french fries
-
ఇంట్లోనే క్రిస్పీగా, టేస్టీగా ఫ్రెంచ్ ఫ్రైస్ : అదిరిపోయే కిచెన్ టిప్స్!
ఎంతో కష్టపడి, ఎంతో రుచిగా ఇంట్లోనే వండిపెట్టినా, రెస్టారెంట్లో చేసినట్టుగా రాలేదు, క్రంచీగా లేవు, క్రిస్పీగా రాలేదు అంటూ రక రకాలవంకలు పెడుతూ ఉంటారు పిల్లలు. దీనికి అవును...అంటూ వారికి వంత పాడతారు శ్రీవారు.. కదా.. అందుకే అదిరిపోయే కిచెన్ టిప్స్ మీకోసం..!పొటాటోతో ఇంట్లో ఫ్రెంచ్ ఫ్రై చేసినప్పుడు రెస్టారెంట్లో ఉన్నట్లు కరకరలాడవు. రెస్టారెంట్ రుచి రావాలంటే పొటాటో స్టిక్స్‌ని నూనెలో ఒక మోస్తరుగా వేయించి తీయాలి. వేడి తగ్గిన తరవాత వాటిని పాలిథిన్ కవర్లో పెట్టి రబ్బర్ బ్యాండ్‌తో బిగుతుగా కట్టి ఫ్రీజర్‌లో పెట్టాలి. నాలుగైదు గంటల తర్వాత తీసి మరోసారి వేయించి వేడిగా ఉండగానే వడ్డించాలి. కొత్త బియ్యాన్ని వండినప్పుడు అన్నం ముద్దగా అవుతుంది. అన్నం ఉడికేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం పిండితే ముద్ద కాకుండా అన్నం మెతుకులు విడివిడిగా ఉంటాయి. తినడానికి బావుంటుంది.ఈ సీజన్లో లభించే చిలగడ దుంపలను ఉడికించి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, కాస్తంత ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి చల్లి ఇస్తే ఇష్టంగా తింటారు పిల్లలు.పప్పుతో పాటు, ఇంట్లోనే చేసిన సగ్గుబియ్యం వడియాలు, మినప వడియాలు నంజుకు పెడితే మారాం చేయకుండా పప్పు నెయ్యి అన్నంతో పాటు తినేస్తారు. ఆరోగ్యానికి ఆరోగ్యంకూడా పరాఠాలకు పిండి కలిపేటప్పుడు అందులో స్వీట్ కార్న్ (చిదిమి కలపాలి), ఉడికించిన పాలకూర, తురిమిన క్యాబేజ్, తురిమిన ముల్లంగి, మెంతి ఆకు కలిపితే పిల్లలు ఇష్టపడతారు. ఇది హెల్దీ బ్రేక్‌ఫాస్ట్. చపాతీలు మృదువుగా రావాలంటే పిండి కలిపిన తర్వాత తడి బట్టను కప్పి అరగంట సేపు నాననిస్తే మంచిది.కూరల్లో ఉప్పు ఎక్కువైతే వెంటనే బంగాళాదుంపను తొక్క తీసి, చిన్న ముక్కలు చేసి కూరలో కలపాలి. అదనంగా ఉన్న ఉప్పు బంగాళదుంప పీల్చుకుంటుంది. ఇదీ చదవండి: దోస ప్రింటింగ్ మెషీన్ : వైరల్ వీడియో -
ఫ్రెంచ్ ఫ్రైస్.. ఆ పేరు ఎలా వచ్చిందంటే..
ఆలూ అనేది ఎంతటి గొప్ప దుంపకూర అంటే దీనిని ఏ వంటకంలోనైనా వినియోగించవచ్చు. అలాగే దీనితో ప్రత్యేకమైన వంటకాలు కూడా చేయవచ్చు. పైగా దీనిని ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. అయితే ఆలూ అనగానే ముందుగా చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ గుర్తుకువస్తాయి. పిల్లలు మొదలుకొని పెద్దల వరకూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. పైగా వీటిని తయారు చేయడం కూడా ఎంతో సులభం. అయితే ఆలూతో చేసే ఈ వంటకాన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఎందుకు అంటారో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెంచ్ ఫ్రైస్ అనే పేరు వినగానే మనకు ఫ్రాన్స్ గుర్తుకువస్తుంది. అయితే దీనికి ఫ్రాన్స్‌తో ఎటువంటి సంబంధం లేదని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఫ్రెంచ్ ఫ్రైస్ మొదట అమెరికాలో పుట్టింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం 17వ శతాబ్ధపు చివరిలో వేయించిన ఆలూని స్పెయిన్‌కు చెందిన కొందరు నిపుణులు దక్షిణ అమెరికా తీసుకువచ్చారట. తరువాత అది యూరప్ చేరిందట. దీని తరువాత ఆలూ ఫ్రాన్స్‌లో ఫేమస్ అయ్యిందట. వీటిని తొలుత ‘పోమ్ దె తెరె ఫ్రిట్’ లేదా ‘ఫ్రయిడ్ పొటాటో’ అని అనేవాట. మొదటి ప్రపంచ యుద్ధంలో బెల్జియం సేన అధికారిక భాష ఫ్రాన్సీన్సీ. ఆ సమయంలో అమెరికా సైనికులు వాటిని ఫ్రెంచ్ ఫ్రైస్ అని పిలిచేవారట. ఈ పదం అమెరికాలో ఎంతో ఫేమస్ అయ్యింది. అదే పేరు ఈ వంటకానికి స్థిరపడిపోయింది. ఫ్రాన్స్‌లోని పలు ప్రాంతాల్లో వీటిని పోమ్ ఫ్రిట్ లేదా ఫ్రిట్ అని పిలుస్తుంటారు. కెనడాలో ఫ్రెంచ్ ఫ్రెస్ను మసాలా గ్రేవీ, వెన్నతో కూడిన పెరుగులో వేసుకుని ఇష్టంగా తింటారట. -
CWG 2022: ఫ్రెంచ్ ఫ్రైస్ ధర తెలిస్తే షాకవ్వడం ఖాయం!
మాములుగా మనం తినే ఫ్రెంచ్ ఫ్రైస్ ధర రూ.100కు మించి ఉండదు. కానీ బర్మింగ్హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌కు వెళితే.. అక్కడ మీరు కొనుక్కునే ప్లేట్ ఫ్రెంచ్ ఫ్రైస్, సాసేజ్ బాక్స్ ధర ఎంత తెలుసా అక్షరాల వెయ్యి రూపాయలు. సాధారణంగా ఎక్కడైనా ఒక కార్యక్రమం జరుగుతుంటే అక్కడ పెట్టే షాపుల్లో బయటికన్నా ధరలు రెట్టింపు ఉండడం సహజం. కానీ కామన్వెల్త్ గేమ్స్‌కు వస్తున్న అభిమానులు ఏమైనా తినాలంటే పర్సు ఖాళీ చేయాల్సిందే. అంతలా మండిపోతున్నాయి అక్కడి రేట్లు. కామన్వెల్త్లో ఆయా దేశాలు ఆటగాళ్లు పతకాల పంట పండిస్తుంటే.. అక్కడి వ్యాపారులు మాత్రం కామన్వెల్త్ చూసేందుకు వస్తున్న అభిమానుల జేబులకు చిల్లు పెడుతూ తమ పంట పండించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక సాసేజ్ ఉన్న బాక్సును ఏకంగా 9.80 యూరోలకు అమ్మేస్తున్నారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.వెయ్యి రూపాయలు. అంటే ప్రేక్షకులు ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక సాసేజ్ తీసుకుంటూ వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఇందులో భాగంగానే ఒక అభిమాని ట్విటర్ వేదికగా తన గోడును వెల్లబోసుకున్నాడు. ''కామన్వెల్త్ గేమ్స్ చూడడానికి ఎంతో దూరం నుంచి వచ్చాం. ఏమైనా తినాలని కొనడానికి వెళ్తే పర్సు ఖాళీ అవుతుంది. పోనీ అంత భారీ రేటుతో కొన్నా ఫ్రైంచ్ ఫ్రైస్ పచ్చిగానే ఉంటుంది.. వాటిని ఫ్రై చేయడానికి ఇంకా డబ్బులు తగలేస్తున్నామంటూ?'' ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ పతకాల జోరు కొనసాగిస్తుంది. నాలుగు రోజుల్లో భారత్ ఖాతాల్లో 9 పతకాలు జమవ్వగా.. అందులో మూడు స్వర్ణం, మూడు రజతం.. మరో మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. Hello @FootyScran, this is the sausage and chips I had at the Sandwell Leisure Centre ahead of tonight's swimming events at @birminghamcg22. This cost £9.80! 🙂 pic.twitter.com/cZAaRg25Cl — Matthew (The Pieman) Williams (@Matthew23732409) July 29, 2022 చదవండి: CWG 2022: కామన్వెల్త్లో అపశ్రుతి.. తీవ్రంగా గాయపడ్డ భారత మహిళా సైక్లిస్ట్ Common Wealth Games 2022: స్వర్ణంపై భారత్ గురి.. అసలు లాన్ బౌల్స్ అంటే ఏమిటి? -
ఆలూ తింటే వెయిట్ పెరుగుతామా?
-
ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలంటే రూ.1.5 లక్షలు ఖర్చు చేయాల్సిందే
న్యూయార్క్: ఫ్రెంచ్ ఫ్రైస్.. చాలా మంది వీటిని తినే ఉంటారు.. ఈ చిత్రంలోని ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం సంగతి పక్కనపెడితే.. కొనడం చాలా కష్టమే.. ఎందుకంటే.. ప్లేట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ధర అచ్చంగా రూ.1.5 లక్షలు.. ఇందులో వాడిన పదార్థాలన్నీ ప్రపంచంలోనే అత్యుత్తమమైనవట. అంతేకాదు.. 23 క్యారట్ల బంగారం పొడి(తినదగినది)ని కూడా వేశారు. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్‌గా ఇది గిన్నిస్ రికార్డు సాధించింది. అయితే.. ఇందుకోసం గిన్నిస్ వాళ్లు షరతు పెట్టారట. ఊరికే తయారుచేసేస్తే సరిపోదు.. అందరికీ అందుబాటులో ఉండాలి.. సాధారణ వినియోగదారులు ఎవరైనా కొని తినాలి అని.. ఈ మధ్యే ఆ తంతు కూడా పూర్తయిందట. మీరు కూడా రేటు ఎక్కువైనా టేస్ట్చేస్తాం అంటారా.. అయితే.. న్యూయార్క్‌లోని సెరెన్డిప్టీ రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే. -
ఇక ఓయో.. కాఫీ!
న్యూఢిల్లీ: చౌకగా హోటల్ గదులను అందుబాటులోకి తెచ్చిన ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ తాజాగా కొత్త విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. ప్రీమియం కాఫీ చెయిన్, రెస్టారెంట్లు ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంది. ది ఫ్రెంచ్ ప్రెస్ పేరుతో 50 పైగా ప్రీమియం కాఫీ షాప్‌లను ఏర్పాటు చేసేందుకు ఓయో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే నాలుగు క్లౌడ్ కిచెన్స్ చేతిలో ఉన్నందున .. వాటి ఊతంతో రెస్టారెంట్ చెయిన్ కూడా ప్రారంభించాలని ఓయో భావిస్తున్నట్లు తెలుస్తోంది. హోటల్ రూమ్స్‌ను చౌకగా అందుబాటులోకి తెచ్చిన కారణంగా ఓయోపై ’చౌక’ బ్రాండ్ అనే ముద్ర పడిపోయిన సంగతి తెలిసిందే. కానీ ప్రీమియం కాఫీ చెయిన్‌పై ఈ ముద్ర పడకుండా చూసుకోవాలని ఓయో భావిస్తోంది. అందుకే తన బ్రాండ్ పేరు ఎక్కడా కనిపించకుండా ది ఫ్రెంచ్ ప్రెస్ బ్రాండ్ కింద ఈ కాఫీ చెయిన్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. ‘ప్రీమియం కాఫీ చెయిన్ విభాగంలో ఎక్కువ సంస్థలు లేకపోవడంతో స్టార్‌బక్స్ వంటి దిగ్గజంతో పోటీపడొచ్చని, ఇందుకు కావల్సిన పూర్తి సామర్థ్యాలు తమకున్నాయని ఓయో భావిస్తోంది. అయితే, ఓయో అంటే చౌకైన, అందుబాటు ధర బ్రాండ్ అనే ముద్ర ఉన్న సంగతి కూడా దానికి తెలుసు. అందుకే కాస్త ఖరీదైన ఈ టార్గెట్ మార్కెట్ కోసం ఓయో బ్రాండింగ్ వాడకూడదని నిర్ణయించుకుంది‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ట్రయల్ రన్.. ఓయో ఇప్పటికే ఓయో టౌన్హౌసెస్ హోటళ్లలో ది ఫ్రెంచ్ ప్రెస్ ఔట్‌లెట్స్‌ను కొన్నింటిని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. పెద్ద మాల్స్, కాస్త ఖరీదైన ఏరియాల్లో మరికొన్నింటిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అలాగే భారీ ఆఫీస్ కాంప్లెక్స్‌ల్లోని ఓయో కో–వర్కింగ్ స్పేస్‌లలోనూ వీటిని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు, ఈ వార్తలను ధృవీకరించేందుకు ఓయో నిరాకరించింది. ఫుడ్ అండ్ బేవరేజెస్ వ్యాపారంలో కూడా తమ కార్యకలాపాలు ఉన్నాయని, ఫుల్ సర్వీస్ హోటల్స్‌లో నిర్వహించే కిచెన్స్ ద్వారా తమ ఆదాయంలో 25 శాతం వాటా వస్తోందని పేర్కొంది. ప్రస్తుతానికి మాత్రం మిగతా కార్యకలాపాల విస్తరణపై స్పందించబోమని వివరించింది. ప్రీమియం రెస్టారెంట్లపై దృష్టి.. ఓయో ఇప్పటికే అద్రక్, ఓ బిరియానీ, పరాఠా పండిట్, మాస్టర్ ఆఫ్ మోమోస్ పేరుతో నాలుగు క్లౌడ్ కిచెన్ బ్రాండ్స్ నిర్వహిస్తోంది. ది ఫ్రెంచ్ ప్రెస్ కాఫీ చెయిన్‌ను విస్తరించిన తర్వాత ప్రీమియం రెస్టారెంట్లు కూడా ఏర్పాటు చేయాలని ఓయో ప్రణాళికలు రూపొందిస్తోంది. తమ సొంత హోటళ్లు, కో–వర్కింగ్ ప్రాపర్టీలు, స్టాండెలోన్ రెస్టారెంట్లలోనూ వీటిని ప్రారంభించాలని భావిస్తోంది. ఈ రెస్టారెంట్ల కోసం క్లౌడ్ కిచెన్స్ సేవలను ఉపయోగించుకోవాలని ఓయో యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
మెక్‌డోనాల్డ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్లో బల్లి!
ఆకలి వేస్తోందంటే ఇంట్లో రెండు దోశలు వేసుకుని తినడం పాత మాట. సరదాగా అలా బయటకు వెల్లి మెక్‌డోనాల్డ్స్‌లో బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం నేటి బాట. అయితే ఇలాగే ఆశగా ఫ్రెంచ్ ఫ్రైస్ తిందామని వెళ్లిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. కోల్‌కతాలోని ఈఎం బైపాస్ ఏరియాలో గల మెక్‌డోనాల్డ్స్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్‌తో పాటు చచ్చిన బల్లి ఒకటి వాళ్ల ప్లేట్లో దర్శనమిచ్చింది. ప్రియాంకా మొయిత్రా అనే మహిళ తన కుటుంబంతో కలిసి వెళ్లినప్పుడు.. ఆమె కూతురికి ఈ బల్లి కనిపించింది. తన నాలుగేళ్ల కూతురి పుట్టినరోజని తామంతా కలిసి రెస్టారెంటుకు వెళ్లామని, తీరా అక్కడ బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసి తింటుండగా బల్లి కనపడటంతో తనకు వెంటనే వాంతులు వచ్చాయని ఆమె చెప్పారు. వెంటనే ఆ విషయాన్ని మేనేజర్‌కు చెప్పగా ఆయన తమకు క్షమాపణలు చెప్పి, వాటిని తీసేసి కొత్తగా మళ్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తామని చెప్పారని ప్రియాంక అన్నారు. అయితే ప్రస్తుతం గర్భవతి అయిన ప్రియాంకకు కాసేపటి తర్వాత కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడంతో తన కూతురితో పాటు గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందారు. వెంటనే ముందుగా ప్లేటులో ఉన్న ఫ్రెంచ్ ఫ్రైస్‌తో పాటు చచ్చిన బల్లి ఫొటోను తీసుకున్నారు. ఆ ఫొటోతో కలిపి ఫూల్ బగన్ పోలీసు స్టేషన్లో మెక్డోనాల్డ్స్పై ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యమని, ఇలాంటి విషాహారం తినడం వల్ల ప్రాణాలకే ప్రమాదం అన్న విషయం ప్రజలకు తెలియాలని ప్రియాంక అన్నారు. -
ఆలూ తింటే.. మధుమేహం ముప్పు
పిల్లలకి పొద్దున్నే భోజనంలోకి ఏం పెట్టాలి.. బంగాళాదుంప ఫ్రై. సాయంత్రం సరదాగా బయటకు వెళ్తే ఏం తినాలి.. ఫ్రెంచి ఫ్రైస్. ఇవి దాదాపు అన్ని కుటుంబాల్లోనూ కామన్‌గా కనిపిస్తాయి. కానీ, అలా తిన్నారంటే టైప్ 2 మధుమేహం వచ్చే ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారానికి ఏడుసార్లు లేదా అంతకంటే ఎక్కువగా బంగాళాదుంపలు తింటే మధుమేహం వచ్చే ప్రమాదం 33 శాతం ఎక్కువగా ఉంటుందట. రెండు నుంచి నాలుగుసార్లు తిన్నా కూడా 7శాతం పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఉడకబెట్టిన బంగాళాదుంపల కంటే, ఫ్రెంచి ఫ్రైస్ మరింత దారుణమని అంటున్నారు. ఉత్త బంగాళాదుంపలు గానీ, ఫ్రెంచి ఫ్రైస్ గానీ తినేకంటే.. అన్నంలోగానీ, క్వినోవా, గోధుమల లాంటివాటితో కలిపి తింటే టైప్2 మధుమేహం వచ్చే ప్రమాదం 12 శాతం తగ్గుతుందట. చాలా దేశాల్లో బాగా అందుబాటులో ఉంటున్న బంగాళాదుంపలు.. ఆరోగ్యకరమైన ఆహారంలో మాత్రం భాగం కాదని ఒసాకా సెంటర్ ఫర్ కేన్సర్ అండ్ కార్డియో వాస్క్యులర్ డిసీజ్ ప్రివెన్షన్‌కు చెందిన డాక్టర్ ఇసావో మురాకి చెప్పారు. బంగాళాదుంపల్లో స్టార్చ్ చాలా ఎక్కువగాను, పీచుపదార్థాలు, విటమిన్లు, మినరల్స్ లాంటివి తక్కువగాను ఉంటాయని ఆయన వివరించారు. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటే టైప్2 మధుమేహం వచ్చే ముప్పు ఎక్కువని తెలిపారు. బంగాళాదుంపలను వేడిగా తింటే.. వాటిలో స్టార్చ్ సులభంగా జీర్ణం అయిపోయి, రక్తంలో గ్లూకోజ్ స్థాయి త్వరగా పెరుగుతుందని, ఇది మంచిది కాదని ఆయన విశ్లేషించారు. -
హెల్త్ టిప్స్
ఆలూ మేలే.. డైటింగ్ చేసేవాళ్ల ముందు ‘ఆలూ’ అనే మాట ఎత్తితే చాలు.. వామ్మో..వాయ్యో అని అరుస్తుంటారు. ఎందుకని అడిగితే అది ఉన్నదానికన్నా మరింత బరువును పెంచుతుందంటూ భయపడతారు. కానీ బంగాళదుంప తింటే బరువు పెరుగుతారన్నది పూర్తిగా నిజం కాదంటున్నారు నిపుణులు. దాన్ని వండే పద్ధతిని బట్టి వాటి ఉపయోగాలుంటాయట. అసలు బంగాళదుంపపై ఇంత నింద పడటానికి ఓ బలమైన కారణమే ఉంది. అదేమిటంటే వాటితో చిప్స్ అనీ ఫ్రెంచ్ ఫ్రైస్ అనీ ఆలు టిక్కా అని తయారు చేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. అవేమో నూనెలో బాగా ఫ్రై చేసిన పదార్థాలు. దాంతో ఆ కారణంగా అవి ఎక్కువగా తిన్నవారు బరువు పెరగడం మొదలైంది. ఫ్రైలు తినడం లాంటి అనారోగ్య పనులుచేయడమే కాకుండా పాపం ‘ఆలూ’ను నిందిస్తున్నారు. అసలు ఈ బంగాళదుంపలో ఉండే ఫైబర్, పొటాషియం, విటమిన్-సి మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫ్రైలు కాకుండా వాటిని ఉడకబెట్టుకొని రోజు ఎన్ని తిన్నా ఆరోగ్యానికి మేలే కానీ కీడు జరగదట. అంతేకాదు డైటింగ్ చేసే వారు ఓ పూట అన్నానికి బదులుగా రెండు, మూడు బంగాళదుంపలను ఉడికించుకొని తింటే కడుపు నిండి పోతుందట. ఇప్పటికైనా ప్రచారంలో ఉన్న అపోహలను విడిచి ఆలూను ఆత్మీయంగా దగ్గరికి తీసుకుంటే ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చంటున్నారు డాక్టర్లు.