
మాట్లాడుతున్న జడ్జి సతీష్‌కుమార్
జిల్లా ఎక్సైజ్, ప్రొహిబిషన్ జడ్జి సతీష్‌కుమార్
కొణిజర్ల:
కోర్టుల్లో కేసుల సత్వర పరిష్కారానికి ఇరు పక్షాలు రాజీ కావడమే సరైన మార్గమని జిల్లా ప్రథమశ్రేణి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఎక్సైజ్, ప్రొహిబిషన్) ఎం.సతీష్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని సాలెంబంజర పంచాయతీ లక్ష్మీపురంలో శనివారం, ఎక్సైజ్ శాఖ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రతి శనివారం లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొణిజర్ల మండలంలో సారా కేసులు అధికంగా నమోదు ఆవుతున్నాయని, నాటు సారా తయారు చేసినా, అమ్మినా చట్టప్రకారం నేరమన్నారు. బాల్యవివాహాలు జరపకుండా అడ్డుకోవాలన్నారు. గ్రామస్తులతో సారా తయారు చేయమని, అమ్మబోమని ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల ఆవరణలో జడ్జి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పి.శ్రీనివాసరావు, న్యాయవాది నరేంద్ర స్వరూప్, సర్పంచ్ పోగుల నాగమణి, ఎక్సైజ్ సీఐలు మోహన్‌బాబు, శశికుమారి, స్థానిక శిక్షణ ఎస్‌ఐ వి.సురేష్, ఎక్సైజ్ ఎస్‌ఐలు రాజిరెడ్డి, రాజా సమ్మయ్య, ఈఓపీఆర్‌డీ జమలారెడ్డి, ఆర్‌ఐ నాగరాజు , కార్యదర్శి నరసింహారావు, స్థానిక ఉపాధ్యాయులు పాల్గొన్నారు.