Delhi Pollution Control Committee
-
Delhi Pollution: కమ్మేసిన పొగమంచు.. ప్రమాదస్థాయిలో కాలుష్యం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఈరోజు(బుధవారం) ఉదయం 5 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 339గా నమోదైంది. దీనికితోడు చలి వాతావరణం నెలకొంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో పొగమంచు కారణంగా విజిబులిటీ తగ్గింది.ఢిల్లీ ఎన్సీఆర్లో గాలి నాణ్యత నిరంతరం క్షీణిస్తోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం దేశ రాజధానిలో గాలి నాణ్యత బుధవారం కూడా ‘చాలా పేలవమైన’ కేటగిరీలో ఉంది. గాలి నాణ్యత 301 నుండి 400 మధ్య ఉన్నప్పుడు జనం శ్వాసకోశ వ్యాధులకు లోనవుతారు. ఇదేవిధంగా ఏక్యూఐ 401 నుండి 500 మధ్య ఉన్నప్పుడు తీవ్రమైన కాలుష్యం కమ్మేసినట్లు పరిగణిస్తారు. ఇది ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే పలు వ్యాధులతో బాధపడుతున్న వారు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో మంగళవారం ఉదయం 7:30 గంటలకు సగటు గాలి నాణ్యత సూచిక 355గా నమోదైంది. ఇది చాలా పేలవమైన కేటగిరీలోకి వస్తుంది. సోమవారం ఢిల్లీలో సగటు వాయు నాణ్యత సూచీ 347గా నమోదైంది. ఇదిలావుండగా ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఢిల్లీ సెక్రటేరియట్లో నైట్ షిఫ్ట్ ఉద్యోగులకు హీటర్లను పంపిణీ చేశారు. చలి మంటలను వేస్తే కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఢిల్లీ ప్రభుత్వం హీటర్లను పంపిణీ చేసిదని తెలిపారు. ఇది కూడా చదవండి: రాష్ట్రంలో రిలయన్స్ ఎనర్జీ బయోగ్యాస్ ప్లాంట్లు -
ఢిల్లీలో శబ్దాలు చేస్తే రూ. లక్ష జరిమానా
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఇకపై ఎవరైనా శబ్ద కాలుష్యానికి పాల్పడితే రూ.10 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా విధిస్తారు. ముందుగా అనుమతి లేకుండా పెళ్లిళ్లు, పండుగల్లో బాణాసంచా పేల్చినా, లౌడ్ స్పీకర్లు, డీజిల్ జనరేటర్ (డీజీ) సెట్స్ వాడితే విధించే జరిమానాలను సవరించినట్టుగా ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (డీపీసీసీ) వెల్లడించింది. ఈ కొత్త నిబంధనల్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారుల్ని ఆదేశిస్తూ శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) సవరించిన జరిమానాల ప్రకారం నివాస ప్రాంతాల్లో పగటి వేళల్లో 55 డెసిబల్, రాత్రి వేళల్లో 45 డెసిబల్ శబ్దాలకు మాత్రమే అనుమతి ఉంది. పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, కోర్టుల చుట్టూ 100 మీటర్ల పరిధి వరకు సైలెంట్ జోన్లగా ప్రకటించారు. పెళ్లిళ్లు, పండుగల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా కాల్చి శబ్ద కాలుష్యానికి పాల్పడితే మొదటిసారి రూ. 20 వేలు జరిమానా విధిస్తారు. రెండో సారి చేస్తే రూ. 40 వేలు, అంతకంటే ఎక్కువగా నిబంధనల్ని ఉల్లంఘిస్తే లక్ష రూపాయల జరిమానా విధిస్తారని డీపీసీసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు వాడితే రూ.10 వేలు జరిమానా విధిస్తారు. ఆ పరికరాలన్నింటినీ స్వాధీనం చేసుకుంటారు. 1,000 కేవీఏకి మించి డీజీ సెట్స్ వినియోగిస్తే రూ.లక్ష, 62.5 నుంచి 1,000 కేవీ మధ్య డీజీ సెట్స్ వాడితే రూ. 25 వేలు, 62.5 కేవీఏ వరకు డీజీ సెట్స్‌పై రూ.10 వేలు జరిమానా విధించాలని నిబంధనల్ని సవరించారు. -
కాలుష్యకారక పరిశ్రమల్ని అనుమతించకండి
డీపీసీసీని ఆదేశించిన జాతీయ హరిత ధర్మాసనం న్యూఢిల్లీ: యుమునా నదిలోకి కాలుష్యాలను వదిలే పరిశ్రమలను ఆ పరిసర ప్రాంతాల్లో అనుమతించొద్దని జాతీయ హరిత ధర్మాసనం (ఎన్జీటీ)... ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీని ఆదేశించింది. ఆల్ ఇండియా లోక్ అధికార్ సంఘటన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పరిశీలించిన ధర్మాసనం శుక్రవారం పైవిధంగా స్పందించింది. గంగానదిలోకి కాలుష్యకారకాలను వదులుతున్న చక్కెర మిల్లుపై కొరడా ఝళిపించిన మరుసటి రోజే ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. నదిలోకి నేరుగాగానీ లేదా పరోక్షంగాగానీ కాలుష్యానికి దారితీసే ఎటువంటి పరిశ్రమలను అనుమతించొద్దని జస్టిస్ పి.జ్యోతిమణి నేతృత్వంలోని ధర్మాసనం.... డీపీసీసీని ఆదేశించింది. ‘కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించే సమయంలో కాలుష్య కారక పరిశ్రమలకు అనుమతించకూడదని మేము స్పష్టం చేస్తున్నాం. కొత్త దరఖాస్తుల పరిశీలన ప్రక్రి యను వీలైనంత త్వరగా పూర్తిచేయాలి’ అని ధర్మాసనం పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టయితు సదరు సంస్థ యజమానిని గుర్తించి అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీచేసే బాధ్యత డీపీసీసీదేనంది. గతంలోనూ ఆదేశాలు పరిశ్రమలను త నిఖీచేసిఅవి కాలుష్యాలను వదులుతున్నాయా లేదా అనే విషయాన్ని గుర్తించాలంటూ జాతీయ హరిత ధర్మాసనం గతంలోనూ డీపీసీసీని ఆదేశించింది. నిబంధనలను పాటించని పరిశ్రమలపై న్యా యపరమైన చర్యలు తీసుకోవాలని కూడా సెప్టెంబర్ 10న ఎన్జీటీ.... డీపీసీసీని ఆదేశించిన సంగతి విదితమే. ఇందుకు స్పందించిన డీపీసీసీ...వజీర్పూర్ ప్రాంతంలోని అనేక పరిశ్రమలను తనిఖీ చేసింది. ఈ పరిశ్రమలన్నీ యుమనా నదిలోకి నేరుగా కాలుష్యకారకాలను వదులుతున్నట్టు గుర్తించింది. దీంతో ఆయా పరిశ్రమలకు మూసివేత నోటీసులను జారీచేసింది.