
ముగ్గురు మొనగాళ్లు!
లండన్: టెస్టులో క్రికెట్ ఈ ఏడాది ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ సత్తా చాటారు. 2015లో ఇప్పటివరకు ముగ్గురు ఆటగాళ్లు వెయ్యి పరుగులు పూర్తి చేయగా అందులో ఇద్దరు బ్రిటీష్ టీమ్ బ్యాట్స్ మెన్ ఉన్నారు. ఈ జాబితాలో ఆండీ కుక్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 13 మ్యాచుల్లో 24 ఇన్నింగ్స్ ఆడిన కుక్ 60.72 సగటుతో 1336 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 7 అర్ధసెంచరీలు ఉన్నాయి. అతడి అత్యధిక స్కోరు 263. ఇక రెండో స్థానంలో మరో ఇంగ్లండ్ ఆటగాడు రూట్ 61.33 సగటుతో 1288 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, 9 అర్ధసెంచరీలు బాదాడు. అతడి అత్యధిక స్కోరు 182.
ఈ ఏడాది టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి మూడో ఆటగాడు ఆస్ట్రేలియా యువ బ్యాట్స్ మన్ స్టీవెన్ స్మిత్. 9 మ్యాచుల్లో 16 ఇన్నింగ్స్ ఆడి 77.61 సగటుతో 1009 పరుగులు సాధించాడు. మూడు సెంచరీలు బాదాడు. అతడి అత్యధిక స్కోరు 215.
పాకిస్థాన్ వెటరన్ బ్యాట్స్ మన్ యూనిస్ ఖాన్ 782 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి కోహ్లి(441) ఒక్కడే ముందున్నాడు.