ఆ రికార్డును ఇద్దరూ మిస్సయ్యారు! | bairstow, root also missed the record of vaughan | Sakshi
Sakshi News home page

ఆ రికార్డును ఇద్దరూ మిస్సయ్యారు!

Published Fri, Dec 16 2016 4:19 PM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM

ఆ రికార్డును ఇద్దరూ మిస్సయ్యారు!

ఆ రికార్డును ఇద్దరూ మిస్సయ్యారు!

చెన్నై: దాదాపు పుష్కరకాలానికి పైగా ఉన్న ఒక అరుదైన రికార్డుకు ఇద్దరు ఇంగ్లండ్ క్రికెటర్లు అత్యంత చేరువగా వచ్చినా దాన్ని మాత్రం అందుకోలేకపోయారు. ఇంగ్లండ్ తరపున ఒక ఏడాది అత్యధిక పరుగులు రికార్డును నెలకొల్పే అవకాశాన్ని తొలుత జో రూట్ కోల్పోగా, ఆ తరువాత దాన్ని బెయిర్ స్టో కూడా మిస్సయ్యాడు. 2002లో ఇంగ్లండ్ జట్టు తరపున టెస్టుల్లో ఒక క్యాలెండర్ అత్యధిక పరుగులు చేసిన రికార్డు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్(1481) పేరిట ఉంది. అదే ఆ జట్టు తరపున ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగుల రికార్డుగా ఉంది.

 

అయితేఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉన్న జో రూట్ ఆ రికార్డుకు పది పరుగుల దూరంలో నిలిచిపోగా, బెయిర్ స్టో 12 పరుగుల దూరంలో ఆ మైలురాయిని చేరుకునే కోల్పోయాడు. 2016లో జో రూట్ మూడు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీ సాయంతో 1471 పరుగులు నమోదు చేయగా, బెయిర్ స్టో 3 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలతో  1469 పరుగులు నమోదు చేశాడు. దాంతో ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లండ్ ఆటగాళ్లలో రూట్, బెయిర్ స్టోలు వరుసగా రెండు,మూడు స్థానాల్లో నిలిచారు. ఈ మ్యాచ్ లో స్టో 49 పరుగులు చేసి అవుట్ కాగా,రూట్ 88 పరుగులు చేసి అవుటయ్యాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement