ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా ఉత్తర భారతదేశమంతా గత రెండు రోజులుగా తెల్లటి పొగమంచు కింద తలదాచుకుంటోంది. ఈరోజు (శుక్రవారం) మూడో రోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పెరిగిన చలికి తోడు పొగమంచు కారణంగా పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది.
పొగమంచు దట్టంగా అలముకోవడంతో రవాణా సమస్య తీవ్రమయ్యింది. ఉత్తర భారతదేశంలోని పలు నగరాల్లో పొగమంచు కారణంగా ఉదయం 9 గంటలకు వరకూ కూడా విజిబులిటీ సరిగ్గా లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. రైళ్లు, విమానాలపై కూడా పొగమంచు ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ రోజు కూడా అమృత్‌సర్, చండీగఢ్, ఢిల్లీల నుండి పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రన్‌వేపై చాలా తక్కువ విజిబులిటీ కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడుతోంది. పొగమంచు కారణంగా లక్నో, చండీగఢ్‌లకు వచ్చే విమానాలను జైపూర్‌కు మళ్లించారు.
ఇక రైళ్ల విషయానికొస్తే ఢిల్లీలోని వివిధ స్టేషన్లలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీకి వచ్చే 30కి పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని 50కి పైగా రైళ్లపై పొగమంచు ప్రభావం కనిపిస్తోంది. న్యూఢిల్లీకి వచ్చే 30కి పైగా రైళ్లు, ఆనంద్ విహార్‌కు వచ్చే 10 రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎన్‌సీఆర్‌లోని 50కి పైగా రైళ్లపై పొగమంచు ప్రభావం కనిపిస్తోంది. ఈ రైళ్లన్నీ చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Delhi Pollution: గ్యాస్ ఛాంబర్ కన్నా ఘోరం.. బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు!
Comments
Please login to add a commentAdd a comment