iragavaram
-
ఇద్దరు చైన్స్నాచర్లకు జైలు
ఇరగవరం: చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరికి 10 నెలలు జైలు శిక్ష విధించినట్టు ఇరగవరం ఎస్సై జి.శ్రీనివాస్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని ఏలేటిపాడులో రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును తూర్పుగోదావరి జిల్లా చిన కాపవరానికి చెందిన వానపల్లి అ య్యప్ప, జిల్లాలోని కడియద్దకు చెందిన పొట్లకర్ల స్వామి లా క్కుపోయారు. ఈ కేసులో నిందితులిద్దరికీ న్యాయమూర్తి జి. వీణ 10 నెలల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
రక్షకులకే శిక్ష!
ఇరగవరం ఎస్సైకి బదిలీ బహుమానం కుక్కునూరులో పోస్టింగ్ తణుకు ఎమ్మెల్యే అవమానించినా ఆదుకోని పోలీసుబాస్‌లు మాట నెగ్గించుకున్న ఎమ్మెల్యే ఎస్పీ బదిలీలోనూ ఇదే వైఖరి జిల్లాలో పోలీస్ ఉద్యోగం బలిపీఠంగా మారింది. అధికారపార్టీ ఆగడాలకు ఏమాత్రం అడ్డుచెప్పినా.. రక్షకులే బలికావాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా జరిగిన ఘటనలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఫలితంగా పోలీసుశాఖలోనూ, ప్రజల్లోనూ అధికారపార్టీ తీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : అధికార పార్టీకి ఎదురువెళ్తే ఏమవుతుందో ఇప్పుడు పోలీసులకూ తెలిసివస్తోంది. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట విననందుకు నిర్బంధానికి గురైన పోలీసు అధికారికి బదిలీ బహుమానంగా దక్కింది. అదీ జిల్లాకు సుదూరంగా ఉన్న ముంపు మండలమైన కుక్కునూరుకు.. పోలీసులపై దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే మాట నెగ్గించుకుని ఎస్సైని బదిలీ చేయించడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. అసలేం జరిగిందంటే.. గత ఏడాది అక్టోబర్‌లో కేవీవీ శ్రీనివాస్ ఇరగవరం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. ఈఏడాది మేలో ఇరగవరం మండలం రేలంగి శివారు అంతెనవారి పేటలో ఈస్టర్ రోజున దళితుల మధ్య గొడవ జరిగింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఇరు వర్గాలలో చెరో ఆరుగురిపై 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. అయితే తెలుగుదేశం వారిపై కేసు పెట్టవద్దంటూ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఇరగవరం ఎస్సై శ్రీనివాస్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. ఆఖరికి ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికీ తీసుకువెళ్లారు. అయితే దాడి జరిగిన విషయం నిర్ధారణ కావడంతో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. దీంతో మే 16న ఎమ్మెల్యే రాధాకృష్ణ ఎస్సై శ్రీనివాస్, రైటర్ ప్రదీప్‌కుమార్‌ను తన కార్యాలయానికి పిలిపించుకుని ’నా మాట వినకుండా కేసులు నమోదు చేస్తారా మీకు ఎంత దమ్ము ఉందిరా’ అంటూ బూతులు తిట్టారు. ఆఫీసులో కింద నేలపై వారిని కూర్చోబెట్టి, తానూ వారి ఎదురుగా కూర్చున్నారు. తనకు సమాధానం చెప్పేవరకూ బయటకు వెళ్లనీయబోనంటూ నిర్బంధించారు. ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో అప్పటి ఎస్పీ భాస్కర్‌భూషణ్ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయించారు. ఎస్పీని టార్గెట్ చేసిన ఎమ్మెల్యేలు దీంతో జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎస్పీని టార్గెట్ చేశారు. ఆ నెల 21న ఏలూరులో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఎస్పీ భాస్కర్‌భూషణ్‌పై జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. వెంటనే ఆయనను బదిలీ చేయించాల్సిందేనని, అంతవరకూ తమకు గన్మెన్లూ వద్దని, వెనక్కి పంపించేస్తామని కొంతమంది గన్మెన్లను వెనక్కి పంపారు. ఈ వ్యవహారాన్ని పరిష్కరిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ తర్వాత కొద్ది రోజులకే ఎస్పీ భాస్కర్ భూషణ్‌ను జిల్లా నుంచి బదిలీ చేశారు. ఇప్పుడు తాజాగా ఎస్సై ఆ తర్వాత ఎస్సైనీ బదిలీ చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ పట్టుపట్టడంతో ఇప్పుడు తాజాగా బాధితుడైన ఎస్సైనీ జిల్లాలోని మారుమూల ప్రాంతానికి పరిపాలనా కారణాలు చూపి బదిలీ చేయడంపై పోలీసు శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇదే పద్ధతి కొనసాగితే పోలీసుల మనోధైర్యం దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో బాలుడి దుర్మరణం
ఇరగవరం : మండలంలోని రాపాక గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వీరవల్లి పవన్‌కుమార్(11) తన స్నేహితుడు సుభాష్‌తో కలిసి సరదాగా ఆడుకోవడానికి సైకిల్‌పై గ్రామ శివార్లకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో రోడ్డు దాటుతుండగా ఏలేటిపాడు నుంచి ఇరగవరం వెళుతున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పవన్‌కుమార్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని స్నేహితుడు సుభాష్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. పవన్‌కుమార్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఇతని తండ్రి రాము వ్యవసాయ కూలీ కాగా తల్లి గృహిణి. పవన్‌కుమార్ రెండో కుమారుడు. సీఐ రామారావు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది
ఇరగవరం : మండలంలోని రేలంగిలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి భార్యే అతనిని హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రేలంగి గ్రామానికి చెందిన పసుపులేటి కృష్ణ(30) ఈ ఏడాది జనవరి 8వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా మృతుని తండ్రి బలరామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పెనుగొండ సీఐ వానపల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసును ఛేదించారు. మృతుడు కృష్ణకు పదేళ్ల క్రితం దేవరపల్లి మండలం బంధపురం గ్రామానికి చెందిన సత్యవతితో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. తొలుత భార్య సత్యవతికి స్వగ్రామం బంధపురంలో పీఎంపీ వైద్యుడితో పరిచయం ఏర్పడి అతనితో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆమె కుటుంబ సభ్యులు పీఎంపీ వైద్యుడిని పిలిపించి విచారించగా అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తిరిగి సత్యవతి రేలంగి గ్రామంలో దాసిరెడ్డి ఆంజనేయ రాజు(పుల్లయ్య)తో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. భార్య ప్రవర్తనతో కృష్ణ మద్యానికి బానిసై వారి సంతోషానికి అడ్డుతగులుతున్నాడు. భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన సత్యవతి, ఆంజనేయ రాజుతో కలిసి హత్యకు పథకం రూపొందించింది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భర్త నిద్రిస్తుండగా ప్రియుడి సహాయంతో మెడకు తువాలు బిగించి హతమార్చారు. పోలీసుల విచారణలో నిందితులిద్దరూ నేరాన్ని అంగీకరించారు. వారిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. కేసు దర్యాప్తునకు హెచ్‌సీ ఆర్.కొండలరావు, ఎస్.ప్రదీప్ కుమార్ సహకరించారు. -
బిక్కుబిక్కుమంటూ..
ఇరగవరం/తణుకు రూరల్ : ఇరాక్‌లో అంతర్యుద్ధంతో అక్కడ ఉన్న జిల్లావాసులు అవస్థలు పడుతున్నట్టు సమాచారం. తినేం దుకు తిండి లేక.. కనీసం తాగేందుకు నీరు లేక ఇబ్బంది పడుతున్నట్టు ఇరాక్ బాధితులు ఫోన్ ద్వారా ఇక్కడ వారి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారంతా ఆందోళనలో ఉన్నారు. ఇరగవరం మండలంలోని తూర్పు విప్పర్రు నుంచి ఐదు నెలల క్రితం పలువురు యువకులు ఇరాక్ పయనమయ్యారు. వారంతా అక్కడ నరకయాతన అనుభవించడంతో కుటుంబసభ్యులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. తమ బిడ్డలను స్వగ్రామాలకు రప్పిం చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తూర్పు విప్పర్రు గ్రామానికి చెందిన కొండేటి సుబ్బారావు, లక్ష్మి దంపతుల కుమారుడు పద్మారావు, అడ్డాల రాంబాబు, వెంకటలక్ష్మిల కుమారుడు నరేష్ గత జనవరిలో ఇరాక్‌లోని భాష్రా యూనివర్సిటీలో లేబర్ పని కోసం వెళ్లారు. వీరితో పాటు మరిం త మంది తెలుగువాళ్లు అక్కడ పనిచేస్తున్నట్టు సమాచారం. చర్యలు తీసుకున్నాం.. అధైర్యపడొద్దు తణుకు : ఇరాక్‌లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ ద్వారా ఢిల్లీలోని ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లినట్టు పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలు అధైర్యపడవద్దని తెలిపారు. దువ్వవాసులు 15 మంది.. ఇరాక్ లో చిక్కుకున్న జిల్లావాసుల్లో తణుకు మండలానికి చెందిన దువ్వ గ్రామస్తులు 15 మంది ఉన్నారు. వీరంతా ఐదు నెలల క్రితం రూ. లక్ష వరకు ఖర్చుచేసి ఇరాక్‌లో జీవనోపాధి కోసం వెళ్లారు. ఇరాక్‌లో అంతర్యుద్ధంతో వీరి పాస్‌పోర్టులు అక్కడ ఏజెంట్లు తీసుకోవడంతో ఇక్కడ వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన నాగిరెడ్డి దుర్గారావు, వెలగన శ్రీనివాస్, తూము అర్జున్, శ్రీరాములు గంగయ్య, రాయుడు శ్రీను, రాయుడు అంజి, రాయుడు గోపాల కృష్ణ, కాపకాయల రామకృష్ణ, బందెల కోటేశ్వరరావు, దైబాల గోపాలం, కోటిపల్లి నరశింహమూర్తి, గుత్తికొండ వెంకటేశ్వరరావు, గరగ సాయి, గరగ గోపాలకృష్ణ ఇరాక్‌లో చిక్కుకున్న వారిలో ఉన్నారు. పది రోజుల నుంచి తమ బిడ్డ ఫోన్ కూడా చేయడం లేదని గుత్తికొండ వెంకటేశ్వరరావు తండ్రి ధనరాముడు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డలను క్షేమంగా స్వగ్రామాలకు తీసుకురావాలని స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి బాధితుల కుటుంబసభ్యులు వేడుకున్నారు. -
దీని ‘దుంప’తెగ..! ఎంత ఎదిగిందబ్బా..!
మౌనంగానే ఎదగడం.. ఎదిగినకొద్దీ ఒదిగుండటం మొక్కల నైజం. ఈ విషయూన్ని బాగా వంటబట్టించుకుందో లేదంటే మొక్క అనిపించుకోవడం ఇష్టంలేదో గానీ ఈ కంద మొక్క ఏకంగా 10 అడుగులకు పైగా ఎత్తు పెరిగింది. సాధారణంగా కంద మొక్క (దీన్ని కంద గొడుగు అని కూడా అంటారు) రెండునుంచి మూడు అడుగుల ఎత్తు మాత్రమే పెరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం అరుుతంపూడి మాజీ సర్పంచ్ గెద్దాడ కుటుంబరావు ఇంటి పెరట్లో మొలకెత్తిన కంద పిలక ఏకంగా 10 అడుగుల ఎత్తు దాటిపోరుుంది. మండు వేసవిలోనూ రెండు నెలల వ్యవధిలోనే ఇలా పెరిగింది. ఈ విషయమై వ్యవసాయ అధికారి ఎం.హుమయూన్‌ను సంప్రదించగా.. భూమిలో సారం అధికంగా ఉండటం లేదా జన్యుపరమైన లోపాల వల్ల మొక్కలు ఇలా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. - ఇరగవరం -
అనాథ బాలికను ఆదుకుంటాం : ఎంపీడీవో
ఇరగవరం, న్యూస్‌లైన్: కంటిచూపు కోల్పోరుున అనాథ బాలిక చాలా రమణను ఆదుకుంటామని ఎంపీడీవో ఎస్టీవీ రాజేశ్వరరావు హామీ ఇచ్చారు. ‘అసలే అనాథ.. ఆపై కంటిచూపు లేదు’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. మంగళవారం ఉదయం ఇరగవరంలోని బాలిక నివాసానికి వచ్చారు. బాలిక రమణతోను, స్థానికులతోను మాట్లాడారు. బాలికను చదివిస్తామని ఎంపీడీవో చెప్పారు. రేలంగిలోని బాలికల వసతి గృహంలో ఆమెను చేర్పిస్తామన్నారు. వెంటనే సదరం కార్యక్రమంలో దరఖాస్తు చేరుుంచి, పింఛను ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో వెల్లడించారు. రూ.2 వేల ఆర్థిక సాయం ఇరగవరం : వైఎస్సార్ సీపీ నాయకుడు విడివాడ రామచంద్రరావు అనాథ బాలిక చాలా రమణ ఇంటికి వచ్చి ఆమెకు రూ.2,000 ఆర్థిక సాయం చేశారు. ప్రభుత్వం ఆ బాలికను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆమెకు చదువు చెప్పిం చేందుకు అధికారులు కృషి చేయూలని, అంత్యోదయ పథకం కింద నెలకు 35 కేజీల బియ్యం, ప్రతినెలా పింఛను ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు అఖిల్‌రెడ్డి, పంపన వెంకటేశ్వరరావు, ఆర్.సత్యనారాయణ, డీవీ ప్రకాష్, ఎ.శ్రీనివాస్, ఎన్.ధనేష్, బి.సత్యనారాయణ ఉన్నారు.