
నేటి నుంచి హైదరాబాద్‌కు ఐదు ఇంద్ర ఏసీ బస్సులు
హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : వేసవిలో ప్రయాణికులకు సుఖవంతమైన, క్షేమమైన ప్రయాణం అందించేందుకు హన్మకొండ. హైదరాబాద్ రూట్‌లో ఐదు ఇంద్ర ఏసీ బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ ఇ.యాదగిరి తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుంచి ఈ ఏసీ బస్సులు నడుపనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో చెప్పారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9.45 గంటల వరకు ప్రతి 45 నిమిషాలకు ఒక ఏసీ బస్సు హన్మకొండ జిల్లా బస్‌స్టేషన్ నుంచి బయలు దేరుతుందన్నారు. అలాగే హైదరాబాద్ నుంచి ఉదయం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సు బయలుదేరుతుందని వివరించారు.
హన్మకొండ నుంచి ఉదయం 4.00, 4.45, 5.30, 6.15, 7.00, 7.45, 9.00, 9.45, 10.30, 11.30 గంటలకు, మద్యాహ్నం 12.15, 1.00, 1.45, 2.30, 3.15 గంటలకు, సాయంత్రం 4.30, 5.15, 6.00, 7.00, 7.45 గంటలకు, రాత్రి 8.30, 9.15, 9.45 గంటలకు బయలుదేరుతుందని వివరించారు. కాగా, హైదరాబాద్ నుంచి ఉదయం 5.00, 5.45, 6.30, 7.15, 8.00, 8.45, 9.30, 10.15, 11.00 గంటలకు, మద్యాహ్నం 12.15, 1.00, 1.45, 2.45, 3.30 గంటలకు, సాయంత్రం 4.15, 5.00, 5.45, 6.30, 7.45 గంటలకు, రాత్రి 8.30, 9.15, 10.15, 11.00 గంటలకు బయలు దేరుతుందని వివరించారు. ప్రయాణికులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.