evening walk
-
లోకేష్ పాదయాత్ర ఈవినింగ్ వాక్ లా ఉంది..!
-
గోవిందపల్లెలో జంట హత్యలు
- మాజీ ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి, అతని బామ్మర్ది శ్రీనివాసరెడ్డి దారుణహత్య శిరువెళ్ల/రుద్రవరం: మండలంలోని గోవిందపల్లె గ్రామం నుంచి మసీదుపురం వెళ్లే అడ్డరోడ్డులో శనివారం రాత్రి జంటహత్యలు కలకలం రేపాయి. ఘటనలో మండల వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎంపీపీ ఇందూరు ప్రభాకర్‌రెడ్డి(52), ఇతని బామ్మర్తి శ్రీనివాసరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి రోడ్డు పక్కనున్న పంట కాల్వలో పడేశారు. వీరిద్దరూ రోజులాగానే శనివారం రాత్రి వాకింగ్‌కు వెళ్లారు. ఇంటికి తిరిగొచ్చే సమయంలో ఈ హత్య జరిగినట్లు ఘటనా స్థలాన్ని బట్టి తెలుస్తోంది. అయితే వాకింగ్‌కు వెళ్లిన ఇద్దరూ చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ముందుగా శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేశారు. రింగ్ అవుతున్నా తీయకపోవడంతో ఆందోళన చెందారు. బంధువులతో కలిసి వెళ్లి చూడగా పంట కాల్వలో విగజీవులుగా కనిపించారు. శ్రీనివాసరెడ్డి మృతదేహంపై వరిగడ్డి కప్పి ఉండగా.. ప్రభాకర్‌రెడ్డి మృతదేహం కాల్వలో బోర్లా పడి ఉండటం గుర్తించారు. సీఐ ప్రభాకర్‌రెడ్డి, డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నేత గంగుల బిజేంద్రారెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఆయన డీఎస్పీతో ప్రత్యేకంగా మాట్లాడారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇదిలాఉండగా సుమారు 30 ఎళ్ల క్రితం ప్రభాకర్‌రెడ్డి తండ్రి నారాయణరెడ్డిని ఆళ్లగడ్డలో భూమా వర్గం హత్య చేయడం గమనార్హం. ఆ తర్వాత గ్రామంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకపోయినా తాజాగా జరిగిన జంట హత్యలు చర్చనీయాంశంగా మారాయి. గంగుల వర్గం ఇటీవల టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. -
ఆ రోజు ఏం జరిగిందంటే...
1 ఒక ప్రసిద్ధ కంపెనీకి రమణ యజమాని. ఆఫీసు నుంచి ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుతాడు రమణ. అందుకే... ఆఫీసు పరిసరాల్లోనే ఈవినింగ్ వాక్ చేయడం అలవాటు చేసుకున్నాడు. ఒకరోజు ఈవినింగ్ వాక్ చేస్తూ హత్యకు గురయ్యాడు. రమణ హత్యకు గురయ్యాడనే వార్త సంచలనం సృష్టించింది. ఉద్యోగుల రోదనలు మిన్ను ముట్టాయి. ‘‘రమణగారికి వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎవరైనా శత్రువులు ఉన్నారా?’’ అడిగాడు ఇన్స్పెక్టర్ నరసింహ. ‘‘వ్యక్తిగతంగా తెలియదుగానీ...వృత్తి పరంగా మాత్రం చాలా కంపెనీలతో పోటీ ఉంది. ఇక్కడికి దగ్గరిలో ఒక పోటీ కంపెనీ ఉంది. దాని యజమాని రవికి మా రమణగారికి ఈమధ్య తీవ్రమైన గొడవ జరిగింది’’ అని చెప్పాడు కంపెనీలో పనిచేస్తున్న సీనియర్ మేనేజర్. పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రవి కుమార్ ఆఫీసుకు చేరుకున్నారు. ‘‘రమణ హత్యలో మీ ప్రమేయం ఉందని అనుమానిస్తున్నాం. హత్య జరగడానికి ముందు రమణ వాకింగ్ చేసే ప్రాంతంలో మీరు కనిపించారని తెలిసింది’’ సూటిగా విషయంలోకి దిగాడు ఇన్స్పెక్టర్ నరసింహ. ‘‘నాకు రమణకు మధ్య గొడవలు జరిగిన విషయం నిజమేగానీ... అతడిని నేను హత్య చేసేంత గొడవలు ఏమీ కావు. హత్యలు చేసే స్వభావం నాకు లేదు. రమణ వాకింగ్ చేసే సమయంలో నేను కనిపించాననే వార్త... నా గురించి గిట్టని వాళ్లు పుట్టించింది. వ్యాపారం అన్నాక...సవాలక్ష మంది శత్రువులు ఉంటారు. అందరినీ చంపుకుంటూ వెళ్లలేము కదా!’’ అన్నాడు రవి. ‘‘అది సరేగానీ... మీరు వేసుకున్న షూస్ చూపండి’’ అడిగాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్కు తన షూ చూపించాడు రవి. ‘‘ఓకే... ఒక్కసారి మీ కారు దగ్గరికి వెళదాం’’ అన్నాడు ఇన్స్పెక్టర్. భయం భయంగానే ఇన్స్పెక్టర్ని కారు దగ్గరికి తీసుకువెళ్లాడు రవి. కారు డోర్ తెరిచి... మ్యాట్‌ను పరిశీలించాడు ఇన్స్పెక్టర్. ఆ తరువాత... ‘‘నిన్ను అరెస్ట్ చేస్తున్నాను’’ అన్నాడు రవితో. ఇప్పుడు చెప్పండి... రవి హంతకుడని ఇన్స్పెక్టర్ ఎలా కనిపెట్టాడు? 2 అరవై రెండు సంవత్సరాల హరిప్రసాద్ చాలా ఆరోగ్యంగా ఉంటాడు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. తన పరిధిలో వీలైనంత సహాయం చేస్తుంటాడు. ఏదైనా మంచి పుస్తకం చదవాలనుకున్నప్పుడు ఇంటికి కాస్త దగ్గరలోని తన ఆఫీసుకు వెళ్లి, పుస్తకం చదువుకొని అక్కడే పడుకోవడం అనేది అతడి అలవాటు. ‘ఇంట్లోనే చదవచ్చు కదా’ అని అంటే– ‘ఆఫీసులో నేను ఒక్కడిని ఉంటాను. ఎలాంటి డిస్ట్రబెన్స్ ఉండదు’ అనేవాడు. అయితే ఇదే అతడి కొంప ముంచింది. ఆరోజు పుస్తకం చదువుకుంటూ ఆఫీసులోనే పడుకొని ఉన్న హరిప్రసాద్ హత్యకు గురయ్యాడు. ఆరాత్రి హత్య జరగడానికి ముందు కొంతసేపు వర్షం పడింది. మట్టి నేల చిత్తడయింది. పోలీసులు ముగ్గురిని అనుమానించారు. 1. రంగయ్య...పాత రౌడీ. చుట్టలు విపరీతంగా కాలుస్తాడు. 2. శ్రీను... ఎప్పుడూ ఎవరితో ఒకరితో తగాద పడుతుంటాడు. గుట్కాలు విపరీతంగా తింటాడు. 3. మోహన్... ఇతడిది కూడా నేరస్వభావం. చెప్పులు వేసుకునే అలవాటు లేదు. ఆఫీసు పరిసరాల్లో... చుట్ట ముక్క ఒకటి కనిపించింది. మరో పక్క రెండు చించిన గుట్కా ప్యాకెట్లు కనిపించాయి. వీటిని బట్టి రంగయ్య, శ్రీనులకు హత్యతో సంబంధం ఉందనే అనుమానాలు వెల్లువెత్తాయి. కానీ ఇది నిజం కాదు. మోహన్ హంతకుడని పోలీసులు కనిపెట్టారు. అంత కరెక్ట్‌గా ఎలా కనిపెట్టారు? ఆన్సర్ 1. రమణ ఈవినింగ్ వాక్ చేసే ప్రదేశంలో..రోడ్డుకు కొత్తగా తారు వేశారు. రోడ్డు తొక్కకుండా తప్పించుకోవడం అక్కడ అసాధ్యం. అలా రవి షూకు తారు అంటింది. హత్య చేసి కారులోకి ఎక్కినప్పుడు మ్యాట్ మీద తారు మరకలు పడ్డాయి. ఆఫీసుకు వచ్చిన రవి షూ మార్చాడుగానీ.. మ్యాట్ విషయం మరచిపోయాడు. 2. ఆఫీసు ముందు చిత్తడి నేల మీద చెప్పులు లేని కాళ్ల అడుగులు మోహన్ ని పట్టించాయి. రంగయ్య, శ్రీనులపై అనుమానం రావడానికి పరిసరాల్లో చుట్ట ముక్క, గుట్కా ప్యాకెట్ వేశాడు మోహన్