రూట్ అజేయ సెంచరీ | Root unbeaten century | Sakshi
Sakshi News home page

రూట్ అజేయ సెంచరీ

Published Sat, Apr 25 2015 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM

Root unbeaten century

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 464
 గ్రెనడా: మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ జో రూట్ (229 బంతుల్లో 182 నాటౌట్; 17 ఫోర్లు; 4 సిక్సర్లు) తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ అజేయ సెంచరీ సాధించాడు. ఫలితంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శుక్రవారం నాలుగో రోజు ఇంగ్లండ్ తమ తొలి ఇన్సింగ్స్‌లో 144.1 ఓవర్లలో 464 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో 165 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది.
 
  కెప్టెన్ కుక్ (211 బంతుల్లో 76; 8 ఫోర్లు), బ్యాలన్స్ (188 బంతుల్లో 77; 8 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. నాలుగో వికెట్‌కు రూట్, బ్యాలన్స్ 165 పరుగులు జోడించారు. బిషూకు నాలుగు వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు బరిలోకి దిగిన విండీస్ కడపటి వార్తలందేసరికి 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. డారెన్ బ్రేవో (36), బ్రాత్‌వైట్ (41) క్రీజులో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement