ఉడకబెట్టిన కూరగాయలు బరువు తగ్గాలనుకునే వారికి మాత్రమే ఉపయోగపడ తాయనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. అంతేకాదు అబ్బా, బోర్! ఏం తింటాంలే, రుచీ పచీ లేకుండా అని అస్సలు అనుకోకూడదు. దీని వల్ల బరువు తగ్గడంతోపాటు, అపారమైన ప్రయోజనాలనుతెలుసుకుంటే ఆశ్చర్య పోతారు.
అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ అధ్యయనాలు, కూరగాయలను ఉడకబెట్టడం వల్ల వాటి పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి. మెత్తగా ఉడికి, తినడానికి సులువుగా ఉండటంతోపాటు, మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి ఇది ఒక గొప్ప మార్గం.
ఉడకబెట్టిన కూరగాయల వల్ల లాభాలు
పచ్చివి తినడం కంటే ఉడకబెట్టినవి తింటే వాటిపైన ఉండే హానికరమైన సూక్ష్మక్రిములు నశిస్తాయి. తేలిగ్గా జీర్ణమవుతాయి.
అసిడిటీ సమస్యకూడా ఉండదు. హెలికోబాక్టర్ పైలోరీ వంటి బాక్టీరియాతో సహా అనేక కారణాల వల్ల కడుపు మంట సంభవించవచ్చు. అందువలన ఉడకబెట్టి తింటే కడుపు మంటను నివారిస్తాయి. యాంటీఆక్సిడెంట్టు ఎక్కువగా అందుతాయి.
ఉడక బెట్టడంలోపోషకాలు పెరుగుతాయి. ఉదా. క్యారెట్‌లను ఉడకబెట్టడం వల్ల చర్మ ఆరోగ్యానికి గొప్పగా ఉండే బీటా కెరోటిన్‌ను సంరక్షిస్తుంది.దీంతో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉడకబెట్టిన ఆహారం చాలా ఆక్సలేట్‌లను తొలగించి మూత్రపిండాల్లో రాళ్లను నిరోధించడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి ఇది మంచి చిట్కా.మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్త పోటు కూడా నియంత్రణలోకి వస్తుంది. వీటన్నింటికీ మించి మేనిఛాయ మెరుగు పడుతుంది.
బుజ్జాయిలకు మంచిది
ఉడికించిన కూరగాయలు ఘనమైన ఆహారాన్ని తినడం ప్రారంభించే శిశువులకు గొప్ప ఎంపిక. చక్కటి పోషకాలు అందుతాయి. పిల్లలు జీర్ణం చేసుకోవడం సులభం. అంతేకాకుండా, రెడీమేడ్ బేబీ ఫుడ్స్‌తో పోలిస్తే ధర తక్కువ, పోషకాలు ఎక్కువ.
ఏ యే కూరగాయలు తినవచ్చు
మన రుచికి నచ్చే ఏ కూరనైనా తినవచ్చు. ఉడక బెట్టుకుని తినే కూరగాయల్లో అన్నీ ఒకే రకమైనవి కాకుండా, నీరు ఎక్కువగా ఉండే, బీరకాయ, సొరకాయ, ఉల్లి కాడలు లాంటివి కూడా చేర్చుకోవాలి. బీట్ రూట్, క్యారట్, ముల్లంగి, బీన్స్, క్యాప్సికమ్, బఠానీ లాంటివి ఆవిరి మీద ఉడక బెట్టుకొని తినవచ్చు. ఇంకా చిలగడదుంప, బ్రకోలీతోపాటు వివిధ ఆకుకూరలను చేర్చుకోవచ్చు. రుచికి కావాలనుకుంటే సన్నగా తరిగిన కొత్తిమీదర పచ్చి ఉల్లిపాయ, పచ్చిమిర్చిముక్కలు, కొద్దిగా నిమ్మరసం కలుపు కోవచ్చు. బరువు తగ్గాలను కునేవారు దీన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో ఇడ్లీ, దోసలు లాంటి స్థానంలో వీటిరి తింటే మంచి ఫలితం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment