మౌనంగానే ఎదగడం.. ఎదిగినకొద్దీ ఒదిగుండటం మొక్కల నైజం. ఈ విషయూన్ని బాగా వంటబట్టించుకుందో లేదంటే మొక్క అనిపించుకోవడం ఇష్టంలేదో గానీ ఈ కంద మొక్క ఏకంగా 10 అడుగులకు పైగా ఎత్తు పెరిగింది. సాధారణంగా కంద మొక్క (దీన్ని కంద గొడుగు అని కూడా అంటారు) రెండునుంచి మూడు అడుగుల ఎత్తు మాత్రమే పెరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం అరుుతంపూడి మాజీ సర్పంచ్ గెద్దాడ కుటుంబరావు ఇంటి పెరట్లో మొలకెత్తిన కంద పిలక ఏకంగా 10 అడుగుల ఎత్తు దాటిపోరుుంది.
మండు వేసవిలోనూ రెండు నెలల వ్యవధిలోనే ఇలా పెరిగింది. ఈ విషయమై వ్యవసాయ అధికారి ఎం.హుమయూన్‌ను సంప్రదించగా.. భూమిలో సారం అధికంగా ఉండటం లేదా జన్యుపరమైన లోపాల వల్ల మొక్కలు ఇలా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
- ఇరగవరం