
దేశరాజధాని డిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందుగానే ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా సమ్మాన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద మహిళలకు తొలుత రూ. 1,000, ఆ తర్వాత ప్రతి నెలా రూ. 2,100 ఇస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది. ఎన్నికలకు ముందు మహిళలను ఆకట్టుకునేందుకు ఇలాంటి పథకాలను ప్రారంభించిన నాల్గవ రాష్ట్రం ఢిల్లీ. ప్రస్తుతం ఈ పథకంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఎన్నికల్లో విజయానికి..
మహిళలకు ప్రతినెలా ఆర్థికసాయం(Financial assistance) అందించే పథకాలు ఇటీవలి కాలంలో ఎన్నికల్లో గెలుపొందడానికి ఉపకరిస్తున్నాయని నిరూపితమయ్యింది. మధ్యప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు బీజేపీ నేత శివరాజ్ ఈ పథకాన్ని ప్రారంభించి, బీజేపీ ప్రభుత్వాన్ని గట్టెక్కించడంలో విజయం సాధించారు. ఇదేవిధంగా మహారాష్ట్రలోని ఏకనాథ్ షిండే ఇదే పథకం ఆధారంగా మహాయుతి కూటమికి మెజారిటీని అందించారు. జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ కూడా మయ్యా సమ్మాన్ పథకం ఆధారంగా వరుసగా రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా..
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలలో మహిళలకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చే పథకాలు ఒకేలా కనిపించినప్పటికీ వీటిలో కొన్ని తేడాలు ఉన్నాయి. ప్రధాన వ్యత్యాసం ఆయా రాష్ట్రాల్లోని మహిళలు స్వీకరించే నగదు మొత్తం. మరొకటి వారి వయసు. ఈ నాలుగు రాష్ట్రాల్లో అమలుచేస్తున్న పథకాలలో తేడాను ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్‌లో లాడ్లీ బహన్ యోజన కింద తొలుత మహిళలకు ప్రతినెలా రూ.1,000 ఇవ్వగా, ఇప్పుడు రూ.1,250 అందజేస్తున్నారు. మహారాష్ట్రలో ఇదే పథకం కింద మహిళలకు రూ.1,500 ఇస్తున్నారు. జార్ఖండ్‌లో ఈ తరహా పథకంలో మహిళలకు తొలుత రూ.1,000, తర్వాత రూ.2,500 అందజేస్తున్నారు. ఢిల్లీలో కూడా కేజ్రీవాల్(Kejriwal) ఇదే హామీనిచ్చారు.
ఏ రాష్ట్రంలో ఎంతమొత్తం?
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్(Mohan Yadav) రాష్ట్రంలోని మహిళలకు ప్రతినెలా రూ.5,000 ఇస్తానని హామీ ఇచ్చారు. కాగా మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో మొదటి విడతగా రూ.1,000 అందించగా, మహారాష్ట్రలో మొదటి విడతగా రూ.1,500 అందించారు. ఢిల్లీలో ఈ పథకంపై ఇంకా చర్చ నడుస్తోంది. జార్ఖండ్‌లో ఎన్నికల అనంతరం ఈ మొత్తాన్ని రూ.2,500కు పెంచారు. మధ్యప్రదేశ్‌లో ఈ మొత్తాన్ని క్రమంగా పెంచుతున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో లాడ్లీ బహన్ యోజనలో మహిళల వయోపరిమితి 21 నుంచి 60 ఏళ్లుగా ఉంది. జార్ఖండ్‌లో 21నుంచి 49 ఏళ్ల వయస్సు గల మహిళలు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందుతున్నారు.
ఢిల్లీలో చర్చనీయాంశంగా..
ఢిల్లీలో 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రతినెలా ఆర్ధికసాయం అందజేయనున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్‌లలోని ప్రభుత్వ శాఖలు ఈ పథకాలను నోటిఫై చేశాయి. అర్హులైన మహిళలు ఇప్పటికీ ఈ పథకం అందించే ప్రయోజనాలను పొందుతున్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అర్హులైన మహిళల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇంతలో ఈ పథకానికి సంబంధించి వెలువడిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: Year Ender 2024: కొత్తగా ప్రారంభించిన పథకాలు.. ప్రయోజనాలు ఇవే..
Comments
Please login to add a commentAdd a comment