eye sight
-
World Sight Day: ఆరెంజ్, క్యారెట్, రాగులు, ఉసిరి.. తిన్నారంటే.. మీ కంటి చూపు..
ఆరోగ్యమైన జీవనానికి పోషకాహారం అవసరమనే విషయం మనందరికీ తెలిసిందే! పోషకాహారం అనే ఆలోచన మదిలోమెదలగానే బరువు తగ్గడం, మధుమేహం, గుండె ఆరోగ్యం.. వంటి ఇతర సమస్యలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటాం. ఐతే కంటి ఆరోగ్యం కూడా ముఖ్యమైనదే. ఆరోగ్యకరమైన చూపు పొందుకోవాలంటే.. లూటిన్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, బేటాకెరొటిన్, ‘ఎ, సి, ఈ’ విటమిన్లు, జింక్.. వంటి పోషకాలు అవసరమౌతాయని ఢిల్లీ నూట్రీషనిస్ట్ లోకేంద్ర తోమర్ సూచిస్తున్నారు. ఏయే ఆహారాల్లో ఆయా పోషకాలు పుష్కలంగా ఉంటాయో తెలుసుకుందాం.. ఆరెంజ్ పండ్లు విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉండే ఆహారాలు నయనారోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఆరెంజ్‌లో విటమిన్ ‘సి’ అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధకతకు మాత్రమే కాకుండా కంటిలో శుక్లాలు పెరగకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా నల్లగుడ్డుపై కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. ఇది కళ్లు పొడిబారకుండా ఉండటానికి, గాయాలను మాన్పడానికి, ఎముకల పుష్టికి ఎంతో ఉపయోగపడుతుందని న్యూట్రిషనిస్ట్ రూపాలీ దత్తా తెలిపారు. చదవండి: బాప్రే! టోపీపై ఏకంగా 735.. ‘గుడ్డు’ రికార్డు! క్యారెట్ మన ఇంట్లో పెద్దవాళ్లు క్యారెట్ తింటే కంటి ఆరోగ్యానికి మంచిదని పదేపదే చెప్తుంటారు. ఎందుకంటే.. క్యారెట్లలో అధికంగా ఉండే బీటా కెరొటిన్ విటమిన్ ‘ఎ’గా రూపాంతరం చెందుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకారని ఆయుర్వేద నిపుణులు రామ్ ఎన్ కుమార్ కూడా సూచిస్తున్నారు. ఆప్రికాట్ పండ్లు సాధారణంగా వేసవికాలంలో లభించే ఈ పండ్లు మన సంప్రదాయ వంటకాల్లో ఎప్పటినుంచో విరివిగా ఉపయోగంలో ఉన్నాయి. వీటిని డ్రైఫ్రూట్స్‌గా కూడా వినియోగిస్తాం. డీకే పబ్లిషింగ్వారి ‘హీలింగ్ ఫుడ్స్’ పుస్తకం ప్రకారం వృద్ధాప్యం వల్ల కలిగే దృష్టిలోపాలను నివారించడంలో ఈ పండ్లు కీలకంగా వ్యవహరిస్తాయి. ఈ పండ్లలో బీటాకెరోటిన్ కంటెంట్ కూడా అధికమే. చదవండి: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్‌గా మారి..! రాగులు రాగుల్లో కంటి ఆరోగ్యానికి మేలు చేసే పోలీఫెనాల్స్ అధికంగా ఉంటాయని నూట్రీషనిస్ట్ శిల్సా ఆరోరా తెలిపారు. యాంటీ క్యాటెర్యాక్ట్ స్థాయిలు ఎక్కువ ఉండే పోలీఫెనాల్స్ కంట్లో శుక్లాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. అలాగే రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించి డయాబెటిక్ ముప్పు నుంచి కాపాడటంలోనూ వీటి పాత్ర కీలకమైనదే. ఉసిరి మనకు అందుబాటులో ఉండో ఆహారాల్లో ఉసిరి ఒకటి. ఉసిరి రోగనిరోధకతను పెంచడమేకాకుండా దృష్టిలోపాలను నివారించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తుందని ఆయుర్వేద నిపుణులు రామ్ ఎన్ కుమార్ సూచిస్తున్నారు. ఉసిరిలోని కెరోటిన్ కళ్లను ఆరోగ్యంగా ఉంచి మెరుగైన చూపుకు తోడ్పడుతుందని అనేక అధ్యయనాలు కూడా వెల్లడించాయి. శరీరంలోని వివిధ అవయవాల మాదిరిగానే కళ్ల ఆరోగ్యం కూడా ప్రధానమైనదే. కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ప్రతి యేటా అక్టోబర్‌లో వచ్చే రెండో గురువారాన్ని ప్రపంచ దృష్టి దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ యేడాది అక్టోబర్ 14న జరుపుకునే ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా నిపుణులు సూచించిన ఈ ఆహార అలవాట్ల ద్వారా నయనారోగ్యాన్ని పదిలంగా కపాడుకుందాం.. చదవండి: Helath Tips: కాఫీ తాగే అలవాటుందా? నిద్రలేమి, యాంగ్జైటీ, చిరాకు.. -
చపాతీ ఎఫెక్ట్.. చూపు కోల్పోయిన బాలుడు
భోపాల్: ‘‘అతి సర్వత్రా వర్జయేత్’’ అన్నారు పెద్దలు... అంటే దేనిని అతిగా చేయడం మంచిది కాదని అర్థం. ముఖ్యంగా తిండి విషయంలో.. ఎంత రుచిగా ఉన్నా.. మన కడుపుకు సరిపోయేంతనే తినాలి తప్ప.. అతిగా లాగించకూడదు. కాదని బాగా తింటే.. ఎంతటి తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందో ఇది చదివితే అర్థం అవుతుంది. పన్నెండేళ్ల కుర్రాడికి చపాతీలు అంటే చాలా ఇష్టం. ఎంత అంటే రోజుకు 40 చపాతీలు తినేవాడు. ఫలితంగా కంటి చూపు కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తింది. వైద్యులు ఆ బాలుడికి సర్జరీ చేసి చూపు ప్రసాదించారు. ఆ వివరాలు.. మధ్యప్రదేశ్ శిప్పూరి జిల్లా ఖోడ్ గ్రామానికి చెందిన 12 ఏళ్ల సందీప్ కంటి చూపు క్రమంగా మందగించడం ప్రారంభం అయ్యింది. ఓ రోజు పూర్తిగా చూపు కోల్పోయాడు. అప్పటి వరకు ఈ సమస్యను పెద్దగా పట్టించుకోని అతడి తండ్రి.. పూర్తిగా చూపు కోల్పోయిన తర్వాత ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే సందీప్ శరీరంలోని అవయవాలు అన్ని పనిచేయడం మానేశాయి. అతడు కేవలం ఊపిరి తీసుకోగల్గుతున్నాడు అంతే. అక్కడ సందీప్‌ను పరీక్షించిన వైద్యులు.. అతడి రిపోర్టులు చూసి షాక్ తిన్నారు. వైద్యులను అంతలా ఆశ్చర్యపరిచిన అంశం ఏంటంటే సందీప్ బ్లడ్ షుగర్ లెవల్స్ ఏకంగా 1206 మిల్లీగ్రాములుగా ఉన్నట్లు గమనించారు. ఇంత చిన్న కుర్రాడికి ఇంత పెద్ద మొత్తంలో షుగర్ లెవల్స్ ఉండటం ఏంటని ఆశ్చర్యపోయి.. అతడి ఆహారం గురించి ఆరా తీశారు. సందీప్ రోజుకు 40 చపాతీలు తినేవాడని అతడి తండ్రి తెలిపాడు. ఇంత పెద్ద మొత్తంలో చపాతీలు తినడం వల్ల సందీప్‌లో షుగర్ లెవల్స్ పెరగడమే కాక మెదడులో చీము చేరింది. దాని వల్ల అతడు కంటి చూపు కోల్పోవడమే కాక.. శరీరంలోని మిగతా అవయవాల పని చేయడం మానేశాయి. ఈ క్రమంలో వైద్యులు సందీప్ తలకు సర్జరీ చేసి 720 మిల్లీ లీటర్ల చీము తొలగించారు. చక్కెర స్థాయిలను తగ్గించడం కోసం ప్రతి రోజు సందీప్‌కు 6 యూనిట్ల ఇన్సులిన్‌ను ఇవ్వడం ప్రారంభించారు. షుగర్ లెవల్స్ సాధారణ స్థితికి వచ్చాక.. కంటి వైద్యుడు సందీప్‌ను పరీక్షించి.. ఆ బాలుడు డయాబెటిక్ రెటినోపతితో బాధపడుతున్నాడని తెలిపారు. వీలైనంత త్వరగా సందీప్‌కు సర్జరీ చేస్తే.. అతడికి కంటి చూపును తిరిగి తెప్పించవచ్చన్నారు. సందీప్ తల్లిదండ్రులు అందుకు అంగీకరించడంతో ఆపరేషన్ చేశారు. ఇప్పుడు సందీప్ చూడగల్గుతున్నాడు. ప్రస్తుతం సందీప్‌కు ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని.. అతడిని అబ్జర్వేషన్లో ఉంచామని వైద్యులు వెల్లడించారు. -
చూపు కోల్పోయిన కత్తి మహేశ్?
ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నప్పటికీ ఆయన తల, ముక్కు,కంటికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా ఆయన్ను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మెదడులో ఎలాంటి రక్తస్రావం జరగకపోవడం వలన మహేష్‌కు ప్రాణాపాయం లేదని తెలుస్తుంది. అయితే ఆయన ఎడమ కంటి చూపు మాత్రం పూర్తిగా పోయిందని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా డాక్టర్లు తమతో చెప్పారని కత్తి మహేష్ మేనమామ ఒకరు మీడియాకు వెల్లడించినట్లు ప్రచారం జరుగుతుంది. సర్జరీ తర్వాతే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఓ క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. మరోవైపు కత్తి మహేశ్ త్వరగా కోలుకోవాలని ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు ప్రార్థిస్తున్నారు. ఈ ఘటనలో కత్తి మహేశ్ కారు నుజ్జు, నుజ్జు అయిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్‌పై విమర్శలు, వివాదాస్పద పోస్తులలో కత్తి మహేశ్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. చదవండి : రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్‌కు తీవ్ర గాయాలు -
‘బ్లాక్ ఫంగస్’: పట్టించుకోకపోతే ప్రాణాలే పోతాయి..
సాక్షి, న్యూఢిల్లీ: సూరత్‌లో కొద్ది రోజుల క్రితం కోవిడ్ నుంచి కోలుకున్న ఎనిమింది మంది కంటి చూపు కోల్పోయిన సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్నామని సంతోషించేలోపే వారి జీవితాలు అంధకారం అయ్యాయి. వీరు చూపు కోల్పోవడానికి కారణం బ్లాక్ ఫంగస్. ఢిల్లీ, అహ్మదాబాద్ తదితర చోట్ల ఈ ఫంగస్‌ను గుర్తించారు. తాజాగా దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు పెరుగుతండటంతో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్తంగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేశాయి. దీని లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీటిలో తెలిపారు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే కోవిడ్ మాదిరి ఈ ఫంగస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం లేదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఏమిటి బ్లాక్ ఫంగస్.. బ్లాక్ ఫంగస్, ‘మ్యూకోర్మైకోసిస్’గా పిలిచే ఈ వ్యాధి కొత్తదేం కాదు. గతంలో కూడా ఉంది. కానీ తాజాగా కోవిడ్ సోకిన వారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీని వల్ల బాధితుడికి ప్రాణాపాయం తలెత్తవచ్చు. వాతావరణంలో సహజంగానే ఉండే ‘మ్యూకోర్’ అనే ఫంగస్ వల్ల ఇది వస్తుంది. అరుదుగా మనుషులకు సోకుతుంటుంది. ముఖ్యంగా కరోనా సోకిన వారిలో, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో అధిక మొత్తంలో స్టెరాయిడ్స్ వినియోగించిన వారికి ఇది ఎక్కువగా సోకే అవకాశం ఉంది. గాలి పీల్చుకొన్నప్పుడు ఈ ఫంగస్ ఊపిరితిత్తుల్లో, సైనస్ వద్ద చేరుతుంది. ఇది మెదడుకు చేరితో ప్రాణాపాయం తప్పదు అంటున్నారు నిపుణులు. బ్లాక్ ఫంగస్ సోకిందని గుర్తించడం ఎలా... బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో చాలా వరకు కోవిడ్-19 లక్షణాలే కనిపిస్తాయి. ఒళ్లునొప్పులు, కళ్లు, ముక్కుచుట్టూ ఎర్రబారిపోవడం, జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పంటి నొప్పి, దంతాలు కదిలిపోవడం, కళ్ల నొప్పి, చూపు మందగించడం, వాంతులైతే రక్తపు జీరలు పడటం, మతి భ్రమించడం, శరీరంలో షుగర్ లెవల్స్ సడెన్‌గా పడిపోవడం, గతంలో ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టడం వంటి తదితర లక్షణాలు కనిపిస్తే బ్లాక్ ఫంగస్ సోకిందని అనుమానించాలి. ఏం చేయాలి.. రక్తంలో షుగర్ లెవల్స్‌ని అదుపులో ఉంచుకోవాలి. కరోనా నుంచి కోలుకున్నా.. ఎప్పటికప్పుడు షుగర్ లెవల్స్‌ని పరీక్షించుకోవాలి. సమాయానికి, సరైన మోతాదులో డాక్టర్లు సూచించిన స్టెరాయిడ్లను మాత్రమే వాడాలి. ఆక్సిజన్ థెరపీ సమయంలో తేమ కోసం పరిశుభ్రమైన నీటిని మాత్రమే వాడాలి. డాక్టర్లను సూచన మేరకు యాంటీబయోటిక్స్, యాంటీఫంగల్ ఔషధాలను తీసుకోవచ్చు. నిరోధించడం ఎలా.. బహిరంగ ప్రదేశాలు, దుమ్ముదూళి ఉన్న ప్రాంతాల్లోకి వెళ్తే తప్పని సరిగా మాస్కు ధరించాలి. వీలైనంత వరకు శరీరం మొత్తం కవర్ అయ్యేలా పొడవాటి దుస్తులు ధరించాలి. చేతులకి గ్లోవ్స్, కాళ్లకు సాక్సులు వేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. Evidence based Advisory in the time of #COVID-19 (𝐒𝐜𝐫𝐞𝐞𝐧𝐢𝐧𝐠, 𝐃𝐢𝐚𝐠𝐧𝐨𝐬𝐢𝐬 & 𝐌𝐚𝐧𝐚𝐠𝐞𝐦𝐞𝐧𝐭 𝐨𝐟 𝐌𝐮𝐜𝐨𝐫𝐦𝐲𝐜𝐨𝐬𝐢𝐬) @MoHFW_INDIA @PIB_India @COVIDNewsByMIB @MIB_India #COVID19India #IndiaFightsCOVID19 #mucormycosis #COVID19Update pic.twitter.com/iOGVArojy1 — ICMR (@ICMRDELHI) May 9, 2021 ‘మ్యూకర్మైకోసిస్’ అంటే మ్యూకోర్మైకోసిస్ ఒక అరుదైన ఇన్ఫెక్షన్. సాధారణంగా మట్టిలో, మొక్కల్లో, ఎరువులో, కుళ్లిపోతున్న పండ్లు, కూరగాయల్లో కనిపించే మ్యూకర్(బూజు లాంటిది) వల్ల వస్తుంది. ఇది అన్నిచోట్లా ఉంటుంది. మట్టిలో, గాల్లో, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల ముక్కులో, చీమిడిలో కూడా ఉంటుందన్నారు వైద్యనిపుణులు. ఇది సైనస్, మెదడు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. డయాబెటిక్ రోగులకు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే క్యాన్సర్, హెచ్ఐవీ లాంటివి ఉన్న రోగులకు ఇది ప్రాణాంతకం కావచ్చు. మరణాల రేటు 50 శాతం వరకూ ఉన్న మ్యూకోర్మైకోసిస్కు స్టెరాయిడ్స్ ఉపయోగించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఇదే చికిత్సతో బ్లాక్ ఫంగస్ బారిన పడిన రోగుల ప్రాణాలను కాపాడవచ్చని వైద్యనిపుణులు తెలిపారు. చదవండి: కలకలం: కరోనా నుంచి కోలుకోగానే కళ్లు పోయాయి -
కలకలం: కరోనా నుంచి కోలుకోగానే కళ్లు పోయాయి
అహ్మదాబాద్: కరోనా వైరస్ ప్రభావంతో కొత్త కొత్త వ్యాధులు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ఆ వైరస్ ప్రజలను భయాందోళనలో నెట్టివేయగా ఈ వైరస్ ప్రభావంతో మరో ప్రమాదకర పరిస్థితులు వచ్చి పడ్డాయి. కరోనా నుంచి కోలుకున్న వారికి కంటి చూపు పోతోంది. దేశంలో అక్కడక్కడ ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒక ఫంగస్ రావడంతో దాని వలన కరోనా నుంచి కోలుకున్న వారి చూపు మందగిస్తోందని తెలుస్తోంది. తాజాగా గుజరాత్‌లోని సూరత్‌లో ఏకంగా 8 మంది కంటిచూపు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ విషయం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా ఈ ఫంగస్ బారిన 40 మందికి పైగా పడ్డారని తెలుస్తోంది. సూరత్‌లో కంటిచూపు పోయిందని 8 మంది బాధితులు ఆస్పత్రికి వచ్చారు. తమ కంటిచూపు మందగించిందని వైద్యులను సంప్రదించారు. వారిని పరిశీలించగా బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మిసిస్) అనేది రావడంతో వారి చూపు పోయిందని వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఫంగస్‌పై వైద్యులు అధ్యయనం చేస్తున్నారు. అయితే ఈ ఫంగస్ ప్రాణాంతకమని కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఫంగస్ రావడానికి గల కారణాలను గుర్తించారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి ఈఎన్టీ విభాగం అధిపతి డాక్టర్ అజయ్ స్వరూప్ ఫంగస్ కారణాలు వివరించారు. ‘కరోనా బాధితుల్లో ఎక్కువ మంది మధుమేహం వారు ఉన్నారని, కరోనా నివారణకు తీసుకున్న ఔషధాల వలన ఈ ఫంగస్ రావడానికి కారణం’ అని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ ఫంగస్ బారినపడే అవకాశం అధికంగా ఉందని తెలిపారు. మధుమేహం, కిడ్నీ, గుండె సంబంధిత, క్యాన్సర్ బాధితులకు ఈ ఫంగస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయితే ఈ ఫంగస్ వస్తే కొందరికి కంటిచూపు కోల్పోగా మరికొందరి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. చదవండి: ‘కదిలావో కాల్చేస్తా..’ టీచర్‌ను బెదిరించిన బాలిక చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’ -
అంధత్వం; దేశంలోనే వరంగల్ రెండో స్థానం..
సాక్షి, హైదరాబాద్: మనిషికి జ్ఞానాన్నిచ్చే అవయవాల్లో కళ్లది క్రియాశీల పాత్ర. చూపులేకుంటే జీవితమంతా అంధకారమే. అలాంటి కళ్ల పనితీరు, దృష్టి లోపాలపై చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. కంటి పనితీరుకు ఊతమిచ్చే ఆహార పదార్థాలు తినడంలో తాత్సారంతో ఏటా వేలాది మంది అంధకారంలో పడిపోతున్నారు. 2015–19 మధ్య కాలంలో ర్యాపిడ్ అసిసెట్మెంట్ ఆఫ్ అవైడబుల్ బ్లైండ్నెస్ విధానం ద్వారా దేశంలో అంధత్వం, దృష్టి లోపాలపై కేంద్రఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఎయిమ్స్, డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆప్తమాలజి కల్ సైన్సెస్, అఖిల భారత ఆయుర్విజ్ఞాన సంస్థ సంయుక్తంగా సర్వే చేశాయి. దీని వివరాలను కేంద్రం విడుదల చేసింది. యాభై ఏళ్లలోపు వయసున్న వారిలో ఏటా 1.99 శాతం మంది అంధత్వానికి గురవుతున్నట్లు వెల్లడి కావడం గమనార్హం. చదవండి: వారి కళ్లు మళ్లీ చూడబోతున్నాయ్! సర్వే సాగిందిలా... ఆర్ఏఏబీని లండన్‌లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఐహెల్త్(ఐసీఈహెచ్) అభివృద్ధి చేసింది. దీని ప్రకారం 50 ఏళ్లలోపున్న వారిని నిర్ణీత పద్ధతిలో సర్వే చేశారు. దేశవ్యాప్తంగా 31 జిల్లాలను ర్యాండమ్‌గా ఎంపిక చేశారు. రాష్ట్రం నుంచి వరంగల్ జిల్లాను ఎంచుకున్నారు. ప్రతి జిల్లా నుంచి 3వేల నమూనాల చొప్పున మొత్తం 93 వేల నమూనాలను ఎంచుకుని సర్వే చేసి ఫలితాలను క్రోడీకరించారు. సర్వే చేసిన వారిలో 1.99 శాతం అంధత్వంతో ఉండగా, 1.96 శాతం తీవ్రమైన దృష్టి లోపంతో ఉన్నట్లు గుర్తించారు. మరో 9.81 శాతం మధ్యస్త దృష్టి లోపంతో ఉండగా, 12.92 శాతం మంది త్వరలో ఏర్పడే దృష్టి లోపంతో బాధపడుతున్నట్లు నిర్ధారిం చారు. మరో 11.77 శాతం అతి తీవ్రతతో కూడిన దృష్టిలోపం, 13.76 శాతం మందిలో సాధారణ దృష్టిలోపం ఉన్నట్లు అంచనావేశారు. సాధారణ పనులు చేసుకునేందుకు ఇబ్బంది పడే దృష్టిలోపంతో 1.03 శాతం మంది ఉన్నారు.చదవండి: ‘ప్రైవేటు’గా సమాచార సేకరణ! రెండో స్థానంలో వరంగల్... వరంగల్ జిల్లాలో రికార్డు స్థాయిలో అంధత్వంతో బాధపడుతున్నట్లు సర్వేలో తేలింది.జాతీయ సగటు 1.99 శాతం ఉండగా.. వరంగల్ 3.47 శాతంతో దేశంలోనే రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా (3.67శాతం) ఉంది. కాటరాక్ట్ సమస్యతోనే... 66.2 శాతం మందిలో అంధత్వానికి, 80.7శాతం మందిలో తీవ్రమైన దృష్టి లోపం రావడానికి, 70.2శాతం మందిలో మధ్యతరహా దృష్టి లోపానికి కాటరాక్ట్ కారణమని తెలింది. 2001 వరకూ వక్రీభవన లోపాలు దృష్టి లోపానికి రెండో అతి పెద్ద కారణమైతే, కార్నియా కారణంగా ఏర్పడే దృష్టి లోపాలు ఇప్పుడు మరో అతిపెద్ద సమస్యగా మారింది. అలాగే కాటరాక్టు సర్జరీలో వచ్చే సమస్యల కారణంగా కూడా దృష్టి కోల్పోవడం ఎక్కువగా జరుగుతోందని సర్వే అంచనా వేసింది. ► అంధత్వంతో బాధపడుతున్నవారు: 1.99% ► అతి తీవ్ర దృష్టిలోపమున్నవారు: 11.77% ► తీవ్ర దృష్టి లోపమున్నవారు: 1.96% ► మధ్యస్తంగా ఉన్న వారు: 9.81% ►త్వరలో చూపు సమస్యలు ఏర్పడేవారు: 12.92% -
చిన్న యాక్సిడెంట్ 20ఏళ్ల క్రితం పోయింది తిరిగొచ్చింది
సినిమాల్లో తరచుగా చూసే కొన్ని సంఘటనలు నిజ జీవితంలో జరిగితే అద్భుతంగా అనిపిస్తాయి. తెలుగు సినిమాల్లో చూపించినట్లుగానే యాక్సిడెంట్లో గతం మరిచిపోవడం.. మళ్లీ చిన్న ప్రమాదం జరిగినా వెంటనే తిరిగి గుర్తుకురావడం ఇలాంటివి చూసినపుడు మనలో మనమే నవ్వుకోవడం జరిగే ఉంటుంది. కానీ అలాంటి సంఘటన నిజంగా జరిగితే ఖచ్చితంగా మనం ఆశ్చర్యపోకుండా ఉండలేం. వివరాల్లోకెళ్తే.. గోర్జో విల్కోపోల్స్కి నగరంలో నివసిస్తున్న జానుస్జ్ గోరాజ్ అనే వ్యక్తికి సుమారు 20 ఏళ్ల కిందట అతడి ఎడమ కన్ను పూర్తిగా చూపు కోల్పోయింది. కుడి కన్ను మాత్రమే స్వల్పంగా కనిపించేది. మసక పట్టినట్లుగా, నీడలు మాత్రమే కనిపించేవి. కొన్ని అలర్జీల వల్ల అతడు చూపు పూర్తిగా మందగించిందని, చికిత్స సాధ్యం కాదని వైద్యులు అప్పట్లో చెప్పేశారు. దీంతో గోరాజ్ అప్పటి నుంచి అంధుడిలాగానే జీవిస్తున్నాడు. (ఆ ఇంట్లో అనుమానాస్పదంగా ఐదు శవాలు) అలా గడిచిపోతున్న అతడి జీవితంలో 2018 వెలుగులు నింపింది. జరిగింది ప్రమాదమే అయినా.. అతడి జీవితానికి మాత్రం అదో తీపి ఘటన. ఓ రోజు అతడు రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన కారు అతడిని ఢీకొట్టింది. అనంతరం గాల్లోకి ఎగిరి కిందపడిన అతనికి తీవ్ర గాయాలయ్యాయి. తుంటి భాగం విరగడంతో అతడు హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది. వైద్యులు సర్జరీ చేసి అతడి తుంటికి చికిత్స అందించారు. సర్జరీ జరిగిన కొన్ని వారాల తర్వాత గోరాజ్ కోలుకున్నాడు. అయితే, ఓ రోజు ఉదయం కళ్లు తెరవగానే.. ఎదురుగా ఉన్న వస్తువులు, మనుషులు స్పష్టంగా కనిపించారు. అది కలో, నిజమో తెలియక అతడు కాసేపు గందరగోళానికి గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్లు ఇది వైద్య చరిత్రలోనే మిరాకిల్ అంటూ ఆశ్చర్యపోతున్నారు. (రాత్రికి రాత్రే కేరళ కూలీకి రూ. 12కోట్లు..!) ఈ విషయంపై డాక్టర్లు మాట్లాడుతూ.. 'మేము రోడ్డు ప్రమాదం అనంతరం అతడికి చికిత్సలో భాగంగా కొన్నిరకాల మందులను ఇచ్చాం. వాటిలో ఏ మందు పనిచేసిందో తెలియదుగానీ.. అది అతడి కంటి లోపాన్ని సరిచేసి ఉండవచ్చు. ఆ సమయంలో అతడికి రక్తం గడ్డకుండా ఇచ్చే యాంటికాగ్యులెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. బహుశా వాటి వల్ల అతడి చూపు మెరుగుపడి ఉండవచ్చు' అని వైద్యులు తెలిపారు. -
టాయిలెట్లో దాక్కొన్నా.. కంటి చూపు పోయింది..
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా దేశమంతా అట్టుడుకుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పోలీసులు జరిపిన లాఠీ ఛార్జీ కారణంగా మాస్టర్ ఆఫ్ లా (ఎల్ఎల్ఎమ్) విద్యార్థి మిన్హాజుద్దీన్ తన చూపు కొల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే డిసెంబరు 15న ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పోలీసులు ఆయుధాలతో యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులను చితకబాదారు. సామాజిక మాధ్యమాల్లో పోలీసులు విద్యార్థులను కొడుతున్న వీడియోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే సరిగ్గా మూడు రోజుల తర్వాత పోలీసులు జరిపిన లాఠీ చార్జీ కారణంగా జామియా యూనివర్సిటీ ఫైనలియర్ స్టూడెంట్ మిన్హాజుద్దీన్ (26) ఒక కంటికి చూపును పూర్తిగా కోల్పోయాడు. ఇక రెండో కంటిపై కూడా దాని ప్రభావం పడుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆవేదన చెందుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. గత ఆదివారం తాను లైబ్రరీలోని ఎంఫిల్ సెక్షన్లో చదువుకుంటుండగా.. 25మందికి పైగా సాయుధులైన పోలీసులు లాఠీలతో విద్యార్థులపై దాడికి దిగారు. తన ఒక కంటికి, చేతికి తీవ్ర గాయాలవడంతో.. పారిపోయి టాయిలెట్లో దాక్కుని అక్కడే స్పృహ కోల్పోయానని వివరించాడు. ఆ తర్వాత తన స్నేహితులు కొంతమంది ఎయిమ్స్‌కు, రాజేంద్ర ప్రసాద్ ఐ ఇన్సిట్యూట్‌కు చేర్చారని అన్నాడు. పోలీసులు కాల్పులు జరపడం, టియర్ గ్యాస్ ప్రయోగించడంతో వైరల్ అయిన వీడియోల్లో విద్యార్థుల అర్తనాదాలు, లైబ్రరీలో పుస్తకాలు చెల్లాచెదురు కావడం గమనించవచ్చు. ఇక పోలీసులు దుశ్చర్యకు పాల్పడ్డారని వస్తున్న ఆరోపణలపై సీనియర్ పోలీసు అధికారి వివరణ ఇచ్చారు. జామియా విద్యార్థులపై అవసరానికి మించి బలప్రయోగం, యూనివర్సిటీ క్యాంపస్‌లోకి అక్రమంగా చొరబడటం అనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఒక గుంపు లోపలికి వెళ్ళిన తర్వాతే పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించారని పేర్కొన్నారు. ఇక హోం మంత్రిత్వ శాఖకు ఢిల్లీ పోలీసులు పంపిన రిపోర్టులో కాల్పులు జరుపలేదని పేర్కొన్నట్లుగా సమాచారం. అయితే పోలీసులు జరిపిన కాల్పుల కారణంగా బుల్లెట్ గాయాలతో ఇద్దరు విద్యార్థులు సప్ధార్ జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆదివారం విద్యార్థులు ప్రశాంతంగా నిర్వహిస్తున్న ర్యాలీలో స్థానిక ముఠాలు ప్రేరేపిస్తున్నాయనే నెపంతో హింసాత్మకంగా మార్చారు. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఆదివారం జరిగిన దమనకాండలో విద్యార్ధులను మినహాయించి 14 మంది స్ధానికులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా సీఏఏకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిలో ఇప్పటివరకు ఇద్దరు మైనర్లతో సహా మొత్తం ఆరు మంది ప్రాణాలు విడిచారు. కాగా ఢిల్లీలో నిరసనల హోరు కారణంగా గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో.. ఏకంగా కొన్ని రోడ్లనే మూసివేశారు. -
అంధకారమేనా?
హన్మకొండ చౌరస్తా (వరంగల్): కంటి వెలుగు.. వారి జీవితాల్లో చీకట్లను నింపింది. హన్మకొండలోని జయ ఆస్పత్రిలో ఇటీవల జరిగిన ఘటనలో బాధితులకు కంటి చూపు కష్టమే అన్న అనుమానాలు నిజమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం ద్వారా సెప్టెంబర్ 26న హన్మకొండలోని జయ ఆస్పత్రిలో జరిగిన ఆపరేషన్లు వికటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 18 మందికి కంటి శస్త్ర చికిత్సలు చేసిన వైద్యులు.. అందులో 11మందికి సెప్టెంబర్ 28న రీఆపరేషన్ చేశారు. అయినప్పటికీ చూపు సరిగా లేదని ఆందోళనకు దిగడంతో 18 మంది బాధితులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి తరలించా రు. మూడు రోజులపాటు ఆస్పత్రిలో ఉంచుకున్న ఎల్వీ ప్రసాద్ వైద్యులు 8మందికి చికిత్స నిలిపివేసి సోమవారం డిశ్చార్జి చేశారు. మూడు రోజుల తర్వాత మరోసారి ఆస్పత్రికి రావాలని వైద్యులు చెప్పగా.. ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని, హన్మకొండలోని జయ ఆస్పపత్రిలోనే చికిత్స పొందాలని సిబ్బంది చెప్పినట్లు బాధితులు ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. అస్పష్టమైన సమాధానంతో ఆందోళన చెందుతూనే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఎనిమిది మంది బాధితులు ఇంటి ముఖం పట్టారు. కంటిలో ఇన్ఫెక్షన్ అలానే ఉందని, చూపు స్పష్టంగా కనపడడం లేదని, కళ్లు మసగ్గానే కనపడుతున్నాయని బాధితులు వాపోయారు. వైద్యులు మాత్రం పది రోజుల్లో అంతా సర్దుకుంటుంద ని.. కంటి చూపు మెరుగుపడుతుందని చెప్పి పం పినట్లు తెలిపారు. ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిశ్చార్జి అయిన బాధితులు బోలే సరోజన, పులిగిల్ల, పరకాల, కె.సరోజన, మచిలీబజార్, హన్మకొండ, గోరంట్ల సుజాత, పాపయ్యపేటచమన్, వరంగల్. ముడిగె రాజయ్య, వేశాలపల్లి, భూపాలపల్లి, బుచ్చమ్మ గోపరాజు,ఎల్లాపూర్, హసన్‌పర్తి. అజ్మీర మేఘ్య, బాంజీపేట, నర్సంపేట. జి.భగవాన్, ధర్మరావుపేట, ఖానాపూర్. మంద సత్తమ్మ, న్యూశాయంపేట, హన్మకొండ. -
కాలానికి కక్ష.. కనుపాపకు శిక్ష
తూర్పుగోదావరి ,అల్లవరం (అమలాపురం): ఏ దేవుడి శాపమో.. ఏ జన్మలో చేసుకున్న పాపమో యావత్ కుటుంబానికి దృష్టి గ్రహణం ఏర్పడింది. తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేక దరిద్రం అనుభవిస్తున్నారు. తరాలు మారినా తలరాతలు మారడం లేదన్న బాధను దిగమింగుకుని జీవచ్ఛవంగా బతుకుతున్నారు. అల్లవరం మండలం బోడసకుర్రు మత్స్యకార గ్రామంలో చింతా వెంకటేశ్వరరావు కుటుంబాన్ని దృష్టి లోపం వెంటాడుతోంది. కుటుంబంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరికి చూపు సమస్య తలెత్తింది. బయటకు వెళ్లాలన్నా, కడుపు నింపుకోవాలన్నా ఎవరో ఒకరి సాయం కావాలి. చేయూత లేకుంటే బయట ప్రపంచం చూడలేని పరిస్థితి. వెంకటేశ్వరరావుకు చిన్నతనం నుంచే కంటి చూపు సమస్య ఉంది. ఉన్న చూపుతోనే చేపల వేట ద్వారా సంపాదించి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే విధి వక్రీకరించింది. చేపల వేట సాగిస్తున్న సమయంలో నత్తగుల్ల ఎడమ కంటికి తగిలి శాశ్వతంగా చూపు లేకుండా చేసింది. మరో రెండేళ్ల వ్యవధిలో కుడి కన్ను పాడై శాశ్వతంగా అంధుడిగా మిగిలిపోయాడు. తన కడుపున పుట్టిన పిల్లలు కూడా ఒకొక్కరూ కంటి చూపు కోల్పోతుండడంతో కన్నీరు మున్నీరవుతున్నాడు. రక్తం పంచుకుని పుట్టిన చెల్లి పాలెపు బేబి (30), కుడుపున పుట్టిన కుమారుడు చింతా రాజు(27) కుమార్తె చింతా రత్నకుమారి (20), ఏ పాపం తెలియని మనవరాలు చింతా వర్షిత (7) ఇలా ఐదుగురిని అంధత్వం వెంటాడుతోంది. పుట్టుకతో ఎవరూ గుడ్డివారు కాదు. వయస్సు పెరిగే కొద్ది దృష్టి లోపం బయటపడుతోంది. తన చెల్లిలిని ఊబలంక గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్లయిన రెండేళ్లకే కంటి చూపు కోల్పోయింది. చూపు లేదన్న సాకుతో కట్టుకున్న భర్త వది లేసి ఒంటరిని చేశాడు. పండంటి బిడ్డకు జన్మనిస్తే పోలి యో చుక్కల రూపంలో శిశువును మృత్యువు కబళించింది. గత్యంతరం లేక అంధుడైన తన అన్న వెంకటేశ్వరరావు ఆశ్రయంలో కాలం గడుపుతోంది. పార్వతే ఇంటి ఇలవేల్పు అటువంటి కుటుంబానికి అన్ని తానై రోజు వారీ కూలి డబ్బులతో బతుకు బండిని లాగుతోంది పార్వతి. విశ్రాంతి తీసుకోవలసిన సమయంలో రెక్కల కష్టాన్ని ధారపోసి కుటుంబాన్ని పోషిస్తోంది. కాగా వెంకటేశ్వరరావుకి మాత్రమే ప్రభుత్వం పింఛను పంపిణీ అందిస్తున్నారు.. వెంకటేశ్వరరావు నుంచి మూడో తరం వరకూ మేనరికం పెళ్లిళ్లు జరగలేదని బాధిత కుటుంబం సాక్షికి తెలిపింది. సరైన సమయంలో వైద్యులకు చూపించినా లోపం లేదని చెబుతున్నారని వాపోయారు. వర్షితను స్కూల్లో చేర్పించిన తర్వాత దృష్టి లోపం ఉందని గుర్తించామని తల్లి తెలిపింది. కాకినాడ, రాజమండ్రి నగరాల్లో కంటి ఆస్పత్రికి తీసుకు వెళ్తే ఏ సమస్యా లేదని వైద్యులు తెలిపారన్నది. పెద్ద ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయించే స్థోమత లేకపోవడంతో ఇంటిలోని అందరూ చూపు కోల్పోతున్నారని భోరున విలపించారు. జన్యుపరమైన లోపాలు సవరించలేం జన్యుపరమైన లోపాలు, మేనరికం వల్ల వచ్చే కంటి సమస్యలు తలెత్తితే నివారణ కష్టతరం. కంటిలో రెగ్మోంటోస్ సమస్య తలెత్తితే ఎంత ఖరీదైనా వైద్యం అందించి నా కంటి చూపు సాధ్యంకాదు. వయసు పెరిగే కొద్దీ నరాలు శక్తి కోల్పోయి కంటి చూపు శాశ్వతంగా పోయే ప్రమాదముంది. గ్లొకోమా సమస్య తలెత్తితే ఆపరేషన్ ద్వారా కంటి చూపు తేవచ్చు. తక్కువ బరువులో పిల్లలు పుట్టినప్పుడు కంటి నరాలు బలహీనంగా ఉం టాయి దీనినే రెటినోపతి ప్రీమెచ్యూరిటీ అం టారు. పిల్లలు తక్కవ బరువుతో పుట్టినప్పుడు ఆర్ఓపీ స్కీనింగ్ నిర్వహిస్తే కంటి సమస్యలను గుర్తించి తధ్వారా చికిత్స అందించవచ్చు. -కడలి ప్రసాద్, కంటి వైద్య నిపుణులు, సత్యా నేత్రాలయ, అమలాపురం -
జుట్టు రాలె..కన్ను పాయె!
సౌదీ అరేబియాకు చెందిన తారిక్ కుస్సు బట్టతలపై జుట్టు కోసం బంజారాహిల్స్‌లోని ఓ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్లో సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ వికటించి కంటిచూపు కోల్పోయాడు. బాధితుడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయగా, అధికారులు కేంద్రాన్ని తనిఖీ చేస్తే సదరు వైద్యుడు అసలు సర్జనే కాదని తేలింది. మెడికల్ టూరిజానికి కేంద్రంగా మారిన హైదరాబాద్‌లో ఇతర దేశాలతో పోలిస్తే వైద్యం చాలా చౌక. తక్కువ ధరకే మెరుగైన వైద్యం పొందే వీలుంది. దీంతో విదేశాల నుంచి కూడా రోగులు వస్తున్నారు. అయితే అక్రమ సంపాదనే లక్ష్యంగా కొందరు వైద్యులు చికిత్స ముసుగులో అనైతిక చర్యలకు పాల్పడుతుంటే.. ఏ అర్హతలూ లేని అనేక మంది శంకర్‌దాదా ఎంబీబీఎస్లుగా చలామణి అవుతున్నారు. ఇలాంటి వ్యక్తులపై ఏడాది కాలంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు 40 ఫిర్యాదులు అందాయి. అనైతిక వైద్యసేవలు.. వైద్యసేవల్లోనిర్లక్ష్యం.. వంటి ఘటనలపై తెలంగాణమెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదులువెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు40 ఫిర్యాదులు అందగా, వీటిలోఇప్పటికే నలుగురు వైద్యులపైరెండు నుంచి ఐదేళ్ల పాటు సస్పెన్షన్వేటు విధించారు. తాజాగా మరో వైద్యుడిపై రెండేళ్ల పాటు వేటువిధించింది. మరో ఐదుగురు వైద్యులకు హెచ్చరిక ఇచ్చి పంపింది. సాక్షి, సిటీబ్యూరో: వృత్తిపట్ల అంకిత భావం, వైద్య రంగంలో కనీస అనుభవం లేని వారు చికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుకుంటున్నారు. నిపుణులతో పాటు ఆస్పత్రిలో కనీస సదుపాయాలు లేకపోయినా సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులుగా చెలామణి అవుతూ.. నిపుణులు, వారు చేసిన చికిత్సలపై ప్రచారం చేసుకుని రోగులను మభ్య పెడు తున్నారు. తీరా ప్రాణాల మీదకు వచ్చే సరికి ‘మా వల్ల కాదు..’అంటూ చేతులెత్తేస్తున్నారు. ఇతర ఆస్పత్రులకు సిఫార్సు చేస్తున్నారు. అప్పటికే రోగం మరింత ముదిరి పోవడంతో పాటు వైద్యపరమైన నిర్లక్ష్యం వల్ల అనేక మంది మత్యువాత పడుతున్నారు. కానీ ఇవేవీ బయటికి రావడం లేదు. ఒక వేళ వచ్చినా, వారు కూడా ఆ క్షణానికి హంగమా సృష్టించి రూ.లక్షో..రెండు లక్షలు నష్టపరిహారంగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. వైద్య పరమైన నిర్లక్ష్యంపై ఆస్పత్రులను కోర్టులకు ఈడుస్తున్న బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మచ్చుకు కొన్ని ఫిర్యాదులు... ♦ సౌదీఅరేబియాకు చెందిన తారిక్ కుçస్సు బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 1లోని ఖాన్స్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్లో సర్జరీ చేయించుకున్నాడు. డాక్టర్ ఇష్రత్ ఉల్లా ఖాన్ చేసిన సర్జరీ వికటించడంతో రోగి ఆరోగ్య పరిస్థితి విషమించింది. కంటిచూపును కూడా కోల్పొవాల్సి వచ్చింది. దీంతో బాధితుడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయగా, అధికారులు సదరు కేంద్రానికి వెళ్లి తనిఖీలు నిర్వహించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. సదరు వైద్యుడు అసలు సర్జనే కాదని తేలింది. కనీస వైద్య సదుపాయాలు లేని సెంటర్లో ఓ ఎంబీబీఎస్ డాక్టర్ ఎలాంటి అర్హతలు లేకుండా కాస్మొటిక్ సర్జరీ చేయడం వల్లే వైద్యం వికటించినట్లు గుర్తించింది. అనైతిక వైద్యానికి పాల్పడిన ఆ వైద్యుడిపై రెండేళ్లపాటు సస్పెన్షన్ వేటు విధించింది. ♦ కేన్సర్‌తో బాధపడుతున్న రోగులకు సంతోష్‌నగర్‌లోని ఓ ఆస్పత్రిలో డాక్టర్ ఏక్యూ టెర్రి రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఏకంగా కీమోథెరపీ నిర్వస్తున్నాడు. కేన్సర్ అడ్వాన్స్ స్టేజీ లో ఉన్న రోగులకు ఖరీదైన మందులు సూచిస్తూ మోసం చేస్తున్నాడు. ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మెడికల్ కౌన్సిల్ బృందం ఆ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించి, సదరు డాక్టర్‌కు హెచ్చరించింది. ♦ సంగారెడ్డిలో కొంతమంది వైద్యులు అన వసరంగా సిజేరియన్లు నిర్వహించారు. ఈ అం శంపై జిల్లా కలెక్టర్ ఐదు ఆస్పత్రులపై ఫిర్యాదు చేశారు. ఎథిక్స్ కమిటీ బృందం ఇటీవల ఆయా ఆస్పత్రులను తనిఖీ చేసింది. అక్రమ సంపాధనే లక్ష్యంగా సిజేరియన్లు చేసినట్లు గుర్తించింది. జిల్లా కలెక్టర్‌కు నివేదిక కూడా అందజేసింది. ♦ నిమ్స్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఓ వై ద్యుడు తన వద్దపని చేస్తున్న పీజీ వైద్యుల ప ట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు రావడంతో... ఆయన్ను హెచ్చరించి పంపింది. ♦ న్యూబోయిన పల్లిలోని ఓ ఆస్పత్రిలో చని పోయినవ్యక్తిని వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం చేసినట్లు నటించారు. బాధితులు గొడవ చేయడంతో ఆస్పత్రి యాజమాన్యం వారికి పరిహారం అందజేసింది. కమీషన్లు ఇవ్వడం నేరమే రోగుల పట్ల సున్నితంగా వ్యవహరించడం, వారి బాధలను సహృదయంతో అర్థం చేసుకోవాలి. వైద్యులు రోగుల మెడికల్ రికార్డులను మూడేళ్ల పాటు విధిగా భద్రపరచాలి. గ్రామీణ ఆర్ఎంపీ వైద్యులకు కమిషన్లు చెల్లించడం, వారి ద్వారా రోగులను రప్పించుకోవడం నేరం. సర్జరీలపై వైద్యుడి పేరుతో వ్యాపార ప్రకటనలు ఇవ్వడం నైతిక విరుద్ధం. – డాక్టర్ రాజలింగం,వైస్ చైర్మన్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కఠినంగా వ్యవహరిస్తాం గతంతో పోలిస్తే ప్రస్తుతం వైద్య చికిత్సలపై ప్రజల్లో అవగాహన పెరిగింది. ఏ చికిత్స దేనికి చేస్తారో? ఏ మందులు ఏ జబ్బుకు సూచిస్తారో? అనే అంశం వైద్యవృత్తితో సంబంధం లేని సగటు మనిషికి కూడా తెలిసి పోయింది. వైద్యపరమైన నిర్లక్ష్యంపై సంబంధిత ఆస్పత్రులను, వైద్యులను నిలదీస్తున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులపైనే కాదు వారి వద్ద వైద్యవిద్య నేర్చుకుంటున్న విద్యార్థులు, వారి ఫిర్యాదులను కూడా స్వీకరించి హెచ్చస్తున్నాం. – డాక్టర్ రవీందర్‌రెడ్డి, చైర్మన్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ -
కంటి చూపే కబళిస్తోంది!
గతేడాది అక్టోబరులో గుంటూరు జిల్లాలో ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో ఓ ఇంజనీరింగ్ కళాశాల బస్సు డ్రైవర్ వీరారెడ్డి (63) తనకు ముందుగా వెళుతున్న ఓ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. బైకుపై వెళ్తున్న శ్రీనివాసరెడ్డి, శ్రీరంగమ్మలు అక్కడికక్కడే మృతి చెందగా, ఆ సంఘటనతో గుండెపోటు వచ్చి.. డ్రైవరు వీరారెడ్డి బస్సులోనే కుప్పకూలిపోయి మరణించాడు. అయితే వీరారెడ్డి కంటి చూపు సమస్యలతో బాధపడటం వల్ల రెండు నిండు ప్రాణాలతోపాటు తాను కూడా మృత్యువాత పడ్డాడు. ఇటీవలే భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆధ్వర్యంలో కాజ టోల్గేట్ వద్ద రవాణా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరం నిర్వహించగా, వంద మంది పరీక్షల్లో ఐదుగురికి కలర్ బ్లైండ్నెస్ తేలింది. శంకర కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో గుంటూరు రవాణా శాఖ కార్యాలయంలో అన్ని విద్యా సంస్థల బస్సుల డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహిస్తే, నలుగురికి కలర్ బ్లైండ్‌నెస్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. యాభై మంది పరీక్షలకు హాజరైతే పది మందికి పైగా దృష్టి సమస్యలున్నట్లు తేల్చారు. సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఏటా వేలాదిమంది రోడ్డుప్రమాదాల్లో మరణిస్తున్నారు. అతివేగం ప్రమాదానికి కారణమనే విషయం మాత్రమే అధికారులు చెబుతున్నారు. కానీ.. మరెన్నో రోడ్డు ప్రమాదాలకు కారణం డ్రైవర్ చూపు సరిగ్గా లేకపోవడమేనని గణాంకాలు చెబుతున్నాయి. ఏపీలో 35 శాతం డ్రైవర్లకు సమస్య.. ఆంధ్రప్రదేశ్‌లోని 65 లక్షల మంది డ్రైవర్లలో 35 శాతం మంది కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నారు. అంటే 22.75 లక్షల మంది డ్రైవర్లకు కంటి చూపు సమస్యలున్నాయి. కంటి చూపు సమస్యల కారణంగా 12 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్ సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ నివేదిక స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో ఏటా కలర్ బ్లైండ్నెస్ పెరుగుతుందన్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. సర్వేలు చెబుతున్నా పట్టించుకోరా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వ సంస్థలతోపాటు పలు ప్రైవేటు ఏజెన్సీలు విశ్లేషణలతో కూడిన సర్వేలు నిర్వహిస్తున్నాయి. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత రవాణా, పోలీస్ శాఖలు కేసు నమోదు చేసి డ్రైవరు మద్యం తాగి ఉన్నాడా? లేదా? అన్న పరీక్షలు చేయడం మినహా డ్రైవరు ఫిట్నెస్, కంటి సమస్యలపై పరీక్షలు చేయించడం లేదు. డ్రైవింగ్ లైసెన్సు జారీ, రెన్యువల్ సమయాల్లో రవాణా శాఖ అధికారులు కంటి సామర్థ్య పరీక్షలు నిర్వహించడం లేదు. ప్రాథమికంగా కంటి పరీక్షలు చేసే పరికరాలైనా రవాణాశాఖకు సమకూర్చడం లేదు. 40 ఏళ్లు దాటిన వారికి లైసెన్సు ఇవ్వాలంటే, ఆరోగ్య ధ్రువపత్రం సమర్పించాలని రవాణా అధికారులు కోరుతున్నారే.. తప్ప కంటి చూపు సమస్యలపై దృష్టి సారించకపోవడం గమనార్హం. ప్రమాదాలకు కారణాలు.. ఓవర్ స్పీడ్ – 40 శాతం డ్రంకన్ డ్రైవ్ – 20 శాతం కంటి చూపు సమస్యలు – 12 శాతం రెస్ట్ లేకుండా డ్రైవింగ్ – 18 శాతం సాంకేతిక కారణాలు – 5 శాతం నిర్లక్ష్య డ్రైవింగ్ – 5 శాతం -
చేపలు తినండి.. మంచి కంటిచూపు పొందండి
చేపలు బాగా తినడం వల్ల వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే మాలెక్యులార్ డిజనరేషన్ అనే కంటిజబ్బు కారణంగా వచ్చే అంధత్వాన్ని నివారించవచ్చని అంటున్నారు అమెరికన్ సైంటిస్టులు. చేపల్లో పుష్కలంగా ఉండే ఒమెగా– 3 ఫ్యాటీ యాసిడ్స్ ఈ జబ్బును నివారించి, కంటిచూపును పదిలంగా ఉంచుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. చేపల్లో ఒమెగా –3 ఫ్యాటీ యాసిడ్ అనే పోషకం ఎక్కువగా లభ్యమవుతుంది. అయితే సాల్మన్, సార్డిన్, మ్యాకరెల్స్ చేపల్లో ఇది మరీ ఎక్కువ. లూసియానా స్టేట్ యూనివర్సిటీకి చెందిన అధ్యయనవేత్తల బృందంలోని కీలక సభ్యుడు ప్రొఫెసర్ నికోలాస్ బాజాన్ ఈ పరిశోధన ఫలితాలను వెల్లడించారు. ఈ పరిశోధన వివరాలన్నీ సెల్యులార్ మాలెక్యులార్ న్యూరోబయాలజీ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
ఇతడు మెదడుతో చూస్తాడు..!
కంటి చూపు లేకపోయినప్పటికీ చుట్టూ ఉన్న పరిసరాలను, పరిస్థితులను అంధులు ఎంతో చక్కగా అంచనా వేయగలుగుతారు. ఈ కోవలోకే వస్తాడు 17 ఏళ్ల జీత్త్రివేది. అయితే ఇతడు అంధుడు కాదు. కానీ డ్రైవింగ్, చదవడం, సూదిలో దారం గుచ్చడం వంటి పనులను కళ్లు మూసుకుని చకచకా చేసేస్తాడు. గతేడాది సెప్టెంబర్‌లో 40 కిలోమీటర్ల వరకు కళ్లకు గంతలు కట్టుకుని బైక్ నడిపి చూపించాడు. ఎలా ఇలా అంటే.. మధ్య మెదడును యాక్టివేట్ చేయడం వల్ల ఏదయినా సాధ్యమే అంటున్నారు జీత్ ట్రైనర్ భరత్ పటేల్. జీత్‌కు తన ఇంద్రియాల పట్ల చక్కని నియంత్రణ ఉందని, ఒక అవయవాన్ని మనం పనిచేయకుండా ఆపేస్తే ఆ పనిని ఇంకో అవయవం సహాయంతో చేయగలుతాడని భరత్ చెప్పారు. అంతేకాదు కళ్లకు గంతలు కట్టుకునే జీత్ పుస్తకాలు చదవగలడు, తన ఎదురుగా వచ్చే వస్తువులను పట్టుకోగలడు, దాగి ఉన్న వస్తువులను కనిపెట్టగలడు, ఒకేసారి ముగ్గురితో చెస్ ఆడగలడు. ఎదురుగా వచ్చే వస్తువు వాసన బట్టి గుర్తించగలుగుతున్నానని, ఆ వస్తువు ఏంటో కూడా చెప్పగలనని జీత్ చెబుతున్నాడు. మధ్య మెదడును ఉత్తేజితం చేస్తే ఆ విద్య ఎవరికైనా సాధ్యమేనంటున్నారు భరత్. సమాజంలో జీత్లా ఏ చిన్నారికైనా ఈ శిక్షణ ఇవ్వచ్చని, అయితే కావాల్సిందల్లా ఓపిక, పట్టుదల, తల్లిదండ్రుల్లో సానుకూల దృక్పథం అని వివరించారు. -
కంటిచూపుతో... పంపేయొచ్చు!
స్మార్ట్‌ఫోన్‌తో ఒక చేత్తో ఫొటో/వీడియో క్లిక్ మనిపించడం... ఇంకోచేత్తో ఠకీమని వాటిని సోషల్ వెబ్సైట్లలోకి ఎక్కించేయడం... ఇదీ ఈకాలపు యువత ట్రెండ్. వీరి పని మరింత సులువు చేసేందుకా అన్నట్టు ఇన్స్టంట్ వీడియో మెసేజింగ్ ఆప్ ‘స్నాప్‌ఛాట్’ ఇదిగో.. ఈ కళ్లద్దాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏంటి దీనివల్ల ప్రయోజనమనుకుంటే... వీటిని ధరించిన అమ్మాయి చూపుడు వేలు ఎక్కడుందో చూడండి... అలాగే ఈ కళ్లజోడుకు ఇరువైపులా ఉన్న కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్లపై ఓ లుక్కేయండి. అదీ విషయం. ఫ్రేమ్‌పై ఉన్న చిన్న మీటను నొక్కగానే ఎల్ఈడీ ఫ్లాష్ వెలుగుతుంది. అదే సమయంలో కెమెరా 10 సెకన్ల వీడియోను రికార్డు చేస్తుంది. కామెంట్స్ జత చేసి వెంటనే దీన్ని స్నాప్ఛాట్లోకి ఎక్కించేయవచ్చునన్నమాట. అలాగని ఇదేదో ఆషామాషీగా వీడియో తీయదండోయ్. ‘స్పెక్టకల్స్’ పేరుతో విడుదలైన ఈ కళ్లజోడు ఏకంగా రెండువైపులా 115 డిగ్రీల వరకూ వీడియో తీయగలదు. మూడు రంగుల్లో లభిస్తున్న ఈ సరికొత్త కళ్లజోడు ధర 129 డాలర్ల వరకూ ఉంటుంది. -
కంటి ఆస్పత్రి ఖాళీ
- ‘సరోజినీ’లో చికిత్సకు ముందుకు రాని రోగులు సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్లు వికటించిన విషయం వెలుగుచూడడంతో రోగులు సరోజినీదేవి కంటి ఆస్పత్రికి వెళ్లేందుకు జంకుతున్నారు. క్యాటరాక్ట్ శస్త్రచికిత్స వికటించి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఐదుగురు బాధితులు మినహా ఇన్‌పేషెంట్ వార్డుల్లో మరెవరూ కన్పించడం లేదు. ఆస్పత్రి చరిత్రలో ఈ పరిస్థితి ఎన్నడూ తలెత్తలేదు. కంటిచూపు మందగించడంతో గతనెల 30న ఆస్పత్రిలో 21 మంది క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోగా.. వారిలో ఏడుగురు కంటిచూపును కోల్పోయిన విషయం తెలిసిందే. కళ్లను శుభ్రం చేసే రింగర్ లాక్టిటెట్(ఆర్ఎల్) సెలైన్ బాటిల్లోనే కాకుండా ఆపరేషన్ థియేటర్లోని వైద్య పరికరాల్లో కూడా బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉందని భావించిన అధికారులు ఈ నెల 1న ఎమర్జెన్సీ మినహా మిగిలిన ఏడు ఆపరేషన్ థియేటర్లను కూడా మూసేశారు. గత ఏడు రోజుల నుంచి ఎమర్జెన్సీకి వచ్చిన ఒకట్రెండు కేసులు మినహా.. ఇతర శస్త్రచికిత్స లేవీ జరగడం లేదు. రోగుల్లో సన్నగిల్లిన నమ్మకం సరోజినీదేవి కంటి ఆస్పత్రికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. రోజుకు సగటున 800 మంది వస్తుంటారు. 540 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రి ఇన్‌పేషెంట్ వార్డుల్లో నిత్యం 350-400 మంది చికిత్స పొందుతుంటారు. రోజుకు సగటున 70-80 మంది కొత్త పేషెంట్లు అడ్మిట్ అవుతారు. రోజుకు 40-50 శస్త్ర చికిత్సలు జరుగుతుంటాయి. అయితే ఆపరేషన్లు వికటించిన నేపథ్యంలో గురువారం అత్యవసర విభాగం సహా ఓపీ, ఐపీ వార్డులన్నీ రోగుల్లేక ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇన్‌పేషెంట్ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులకు కూడా వైద్యులపై నమ్మకం సన్నగిల్లింది. తమను ఇక్కడి నుంచి ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి షిఫ్ట్ చేయాలని బాధితుడు అంజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న రోగులకు ఇప్పటివరకు చేయాల్సినదంతా చేస్తున్నామని, బయటి నుంచి నిపుణులను పిలిపించాల్సిన అవసరం లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్గుప్తా పేర్కొన్నారు. నిలోఫర్‌లో ‘ఫంగస్’ సెలైన్ బాటిళ్లు తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ) సరఫరా చేసిన రింగర్ లాక్టిటెట్(ఆర్ఎల్) సెలైన్ వాటర్ బాటిల్లో ‘క్లెబ్సియల్లా’ బ్యాక్టీరియా ఉన్నట్లు సరోజినీదేవి ఉదంతంతో తేలిన సంగతి తెలిసిందే. అదే కంపెనీకి చెందిన సెలైన్ బాటిల్లో ఫంగస్ ఉన్నట్టు వారం రోజుల కిందటే నిలోఫర్ చిన్నపిల్లల ఆసుపత్రి వైద్యులు గుర్తించారు. దానిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ టీఎస్ఎంఐడీసికి లేఖ రాసినా అధికారులు స్పందించలేదు. తాజాగా సరోజినీదేవి ఆసుపత్రిలో బ్యాక్టీరియా వెలుగుచూడడంతో డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు గురువారం హడావుడిగా నిలోఫర్ ఆసుపత్రికి చేరుకొని 29 వేల సెలైన్ బాటిళ్లను సీజ్ చేశారు. ఈ ఆసుపత్రికి 38 వేల సెలైన్ బాటిళ్లు సరఫరా చేయగా.. వాటిలో ఇప్పటికే 9 వేల బాటిళ్లు ఉపయోగించారు. కంపెనీని వదిలి.. డాక్టర్లపై చర్యలా: టీజీడీఏ సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఘటనకు వైద్యులను బాధ్యులుగా చేయడం తగదని తెలంగాణ వైద్యుల సంఘం( టీజీడీఏ) ఉస్మానియా యూనిట్-2 ప్రతినిధులు డాక్టర్ రవీందర్‌గౌడ్, డాక్టర్ నరహరి, డాక్టర్ లాలూ ప్రసాద్, డాక్టర్ వినోద్‌కుమార్ లు స్పష్టంచేశారు. సరఫరా చేసిన కంపెనీని, నాణ్యతను పరిశీలించకుండా కొనుగోలు చేసిన టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులను వదిలి వైద్యులపై చర్యలు తీసుకోవాలని చూడటం సమంజసం కాదన్నారు. మందుల కొనుగోళ్లు, వాటి నాణ్యతపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
గెలిచాడు... గెలిపించాడు!
ఆదర్శం * అతని కంటికి చూపు లేదు * కానీ అతని మనసుకు ఉంది * అదే తనని గెలిపించింది ‘మీరు చేరే గమ్యానికి మీ సమస్యల గురించి చెప్పకండి. కానీ సమస్యలకు మాత్రం మీరు చేరే గమ్యాన్ని గురించి చెప్పండి’ అంటాడు భవేష్ భాటియా. ఆయన ఆ మాటలు ఎందుకన్నాడో తెలియాలంటే... ఆయన గురించి మనకు తెలియాలి. అప్పటివరకూ ఇంద్రధనుస్సుల తోటలో విహరించిన వ్యక్తికి ఒక్కసారిగా చీకటి గదికి మాత్రమే పరిమితమైపోవాల్సి వస్తే ఎలా ఉంటుంది? జీవితం కూడా చీకటిమయం అయిపోయినట్లు అని పిస్తుంది. భవేష్ భాటియాకు కూడా అలాగే అనిపించింది. ‘రెటీనా మాక్యులర్ డీజెనరేషన్’ వల్ల భవేష్ ఇరవయ్యేళ్ల వయసులో తన కంటి చూపును కోల్పో యాడు. దాంతో పాటు ధైర్యాన్నీ కోల్పో యాడు. కాలు మీద కాలు వేసుకొని కులా సాగా బతకడానికి తనది సంపన్న కుటుంబం కాదు. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు. దాంతో ఎలా బతకాలా అని ఒకటే ఆలోచనలు. అయితే అదృష్టంకొద్దీ ఆ ఆలోచనల మథనంలో ‘పిరికితనం’ అనే విషం పుట్టలేదు. ‘ఆత్మస్థైర్యం’ అనే అమృతం పుట్టింది. గుజరాత్‌లోని అంజార్ గ్రామంలో పుట్టాడు భవేష్. అక్కడ భూకంపం రావడంతో కుటుంబం మొత్తం మహా బలేశ్వర్ (మహారాష్ట్ర) వచ్చి స్థిరపడింది. చూపు పోయిన తరువాత కొంతకాలానికి మహాబలేశ్వర్‌లోని ఒక హోటల్లో టెలిఫోన్ ఆపరేటర్‌గా చేరాడు భవేష్. అయితే చూపులేని కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో ఉద్యోగాన్ని వదులుకోక తప్పింది కాదు. అలా అని ఇంట్లో కూర్చోవడానికి మనసొప్పలేదు. ఆ సమయంలోనే ఎవరో ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్లైండ్’ గురించి చెప్పడంతో ఆ ఇన్స్టిట్యూట్లో క్యాండిల్ మేకింగ్ కోర్స్‌లో చేరాడు. కోర్సు పూర్తయిన తరువాత తాను తయారుచేసిన క్యాండిల్స్‌ను రోడ్డు పక్కన అమ్మడం మొదలు పెట్టాడు. ఇది మొదలు అతడు ఎప్పుడూ వెనక్కితిరిగి చూసుకోలేదు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ చివరికి ‘సన్‌రైజ్ క్యాండిల్స్’ పేరుతో కంపెనీ స్థాపించే స్థాయికి ఎదిగాడు. తనలాంటి 225 మంది అంధులకు ఉపాధి కల్పించే స్థాయికి చేరాడు. ‘‘ఉద్యోగం ఎంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందో నాకు అనుభవపూర్వకంగా తెలుసు. అందుకే నాలాంటి చూపులేని వ్యక్తులకు క్యాండిల్స్ తయారీలో శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తున్నాను’’ అంటున్నాడు భవేష్. ‘‘వారికి తాత్కాలిక ఉపాధి కల్పించడం మాత్రమే నా ఉద్దేశం కాదు. భవిష్యత్తులో సొంత కాళ్ల మీద నిలబడి, నాలా కంపెనీ ప్రారంభించేలా తయారు చేస్తున్నాను’’ అని కూడా అంటున్నాడు. విశేషమేమిటంటే భవేష్ ఫ్యాక్టరీలో తయారయ్యేవి ఎకో-ఫ్రెండ్లీ క్యాండిల్స్! మూస పద్ధతిలో కాకుండా ఎప్పటికప్పుడు క్యాండిల్స్ తయారీలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటుంది భవేష్ కంపెనీ. పొగరహిత క్యాండిల్స్ తయారీ అలాంటిదే! క్యాండిల్స్‌తో రకరకాల కళా కృతులు, విగ్రహాలు కూడా తయారు చేస్తారు. ఈ కంపెనీ తయారుచేసిన కొన్ని క్యాండిల్స్... ఎనిమిది అడుగుల ఎత్తు ఉంటాయి! వీరి సృజ నాత్మకను మెచ్చిన రిలయెన్‌స కంపెనీ వ్యాపారాన్ని విస్తరించ డానికి అవసరమైన గ్రాంటు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. కానీ భవేష్ దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. మాకు సహాయపడాలనుకుంటే మరింత ఎక్కువ పని ఇప్పించండి చాలు అన్నాడు. దీనికి వారు సంతోషంగా అంగీకరించారు. నాటి నుంచీ ఆ కంపెనీ నుంచి సన్రైజ్కి పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తున్నాయి. భవేష్ అంకితభావం, టీమ్ వర్క్ వల్ల ఇప్పుడు క్యాండిల్ మేకింగ్ కంపెనీలలో ‘సన్‌రైజ్’ ప్రముఖంగా నిలిచింది. స్వదేశం నుంచే కాక వివిధ దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. అయితే వ్యాపారంలోనే కాదు... క్రీడల్లోనూ సత్తా చాటుతున్నాడు భవేష్. నేషనల్ లెవెల్ పారాలింపిక్స్ చాంపియన్ అయిన అతడు, షార్ట్‌పుట్ విభాగంలో పలు పతకాలు గెలుచు కున్నాడు. అలాగే భవేష్ ట్రెక్కర్, రన్నర్ కూడా. 2016లో బ్రెజిల్లో జరగబోయే పారాలింపిక్స్ గేమ్స్ కోసం కాస్త గట్టిగానే సన్నద్ధమవు తున్నాడు. అయినా ఆయనకు విజయాలు కొత్తేమీ కాదుకదా! ఇప్పటికే జీవితంలో గెలిచాడు. ఎందరినో గెలిపించాడు. -
పసి‘గుడ్డు’ను చిదిమేశారు!
డాక్టర్ నిర్లక్ష్యంతో చూపుకోల్పోయిన పసికందు సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం ఓ పసికందు జీవితాన్ని అంధకారం చేసింది. శిశువు కంటి నుంచి నీరుకారుతోందని ఆసుపత్రికి తీసుకెళితే డబ్బు యావలో పడిన డాక్టర్లు జబ్బేమిటో తెలుసుకోవడాన్ని విస్మరించారు. ఎమర్జెన్సీ చికిత్స పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి చుక్కల మందుతో మమ అనిపించారు. అయినా తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి తీసుకెళితే స్థానిక ప్రైవేటు ఆసుపత్రి నిర్లక్ష్యం బయటపడింది. పుట్టిన నెలరోజుల్లోపు పసిపాప కంటికి ఉన్న సమస్యను స్థానిక వైద్యులు గుర్తిస్తే కంటిచూపు వచ్చేదని పేర్కొన్నారు. ప్రస్తుతం సమయం దాటిపోవడంతో శిశువు ఒక కన్ను చూపును పూర్తిగా కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆసలే ఆడపిల్ల... అందులోనూ ఒక కన్ను పూర్తిగా చూపుకోల్పోవడంతో నిర్ఘాంతపోయిన తల్లిదండ్రులు రోదిస్తున్నారు. ఇందులో తమ తప్పేమీ లేదని, సమస్యను గుర్తించిన వెంటనే తాము నేత్ర వైద్యురాలి వద్దకు పంపామని సదరు ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు పేర్కొనడం గమనార్హం. పాప తల్లిదండ్రుల ఫిర్యాదు, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్య నిపుణురాలు డాక్టర్ సుభద్ర జలాల్ ఇచ్చిన నివేదిక లో పేర్కొన్న అంశాలు.. చుక్కల మందుతో సరి.. కరీంనగర్ బోయవాడకు చెందిన వి.స్వరూపకు మే 27న ఇద్దరు కవల పిల్లలు (ఆడ, మగ శిశువులు) జన్మించారు. 8వ నెలలోనే ప్రసవం కావడంతో ఆరోగ్య పరీక్షల నిమిత్తం అదేరోజున ఆ శిశువులను నగరంలోని పెటల్స్ నియో కేర్ అనే ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలోని ఎన్ఐసీయూలో పది రోజులపాటు శిశువులను ఉంచి పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆ తరువాత డిశ్చార్జి చేశారు. డిశ్చార్జి అయిన తర్వాత ఆడ శిశువు (అవంతిక) కంటిలోనుంచి నీరు కారడం ప్రారంభించింది. ఇది గమనించిన శిశువు తల్లిదండ్రులు జూన్ 16న మళ్లీ పెటెల్ నియో కేర్ ఆసుపత్రి డాక్టర్ వద్దకు వెళ్లగా చుక్కల మందు (ఐడ్రాప్స్) రాసిచ్చారు. అయినా తగ్గకపోవడం, దీనికితోడు శిశువు కంటిలో తెల్లని చుక్క కనిపించడంతో తల్లిదండ్రులు మళ్లీ జూలై 28న, సెప్టెంబర్ 1న రెండు దఫాలు అదే వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. మళ్లీ కొన్ని మందులు రాసివ్వడంతో శిశువు తల్లిదండ్రులు స్థానిక శ్రీహర్ష కంటి ఆసుపత్రి వైద్యురాలి వద్దకు వెళ్లారు. అక్కడ కంటి పరీక్షలు నిర్వహించిన డాక్టర్ హైదరాబాద్‌కు తీసుకువెళ్లాలని సూచించారు. వెలుగుచూసిన నిర్లక్ష్యం హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లిన తల్లిదండ్రులు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో శిశువును చేర్పించారు. అక్కడ వివిధ పరీక్షలు నిర్వహించిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణురాలు సుభద్ర జలాలి నెలలు నిండకుండా జన్మించిన శిశువుకు 20 నుంచి 30 రోజుల్లోపు అంధత్వ నివారణ పరీక్షలు (ఆర్ఓపీ) నిర్వహిస్తే కంటిచూపు వచ్చేదని పేర్కొన్నారు. స్థానిక ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు ఆ పరీక్షలు చేయకపోవడం, వ్యాధి నిర్దారణ చేయకుండానే చుక్కల మందు ఇవ్వడం వంటి నిర్లక్ష్య చర్యల వల్ల శిశువు కంటిచూపు పోయిందని తెలిపారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని సూచించడంతో నెలలు నిండకుండానే జన్మించిన శిశువుకు నిర్వహించాల్సిన పరీక్షలను వెల్లడిస్తూ మెడికల్ రిపోర్ట్‌ను రూపొందించడంతోపాటు పెటెల్స్ నియో కేర్ వైద్యుడికి లేఖ రాశారు. దీంతో నిర్ఘాంతపోయిన సదరు శిశువు తల్లిదండ్రులు ఆఖరి ప్రయత్నంగా చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తీసుకెళ్లి ‘ఎంత డబ్బు ఖర్చయినా భరిస్తాం. పాప కంటి చూపు తెప్పించండి’ అని ప్రాథేయపడ్డారు. అక్కడి వైద్యులు సైతం అన్ని పరీక్షలు నిర్వహించి పాపకు ఒక కన్ను పూర్తిగా నిర్వీర్యమైపోయిందని, ఆ కంటికి ఇక చూపు వచ్చే అవకాశమే లేదని చెప్పడంతో రోదిస్తూ తిరుగుముఖం పట్టారు. డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి - శిశువు తల్లిదండ్రులు నా బిడ్డ కంటిచూపు కోల్పోవడానికి పెటల్స్ నియో కేర్ హాస్పిటల్ డాక్టర్ కాసం శివకుమార్ కారణం. మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు. డాక్టర్‌పై కేసు నమోదు చేసి హాస్పిటల్ గుర్తింపును రద్దుచేయాలి. నా బిడ్డ వైద్యపరీక్షల కోసం నా అప్పుసప్పు చేసి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేశాం. మాకు న్యాయం చేయాలని కోరుతున్నా. మా తప్పేమీ లేదు - డాక్టర్ కాసం శివకుమార్ స్వరూప దంపతుల కుమార్తెకు కంటి చూపు పోవడంలో మా తప్పేమీ లేదు. ఆ పాప పుట్టినప్పుడు రెండు కేజీల బరువుంది. దీనికితోడు శిశువుకు ఇన్ఫెక్షన్ సోకింది. పది రోజులు చికిత్స చేసి పంపాం. మావద్ద ఉన్నప్పుడు శిశువుకు ఎలాంటి సమస్యా రాలేదు. వాళ్లు ఇంటికి వెళ్లిన కొద్దిరోజుల తరువాత శిశువు కంటికి నీరు రావడంతో మళ్లీ కొన్నిసార్లు నా వద్దకొచ్చారు. నేను సమస్యను గుర్తించిన వెంటనే డాక్టర్ శ్రీలత వద్దకు పంపాను. కాబట్టి ఈ విషయంలో మా నిర్లక్ష్యమేమీ లేదు. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలి - డీవైఎఫ్ఐ ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ అరికట్టడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. అందులో భాగంగా ఈనెల 18న జిల్లా డీఎంహెచ్‌వో ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.కిశోర్, బీమాసాహెబ్, నగర అధ్యక్షుడు జి.తిరుపతి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.