న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఈరోజు(బుధవారం) ఉదయం 5 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 339గా నమోదైంది. దీనికితోడు చలి వాతావరణం నెలకొంది. ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో పొగమంచు కారణంగా విజిబులిటీ తగ్గింది.
ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో గాలి నాణ్యత నిరంతరం క్షీణిస్తోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం దేశ రాజధానిలో గాలి నాణ్యత బుధవారం కూడా ‘చాలా పేలవమైన’ కేటగిరీలో ఉంది. గాలి నాణ్యత 301 నుండి 400 మధ్య ఉన్నప్పుడు జనం శ్వాసకోశ వ్యాధులకు లోనవుతారు. ఇదేవిధంగా ఏక్యూఐ 401 నుండి 500 మధ్య ఉన్నప్పుడు తీవ్రమైన కాలుష్యం కమ్మేసినట్లు పరిగణిస్తారు. ఇది ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే పలు వ్యాధులతో బాధపడుతున్న వారు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో మంగళవారం ఉదయం 7:30 గంటలకు సగటు గాలి నాణ్యత సూచిక 355గా నమోదైంది. ఇది చాలా పేలవమైన కేటగిరీలోకి వస్తుంది. సోమవారం ఢిల్లీలో సగటు వాయు నాణ్యత సూచీ 347గా నమోదైంది. ఇదిలావుండగా ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఢిల్లీ సెక్రటేరియట్‌లో నైట్ షిఫ్ట్ ఉద్యోగులకు హీటర్లను పంపిణీ చేశారు. చలి మంటలను వేస్తే కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఢిల్లీ ప్రభుత్వం హీటర్లను పంపిణీ చేసిదని తెలిపారు.
ఇది కూడా చదవండి: రాష్ట్రంలో రిలయన్స్ ఎనర్జీ బయోగ్యాస్ ప్లాంట్లు
Comments
Please login to add a commentAdd a comment