ఎంతో కష్టపడి, ఎంతో రుచిగా ఇంట్లోనే వండిపెట్టినా, రెస్టారెంట్‌లో చేసినట్టుగా రాలేదు, క్రంచీగా లేవు, క్రిస్పీగా రాలేదు అంటూ రక రకాలవంకలు పెడుతూ ఉంటారు పిల్లలు. దీనికి అవును...అంటూ వారికి వంత పాడతారు శ్రీవారు.. కదా.. అందుకే అదిరిపోయే కిచెన్ టిప్స్ మీకోసం..!
పొటాటోతో ఇంట్లో ఫ్రెంచ్ ఫ్రై చేసినప్పుడు రెస్టారెంట్‌లో ఉన్నట్లు కరకరలాడవు. రెస్టారెంట్ రుచి రావాలంటే పొటాటో స్టిక్స్‌ని నూనెలో ఒక మోస్తరుగా వేయించి తీయాలి. వేడి తగ్గిన తరవాత వాటిని పాలిథిన్ కవర్‌లో పెట్టి రబ్బర్ బ్యాండ్‌తో బిగుతుగా కట్టి ఫ్రీజర్‌లో పెట్టాలి. నాలుగైదు గంటల తర్వాత తీసి మరోసారి వేయించి వేడిగా ఉండగానే వడ్డించాలి.
కొత్త బియ్యాన్ని వండినప్పుడు అన్నం ముద్దగా అవుతుంది. అన్నం ఉడికేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం పిండితే ముద్ద కాకుండా అన్నం మెతుకులు విడివిడిగా ఉంటాయి. తినడానికి బావుంటుంది.
ఈ సీజన్‌లో లభించే చిలగడ దుంపలను ఉడికించి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, కాస్తంత ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి చల్లి ఇస్తే ఇష్టంగా తింటారు పిల్లలు.
పప్పుతో పాటు, ఇంట్లోనే చేసిన సగ్గుబియ్యం వడియాలు, మినప వడియాలు నంజుకు పెడితే మారాం చేయకుండా పప్పు నెయ్యి అన్నంతో పాటు తినేస్తారు. ఆరోగ్యానికి ఆరోగ్యంకూడా
పరాఠాలకు పిండి కలిపేటప్పుడు అందులో స్వీట్ కార్న్ (చిదిమి కలపాలి), ఉడికించిన పాలకూర, తురిమిన క్యాబేజ్, తురిమిన ముల్లంగి, మెంతి ఆకు కలిపితే పిల్లలు ఇష్టపడతారు. ఇది హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.
చపాతీలు మృదువుగా రావాలంటే పిండి కలిపిన తర్వాత తడి బట్టను కప్పి అరగంట సేపు నాననిస్తే మంచిది.
కూరల్లో ఉప్పు ఎక్కువైతే వెంటనే బంగాళాదుంపను తొక్క తీసి, చిన్న ముక్కలు చేసి కూరలో కలపాలి. అదనంగా ఉన్న ఉప్పు బంగాళదుంప పీల్చుకుంటుంది.
ఇదీ చదవండి: దోస ప్రింటింగ్ మెషీన్ : వైరల్ వీడియో
Comments
Please login to add a commentAdd a comment