సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనేది అందరికి తెలుసు. పిల్లల ఉంచి పెద్దలదాకా కంటి వ్యాధులు ,దృష్టి లోపాలు చాలా సాధారణగా మారిపోయాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2.2 బిలియన్లకు పైగా ప్రజలు ఏదో ఒక రకమైన దృష్టి లోపం లేదా అంధత్వంతో బాధపడుతున్నారు. అయితే చాలా వరకు కంటి సమస్యల్ని చక్కటి ఆహారం, ముందస్తు ఆరోగ్య పరీక్షలతో నివారించు కోవచ్చు. అలాగే కొన్ని జాగ్రత్తలను కూడా పాటించాల్సి ఉంటుంది అలాంటి సూపర్ ఫుడ్స్, జాగ్రత్తలేమిటో చూద్దాం!
చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా చాలామంది కంటిచూపు సమస్యలతో బాధ పడుతున్నారు. చిన్న వయసులోనే కళ్ల జోడు సాయం లేనిదే కాలం గడవని పరిస్థితి. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే చక్కటి ఆహారం తీసుకోవాలి.
క్యారెట్‌లో బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో తగినంత విటమిన్ ఏ కూడా ఉంటుంది.
బచ్చలికూరలో లుటిన్,జియాక్సంతిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హానికరమైన యూవీ కిరణాలు, ఫ్రీ రాడికల్స్ నుండి కళ్ళను కాపాడతాయి.
సాల్మన్ చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి రెటీనాను ఆరోగ్యంగా ఉంచుతాయి. కళ్ళు పొడిబారకుండా కాపాడతాయి.
బ్లూబెర్రీస్ యాంటీఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. వాపును తగ్గించి, ఆరోగ్యకరమైన,చక్కటి దృష్టిని అందించేలా తోడ్పడతాయి.
స్వీట్ పొటాటోలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది, ఇది రాత్రి దృష్టిని పెంచడంలో సహాయపడుతుంది. కళ్లు పొడిరకుండా కాపాడుతంది.
బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. ఇది వయస్సు సంబంధిత సమస్యలనుంచిరక్షిస్తుంది.
గుడ్డు సొనలో లుటిన్ ,జియాక్సంతిన్ బాగా లభిస్తుంది. ఇది కాంతి నష్టంతో పోరాడేలా కళ్ళ సామర్థ్యాన్ని పెంచుతుంది.
నారింజలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది కంటిశుక్లబాధలనుంచి కాపాడుతుంది.
జాగ్రత్తలు
కళ్ళ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పౌష్టిక ఆహారాలను తీసుకోవాలి.విటమిన్ సీ లభించే పండ్లు, కూరగాయలు,ఆకు కూరలు ఎక్కువగా తినటం కూడా కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ఎక్కువసేపు లాప్టాప్ ముందు, మొబైల్ ఫోన్లను చూస్తూ ఉండేవారి కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది అనేది గమనించాలి. అలాగే చలికాలంలో చలిగాలులకు కళ్లకు నష్టం ఏర్పడే అవకాశం ఉంది. చలిగాలలు, దుమ్ము ధూళినుంచి కళ్లను కాపాడుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment