
ఈవినింగ్ వాక్? మార్నింగ్ వాక్ ఏది బెటర్?
ఆధునిక జీవితం కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే శారరీక శ్రమ తగ్గిపోతున్న తరుణంలో అనేక రకాల వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా హాయిగా జీవించాలంటే విధిగా వాకింగ్ చేయాల్సిన అవవసరం చాలా ఉంది. అయితే వాకింగ్ ఉదయం చేస్తే మంచిదా లేక సాయంత్రం చేస్తే మంచిదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అసలు ఏ సమయంలో వాకింగ్ చేస్తే ఎక్కువ ఫలితాలు లభిస్తాయి ఆలోచిస్తూ ఉంటారు. అసలు సమస్యలు ఉన్నవారు, ఆరోగ్యంగా ఉన్నవారు, చిన్నా పెద్దా అన్న భేదమేలేదు. ఎవరైనా, ఎపుడైనా ఎంచక్కా వాకింగ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. దీని వల్ల రాబోయే అనేక ఆరోగ్య సమస్యలు పరారవుతాయి.
ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేందుకు ఉండేందుకు వివిధ రకాల పోషకాలే కాదు శారీరక శ్రమ కూడా అవసరం అనేది ముఖ్యం అని గమనించాలి. మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధుల వంటి దీర్ఘకాలిక పరిస్థితులను నివారించడానికి, అనేక ఆరోగ్య ప్రయోజనాలకు నడక ఒక ముఖ్యమైన వ్యాయామం. ఎపుడు ఎలా చేసినా ఆరోగ్యానికి చాలా మంచిది. వాకింగ్ వల్ల మానసిక ఒత్తిడికి దూరమవుతుంది. రోగ నిరోధక శక్తి పెరగుతుంది. కండరాలకు,కీళ్లకు బలం చేకూరుతుంది. వివిధ రకాల అధ్యయనాల ప్రకారం మార్నింగ్ వాకింగ్ ప్రయోజనాలు, ఈవెనింగ్ వాక్ ప్రయోజనాలు వేర్వేరుగా ఉన్నాయి.
ఉదయం వాకింగ్
ఉదయం వేళ లేత ఎండలో వాకింగ్ లేదా సాయంత్రం చల్లగాలిలోవాకింగ్ రెండూ ప్రత్యేకమే. మార్నింగ్ వాకింగ్ వల్ల శరీరానికి కావల్సిన విటమిన్ డీ లభిస్తుంది. ఇది ఇమ్యూనిటీ పటిష్టం చేసేందుకు, ఎముకల ఆరోగ్యానికి దోహదపడుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ముఖ్యంగా ఒత్తిడి దూరమౌతుంది. రోజంతా ఎనర్జెటిక్‌గా ఉంటారు. ఉదయం పూట స్వచ్ఛమైన గాలి ఆరోగ్యానికి చాలా మంచిది.
సాయంత్రం పూట వాకింగ్
సాయంత్రం వాకింగ్ లాభాలను కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఉదయం నుంచి ఉన్న అలసట, పని ఒత్తిడి దూరం కావాలంటే, చికాకు పోవాలన్నా నడక చక్కని పరిష్కారం. ప్రశాంతమైన నిద్ర పడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
వాకింగ్‌తో ఇన్ని సమస్యలకు చెక్ చెప్పవచ్చు
గాలి నాణ్యత, ఉష్ణోగ్రత ,భద్రత దృష్టిలో పెట్టుకుని ఎవరికి వారు ఉదయమా, సాయంత్రమా అనేది నిర్ణయించుకోవాలి. ఉదయపు చలిగాలులు పడని వారు సాయంత్రం వాకింగ్ చేస్తే మంచిది. కాలుష్యానికి దూరంగా ఉండే ప్రశాంతమైన వాతావరణంలో నడక మంచి ఫలితాలనిస్తుంది. అన్ని వయసుల వారికి అనువైన వ్యాయామం. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా చేస్తే బరువు తగ్గుతుంది. ఎండార్ఫిన్‌లను విడుదల చేయడం ద్వారా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇవే కాకుండా రోజూ మీకునచ్చిన సమయంలో వాకింగ్ వల్ల జుట్టు రాలటం, మొటిమలు, చర్మం నల్లబడటం, ఆటో ఇమ్యూన్ సమస్యలు, మలబద్ధకం,తలనొప్పి, దిగులు, ఆందోళన, డిమెన్షియా, పార్కిన్ సన్స్, మతిమరుపు, ఏకాగ్రత లేమి, చికాకు, కోపం, పీసీఓడీ, బహిష్టు సంబంధిత సమస్యలు ఇలాంటి వాటికెన్నింటికో చెక్ చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment