
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అంతకంతకూ పెరుగుతున్న వాయు కాలుష్యం కాస్త ఉపశమించింది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ(ఏక్యూఐ) గత ఎనిమిది రోజులుగా ప్రమాదకర స్థాయిలో ఉంది. అయితే ఈరోజు(గురువారం) గాలి నాణ్యత కొద్దిగా మెరుగుపడింది.
నేటి ఉదయం ఢిల్లీ ఎక్యూఐ ప్రమాదకర స్థాయి నుంచి కాస్త తగ్గి, వెరీ పూర్ కేటగిరికి చేరింది. ఈరోజు ఉదయం ఢిల్లీ ఏక్యూఐ 384గా నమోదైంది. మొన్నటి వరకూ ఏక్యూఐ 500 స్థాయిని తాకింది. ఈరోజు ఢిల్లీలో గాలి కాస్త పరిశుభ్రంగా మారినప్పటికీ, పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. మరోవైపు ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల ద్వారా రాజధానిలో ఆన్‌లైన్‌లో పటాకుల అమ్మకాలను నిలిపివేయాలని ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
అక్టోబర్ 14న ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వచ్చే ఏడాది జనవరి ఒకటి వరకు ఢిల్లీలో బాణాసంచా తయారీ, నిల్వ, కాల్చడంపై పూర్తి నిషేధం విధించింది. మరోవైపు ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్)ను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఢిల్లీలో 50 శాతం సామర్థ్యంతో కార్యాలయాలు తెరుచుకోనున్నాయి. 50 శాతం సిబ్బంది ఇంటి నుంచే పని చేయనున్నారు. గ్రాప్ మూడవ, నాల్గవ దశల కింద ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోపి పలు జిల్లాల్లో పాఠశాలలను మూసివేతను తప్పనిసరి చేశారు. అలాగే గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్‌లలోని ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరు సమయాల్లో పనిచేయనున్నాయి.
ఇది కూడా చదవండి: సగం మంది ఇంటి నుంచే పనిచేయండి
Comments
Please login to add a commentAdd a comment