ఢిల్లీలో కొనసాగుతున్న తీవ్రస్థాయి వాయు కాలుష్యం
పాఠశాలలు బంద్
ఐదో తరగతి దాకా ఆన్ లైన్ క్లాసులే
432 పాయింట్లు దాటిన వాయు కాలుష్యము
గ్రాఫ్ 3 అమలు చేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
నిర్మాణ పనులు, కూల్చివేతలు కూల్చివేతలు నిలిపివేయాలని ఆదేశం
బిఎస్3 వెహికల్స్ ., డీజిల్ వాహనాలు ఢిల్లీలోకి ఎంట్రీపై నిషేధం
రోడ్లపై నీళ్లు చల్లే వాహనాల సంఖ్య పెంపు
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత క్షీణ స్థాయికి చేరింది. ఢిల్లీ ఏక్యూఐ స్థాయి గురువారం 400 దాటింది. ఈ స్థాయి కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ గ్రాప్- 3ని నవంబర్ 15 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.
గ్రాప్- 3 నిబంధనల ప్రకారం కాలుష్యం అదుపులోకి వచ్చే వరకు నిర్మాణ సంబంధిత పనులను నిలిపివేయనున్నారు. భవనాల కూల్చివేతలు, మైనింగ్‌కు సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలు నిలిపివేయనున్నారు. ప్రాథమిక పాఠశాలలకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గత రెండు రోజులుగా ఢిల్లీలో కాలుష్య స్థాయి అత్యంత పేలవమైన స్థాయి నుంచి తీవ్ర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ వార్ రూమ్‌లో పర్యావరణ శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించింది. అనంతరం పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్.. కాలుష్య నివారణకు చేపడుతున్న మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.
రాజధాని ఢిల్లీ గాలి పీల్చడం ఇప్పుడు ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారింది. పంజాబ్-హర్యానాలలో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల వచ్చే పొగ కారణంగా, రాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్‌గా మారింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తాజా డేటా ప్రకారం ఢిల్లీలో సగటు గాలి నాణ్యత సూచిక అంటే ఏక్యూఐ 452కి చేరింది. సైన్స్ మ్యాగజైన్ లాన్సెట్ న్యూరాలజీ జర్నల్‌లో ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యం కారణంగా సబ్‌రాక్నోయిడ్ హెమరేజ్(బ్రెయిన్ స్ట్రోక్-ఎస్‌ఏహెచ్) కేసులు పెరుగుతున్నాయి. తీవ్రమైన వాయు కాలుష్యంఅంగ వైకల్యానికి, అనేక సందర్భాల్లో గుండె వైఫల్యానికి కారణంగా నిలుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment