నేనేం చేయలేను
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ‘‘నేను ఆయన్ను(డీఈఓ రమేష్)ను ఇంకా రిలీవ్ చేయలేదు.. అలాంటప్పుడు మీకు ఎలా బాధ్యతలు అప్పగిస్తాను. అయినా ఎన్నికల విధుల్లో ఉన్న డీఈఓ రమేశ్‌ను ఇక్కడి నుంచి పంపడం నా పరిధిలో లేదు. అదంతా ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది. అంతవరకూ మీ విషయంలో నేనేం చేయలేను’’ విధుల్లో చేరడానికి వచ్చిన కొత్త డీఈఓ రాజేశ్వర్‌రావుతో కలెక్టర్ స్మితా సబర్వాల్ అన్న మాటలివి.
తొలినుంచీ డీఈఓ రమేష్ బదిలీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ స్మితా సబర్వాల్ తన పంథాను ఏ మాత్రం మార్చుకోలేదు. రమేష్‌ను ఇక్కడనుంచి పంపే అవకాశమే లేదంటూ మరోసారి తేల్చిచెప్పారు. ప్రకాశం జిల్లా డీఈఓగా పనిచేస్తున్న రాజేశ్వర్‌రావును మెదక్ జిల్లా డీఈఓగా బదిలీ కావడంతో బాధ్యతలు స్వీకరించేందుకు బుధవారం కలెక్టర్ వద్దకు రాగా ఆమె జాయిన్ చేసుకునేందుకు నిరాకరించారు. ప్రస్తుత డీఈఓ రమేష్‌ను రిలీవ్ చేయలేదనీ, అందువల్ల మీకు బాధ్యతలు అప్పగించలేనని రాజేశ్వర్‌రావుకు కలెక్టర్ స్మితాసబర్వాల్ స్పష్టం చేశారు.
దీంతో ఏంచేయాలో అర్థం కాక కొత్త డీఈఓ తలపట్టుకుంటున్నారు. డీఈఓగా విధులు నిర్వహిస్తున్న రమేశ్‌ను విద్యాశాఖ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ ఈ నెల 12న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్వర్‌రావును నియమించారు. ఈ మేరకు 18న ప్రకాశం జిల్లా నుంచి రిలీవ్ అయిన రాజేశ్వర్‌రావు బుధవారం మెదక్ డీఈఓగా విధుల్లోకి చేరేందుకు బుధవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌కు వచ్చారు. ముందుగా కలెక్టర్ స్మితా సబర్వాల్‌ను ఆమె చాంబర్‌లో కలవగా, బాధ్యతలు అప్పగించేందుకు కలెక్టర్ పూర్తిగా నిరాకరించారు. డీఈఓ రమేష్‌ను రిలీవ్ చేసేంతవరకు వేచి ఉండాలంటూ కలెక్టర్
ఆమె జాయిన్ చేసుకునేందుకు నిరాకరించారు. ప్రస్తుత డీఈఓ రమేష్‌ను రిలీవ్ చేయలేదనీ, అందువల్ల మీకు బాధ్యతలు అప్పగించలేనని రాజేశ్వర్‌రావుకు కలెక్టర్ స్మితాసబర్వాల్ స్పష్టం చేశారు.
దీంతో ఏంచేయాలో అర్థం కాక కొత్త డీఈఓ తలపట్టుకుంటున్నారు. డీఈఓగా విధులు నిర్వహిస్తున్న రమేశ్‌ను విద్యాశాఖ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ ఈ నెల 12న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్వర్‌రావును నియమించారు. ఈ మేరకు 18న ప్రకాశం జిల్లా నుంచి రిలీవ్ అయిన రాజేశ్వర్‌రావు బుధవారం మెదక్ డీఈఓగా విధుల్లోకి చేరేందుకు బుధవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌కు వచ్చారు. ముందుగా కలెక్టర్ స్మితా సబర్వాల్‌ను ఆమె చాంబర్‌లో కలవగా, బాధ్యతలు అప్పగించేందుకు కలెక్టర్ పూర్తిగా నిరాకరించారు. డీఈఓ రమేష్‌ను రిలీవ్ చేసేంతవరకు వేచి ఉండాలంటూ కలెక్టర్ సూచించడంతో రాజేశ్వర్‌రావు వెనుదిరిగారు.
కాగా డీఈఓ రమేశ్‌ను విధుల్లో నుంచి రిలీవ్ చేయలేమని, ఆయనకు ఎన్నికల బాధ్యతలు అప్పగించినందున ఎన్నికలు అయ్యేంతవరకు బదిలీని తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. వచ్చే నెల 3 వరకు ఎన్నికల విధుల్లో ఉన్నందున అప్పటివరకు డీఈఓ రమేశ్‌ను రిలీవ్ చేయలేమని కలెక్టర్ స్పష్టం చేసినట్లు సమాచారం. జిల్లా కలెక్టర్ విద్యాశాఖకు రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుంటే ఇప్పట్లో డీఈఓ రిలీవ్ అయ్యే అవకాశాలు కానరావటం లేదు. మరోవైపు ఇప్పటికే ప్రకాశం జిల్లా డీఈఓగా రిలీవ్ అయిన రాజేశ్వర్‌రావుకు ఇక్కడ బాధ్యతలు అప్పగించకపోవడంతో ఆయోమయంలో పడిపోయారు.