rajeswar rao
-
telangana: గవర్నర్ కోటా ఎమ్మెల్సీచాన్స్ ఎవరికి?
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండటంతో.. కొత్తగా ఎవరికి చాన్స్ వస్తుందనే దానిపై బీఆర్ఎస్లో చర్చ మొదలైంది. ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న డి.రాజేశ్వర్‌రావు, ఫారూఖ్ హుస్సేన్‌ల ఆరేళ్ల పదవీకాలం ఈ నెల 27న పూర్తవుతోంది. ఈ రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లను గురువారం జరిగే కేబినెట్ భేటీలో ఖరారు చేసే అవకాశముంది. పదవీకాలం పూర్తవుతున్న డి.రాజేశ్వర్‌రావు, ఫారూఖ్ హుస్సేన్ ఇద్దరూ మైనారిటీ వర్గాలకు చెందినవారే కావడంతో మరోమారు పదవులను ఆశిస్తున్నారు. క్రిస్టియన్ కోటాలో రాజేశ్వర్, ముస్లిం కోటాలో ఫారూఖ్ హుస్సేన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజేశ్వర్‌రావు కాంగ్రెస్ హయాంలో రెండుసార్లు, బీఆర్ఎస్ హయాంలో ఒకసారి.. ఫారూఖ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి ఒక్కోసారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా పనిచేశారు. వారికి మళ్లీ అవకాశమిస్తారా? అన్న దానిపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వం రెండేళ్ల క్రితం గవర్నర్ కోటాలో పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసినా.. ఆయనపై క్రిమినల్ కేసులు ఉన్నాయనే కారణంతో గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా పక్కనపెట్టారు. దీనితో ప్రభుత్వం ఆ స్థానంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరును ప్రతిపాదించగా గవర్నర్ ఓకే చేశారు. ఈ నేపథ్యంలో క్లీన్ ఇమేజీ ఉన్నవారిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. ఇందులో టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర, టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా సేవలతోపాటు అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటులో చేసిన కృషిని దృష్టిలో పెట్టుకుని చక్రపాణి వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ఇక గౌడ వర్గానికి మండలిలో ప్రాతినిధ్యం లేనందున ఆ వర్గానికి చెందిన ప్రముఖుల పేర్లను.. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మైనారిటీ వర్గానికి చెందిన నేతల పేర్లనూ కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. చదవండి: త్వరలో తెలంగాణకు అమిత్‌షా, జేపీ నడ్డా -
అవమానాలు భరించలేం, పార్టీలో నుంచి వెళ్లిపోదామా?
సాక్షి ప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ పార్టీలో చాప కిందినీరులా సాగుతున్న అసంతృప్తి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా తారాస్థాయికి చేరింది. బీ ఫాంల కేటాయింపులో సమన్యాయం జరగలేదంటూ కొందరు సీనియర్ నాయకులు మనస్తాపానికి గురవుతున్నారు. కొంతకాలంగా తమను పార్టీకి దూరం చేసేందుకు సాగుతున్న కుట్రలను వివరించినా అధిష్టానం పట్టించుకోకపోవడంతో కలత చెందిన మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, వరద రాజేశ్వర్‌రావు దంపతులు పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రేటర్ వరంగల్ ఎన్నికల సందర్భంగా తాము సూచించిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై మనస్థాపం చెందిన వారు ‘పార్టీలో ఉందామా? రాజీనామా చేద్దామా?’ అని గురువారం ముఖ్య కార్యకర్తలతో సమాలోచనలు చేయడం చర్చనీయాంశంగా మారింది. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్న తమను బయటకు పంపే కుట్ర సాగుతుందన్న వ్యాఖ్యలతో.. అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధం కావాలని కార్యకర్తలు సూచించినట్లు తెలిసింది. ఇంకెంతో కాలం భరించలేం... గత నలభై ఏళ్లుగా వరద రాజేశ్వర్‌రావు, స్వర్ణ దంపతులు కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. వీరిలో స్వర్ణ నగర మేయర్‌గా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో గ్రేటర్ వరంగల్ ఎన్నికల సందర్భంగా తమను పట్టించుకోకుండా అవమానించారని వారు ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. నగర మేయర్‌గా ఐదేళ్లు పనిచేసిన స్వర్ణ 2014 ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, పార్టీ సభ్యత్య నమోదు కూడా ఇక్కడి నుంచే చేయించుకున్నారు. అయినా వర్ధన్నపేట నుంచి పీసీసీ సభ్యురాలిగా అవకాశం ఇచ్చారు. అప్పట్లో శ్రేణుల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో వర్ధన్నపేట నుంచి మార్చి సంబంధం లేని వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి సభ్యురాలిగా నియమించినట్లు వెల్ల డించారు. అయితే దీనివెనుక జిల్లా, రాష్ట్ర నేతల కుట్ర దాగి ఉందని వరద రాజేశ్వర్ దంపతుల అనుచరులు అప్పట్లో విమర్శలు చేశారు. వరంగల్ పశ్చిమ నుంచి వచ్చే ఎన్నికల్లో తమ నేతలకు అవకాశం ఇవ్వకుండా చేసే ముందస్తు ప్రణాళికలో భాగమే ఈ కుట్ర చేశారనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల వేళ తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానపరిచారని, ఇంకా ఎంతోకాలం ఈ అవమానాలను భరించలేమని ముఖ్య కార్యకర్తలతో స్వర్ణ – వరదరాజేశ్వర్‌రావు దంపతులు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీలో ఉంటూ ఆత్మగౌరవ పోరాటం చేయడమా, లేక పార్టీ నుంచి తప్పుకోవడమా అన్న కోణంలో వారు ముఖ్య అనుచరులతో చర్చలు చేస్తున్నారు. హన్మకొండలోని స్వగహంలో గురువారం కార్యకర్తలతో సమావేశమైన వారు రాత్రి పొద్దుపోయే వరకు సమాలోచనలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: నామినేషన్లు ముగిశాయి.. ఇక ప్రచారమే -
మీడియాలో పాక్షికత వాంఛనీయమా?
ఇటీవలి గతం కేసి చూస్తే కొన్ని వార్తా పత్రికలు విధానం కంటే ఒక టార్గెట్‌ను ప్రధానంగా ఎంచుకుంటున్నాయని తెలుస్తుంది. వివాదాస్పద అంశాలపై రెండు కోణాలను సమర్పించడం ద్వారా పాఠకులకు సమాచారం ఇవ్వడం కంటే ముందే లక్ష్యంగా చేసుకున్న బాధితుడిని నాశనం చేయడమే తమ ప్రాథమిక బాధ్యతగా ఈ పత్రికలు చేపట్టాయి. నిర్నిరోధంగా ఇవి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిందలు వేయడంలో, బురద జల్లడంలో మునిగితేలుతున్నాయి. తమ వార్తా కథనాలు, వ్యాఖ్యల్లో నిర్దిష్టత, వాస్తవానికి చెందిన ప్రాథమిక విలువలను ఇవి వదిలేశాయి. ఫ్రీ ప్రెస్‌ను నమ్ముతున్న మనం నేడు ఎదుర్కొంటున్న ముఖ్య ప్రశ్న ఏదంటే, ఒకరి వృత్తిగతమైన గౌరవానికి భంగం కలిగించకపోవడం ద్వారా.. యాజమాన్యం వైఖరితో పనిలేకుండా జర్నలిజాన్ని స్వేచ్ఛాయుతమైన, స్వతంత్రమైన, పాక్షిక రహితమైనదిగా ఎలా తీర్చిదిద్దాలన్నదే. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలలో ప్రచురించిన, ప్రసారం చేసిన నిరాధార వార్తలపై స్పష్టీకరణలు ఇవ్వడానికి, ఫిర్యాదులు చేయడానికి, అవసరమైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా తగిన న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి ఇంతవరకు సమాచార, ప్రజాసంబంధాల శాఖ ప్రత్యేక కార్యదర్శికి ఉంటున్న అధికారాలను ఆయా ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు కూడా కట్టబెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 30న ఒక జీవో జారీ చేసింది. ఇది మీడియా వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 2007 ఫిబ్రవరిలో జారీ చేసి నిరసనల కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన జీవోకు ప్రస్తుత జీవో సరిపోలి ఉంది. కానీ వైఎస్సార్ ప్రభుత్వం తీసుకురాదలిచిన అదే జీవోను గత విభజనానంతర ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు ప్రభుత్వం కాస్త మెరుగుపరిచి అమలులోకి తీసుకువచ్చిన విషయం గమనించాలి. ఈ జీవోను ప్రత్యేకించి సాక్షి సంపాదకులు, జర్నలిస్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం ఉపయోగించింది కూడా. నిరాధార వార్తలు సమంజసమేనా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు, నిరాధార వార్తలను దురుద్దేశ పూర్వకంగా వ్యాప్తి చేస్తూ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ఒక సెక్షన్ మీడియా చేస్తున్న ఉద్దేశపూర్వకమైన ప్రయత్నాలను అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చింది. నిజమైన, సరైన సమాచారాన్ని ప్రజలకు అందచేయడానికి ఈ జీవో అవసరమని ఏపీ ప్రభుత్వం భావించింది. తమతమ విభాగాలకు, వ్యవహారాలకు సంబంధించి పూర్తి జ్ఞానం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ విభాగాల కార్యదర్శులకు ఈ జీవో ద్వారా ప్రభుత్వం అధికారం కట్టబెట్టింది. ఇటీవలి పరిణామాలను చూస్తే కొన్ని వార్తా పత్రికలు విధానం కంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవడంలోనే శ్రద్ధ చూపుతున్నాయని అనిపిస్తోంది. వివాదాస్పద అంశాలలోని భిన్న కోణాలను అందించడం ద్వారా పాఠకులకు సమాచారం ఇవ్వడం కంటే ముందే లక్ష్యంగా చేసుకున్న బాధితుడిని నాశనం చేయడమే తమ ప్రాథమిక బాధ్యతగా ఈ పత్రికలు వ్యవహరిస్తున్నాయి. వీటి సామర్థ్యానికి సంబంధించిన ప్రమాణాలు ఒక తరహా దాడితో మొదలై ఇతర విచారణలన్నింటినీ దానికి లోబర్చి వేస్తుంటాయి. నిర్నిరోధంగా ఇవి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిందలు వేయడంలో, బురద జల్లడంలో మునిగితేలుతున్నాయి. తమ వార్తా కథనాలు, వ్యాఖ్యల్లో నిర్దిష్టత, వాస్తవానికి సంబంధించిన ప్రాథమిక విలువలను కూడా ఇవి వదిలేశాయి. అహంభావపూరితమైన యజ మానుల పాక్షిక ప్రయోజనాలను నెరవేర్చడానికి పనికి వస్తుందేమో కానీ సహజంగానే ఇది స్వేచ్ఛాయుత మీడియాగా ఉండవలసిన వాటి పాత్రను కుదించివేస్తోంది. క్రిస్టియన్ సైన్స్ మోనిటర్ సంపాదకురాలిగా పనిచేసిన కేథరీన్ ఫేనింగ్ ఫ్రీ ప్రెస్ గురించి వ్యాఖ్యానిస్తూ, ‘‘స్వేచ్ఛాయుతంగా ఉండే పత్రికే బాధ్యతాయుతంగా ఉండగలదు. కానీ ఆంక్షలతో కూడిన పత్రిక బాధ్యతతో వ్యవహరించదు. ఆంక్షలు పెట్టారంటేనే వాస్తవాలను అవి పూర్తిగా వెల్లడించవని అర్థం. వాస్తవాలను తెలుసుకుని అన్నిరకాలుగా ప్రజలకు అవసరమైన సమాచారాన్ని వారు నిర్ణయించుకోవడానికి అనుగుణంగా అందించలేవు’’ అని వ్యాఖ్యానించారు. వార్తా పత్రిక అధికారంలో ఉన్నవారికి సలహాదారూ కాదు, సహకారీ కాదని ఆమె చెప్పారు. జర్నలిజంలో అతి ముఖ్యమైనది పత్రికకి సంబంధించిన ప్రేరణ మాత్రమే. అయితే ఆ ప్రేరణ పాఠకులకు సమాచారం ఇవ్వడం కోసమా లేక రాజకీయ ప్రయోజనం కోసమో, సర్క్యులేషన్ పెంచుకోవడం కోసమో ఉద్దేశించిందా అనేదే కీలకమైన అంశం అని ఆమె వివరించారు. ఏదైనా అడిగే హక్కు ఉంది కానీ... న్యూయార్క్ టైమ్స్ సంపాదకుడు ఏఎమ్ రోసంథాల్ అభిప్రాయం ప్రకారం, అమెరికా రాజ్యాంగానికి తొలి సవరణ జరిగిన తర్వాత కూడా సంపూర్ణ స్వేచ్ఛకు అది హామీ ఇవ్వలేదు. కొత్తగా వృత్తిలో చేరిన రిపోర్టరుగా, అమెరికన్ రాజ్యాంగానికి తొలి సవరణపై తాను తొలి పాఠం నేర్చుకున్నానని రోసంథాల్ చెప్పారు. ఆ తొలి సవరణ ఏం చెబుతోందంటే ఎవరినైనా, ఏదైనా అడిగే హక్కు నాకుంది. అదేసమయంలో దానికి జవాబును బహిరంగంగా కాక జనాంతికంగా చెప్పాలని అడిగే హక్కు కూడా అతనికి ఉంటుంది. స్వేచ్ఛాయుత మీడియాపై నమ్మకం ఉన్నవారిగా మనం ఇవాళ ముఖ్యమైన ప్రశ్న ఎదుర్కొంటున్నాం. జర్నలిజాన్ని స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిష్పాక్షికంగా మలచడం ఎలా? యాజమాన్యం ప్రమేయం లేకుండా, ఒకరి వృత్తి గౌరవానికి భంగం కలిగించకుండా ఉండటం ఎలా అన్నవే ఆ ప్రశ్నలు. సుప్రసిద్ధ న్యాయపండితుడు, స్వేచ్ఛాయుత మీడియా భావన పట్ల పరిపూర్ణ విశ్వాçÜం కల పాల్కీవాలా.. మీడియాలో వ్యాపారీకరణ పెరిగే కొద్దీ అది సమాజ ఆరోగ్యంపై, ప్రజాస్వామ్యంపై దుష్ప్రభావం కలిగిస్తున్నదని, అలాగే జర్నలిజం వృత్తికూడా వ్యాపారీకరణకు బలవుతోందని చెప్పారు. భారతదేశంలో పత్రికావ్యవస్థ అనేక కారణాల వల్ల సంపూర్ణ స్వేచ్చను కలిగిలేదని పాల్కీవాలా చెప్పారు. జర్నలిస్టులకు స్వయంగా చైతన్యవంతం కావడం, స్వయం క్రమశిక్షణతో ఉండటమే కాకుండా స్వీయ నియంత్రణ కూడా అవసరమని పాల్కీవాలా చెప్పారు. హిందూస్తాన్ టైమ్స్ ఎడిటర్‌గా, తర్వాత ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంపాదకుడిగా పనిచేసిన సీనియర్ జర్నలిస్టు ఎస్ ముల్గావ్కర్.. స్వేచ్ఛకు, ఇష్టానుసారంగా వ్యవహరించడానికి మధ్య లక్ష్మణ రేఖను చెరిగిపోవడం చూసి బాధపడ్డారు. ఇలాంటి పరిస్థితి రావడానికి తనవంటివారు తీసుకున్న నిర్ణయాలు కూడా కారణం అని ఆయన తన తప్పులను అంగీకరించారు. మీడియాలో పెరుగుతున్న పెడధోరణిని చూడవలసి వస్తున్నందుకు బాధపడుతున్నానని చెప్పారు. విశ్వసనీయతే ప్రశ్నార్థకం వార్తల కవరేజీలో బాధ్యతారహిత ధోరణి, జర్నలిస్టులు చేసే వ్యాఖ్యలు ఏ స్థాయికి వెళ్లాయంటే ప్రజల దృష్టిలో మీడియా విశ్వసనీయత ప్రశ్నార్థకమయ్యే స్థాయిలో దిగజారిపోయాయి. సమాజానికి తెలియజేయాలని అనుకుంటూ తన లక్ష్యాలను సిద్ధింపజేసుకోవడమా లేదా వారిని ఏమార్చి తన రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడమా ఏది ముఖ్యం అనేది పత్రికలు నిర్ణయించుకోవాలి. జర్నలిస్టు వృత్తిని నమ్రతతో కొనసాగించడంలో అయిదు దశాబ్దాలపాటు గడిపిన వ్యక్తిగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూసి విచారిస్తున్నాను. వార్తలు పవిత్రమైనవి, వ్యాఖ్యలు స్వేచ్ఛాయుతమైనవి అనే స్వీయ ప్రమాణాలను నేడు జర్నలిజం తనకుతానుగా తోసివేస్తున్నట్లుగా ఉంది. నా జర్నలిజం ప్రయాణంలో ఏ సమయంలోకూడా ఇలాంటి అతిశయించిన ధోరణిని నేను ఎన్నడూ చూడలేదు. విశ్వసనీయత అనేది జర్నలిజానికి అత్యంత ప్రాథమిక అంశంగా ఉండాలనే అంశంలో నేడు విఫలం కావడమే దీనికి కారణం. మీడియా విశ్వసనీయతకు చెందిన ఈ విషాద ముఖచిత్రం ప్రస్తుతం జర్నలిజం తీరుతెన్నులకు చిత్రిక పడుతోంది. ప్రజాస్వామ్యం ప్రధాన రక్షణ దుర్గాల్లో ఒకటైన మీడియాకు ముప్పు కలిగేలా అపవిత్రం చేస్తున్నారని చెబుతూ ముల్గావ్కర్ చెప్పిన ప్రెస్ అంటే దేవాలయం అనే భావనను కాపాడుకోవలసి ఉంది. ఇవ్వాళ అత్యంత తరచుగా నిందలకు గురవుతున్న ఒక వృత్తి పేరు చెప్పండి అని ఎవరినైనా అడిగితే సమాధానం జర్నలిజం అనే వస్తుందని నా అంచనా. జర్నలిజం వృత్తిని తిరిగి అత్యున్నత శిఖరాలకు చేర్చడానికి ఆ వృత్తిలో ఉంటున్నవారే వృత్తిగతతత్వం, మేధోపరమైన స్వాతంత్య్రం అనే పతకాన్ని పైకెత్తవలసిన అవసరం ఉంది. దీనికి చేయవలసిందల్లా పత్రికా స్వాతంత్య్రం పట్ల తమ నిబద్ధతను చెరిపివేస్తూ.. పాక్షిక మీడియా ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులు చెప్పని మాటల్ని ప్రచారంలో పెట్టడం, కపటవైఖరి వంటి పెడధోరణులకు ఫుల్ స్టాప్ పెట్టడమే. సి.హెచ్. రాజేశ్వరరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
అనర్గళ విద్యా ‘సాగరు’డు
సాక్షి, కరీంనగర్: రాజకీయాల్లో తలపండిన నేతలు.. కాకలు తీరిన యోధులు.. ఒక్కసారైనా రాజ్యాంగపరంగా ప్రాధాన్యత ఉన్న గవర్నర్ పదవి చేపట్టాలని ఆశిస్తారు. అలాంటి రాజ్యాంగపరమైన పదవిలో రాణిస్తున్నారు చెన్నమనేని విద్యాసాగర్‌రావు (77). మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న విద్యాసాగర్‌రావు 2014 ఆగస్ట్ 30న మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. విద్యాసాగర్‌రావు మూడుసార్లు శాసనసభ్యుడిగా, రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా.. ఐదేళ్లు కేంద్ర మంత్రిగా పని చేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి గవర్నర్ స్థాయికి ఎదిగిన రెండో వ్యక్తి విద్యాసాగర్‌రావు. మొదటి వ్యక్తి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి. పిట్టకథలు, వాగ్దాటితో ఆకట్టుకునే ‘సాగర్జీ’ ప్రస్థానంపై కథనం.. విద్యార్థి దశలో రచన, రాజకీయం.. విద్యాసాగర్‌రావు ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుతుండగా విద్యార్థి నాయకుడిగా వర్సిటీ స్థాయి ఎన్నికల్లో పాల్గొన్నారు. బీఎస్సీ ఎల్ఎల్బీ చదివారు. ఇందిర ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయి జైలుకెళ్లారు. జైలులో ఉండగా పలు కథలు, వ్యాసాలు రాశారు. విద్యాసాగర్‌రావు సోదరుడు చెన్నమనేని రాజేశ్వర్‌రావు కమ్యూనిస్టు నేతగా ఉండగా విద్యాసాగర్‌రావు మాత్రం ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా పనిచేశారు. 1983లో తొలిసారి కరీంనగర్ జిల్లా చొప్పదం డిలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. 1985లో మెట్పల్లి నుంచి పోటీచేసిన విద్యాసాగర్‌రావు ఆపై 1989, 1994 ఎన్నికల్లో వరుస విజయా లు సాధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా, శాసనసభలో శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. 1998లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి 12వ లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. అప్పట్లో వాజ్‌పేయి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో 1999లో వచ్చిన ఎన్నికల్లో రెండోసారి ఎంపీ అయ్యారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. కేసీఆర్‌పై పోటీ.. 2004 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఉద్యమ నేతగా కరీంనగర్ నుంచి కేసీఆర్ పోటీ చేయగా అప్పటికే సిట్టింగ్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్న విద్యాసాగర్‌రావు మూడోసారి బరిలో దిగారు. తెలంగాణ వాదం బలంగా ఉండటంతో విద్యాసాగర్‌రావు ఓటమిపాలయ్యారు. 2009లో వేములవాడ ఎమ్మెల్యేగా పోటీచేసిన విద్యాసాగర్‌రావు తన సోదరుడు రాజేశ్వర్‌రావు, తనయుడు రమేశ్‌బాబు చేతిలో ఓటమిపాలయ్యా రు. బాబాయిని ఓడించిన అబ్బాయిగా రమేశ్‌బాబు వార్తల్లో నిలిచారు. 2014లో కరీంనగర్ లోక్‌సభ నుంచి పోటీ చేసిన విద్యాసాగర్‌రావు మరోసారి ఓటమిపాలయ్యారు. మహారాష్ట్ర గవర్నర్‌గా.. తెలంగాణ ప్రాంత సీనియర్ బీజేపీ నేతగా గుర్తింపు పొందిన విద్యాసాగర్‌రావు 2014లో బీజేపీ సర్కార్ కేంద్రంలో అధికారంలోకి రావడంతో మహారాష్ట్ర గవర్నర్‌గా 2014 ఆగస్టు 30న బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో మరణించిన సందర్భంగా తమిళనాట నెలకొన్న నాటకీయ పరిణామాలను నిశితంగా గమనించిæనాటి తమిళనాడు ఇంఛార్జి గవర్నర్‌గా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. మాటల మరాఠీ.. విద్యాసాగర్‌రావుకు మాటల మాం త్రికుడని పేరు. వేదికలపై అనర్గళంగా మాట్లాడుతూ కుల సంఘాల పేర్లను ఉచ్చరిస్తారు. ప్రసంగం మధ్యలో పిట్టకథలు చెబుతూ సభికులను ఆకట్టుకుంటారు. అసెంబ్లీ వేదికగా సాగే చర్చల్లోనూ తనదైన శైలిలో సాధికారంగా మాట్లాడటం ఆయన ప్రత్యేకత. సభ ఏదైనా తన వాగ్ధాటితో మెప్పిస్తారు. విద్యాసాగర్‌రావును ముద్దుగా ‘సాగర్జీ’ అంటారు. ప్రసంగం మధ్యలో చమత్కారాలు, తెలంగాణ నుడికారాలు, సామెతలు చెబుతూ రక్తికట్టిస్తారు. ఇంతట ‘మాటల నేత’ ప్రస్తుతం గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కమాటా మాట్లాడకుండా గంభీరంగా ఉండటం విశేషం. కుటుంబమంతా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం నాగారానికి చెందిన చెన్నమనేని శ్రీనివాస్‌రావు–చంద్రమ్మ దంపతుల చిన్నకొడుకుగా 1942 ఫిబ్రవరి 12న జన్మించిన విద్యాసాగర్‌రావు పాఠశాల స్థాయి నుంచే చురుకైన వక్త. ఆయన భార్య వినోద. పిల్లలు వివేక్, వినయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. చిన్నబ్బాయి వికాస్ డాక్టర్. విద్యాసాగర్‌రావు పెద్దన్నయ్య రాజేశ్వర్‌రావు సీనియర్ రాజకీయ నేత కాగా మరో అన్నయ్య పద్మవిభూషణ్ హన్మంతరావు ఆర్థికవేత్త. ఇంకో అన్నయ్య వెంకటేశ్వర్రావు కమ్యూనిస్టు నాయకుడు. విద్యాసాగర్‌రావు సోదరి కుమారుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రస్తుత కరీంనగర్ ఎంపీ కాగా సోదరుడు రాజేశ్వరరావు కొడుకు రమేశ్‌బాబు వేములవాడ శాసనసభ్యుడిగా ఉన్నారు. సొంత డబ్బుతో స్కూలు, చెరువు.. నాగారంలోని రెండున్నర ఎకరాల భూమిని గురుకుల విద్యాలయానికి దానంగా ఇచ్చారు. గ్రామం లోని 85 మంది రైతులకు రూ.1.32 కోట్ల సొంత ఖర్చులతో బోర్లు వేయించారు. 105 మంది పేద బీడీ కార్మికులకు ప్రభుత్వ పరంగా ఇళ్లు కట్టించారు. 1993లో నాగారంలో రూ.60 లక్షలతో తొలి ఊట చెరువు నిర్మించారు. తల్లి చంద్రమ్మ పేరిట ట్రస్ట్ పెట్టి సిరిసిల్లలో సాగునీటి కాలువలు తవ్వించారు. కార్గిల్ వీరుల స్మారకార్థం 2000లో కార్గిల్ లేక్‌ను ఏర్పాటు చేశారు. - వూరడి మల్లికార్జున్, సిరిసిల్ల -
ములుగు మొదటి ఎమ్మెల్యే మృతి
సాక్షి, భూపాలపల్లి : ములుగు నియోజకవర్గ మొదటి ఎమ్మెల్యే సూర్యనేని రాజేశ్వర్ రావు మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు (ఆదివారం) కన్నుమూశారు. ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) పార్టీ తరఫున ములుగు మొట్ట మొదటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1957 నుంచి 62 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే రాజేశ్వర్ రావు స్వస్థలం వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవి పేట గ్రామం. -
నేనేం చేయలేను
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ‘‘నేను ఆయన్ను(డీఈఓ రమేష్)ను ఇంకా రిలీవ్ చేయలేదు.. అలాంటప్పుడు మీకు ఎలా బాధ్యతలు అప్పగిస్తాను. అయినా ఎన్నికల విధుల్లో ఉన్న డీఈఓ రమేశ్‌ను ఇక్కడి నుంచి పంపడం నా పరిధిలో లేదు. అదంతా ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది. అంతవరకూ మీ విషయంలో నేనేం చేయలేను’’ విధుల్లో చేరడానికి వచ్చిన కొత్త డీఈఓ రాజేశ్వర్‌రావుతో కలెక్టర్ స్మితా సబర్వాల్ అన్న మాటలివి. తొలినుంచీ డీఈఓ రమేష్ బదిలీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ స్మితా సబర్వాల్ తన పంథాను ఏ మాత్రం మార్చుకోలేదు. రమేష్‌ను ఇక్కడనుంచి పంపే అవకాశమే లేదంటూ మరోసారి తేల్చిచెప్పారు. ప్రకాశం జిల్లా డీఈఓగా పనిచేస్తున్న రాజేశ్వర్‌రావును మెదక్ జిల్లా డీఈఓగా బదిలీ కావడంతో బాధ్యతలు స్వీకరించేందుకు బుధవారం కలెక్టర్ వద్దకు రాగా ఆమె జాయిన్ చేసుకునేందుకు నిరాకరించారు. ప్రస్తుత డీఈఓ రమేష్‌ను రిలీవ్ చేయలేదనీ, అందువల్ల మీకు బాధ్యతలు అప్పగించలేనని రాజేశ్వర్‌రావుకు కలెక్టర్ స్మితాసబర్వాల్ స్పష్టం చేశారు. దీంతో ఏంచేయాలో అర్థం కాక కొత్త డీఈఓ తలపట్టుకుంటున్నారు. డీఈఓగా విధులు నిర్వహిస్తున్న రమేశ్‌ను విద్యాశాఖ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ ఈ నెల 12న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్వర్‌రావును నియమించారు. ఈ మేరకు 18న ప్రకాశం జిల్లా నుంచి రిలీవ్ అయిన రాజేశ్వర్‌రావు బుధవారం మెదక్ డీఈఓగా విధుల్లోకి చేరేందుకు బుధవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌కు వచ్చారు. ముందుగా కలెక్టర్ స్మితా సబర్వాల్‌ను ఆమె చాంబర్లో కలవగా, బాధ్యతలు అప్పగించేందుకు కలెక్టర్ పూర్తిగా నిరాకరించారు. డీఈఓ రమేష్‌ను రిలీవ్ చేసేంతవరకు వేచి ఉండాలంటూ కలెక్టర్ ఆమె జాయిన్ చేసుకునేందుకు నిరాకరించారు. ప్రస్తుత డీఈఓ రమేష్‌ను రిలీవ్ చేయలేదనీ, అందువల్ల మీకు బాధ్యతలు అప్పగించలేనని రాజేశ్వర్‌రావుకు కలెక్టర్ స్మితాసబర్వాల్ స్పష్టం చేశారు. దీంతో ఏంచేయాలో అర్థం కాక కొత్త డీఈఓ తలపట్టుకుంటున్నారు. డీఈఓగా విధులు నిర్వహిస్తున్న రమేశ్‌ను విద్యాశాఖ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ ఈ నెల 12న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్వర్‌రావును నియమించారు. ఈ మేరకు 18న ప్రకాశం జిల్లా నుంచి రిలీవ్ అయిన రాజేశ్వర్‌రావు బుధవారం మెదక్ డీఈఓగా విధుల్లోకి చేరేందుకు బుధవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌కు వచ్చారు. ముందుగా కలెక్టర్ స్మితా సబర్వాల్‌ను ఆమె చాంబర్లో కలవగా, బాధ్యతలు అప్పగించేందుకు కలెక్టర్ పూర్తిగా నిరాకరించారు. డీఈఓ రమేష్‌ను రిలీవ్ చేసేంతవరకు వేచి ఉండాలంటూ కలెక్టర్ సూచించడంతో రాజేశ్వర్‌రావు వెనుదిరిగారు. కాగా డీఈఓ రమేశ్‌ను విధుల్లో నుంచి రిలీవ్ చేయలేమని, ఆయనకు ఎన్నికల బాధ్యతలు అప్పగించినందున ఎన్నికలు అయ్యేంతవరకు బదిలీని తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. వచ్చే నెల 3 వరకు ఎన్నికల విధుల్లో ఉన్నందున అప్పటివరకు డీఈఓ రమేశ్‌ను రిలీవ్ చేయలేమని కలెక్టర్ స్పష్టం చేసినట్లు సమాచారం. జిల్లా కలెక్టర్ విద్యాశాఖకు రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుంటే ఇప్పట్లో డీఈఓ రిలీవ్ అయ్యే అవకాశాలు కానరావటం లేదు. మరోవైపు ఇప్పటికే ప్రకాశం జిల్లా డీఈఓగా రిలీవ్ అయిన రాజేశ్వర్‌రావుకు ఇక్కడ బాధ్యతలు అప్పగించకపోవడంతో ఆయోమయంలో పడిపోయారు. -
డీఈఓ బదిలీ!
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: డీఈఓ రమేష్ బదిలీ అయినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా విద్యాధికారి రాజేశ్వర్‌రావు నియమితులైనట్టు తెలుస్తోంది. ఈ బదిలీ వెనుక ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్టు సర్వత్రా గుసగుసలు వినిపిస్తున్నాయి. సంవత్సర కాలంగా డీఈఓను బదిలీ చేసేందుకు ఎమ్మెల్యే తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యే చర్యలను విద్యార్థి సంఘాలతో పాటు ఉపాధ్యాయ సంఘాల్లోని కొందరు నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. డీఈఓను బదిలీ చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మంచిగా పనిచేసే అధికారిని ఎలా బదిలీ చేస్తారో చూస్తానంటూ జోక్యం చేసుకోవడం వల్ల అప్పట్లో బదిలీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. తాజాగా ఎన్నికల సందర్భంగా వివిధ శాఖల అధికారుల బదిలీల ప్రక్రియలో భాగంగా పెండింగ్‌లో ఉన్న భాగంగా పెండింగ్‌లో ఉన్న డీఈఓ బదిలీ ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం సంతకం చేసినట్లు తెలిసింది. డీఈఓ రమేశ్‌ను ఆదిలాబాద్‌కు బదిలీ చేస్తూ ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్వర్‌రావును నియమించినట్టు సమాచారం. ప్రైవేటు పాఠశాలల వ్యవహారంలో డీఈఓ ఎమ్మెల్యే సూచనలు పట్టించుకోకపోవడంతో పాటు మారుమూల పాఠశాలల పనితీరుపై ప్రత్యేక దృష్టిని సారించి పని చేయని ఉపాధ్యాయులపై వేటు వేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే డీఈఓకు, ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మధ్య విభేదాలు తలెత్తినట్టు సమాచారం. ఎమ్మెల్యే సూచించిన ఏ ఒక్కటీ కూడా డీఈఓ చేయకపోవడంతోపాటు, తన పరిధిలో లేదంటూ దాట వేస్తూ రావడంతో జగ్గారెడ్డి తీవ్ర గుర్రుగా ఉన్నట్టు వినికిడి. తన సిఫార్సులను లెక్క చేయని డీఈఓను ఎలాగైనా బదిలీ చేయించాలని ఎమ్మెల్యే నిర్ణయించుకున్నట్టు సమాచారం. పైగా డీఈఓ బదిలీ తన వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనుకున్నట్లుగానే ముఖ్యమంత్రి ద్వారా బదిలీ ఉత్తర్వులపై సంతకం చేయించినట్టు సమాచారం. దూకుడుగా వెళ్లడమే కారణమా? జిల్లా విద్యాశాఖాధికారిగా 2012 ఏప్రిల్ 9న బాధ్యతలు చేపట్టిన్నప్పటి నుంచి దూకుడుగా వెళుతుండటంతో మింగుడుపడని ఉపాధ్యాయ సంఘాలు డీఈఓ బదిలీకి పైరవీలు ప్రారంభించాయి. ఆయనను బదిలీ చేయిస్తే వచ్చే ఎన్నికల్లో ఉపాధ్యాయులంతా మీ గెలుపు కోసం పనిచేస్తారని గుర్తింపు పొందిన పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రజాప్రతినిధిపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. దీంతో వారి మద్దతు కూడగట్టుకునేందుకు డీఈఓ బదిలీ వ్యవహారాన్ని తన భుజాలపై వేసుకుని బదిలీ తతంగాన్ని చివరివరకు ఆయనే నడిపించినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డీఈఓ బదిలీకి దూకుడుగా వ్యవ హరించడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా పనిచేయని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడంలో డీఈఓ రమేష్ వెనుకంజ వేసేవారు కాదు. విధులకు సక్రమంగా హాజరుకాని ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన వారిలో అధికంగా ఉపాధ్యాయ సంఘాల్లోని జిల్లాస్థాయి నాయకులే ఉన్నారు. ఇదిలా ఉంటే పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు జూలై మొదటి వారం నుంచే ప్రత్యేక తరగతులతో పాటు ప్రతి శుక్రవారం క్విజ్ పోటీలు, తదితర కార్యక్రమాలను చేపట్టారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ సైతం డీఈఓ చేపట్టిన కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ అందుకు ప్రతి రోజూ విద్యార్థులకు సాయంత్రం వేళల్లో అల్పాహారం ఇచ్చేందుకు నిర్ణయించారు. దీంతో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పటిష్టతకు కలెక్టర్, డీఈఓ చేసిన కృషిని జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు. ఇదిలా ఉండగా పలు కారణాల చేత బదిలీ ఆగే అవకాశం లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. బదిలీ చేయడం సరికాదు సంగారెడ్డి మున్సిపాలిటీ: ప్రభుత్వ పాఠశాలల పటిష్టత కోసం కృషి చేస్తున్న జిల్లా విద్యాశాఖాధికారిని తన రాజకీయ పలుకుబడి కోసం బదిలీ చేయించడం సరైంది కాదని ఈ సమయంలో కలెక్టర్ జోక్యం చేసుకొని డీఈఓ బదిలీ నిలిపి వేయాలని టీ జేఏసీ పశ్చిమ జిల్లా చైర్మన్ వై.అశోక్‌కుమార్, ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కిషన్, మార్పు కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్నార్, టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి గౌతంరెడ్డి, ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షుడు సురేష్‌లు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. సమాజం కోసం నిజాయితీగా పనిచేసే అధికారులను తమ ఉనికి కోసం రాజకీయ నాయకులు బదిలీ చేయిం చడం సరికాదన్నారు. ఈ సంస్కృతిని ప్రజలు ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలో ఎస్పీగా పనిచేసిన అవినాష్ మహంతిని అలాగే బదిలీ చేయించారని, తాజాగా డీఈఓను మూడు సంవత్సరాలు నిలువకుండానే కొందరుస్వార్థ పరులు తమ ఉనికి కోసం బదిలీ చేయిస్తున్నారన్నారు. -
అనాథ బాలికను ఆదుకుంటాం : ఎంపీడీవో
ఇరగవరం, న్యూస్‌లైన్: కంటిచూపు కోల్పోరుున అనాథ బాలిక చాలా రమణను ఆదుకుంటామని ఎంపీడీవో ఎస్టీవీ రాజేశ్వరరావు హామీ ఇచ్చారు. ‘అసలే అనాథ.. ఆపై కంటిచూపు లేదు’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. మంగళవారం ఉదయం ఇరగవరంలోని బాలిక నివాసానికి వచ్చారు. బాలిక రమణతోను, స్థానికులతోను మాట్లాడారు. బాలికను చదివిస్తామని ఎంపీడీవో చెప్పారు. రేలంగిలోని బాలికల వసతి గృహంలో ఆమెను చేర్పిస్తామన్నారు. వెంటనే సదరం కార్యక్రమంలో దరఖాస్తు చేరుుంచి, పింఛను ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో వెల్లడించారు. రూ.2 వేల ఆర్థిక సాయం ఇరగవరం : వైఎస్సార్ సీపీ నాయకుడు విడివాడ రామచంద్రరావు అనాథ బాలిక చాలా రమణ ఇంటికి వచ్చి ఆమెకు రూ.2,000 ఆర్థిక సాయం చేశారు. ప్రభుత్వం ఆ బాలికను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆమెకు చదువు చెప్పిం చేందుకు అధికారులు కృషి చేయూలని, అంత్యోదయ పథకం కింద నెలకు 35 కేజీల బియ్యం, ప్రతినెలా పింఛను ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు అఖిల్‌రెడ్డి, పంపన వెంకటేశ్వరరావు, ఆర్.సత్యనారాయణ, డీవీ ప్రకాష్, ఎ.శ్రీనివాస్, ఎన్.ధనేష్, బి.సత్యనారాయణ ఉన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచండి
గుడ్లూరు, న్యూస్‌లైన్: ఉపాధ్యాయులు అకింతభావంతో పని చేసి విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని డీఈఓ రాజేశ్వరరావు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యూటీఎఫ్ జిల్లా స్థాయి విద్యా చైతన్య సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం లేకపోవడంతోనే పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై అభద్రతభావాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులుపై ఉందన్నారు. అక్షర ప్రకాశంలో ప్రతి ఉపాధ్యాయుడూ భాగస్వామి కావాలని కోరారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి కాలానికి అనుగుణంగా విద్యా రంగాన్ని సంస్కరించాలన్నారు. స్వార్థ ప్రమోజనాల కోసమే రాష్ట్రాన్ని విడదీస్తున్నారని మండిపడ్డారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటంలో యూటీఎఫ్ ముందుందని చెప్పారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ సమైక్యం కోసం పోరాడని సీమాంధ్ర రాజకీయ నాయకులకు పదవుల్లో కొనసాగే అర్హత లేదన్నారు. విద్యలో జిల్లా వెనకబడి ఉందని చెప్పారు. ఎమ్మెల్సీ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తోందని విమర్శించారు. అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామిరెడ్డి, వైఎస్ఆర్ సీపీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త తూమాటి మాధవరావు ప్రసంగించారు. సదస్సులో డిప్యూటీ డీఈఓ చాంద్‌బేగం, పీఈఓ వెంకట్రావు, ఎంఈఓ సుధాకరరావు, ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీ కరస్పాండెట్ కంచర్ల రామయ్య, దివి శ్రీనివాసులు నాయుడు, రమణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, జాన్ విలియం పాల్గొన్నారు. -
అదనపు బాధ్యతలతో బోధనకు దూరం
మార్కాపురం, న్యూస్‌లైన్: ఇన్‌చార్జ్‌ల పాలనతో జిల్లాలో విద్యాశాఖ గాడితప్పుతోంది. 56 మండలాల్లో కేవలం 9 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. మిగిలిన మండలాల్లో లేకపోవడంతో పాలన కుంటుపడుతోంది. జిల్లావ్యాప్తంగా 424 ఉన్నత పాఠశాలలు, 2,942 ప్రాథమిక, 419 ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. ఇదే సమయంలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో పిల్లలకు పాఠాలు చెప్పలేకపోతున్నారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి వివిధ పథకాలను అమలు చేస్తోంది. మధ్యాహ్న భోజన పథకం, స్కాలర్‌షిప్‌ల పంపిణీ, ఏకరూప దుస్తులు, పరీక్షల నిర్వహణ తదితర కార్యక్రమాలు పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎంఈఓలదే. ప్రస్తుతం జిల్లాలో కొమరోలు, దోర్నాల, సంతనూతలపాడు, అద్దంకి, మర్రిపూడి, కొరిశపాడు, కారంచేడు, ఉలవపాడు తదితర మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలుండగా మిగిలిన మండలాల్లో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. పదేళ్ల నుంచి ఎంఈఓల నియామకంపై హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కేసులు విచారణలో ఉన్నాయి. జిల్లా పరిషత్ టీచర్లు, ప్రభుత్వ టీచర్ల మధ్య ఎంఈఓల పదోన్నతులు, నియామకాలపై సందిగ్ధత నెలకొంది. అప్పటి నుంచి జిల్లాలోని వివిధ మండలాల్లో ఇన్‌చార్జ్‌ల పాలనలో విద్యాశాఖ నడుస్తోంది. ప్రధానోపాధ్యాయులు పాఠశాలల తనిఖీలు, విద్యార్థుల ప్రగతి, పాఠశాల నిధుల వినియోగం, ఎస్ఎంసీ సమావేశాలు తదితర కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంది. వారిని ఎఫ్ఏసీ ఎంఈఓలుగా నియమించడంతో ఓ వైపు పాఠశాల నిర్వహణ, మరోవైపు ఎంఈఓల బాధ్యతలు భారంగా మారాయి. ఇరువైపులా పర్యవేక్షణ కష్టమవుతోంది. ఇబ్బంది లేకుండా చూస్తున్నాం -రాజేశ్వరరావు, డీఈఓ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఈఓల సమస్య ఉంది. జిల్లాలో పదేళ్ల నుంచి రెగ్యులర్ ప్రతిపాదికపై ఎంఈఓల నియామకం లేకపోవడంతో సమీపంలో ఉన్న హెచ్ఎంలను ఎఫ్ఏసీ ఎంఈఓలుగా నియమించి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. -
తీరనున్న సబ్జెక్టు టీచర్ల కొరత
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ఇతర ఉన్నత పాఠశాలల్లో మిగులుగా ఉన్న సబ్జెక్టు టీచర్లను వర్క్ అడ్జస్ట్మెంట్ (పని సర్దుబాటు) కింద నియమించేందుకు వీలుకల్పిస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ జి.వాణీమోహన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సబ్జెక్టు టీచర్ల కొరత వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని ప్రజాప్రతినిధులు, జిల్లా విద్యాశాఖాధికారులు, కలెక్టర్లు, విద్యాశాఖ కమిషనర్ దృష్టికి పలువురు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. మెజారిటీ జిల్లాల్లో వివిధ కారణాల వల్ల ఈ ఏడాది చెలరేగిన అలజడులు, ఆందోళనలు విద్యాబోధనపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్న పాఠశాలలకు మిగులు టీచర్లు ఉన్న పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. పని సర్దుబాటుపై ఇతర పాఠశాలల్లో పనిచేసేందుకు నియమించబడే ఉపాధ్యాయులు తమ మాతృ పాఠశాల నుంచే జీతాలు తీసుకుంటారు. వీరంతా సకాలంలో నిర్దేశిత విధానంలో సిలబస్ పూర్తిచేయాలి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా, తరగతి, సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల కొరతను గుర్తించాలి. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఏయే సబ్జెక్టులకు ఎంతమంది టీచర్లు అవసరమో గుర్తించి సంబంధిత ఉప విద్యాధికారులకు నివేదించాలి. ఉప విద్యాధికారులు సబ్జెక్టు టీచర్ల కొరత వివరాలను జిల్లా విద్యాశాఖాధికారికి నివేదించాలి. జిల్లా విద్యాశాఖాధికారి కలెక్టర్ అనుమతితో పని సర్దుబాటుపై ఉపాధ్యాయులను ఇతర పాఠశాలల్లో నియమించాలి. మిగులు ఉపాధ్యాయులను గుర్తించే విషయంలో ఆయా పాఠశాలల్లో బోధనకు ఇబ్బంది కలగకుండా కూడా చూడాలని డెరైక్టర్ ఆదేశించారు. సర్దుబాటుకు మార్గదర్శకాలు ఇవీ... = విద్యాహక్కు చట్టం 2009 నిర్దేశించిన ప్రకారం పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ఉండేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాలలకు సబ్జెక్టు టీచర్ పోస్టులు మంజూరై ప్రస్తుతం ఖాళీగా ఉంటే వెంటనే ఆ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. పదోన్నతుల ద్వారా భర్తీ కాని సబ్జెక్టు టీచర్ పోస్టులను సర్దుబాటు ద్వారా భర్తీ చేయాలి. పాఠశాలల్లో రెండు కంటే ఎక్కువ పదో తరగతి సెక్షన్లు ఉంటే ఇద్దరు కంటే ఎక్కువ మంది సబ్జెక్టు టీచర్లు పనిచేస్తుంటే వారిలో ఒకరిని సర్దుబాటు చేయాలి. రెండు సెక్షన్లను కలిపివేసి ఒక సబ్జెక్టు టీచరును ఆ పాఠశాలలో కొనసాగించి రెండో టీచర్‌ను అవసరమున్న పాఠశాలకు సర్దుబాటు చేయాలి. పట్టణ ప్రాంతాల్లో, సక్సెస్‌స్కూళ్లలో మిగులు టీచర్లు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. ఆయా పాఠశాలల్లోని విద్యార్థులకు అవసరమైన వారి కంటే అదనంగా టీచర్లున్నారు. ఈ పాఠశాలల నుంచి అవసరమున్న పాఠశాలలకు టీచర్లను సర్దుబాటు చేయాలి. ఒక పాఠశాలలో ఒక సబ్జెక్టు టీచర్ కూడా లేకపోతే ఆ మండలంలోనే పొరుగున ఉన్న పాఠశాలలో ఇద్దరు సబ్జెక్టు టీచర్లుంటే వారిలో పదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయుడిని అక్కడే ఉంచి రెండో ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేయాలి. జిల్లాలో కొత్తగా ప్రారంభించిన ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూళ్లు) కూడా ఖాళీగా ఉన్న సబ్జెక్టు టీచర్ పోస్టులను పని సర్దుబాటు చేసే విధానం ద్వారా భర్తీచేసి ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యేవరకు కొనసాగించాలి. ఉపాధ్యాయుల పని సర్దుబాటుకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా పాటించి ఈ నెల 20వ తేదీ నాటికి సబ్జెక్టు టీచర్ల కొరత తీర్చాలి. కసరత్తు జరుగుతోంది : డీఈఓ రాజేశ్వరరావు ఉపాధ్యాయుల పని సర్దుబాటు ఉత్తర్వులపై కసరత్తు జరుగుతోంది. ఈ నెల 19న ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఈ విషయం చర్చించి కలెక్టర్ అనుమతితో టీచర్లకు సర్దుబాటు ఉత్తర్వులు జారీ చేస్తాం.