అనాథ బాలికను ఆదుకుంటాం : ఎంపీడీవో | helpfull to Orphaned girl:MPDO | Sakshi
Sakshi News home page

అనాథ బాలికను ఆదుకుంటాం : ఎంపీడీవో

Published Wed, Dec 25 2013 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM

helpfull to Orphaned girl:MPDO

ఇరగవరం, న్యూస్‌లైన్: కంటిచూపు కోల్పోరుున అనాథ బాలిక చాలా రమణను ఆదుకుంటామని ఎంపీడీవో ఎస్‌టీవీ రాజేశ్వరరావు హామీ ఇచ్చారు. ‘అసలే అనాథ.. ఆపై కంటిచూపు లేదు’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. మంగళవారం ఉదయం ఇరగవరంలోని బాలిక నివాసానికి వచ్చారు. బాలిక రమణతోను, స్థానికులతోను మాట్లాడారు. బాలికను చదివిస్తామని ఎంపీడీవో చెప్పారు. రేలంగిలోని బాలికల వసతి గృహంలో ఆమెను చేర్పిస్తామన్నారు. వెంటనే సదరం కార్యక్రమంలో దరఖాస్తు చేరుుంచి, పింఛను ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో వెల్లడించారు.
 రూ.2 వేల ఆర్థిక సాయం
 ఇరగవరం : వైఎస్సార్ సీపీ నాయకుడు విడివాడ రామచంద్రరావు అనాథ బాలిక చాలా రమణ ఇంటికి వచ్చి ఆమెకు రూ.2,000 ఆర్థిక సాయం చేశారు. ప్రభుత్వం ఆ బాలికను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆమెకు చదువు చెప్పిం చేందుకు అధికారులు కృషి చేయూలని, అంత్యోదయ పథకం కింద నెలకు 35 కేజీల బియ్యం, ప్రతినెలా పింఛను ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు అఖిల్‌రెడ్డి, పంపన వెంకటేశ్వరరావు, ఆర్.సత్యనారాయణ, డీవీ ప్రకాష్, ఎ.శ్రీనివాస్, ఎన్.ధనేష్, బి.సత్యనారాయణ ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement