మండలంలోని రాపాక గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు దుర్మరణం పాలయ్యాడు.
ఇరగవరం : మండలంలోని రాపాక గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వీరవల్లి పవన్‌కుమార్(11) తన స్నేహితుడు సుభాష్‌తో కలిసి సరదాగా ఆడుకోవడానికి సైకిల్‌పై గ్రామ శివార్లకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో రోడ్డు దాటుతుండగా ఏలేటిపాడు నుంచి ఇరగవరం వెళుతున్న ట్రాక్టర్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో పవన్‌కుమార్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని స్నేహితుడు సుభాష్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. పవన్‌కుమార్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఇతని తండ్రి రాము వ్యవసాయ కూలీ కాగా తల్లి గృహిణి. పవన్‌కుమార్ రెండో కుమారుడు. సీఐ రామారావు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.