చేపలు బాగా తినడం వల్ల వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే మాలెక్యులార్ డిజనరేషన్ అనే కంటిజబ్బు కారణంగా వచ్చే అంధత్వాన్ని నివారించవచ్చని అంటున్నారు అమెరికన్ సైంటిస్టులు. చేపల్లో పుష్కలంగా ఉండే ఒమెగా– 3 ఫ్యాటీ యాసిడ్స్ ఈ జబ్బును నివారించి, కంటిచూపును పదిలంగా ఉంచుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. చేపల్లో ఒమెగా –3 ఫ్యాటీ యాసిడ్ అనే పోషకం ఎక్కువగా లభ్యమవుతుంది.
అయితే సాల్మన్, సార్డిన్, మ్యాకరెల్స్ చేపల్లో ఇది మరీ ఎక్కువ. లూసియానా స్టేట్ యూనివర్సిటీకి చెందిన అధ్యయనవేత్తల బృందంలోని కీలక సభ్యుడు ప్రొఫెసర్ నికోలాస్ బాజాన్ ఈ పరిశోధన ఫలితాలను వెల్లడించారు. ఈ పరిశోధన వివరాలన్నీ సెల్యులార్ మాలెక్యులార్ న్యూరోబయాలజీ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment