
మన భారతదేశం ఖ్యాతీ ఖండాంతరాలకు కూడా చేరవవుతోంది. అందుకు నిదర్శనం ఇటీవల కాలంలో పలువురు విదేశీయలు పంచుకున్న తమ భారత పర్యటన అనుభవాలే. ప్రతి విదేశీయుడు ఇక్కడ ఉండటం అదృష్టంగా భావిస్తుంటే మనమే ఎంత గొప్పవాళ్లం అనిపిస్తోంది. అంతెందుకు మన భారతీయులే ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లి సెటిల్ అయ్యి కూడా.. మళ్లీ ఇక్కడకు వచ్చేస్తున్నారు. మాతృభూమే గొప్పదని కితాబిస్తున్నారు. మనం పుట్టిన దేశం కాబట్టి మనకు నచ్చుతుంది. కానీ ప్రాంతాలు, భాష, సంస్కృతుల్లో ఎంతో వైవిధ్యం ఉన్నప్పటికీ విదేశీయలు ఈ వాతావరణాన్ని ఇష్టపడుతుండటమే అత్యంత విశేషం. తాజాగా ఆ కోవలోకి మరో డెన్మార్క్ మహిళ కూడా చేరింది. పైగా ఆమె ఎలాంటి ప్లాన్ చేయకుండానే భారత్‌కి వచ్చి మంచి పనిచేశానంటోంది. మరీ ఆమెకు అంతగా భారత్‌లో ఏం నచ్చాయో చూద్దామా..!.
డెన్మార్క్ దేశ రాజధాని కోపెన్‌హాగన్‌లో నివశించే ఎస్మెరాల్డా అనే మహిళ భారత పర్యటను వెళ్లాలనే నిర్ణయం తీసుకుని మంచి పనిచేశానని అంటోంది. ఆ కోపెన్‌హాగన్ నగర వాతావరణంతో విసుగొచ్చేసిందని, మంచి మార్పుకావలని కోరుకున్నట్లు చెబుతోంది. అందుకోసమే తానెంతో ఇష్టపడ్డ స్నేహితులు, ఉద్యోగాన్ని, నాకిష్టమైన అపార్ట్‌మెంట్ తదితరాలన్నింటిని వదిలేసి మరీ భారత్ పర్యటనకు వచ్చేసిందట.
ఇది తాను తీసుకున్న నిర్ణయాల్లో బెస్ట్ అని చెబుతోంది. వేసవిలో మాత్రమే కోపెన్‌హాగన్ సరదాగా ఉంటుందే తప్పా..మిగతా సమయాల్లో బోరుగానే ఉంటుందని వాపోతోంది. అంతేగాదు తన నగరాన్ని నిద్రాణమైన ప్రదేశంగా అభివర్ణిస్తోందామె. ఇక భారతదేశంలో రిషికేశ్ నుంచి గోవా, ముంబై అంతటా చేసిన పర్యటనల్లో పొందిన అనుభవాలను డాక్యమెంట్ చేసి మరీ..ఇన్‌స్టాగ్రాంలో వీడియో రూపంలో షేర్ చేసింది.
ఆ వీడియోలో ఎస్మెరాల్డా భారత్‌పై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ.. వైవిధ్యమైన ప్రకృతి దృశ్యాలు, ఉత్సాహభరితమైన సంస్కృతి, ప్రజల ఆదరణను ఎంతగానో కొనియాడింది. ఈ భారత పర్యటనలో తన గురించి తాను తెలుసుకోగలిగానంటోంది. ఇక్కడ ప్రకృతి, వైవిధ్య భరితమైన సంస్కతి తనను ఎంతగానో కట్టిపడేశాయంటోంది. అంతేగాదు భారతదేశం తనలోని కొత్తకోణాలను పరిచయం చేసిందట.
ఇక్కడ జర్నీ ఓ అపూర్వ అనుభవాన్ని అందిచాయట. పైగా ప్రపంచాన్ని అన్వేషించే అవకాశాన్ని కూడా అందించిందని అంటోంది. చివరగా ఈ భారత పర్యటన తన జీవితాన్నే మార్చేసిందని చెబుతోంది. నిజానికి తాను యూరోపియన్ వేసవి సాహసయాత్రకు బయలుదేరే ముందు అనుకోకుండా భారతదేశ పర్యటనకు వచ్చానని, అనుకోకుండా ఇంకో నెల ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసుకున్నట్లు వివరించింది. ఇలా ఆమె దాదాపు పది నెలలు భారత్‌లో గడిపిందట.
అంతేగాదు వర్షాకాలంలో భారత్‌కి మళ్లీ తిరిగి రావాలనుకుంటున్నట్లు కూడా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది. ఇప్పుడు ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అంతేగాదు నెటిజన్లు కూడా ఆల్‌ది బెస్ట్ చెబుతూ..భారతదేశానికి వస్తూ ఉండండి అని ఆమెను ఆహ్వానిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: Train With ATM: దేశంలోనే తొలి ఏటీఎం రైలు..! ఎక్కడంటే..)