న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో కాలుష్యం కాస్త ఉపశమించింది. దీంతో అక్కడి ప్రజలు కొద్దిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. అయితే కాలుష్య స్థాయి ఇప్పట్లో ఆశించినంతలా తగ్గేలా కనిపించడంలేదు. తెల్లవారుజామున పొగమంచు కారణంగా జనం పలు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.
కొద్ది రోజుల క్రితం 400 దాటిన కాలుష్య సూచీ ఇప్పుడు 300 నుంచి 400 మధ్యలో ఉంటోంది. ఢిల్లీవాసులు కాలుష్యం నుంచి ఉపశమనం పొందేందుకు ఎయిర్ ప్యూరిఫైయర్లు, మాస్క్‌లను వినియోగిస్తున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీబీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం ఏక్యూఐ కొద్ది రోజుల క్రితం వరకూ ప్రమాదకర కేటగిరీలో ఉంది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఢిల్లీవాసులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని నుంచి ఉపశమనం కోసం వర్షాలు పడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వర్షం కారణంగా గాలి నాణ్యత మెరుగుపడుతుంది.
ఇది కూడా చదవండి: World Oldest Man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment