ఢిల్లీకి వస్తే గ్యాస్‌ ఛాంబర్‌లో కాలు పెట్టినట్లే: ప్రియాంకా గాంధీ | Priyanka Gandhi Said Entering Delhi was like Entering a Gas Chamber | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి వస్తే గ్యాస్‌ ఛాంబర్‌లో కాలు పెట్టినట్లే: ప్రియాంకా గాంధీ

Published Thu, Nov 14 2024 1:44 PM | Last Updated on Thu, Nov 14 2024 2:51 PM

Priyanka Gandhi Said Entering Delhi was like Entering a Gas Chamber

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలో  ఏర్పడిన వాయు కాలుష్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళలోని వయనాడ్‌లో లోక్‌సభ ఉపఎన్నికల్లో ఓటు వేసిన  అనంతరం ఆమె ఢిల్లీకి తిరిగి వచ్చారు. తాను రాజధానికి తిరిగి రావడం ‘గ్యాస్ ఛాంబర్‌’లో ప్రవేశించినట్లుగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

ఢిల్లీలో కాలుష్యం ఏటా పెరిగిపోతోందని, స్వచ్ఛమైన గాలి కోసం అందరూ కలసికట్టుగా పనిచేయాలని ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు.  ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఒక పోస్ట్‌లో.. వయనాడ్ నుండి ఢిల్లీకి తిరిగి రావడం గ్యాస్ చాంబర్‌లోకి ప్రవేశించినట్లుగా అనిపిస్తున్నదని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలంతా స్వచ్ఛమైన గాలి కోసం ఉద్యమించాలన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు వాయు కాలుష్యం కారణంగా పలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
 

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కేరళలోని వయనాడ్ నుంచి తన ఎన్నికల ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ప్రియాంక సోదరుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వయనాడ్‌ నుంచి వైదొలగడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది.  ఆ మధ్య జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, వయనాడ్‌ స్థానాల నుంచి గెలుపొందిన రాహుల్‌ ఆ తర్వాత వయనాడ్‌ లోక్‌సభకు దూరమయ్యారు.

ఇది కూడా చదవండి: ‘ఆమె రీల్స్‌ చేస్తే.. ప్రజలేందుకు బాధ్యత తీసుకోవాలి’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement