వంట చేయడం ఒక కళ. ఇష్టంతో, నైపుణ్యం కలగలిస్తేనే వండిన ఏ ఆహారం అయినా రుచిగా ఉంటుంది. అందరూ వంట చేస్తారు. కానీ కొంతమంది మాత్రమే ఆహా అనిపించేలా చేస్తారు. వంట కళలో ప్రావీణ్యం సంపాదించడానికి చాలా సమయం పడుతుంది. అన్ని సమపాళ్లలో కుదిరితేనే కదా మజా వచ్చేది. మీరు ఎంత గొప్ప ఛెఫ్ అయినా , కొన్ని చిట్కాలు పాటిస్తే మన వంట తిన్నవాళ్లు అద్భుతం అనాల్సిందే.!
- చికెన్, మటన్ కూరలు చేసేటపుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు ఉప్పు,కారం, పసుపుతోపాటు కాస్తంత నిమ్మరసం , పెరుగు కలిపి మారినేట్ చేసిన పది నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచి, వండితే సూపర్ టేస్ట్ వస్తుంది.
- పులుసు కూరల్లో కాస్తం బెల్లం చేరిస్తే, దానికి వచ్చే రుచి అమోఘం. అలాగే పాయసం, క్షీరాన్నం లాంటి తీపి వంటకాల్లో కొద్దిగా ఉప్పు వేసి చూడండి.
- ఆలూ ఫ్రై, ఇతర వేపుళ్లు లాంటివి చేసేటపుడు పాన్ అంటుకోకుండా ఉండాలంటే, పాన్‌బాగా వేడెక్కే దాగా ఆగాలి. మూత పెట్టకుండా వేయించాలి. కొద్దిసేపు వేగాగా ఉప్పు వేసుకుంటే మూకుడుకి అంటుకోదు. పనీర్ కూరలకు చిటికెడు కార్న్‌ఫ్లోర్‌తో మెరినేట్ చేస్తే బెటర్
- అల్లం వెల్లులి పేస్ట్ తాజాగా ఉండాలంటే, ఈ పేస్ట్ చేసేటపుడు ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు చేర్చుకోవాలి. అలాగే తడి తగలకుండా జాగ్రత్త పడాలి. గాజు సీసాలో నిల్వ చేస్తే మంచిది. ఈ సీసాను ఎప్పటికపుడు ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా తాజాగా మంచి వాసనతో ఉంటుంది.
- అలాగే ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా తాజాగాఉండాలంటే గాలి చొరబడని కంటైనర్‌లలో నిల్వ చేసుకోవాలి
పూరీలు, పకోడీలు వేయించే నూనెలో చిటికెడు ఉప్పు వేస్తే పూరీలు, పకోడీలు పెద్దగా నూనె పీల్చవు. వీటిని వేయించడానికి తక్కువ నూనె పడుతుంది. - కొత్తిమీర, పుదీనా, టార్రాగన్ లాంటి వాటిని కూరలు దింపేముందు వేస్తే రుచి బావుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment