏడు వికెట్లకు 652 పరుగులు చేసింది. -
రాజీయే సరైన మార్గం
జిల్లా ఎక్సైజ్, ప్రొహిబిషన్ జడ్జి సతీష్‌కుమార్ కొణిజర్ల: కోర్టుల్లో కేసుల సత్వర పరిష్కారానికి ఇరు పక్షాలు రాజీ కావడమే సరైన మార్గమని జిల్లా ప్రథమశ్రేణి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఎక్సైజ్, ప్రొహిబిషన్) ఎం.సతీష్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని సాలెంబంజర పంచాయతీ లక్ష్మీపురంలో శనివారం, ఎక్సైజ్ శాఖ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రతి శనివారం లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొణిజర్ల మండలంలో సారా కేసులు అధికంగా నమోదు ఆవుతున్నాయని, నాటు సారా తయారు చేసినా, అమ్మినా చట్టప్రకారం నేరమన్నారు. బాల్యవివాహాలు జరపకుండా అడ్డుకోవాలన్నారు. గ్రామస్తులతో సారా తయారు చేయమని, అమ్మబోమని ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల ఆవరణలో జడ్జి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పి.శ్రీనివాసరావు, న్యాయవాది నరేంద్ర స్వరూప్, సర్పంచ్ పోగుల నాగమణి, ఎక్సైజ్ సీఐలు మోహన్‌బాబు, శశికుమారి, స్థానిక శిక్షణ ఎస్ఐ వి.సురేష్, ఎక్సైజ్ ఎస్ఐలు రాజిరెడ్డి, రాజా సమ్మయ్య, ఈఓపీఆర్డీ జమలారెడ్డి, ఆర్ఐ నాగరాజు , కార్యదర్శి నరసింహారావు, స్థానిక ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అతడే ఒక సైన్యం
కోహ్లికే ఎలా సాధ్యమైంది... మళ్లీ అంతే అలవోకగా, అదే ఒత్తిడిలోనూ ఎక్కడా మనసు చెదరకుండా అతను మాత్రమే ఎలా ఆడగలడు. నా బ్యాటింగ్‌లో మ్యాజిక్ లేదని కోహ్లి స్వయంగా చెప్పుకోవచ్చు గాక... కానీ ఇలాంటి ఆటను మ్యాజిక్ అనకుండా ఏం చెప్పగలం. మరో లోకంనుంచి వచ్చినట్లుగా మరెవరికీ సాధ్యం కానట్లుగా అంత సునాయాసంగా షాట్లు ఆడేస్తుంటే బౌలర్లు మాత్రం ఏం చేయగలరు, ఎలాంటి ప్రత్యర్థి అయినా తలవంచక ఏం చేస్తుంది. పూజా పునస్కారాలకు దూరం అని సరదాగా చెప్పుకోవచ్చు... కానీ మైదానంలో దిగితే దీక్ష బూనిన రుషిలా ఎంతటి పట్టుదల, ఎంతటి గాంభీర్యం, లక్ష్యం చేరే వరకు పట్టు వీడని అచంచల ఆత్మవిశ్వాసం. సమకాలీన క్రికెట్లో అతనితో పోల్చేందుకు స్మిత్‌లు, రూట్లు, విలియమ్సన్ల పేర్లు ఏవేవో చెబుతున్నారు. కానీ లక్ష్యాన్ని చేర్చడంలో వారితో పోలిస్తే విరాట్ ఎక్కడో అందనంత ఎత్తులో ఉన్నాడు. ప్రశంసలు కురిపిస్తూ, అతని ఆటను పొగుడుతూ ఎంతో మంది అలసిపోతున్నారు. కానీ పరుగులు తీయడంలో మాత్రం తను అలసిపోవడం లేదు. జట్టు గెలిచిన సమయంలో అతని భావోద్వేగాలు చూస్తే ఒక విజయానికి అతను ఎంతగా ప్రాణం ఒడ్డుతాడో అర్థమవుతుంది. బౌండరీల వర్షం... ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఆరంభంలో హాజల్‌వుడ్ బౌలింగ్‌లో వరుసగా కొట్టిన మొదటి రెండు ఫోర్లు చూస్తే ఏదో బ్యాట్ సరిచేసుకుంటూ ఆడినంత సులభంగా అనిపించాయి. పరిస్థితి చక్క బెడుతూ సింగిల్స్‌కే పరిమితమై, కొద్ది సేపటికి మరో ఫోర్, సిక్స్ తర్వాత 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తయింది. కానీ ఎలాంటి భావోద్వేగాలు లేవు. ఇంకా కర్తవ్యం పూర్తి కాలేదు. చేయాల్సిన పని మిగిలే ఉంది. అప్పుడు మొదలైంది ఫాల్క్‌నర్ ఓవర్. షార్ట్ బాల్ వేస్తే ఫోర్, యార్కర్ వేస్తే పక్కకు జరిగి ఆడి మరో బౌండరీ, ఆ వెంటనే ముందుకు దూసుకొచ్చి భారీ సిక్సర్. పాపం ఆసీస్ కెప్టెన్ స్మిత్‌కు ఏమీ పాలుపోవడం లేదు. ఏదో అపనమ్మకంగానే కూల్టర్‌నీల్‌కు బంతి అప్పగించాడు. వరుసగా నాలుగు బంతులు... పాయింట్, ఫైన్ లెగ్, ఎక్స్ట్రా కవర్, కవర్స్లపై నాలుగు ఫోర్లు పడ్డాయి. ఏ దిక్కున వేసినా నాకు దిక్కు లేదు అన్నట్లుగా కనిపించింది బౌలర్ మొహం. అంతటితో ఆగిపోయాడా... మధ్యలో మంచింగ్లాగా ఇంతటి ఉత్కంఠ స్థితిలో అవతలి వైపు అన్నలాంటి ధోని అండగా ఉండగా వికెట్ల మధ్య పరుగెత్తడాన్ని చిన్నపిల్లల ఆటలా మార్చేశాడు కోహ్లి. చరిత్రలో గొప్ప క్రికెటర్ల కథలు ఎన్నో వినిపించవచ్చు. కానీ ఇలాంటి ఆటతో ఆడితే ఈతరంలో అతను ఉంటే చాలు మిగతా పది మంది లేకున్నా మ్యాచ్ ఆడేయవచ్చు అన్నట్లుగా సాగుతున్న కోహ్లి ఆటకు హ్యాట్సాఫ్ ► 6 టి20ల్లో ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇది వరుసగా ఆరో విజయం ప్రతి మ్యాచ్‌లో సవాల్ ఎదురు కావడం ఆటగాడిగా మనల్ని తీర్చి దిద్దుతుంది. ఈ ఇన్నింగ్స్ నా టాప్-3లలో ఒకటి. ఇంకా చెప్పాలంటే ది బెస్ట్ అనవచ్చు. ఎందుకంటే ఇంత ఉద్వేగానికి ఎప్పుడూ గురి కాలేదు. - విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌తో ఆస్ట్రేలియా స్టార్ షేన్ వాట్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పాడు. బుధవారం ఢిల్లీలో జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్; గురువారం ముంబైలో జరిగే రెండో సెమీస్‌లో వెస్టిండీస్‌తో భారత్ ఆడతాయి. -
ముగ్గురు మొనగాళ్లు!
లండన్: టెస్టులో క్రికెట్ ఈ ఏడాది ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ సత్తా చాటారు. 2015లో ఇప్పటివరకు ముగ్గురు ఆటగాళ్లు వెయ్యి పరుగులు పూర్తి చేయగా అందులో ఇద్దరు బ్రిటీష్ టీమ్ బ్యాట్స్ మెన్ ఉన్నారు. ఈ జాబితాలో ఆండీ కుక్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 13 మ్యాచుల్లో 24 ఇన్నింగ్స్ ఆడిన కుక్ 60.72 సగటుతో 1336 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 7 అర్ధసెంచరీలు ఉన్నాయి. అతడి అత్యధిక స్కోరు 263. ఇక రెండో స్థానంలో మరో ఇంగ్లండ్ ఆటగాడు రూట్ 61.33 సగటుతో 1288 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, 9 అర్ధసెంచరీలు బాదాడు. అతడి అత్యధిక స్కోరు 182. ఈ ఏడాది టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి మూడో ఆటగాడు ఆస్ట్రేలియా యువ బ్యాట్స్ మన్ స్టీవెన్ స్మిత్. 9 మ్యాచుల్లో 16 ఇన్నింగ్స్ ఆడి 77.61 సగటుతో 1009 పరుగులు సాధించాడు. మూడు సెంచరీలు బాదాడు. అతడి అత్యధిక స్కోరు 215. పాకిస్థాన్ వెటరన్ బ్యాట్స్ మన్ యూనిస్ ఖాన్ 782 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి కోహ్లి(441) ఒక్కడే ముందున్నాడు. -
రూట్ అజేయ సెంచరీ
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 464 గ్రెనడా: మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ జో రూట్ (229 బంతుల్లో 182 నాటౌట్; 17 ఫోర్లు; 4 సిక్సర్లు) తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ అజేయ సెంచరీ సాధించాడు. ఫలితంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శుక్రవారం నాలుగో రోజు ఇంగ్లండ్ తమ తొలి ఇన్సింగ్స్‌లో 144.1 ఓవర్లలో 464 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో 165 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. కెప్టెన్ కుక్ (211 బంతుల్లో 76; 8 ఫోర్లు), బ్యాలన్స్ (188 బంతుల్లో 77; 8 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. నాలుగో వికెట్‌కు రూట్, బ్యాలన్స్ 165 పరుగులు జోడించారు. బిషూకు నాలుగు వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు బరిలోకి దిగిన విండీస్ కడపటి వార్తలందేసరికి 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. డారెన్ బ్రేవో (36), బ్రాత్‌వైట్ (41) క్రీజులో ఉన్నారు. -
ఆట సమం... అటుపై వర్షం!
మాంచెస్టర్‌లో రెండో రోజు ఆరంభంలో భారత పేసర్ల జోరు... 34 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు... మ్యాచ్‌పై పట్టు దొరికినట్లే అనిపించింది. కానీ రూట్, బట్లర్ పోరాడారు. దాంతో ఇంగ్లండ్‌కు కోలుకునే అవకాశం చిక్కింది. 36 ఓవర్ల ఆటలో ఇరు జట్లు సమఉజ్జీలుగా నిలిచిన వేళ... నేనున్నానంటూ మధ్యలో వానొచ్చింది. దాదాపు మూడున్నర గంటల పాటు ప్రభావం చూపించింది. ఫలితంగా శుక్రవారం ఆటలో ఎక్కువ భాగం వర్షార్పణమైంది. రెండో రోజు మ్యాచ్‌కు వాన దెబ్బ కేవలం 36 ఓవర్ల ఆట సాధ్యం ఇంగ్లండ్ 237/6 భారత్‌పై 85 పరుగుల ఆధిక్యం ఓల్డ్ ట్రాఫర్డ్: భారత్, ఇంగ్లండ్ నాలుగో టెస్టు మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. భారీ వర్షం కారణంగా రెండో రోజు ఆట రెండు సెషన్లు కూడా సాగలేదు. శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. జో రూట్ (94 బంతుల్లో 48 బ్యాటింగ్; 5 ఫోర్లు), జాస్ బట్లర్ (53 బంతుల్లో 22 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. ఇయాన్ బెల్ (82 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 85 పరుగులు ముందంజలో ఉంది. రెండో రోజు ఇంగ్లండ్ 36 ఓవర్లలో 124 పరుగులు చేసింది. వికెట్‌పై తేమ ఉండటంతో తొలి రోజులాగే రెండో రోజు ఉదయం కూడా పేస్ బౌలర్లు ప్రభావం చూపించారు. దాంతో తక్కువ వ్యవధిలో ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయింది. భువనేశ్వర్ (3/47), ఆరోన్ (3/48)లకే ఆ వికెట్లు దక్కాయి. అయితే రూట్, బట్లర్ ఏడో వికెట్‌కు అభేద్యంగా 67 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఇదే తరహా వాతావరణంలో శనివారం ఉదయం కూడా భారత బౌలర్లు చెలరేగితే ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం దక్కకుండా నివారించవచ్చు. అప్పుడే ఈ మ్యాచ్‌లో టీమిండియా కోలుకునే అవకాశం ఉంది. స్కోరు వివరాలు : భారత్ తొలి ఇన్నింగ్స్: 152 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: కుక్ (సి) పంకజ్ (బి) ఆరోన్ 17; రాబ్సన్ (బి) భువనేశ్వర్ 6; బాలెన్స్ (ఎల్బీ) (బి) ఆరోన్ 37; బెల్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 58; జోర్డాన్ (సి) ఆరోన్ (బి) భువనేశ్వర్ 13; రూట్ (బ్యాటింగ్) 48; అలీ (బి) ఆరోన్ 13; బట్లర్ (బ్యాటింగ్) 22; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (71 ఓవర్లలో 6 వికెట్లకు) 237 వికెట్ల పతనం: 1-21; 2-36; 3-113; 4-136; 5-140; 6-170. బౌలింగ్: భువనేశ్వర్ 18-6-47-3; పంకజ్ సింగ్ 17-2-79-0; ఆరోన్ 16-2-48-3; అశ్విన్ 13-1-28-0; జడేజా 7-0-21-0. తొలి సెషన్: భారత్ జోరు రెండో రోజు ఆట ప్రారంభమయ్యాక రెండో ఓవర్లోనే బెల్ 63 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కొద్ది సేపటికే నైట్‌వాచ్‌మన్ జోర్డాన్ (13)ను అవుట్ చేసి భువనేశ్వర్ బ్రేక్ ఇచ్చాడు. మిడ్వికెట్లో ఆరోన్ చక్కటి క్యాచ్ అందుకోవడం విశేషం. మరో నాలుగు పరుగులకే ఇంగ్లండ్ జట్టు బెల్ వికెట్ కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ వికెట్ కూడా భువీ ఖాతాలోకే వెళ్లింది. ఆ వెంటనే ప్రత్యర్థిని కోలుకోనీయకుండా ఆరోన్ అద్భుత బంతితో మొయిన్ అలీ (13)ని బౌల్డ్ చేశాడు. ఈ దశలో ఇంగ్లండ్, భారత్‌కంటే కేవలం 18 పరుగులు ముందంజలో ఉంది. అయితే రూట్, బట్లర్ లంచ్ వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. మొత్తానికి ఈ సెషన్లో టీమిండియా ఆధిక్యం కనబరిచింది. ఓవర్లు: 27, పరుగులు: 88, వికెట్లు: 3 రెండో సెషన్: రూట్, బట్లర్ నిలకడ విరామం తర్వాత ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జోరు పెంచారు. ధాటిగా ఆడి పరుగులు రాబట్టారు. 87 బంతుల్లో ఈ జోడి 50 పరుగులు చేర్చి పరిస్థితిని చక్కదిద్దింది. ఇంగ్లండ్ ఆధిక్యం 85 పరుగులకు చేరిన తర్వాత భారీ వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. సుదీర్ఘ సమయం పాటు వాన కురిసి ఆట ఆరంభం కాకపోవడంతో అంపైర్లు టీ విరామం ప్రకటించారు. ఓవర్లు: 9, పరుగులు: 36, వికెట్లు: 0 -
దీని ‘దుంప’తెగ..! ఎంత ఎదిగిందబ్బా..!
మౌనంగానే ఎదగడం.. ఎదిగినకొద్దీ ఒదిగుండటం మొక్కల నైజం. ఈ విషయూన్ని బాగా వంటబట్టించుకుందో లేదంటే మొక్క అనిపించుకోవడం ఇష్టంలేదో గానీ ఈ కంద మొక్క ఏకంగా 10 అడుగులకు పైగా ఎత్తు పెరిగింది. సాధారణంగా కంద మొక్క (దీన్ని కంద గొడుగు అని కూడా అంటారు) రెండునుంచి మూడు అడుగుల ఎత్తు మాత్రమే పెరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం అరుుతంపూడి మాజీ సర్పంచ్ గెద్దాడ కుటుంబరావు ఇంటి పెరట్లో మొలకెత్తిన కంద పిలక ఏకంగా 10 అడుగుల ఎత్తు దాటిపోరుుంది. మండు వేసవిలోనూ రెండు నెలల వ్యవధిలోనే ఇలా పెరిగింది. ఈ విషయమై వ్యవసాయ అధికారి ఎం.హుమయూన్‌ను సంప్రదించగా.. భూమిలో సారం అధికంగా ఉండటం లేదా జన్యుపరమైన లోపాల వల్ల మొక్కలు ఇలా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. - ఇరగవరం -
నేటి నుంచి హైదరాబాద్‌కు ఐదు ఇంద్ర ఏసీ బస్సులు
హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : వేసవిలో ప్రయాణికులకు సుఖవంతమైన, క్షేమమైన ప్రయాణం అందించేందుకు హన్మకొండ. హైదరాబాద్ రూట్లో ఐదు ఇంద్ర ఏసీ బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ ఇ.యాదగిరి తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుంచి ఈ ఏసీ బస్సులు నడుపనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో చెప్పారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9.45 గంటల వరకు ప్రతి 45 నిమిషాలకు ఒక ఏసీ బస్సు హన్మకొండ జిల్లా బస్‌స్టేషన్ నుంచి బయలు దేరుతుందన్నారు. అలాగే హైదరాబాద్ నుంచి ఉదయం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సు బయలుదేరుతుందని వివరించారు. హన్మకొండ నుంచి ఉదయం 4.00, 4.45, 5.30, 6.15, 7.00, 7.45, 9.00, 9.45, 10.30, 11.30 గంటలకు, మద్యాహ్నం 12.15, 1.00, 1.45, 2.30, 3.15 గంటలకు, సాయంత్రం 4.30, 5.15, 6.00, 7.00, 7.45 గంటలకు, రాత్రి 8.30, 9.15, 9.45 గంటలకు బయలుదేరుతుందని వివరించారు. కాగా, హైదరాబాద్ నుంచి ఉదయం 5.00, 5.45, 6.30, 7.15, 8.00, 8.45, 9.30, 10.15, 11.00 గంటలకు, మద్యాహ్నం 12.15, 1.00, 1.45, 2.45, 3.30 గంటలకు, సాయంత్రం 4.15, 5.00, 5.45, 6.30, 7.45 గంటలకు, రాత్రి 8.30, 9.15, 10.15, 11.00 గంటలకు బయలు దేరుతుందని వివరించారు. ప్రయాణికులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ఇంగ్లండ్ 247/4
లండన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ ఐదో టెస్టులో ఇంగ్లండ్ దీటుగా జవాబిస్తోంది. రూట్ (68), పీటర్సన్ (50) అర్ధసెంచరీలు నమోదు చేయడంతో శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 116 ఓవర్లలో 4 వికెట్లకు 247 పరుగులు చేసింది. ఇయాన్ బెల్ (29 నాటౌట్), వోక్స్ (15 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ ఇంకా 245 పరుగులు వెనకబడి ఉంది. 32/0 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ ఆరంభంలోనే కుక్ (25) వికెట్ కోల్పోయింది. అయితే రూట్ నెమ్మదిగా ఆడుతూ రెండు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కుక్‌తో కలిసి తొలి వికెట్‌కు 68, రెండో వికెట్‌కు ట్రాట్ (40)తో కలిసి 50 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. తర్వాత వచ్చిన పీటర్సన్ వికెట్ కాపాడుకునేందుకు ప్రాధాన్యమిచ్చినా... ట్రాట్‌కు మంచి సహకారం అందించాడు. ఈ ఇద్దరు ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ మూడో వికెట్‌కు 58 పరుగులు జోడించారు. తర్వాత బెల్ కూడా నిలకడను కనబర్చడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. ఈ క్రమంలో పీటర్సన్ 127 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాక... స్టార్క్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. చివర్లో వోక్స్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. స్టార్క్ 2, హారిస్, లియోన్ చెరో వికెట్ తీశారు.