Living
-
‘లివింగ్ టెంపుల్’ ఆర్ట్ షో ప్రారంభం, ముఖ్య అతిథిగా స్మితా సబర్వాల్
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘లివింగ్ టెంపుల్’ హైదరాబాద్‌లోని రాయదుర్గంలోని టి-వర్క్స్‌లో ప్రారంభమైంది. భారతదేశ ఆలయ కళ, సంస్కృతి మరియు వారసత్వాన్ని చాటుకునే ఈ ప్రదర్శనలో టెంపుల్ ఆర్ట్ స్ఫూర్తితో 30 మంది కళాకారులు వారి వారి కళారూపాలను ప్రదర్శిస్తారు. ‘లివింగ్ టెంపుల్’ పేరుతో నిర్వహిస్తున్న మూడు రోజుల పాలు జరిగే ఈ వేడుకకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (పర్యాటక, సంస్కృతి, వారసత్వం మరియు యువజన వ్యవహారాల శాఖ, తెలంగాణ) స్మితా సబర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ , ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, భారత పురావస్తు సర్వే శాఖ కెకె ముహమ్మద్ తదితరులు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ మాట్లాడుతూ, “ఇది యువకులు, అనుభవజ్ఞులైన కళాకారులతో జమిలిగా కలిసి వచ్చే క్యాలెండర్ కార్యక్రమంగా ఉండాలని పిలుపునిచ్చారు. దీనికి తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త కెకె ముహమ్మద్ మాట్లాడుతూ, “వివిధ రకాల వారసత్వ పర్యటనలు ఉన్నాయి కానీ,అవి ప్రజలను ఆకట్టుకునేలా వినూత్నంగా ఉండాలన్నారు. సందర్శకులకు ఈ ప్రదర్శనను ఆదరించడం ద్వారా సింగపూర్, చైనాలో లాగా ఈ స్మారక చిహ్నాలను జీవన వారసత్వంగా మార్చాలని అభిలషించారు.మన వారసత్వాన్ని, ప్రకృతిని కాపాడుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు ప్రముఖ ఆర్టిస్ట్, కళా దర్శకుడు తోట తరణి తన సెట్‌ను తీసివేసినపుడు, ఈ ప్రదేశంలో ఎలాంటి శిథిలాలు లేకుండా జాగ్రత్త పడతానని వివరించారు.తెలంగాణ టూరిజం మద్దతుతో అన్నపూర్ణ మడిపడిగ క్యూరేట్ చేస్తున్న ‘లివింగ్ టెంపుల్’ దేశవ్యాప్తంగా ఉన్న 30 మందికి పైగా ప్రఖ్యాత కళాకారులు భారతీయ దేవాలయాల గొప్ప వారసత్వాన్ని ప్రదర్శిస్తారు. 100 కి పైగా అద్భుతమైన కళాకృతులతో,సాంప్రదాయ ఆలయ కళ, సమకాలీన కళాత్మక వ్యక్తీకరణల అందమైన కలయికగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్భుతమైన కళాఖండాల సేకరణతో పాటు - ఆర్ట్ - హెరిటేజ్ టూరిజం - ది మిస్సింగ్ లింక్ , ప్యానెల్ చర్చ, సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. తోట తరణి, అమర్ రమేష్, ద్రధా, చరణ్ జీత్, పర్ణవి బంగర్, రాయన్న గిరిధర్ గౌడ్, సంగం వంఖడే, వినోద్ దరోజ్ లాంటి అనేక ప్రఖ్యాత కళాకారుల బృందం అద్భుతమై ప్రదర్శనివ్వబోతోంది. ఈ కార్యక్రమం పురావస్తు శాస్త్రవేత్త కెకె మొహమ్మద్, ఫోటోగ్రాఫర్ అమర్ రమేష్ , కళాకారుడు ద్రధా వ్రత వంటి నిపుణుల సహకారం తో ‘లివింగ్ టెంపుల్’ భారతీయ ఆలయ సంస్కృతి యొక్క సజీవ వారసత్వానికి ఒక వేడుక, ఒక మరపురాని అనుభవాన్ని మిగల్చినుంది అనడంలో సందేహంలేదు.ఫిబ్రవరి 28 2025 మార్చి 2 వరకు సందర్శకులకు ఆహ్వానంప్రదర్శన: ఉదయం 11:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకువేదిక : టి-వర్క్స్, శిల్ప్ గ్రామ్ క్రాఫ్ట్ విలేజ్, రాయ్ దుర్గ్, హైదరాబాద్, తెలంగాణ 500081.మరిన్ని వివరాల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెం.అన్నపూర్ణ మడిపడిగ- 9052594901 -
కలిసే దూరంగా ఉందాం!
పెళ్లయిన కొత్తలో ఆమె ఏం చెప్పినా, చేసినా అతనికి ఎంతో ఇష్టం. ఇద్దరికీ నచ్చిన ఫుడ్, నచ్చిన రంగు, నచ్చిన హాలిడే వెకేషన్. కొన్నాళ్లు గడిచాక సీన్ రివర్స్. ఏం చేసినా తప్పే. చేయకపోయినా తప్పే. టాయిలెట్ కమోడ్ మూత వేయకపోతే మాటల యుద్ధం. మంచంపై తడిసిన తువ్వాలు కనిపిస్తే పెద్ద వాగ్వాదం. ఏసీ నంబర్ పెంచినా, తగ్గించినా పట్టరానంత కోపాలు. పెద్దలు కుదిర్చిన పెళ్లికావొచ్చు మనసులు కలిపిన ప్రేమ వివాహం కావొచ్చు. కీచులాటలు కామన్. ఇలా కొట్టుకుంటూ కలిసుండే బదులు విడిపోతే బాగుండు అనే జంటలు కోకొల్లలు. శాశ్వతంగా విడిపోకుండా దూరం దూరంగా వేర్వేరు ఇళ్లలో ఉంటూ ఒకరికిపై మరొకరు గాఢమైన ప్రేమానుబంధాలను పెంచుకునే కొత్త ధోరణి ఇప్పుడు మొగ్గ తొడిగి వేగంగా విస్తరిస్తోంది. దీనికే ఇప్పుడు చాలా జంటలు ‘దూరంగా కలిసి బతకడం( లివింగ్ అపార్ట్ టుగెదర్ ) అనే కొత్త పేరు పెట్టి ఆచరిస్తున్నాయి. ఈ నయా ట్రెండ్‌లోని విశేషాలను తెల్సుకునేందుకు ఆయా జంటల జీవితాల్లోకి ఓసారి తొంగిచూద్దాం.. ఏమిటీ ఎల్ఏటీ? లివింగ్ అపార్ట్ టుగెదర్ (ఎల్ఏటీ) గురించి 19వ శతాబ్దానికి చెందిన లెబనాన్ మూలాలున్న అమెరికన్ రచయిత కహ్లిల్ గిబ్రాన్ తన ‘పెళ్లి’కవితలో తొలి సారిగా ప్రస్తావించారు. భా ర్యభర్తలు ఒకరిపై మరొకరికి ఎనలేని ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ తమ అహం కిరీటం కిందపడొద్దనే కారణంగా తమ మాటే నెగ్గాలనే మొండిపట్టుదలతో చిన్నపాటి వాగ్వాదాలకు దిగుతారు. తర్వాత బాధపడతారు. మళ్లీ అంతా సర్దుకోవడానికి కాస్తంత సమ యం పడుతుంది.ఇప్పుడున్న ఆధునిక యుగంలో భార్యాభర్తలిద్దరూ సొంత కెరీర్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. వేర్వేరు చోట్ల ఉద్యోగాలు, వృత్తుల్లో నిమగ్నమవుతున్నారు. పని కోసం వేరే చోట ఉండాల్సి రావడం, వ్యక్తిగత అభిప్రాయాలకు గౌరవించాల్సి రావడం, అన్యోన్యంగా ఉన్నాసరే కొన్నిసార్లు వ్యక్తిగత ఏకాంతం(పర్సనల్ స్పేస్) కోరుకోవడం వంటివి జరుగుతున్నాయి. వీటికి పరిష్కార మార్గంగా జంటలే తమకు తాముగా ఎల్ఏటీకి జై కొడుతున్నాయి. చినికిచినికి గాలివాన దుమారంగా మారే ప్రమాదాలను దూరం దూరంగా ఉండటం వల్ల తప్పించుకోవచ్చని జంటలు భావిస్తున్నాయి.ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇస్తూనే ఇలా దూరంగా ఉంటూ మానసికంగా అత్యంత దగ్గరగా ఉంటున్నామని ఎల్ఏటీ జంటలు చెబుతున్నాయి. ‘‘సాన్నిహిత్యంలోనూ కా స్తంత ఎడం ఉంచుదాం. ఈ స్వల్ప దూరా ల్లోనే స్వర్గలోకపు మేఘాల స్పర్శను స్పశిద్దాం’’అంటూ జంటలు పాటలు పాడుకుంటున్నాయని కవి గిబ్రాన్ ఆనాడే అన్నారు. ఎవరికి బాగా నప్పుతుంది?వేర్వేరు చోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే జంటలు ఈ సిద్ధాంతాన్ని ఆచరించి మంచి ఫలితాలు పొందొచ్చు. ముఖ్యమైన పనుల మీద దూరంగా, విదేశాల్లో గడపాల్సిన జంటలు ఈ మార్గంలో వెళ్లొచ్చు. వ్యక్తిగత ఏకాంతం కోరుకుంటూనే జీవిత భాగస్వామికి అత్యంత విలువ ఇచ్చే జంటలూ ఈ సిద్ధాంతం తమకు ఆమోదయోగ్యమేనని చెబుతున్నాయి. వేర్వేరు కార్యాలయాలు, భిన్న వృత్తుల్లో, విభిన్న సమయాల్లో పనిచేసే జంటలకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భాగస్వామికి అతిభారంగా మారకూడదని, ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడదామని భావించే జంటలూ ఈ ట్రెండ్‌ను ఫాలో కావొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఎలా సాధ్యం?కథలు, సినిమాల్లో, నవలల్లో ప్రస్తావించినట్లు దూరంగా ఉన్నప్పుడు ప్రేమికులను విరహవేదన కాల్చేస్తుంది. అదే వేదన ఈ జంటలకు ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. కలిసిమెలిసి ఉంటేనే బంధం బలపడుతుందన్న భావనకు భిన్నమైన సిద్ధాంతం ఇది. కాస్తంత కష్టపడితే ఈ బంధాన్నీ పటిష్టపరుచుకోవచ్చని మనోవిజ్ఞాన నిపుణులు చెప్పారు. ‘‘వారాంతాలు, సెలవు దినాల్లో ఒకరి నివాస స్థలానికి ఇంకొకరు వచ్చి ఆ కాస్త సమయం అత్యంత అన్యోన్యంగా గడిపివెళ్తే చాలు. తమ మధ్య దూరం ఉందనే భావన చటక్కున మటుమాయం అవుతుంది.కలిసి ఉన్నప్పటి సరదా సంగతులు, మధుర స్మృతులను మాత్రమే టెక్ట్స్ రూపంలో సందేశాలు పంపుతూ గుర్తుచేసుకుంటూ ప్రేమ వారధికి మరింత గట్టిదనం కల్పించొచ్చు. కలిసి ఉన్నప్పుడు జరిగిన గొడవలను భూతద్దంలోంచి చూడటం మానేయాలి. ఆధునిక జంటల్లో స్వతంత్ర భావాలు ఎక్కువ. గతంతో పోలిస్తే వ్యక్తిగత ఏకాంతం ఎక్కువ కోరుకుంటారు. జీవిత భాగస్వామి ఆలోచనలకు విలువ ఇవ్వాలి. పాత, చేదు విషయాలను తవ్వుకోవడం తగ్గించాలి’’అని ఢిల్లీలోని ఎల్ఏటీ నిపుణుడు రుచీ రూహ్, మానసిక నిపుణుడు, జంటల మధ్య మనస్పర్థలను తగ్గించే డాక్టర్ నిషా ఖన్నా సూచించారు. చివరగా చెప్పేదేమంటే? విడివిడిగా జీవించే సమయాల్లో ఇద్దరి మధ్యా నమ్మకం అనేది అత్యంత కీలకం. ఆర్థిక, శారీరక, మానసిక అంశాలను నిజాయతీగా, నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా మాట్లాడుకుని కష్టాల కడలిలోనూ జీవననావ సాఫీగా సాగేలా చూసుకోవాలి. ఎప్పుడు కలవాలి? ఎక్కడ కలవాలి? ఎంతసేపు కలవాలి? ఏమేం చేయాలి? అనేవి ముందే మాట్లాడుకుంటే వేచి చూడటం వంటి ఉండవు. అనవసర కోపాలు, అపార్థాలు రావు. భారత్‌లో బ్రతుకు దెరువు కోసం లక్షలాది కుటుంబాల్లో పురుషులు వేరే జిల్లాలు, రాష్ట్రాలకు వలసవెళ్తూ భార్యను గ్రామాల్లో ఒంటరిగా వదిలి వెళ్తున్నారు.విశాల దృక్పథం, మానసిక పరిణతి కోణంలో చూస్తే భారత్‌లో దశాబ్దాలుగా ఎల్ఏటీ సంస్కృతి ఉందనే చెప్పాలి. ప్రత్యేకంగా పేరు పెట్టకపోయినా నోయిడా, గుర్గావ్, ఢిల్లీ, ముంబైలలో ఇద్దరూ పనిచేసే చాలా జంటలు ఇదే సంస్కృతిని ఆచరిస్తున్నాయి. వేర్వేరు చోట్ల ఉద్యోగాలు, సొంతూర్లలో వృద్ధ తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యతల కారణంగా మెట్రో నగరాల్లో చాలా జంటలు దూరంగా ఉంటున్నాయి. పశ్చిమదేశాల్లో ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి బాగా విస్తరిస్తోంది. -
చిన్న వయసు.. ముసలి శరీరం.. ఇకలేదు
అమితాబ్ నటించిన బాలీవుడ్ సినిమా ‘పా’ గుర్తుండేవుంటుంది. అందులో అమితాబ్ అత్యంత అరుదైన జన్యు సంబంధిత వ్యాధి ప్రొజెరియాతో బాధపడుతుంటాడు. ఈ వ్యాధి సోకిన చిన్నారులకు బాల్యంలోని వృద్ధాప్య ఛాయలు రావడంతో పాటు ఆ లక్షణాలు కూడా వచ్చి మరణిస్తుంటారు. ‘పా’ సినిమా వచ్చిన తరువాత చాలామందికి ఈ వ్యాధిపై అవగాహన ఏర్పడింది. ఇదే వ్యాధితో సుదీర్ఘ కాలం జీవించిన ‘సమ్మీ బస్సో’ తన 28వ ఏట కన్నుమూశాడు. ‘సమ్మీ బస్సో’ అరుదైన జన్యు వ్యాధి ‘ప్రొజెరియా’తో బాధపడుతూ ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా రికార్డులకెక్కాడు. ఈ వ్యాధి సోకిన చిన్నారులు తమ రెండేళ్ల వయసు నుంచే వృద్ధాప్యానికి చేరుకుంటారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ‘సమ్మీ బస్సో’ తన 28వ ఏట కన్నుమూశాడు. ప్రొజెరియాను హచిన్సన్-గిల్ఫోర్డ్ సిండ్రోమ్ లేదా హెచ్జిపిఎస్ అని కూడా పిలుస్తారు. ప్రొజెరియా వ్యాధి సోకినప్పుడు చిన్నారులు వయసు మీద పడినట్లు కనిపిస్తారు, ప్రొజెరియా బారిన పడినవారి ఆయుర్ధాయం గరిష్టంగా 13.5 ఏళ్లు మాత్రమే ఉంటుంది.ఈ వ్యాధి ప్రతి ఎనిమిది మిలియన్ల మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది . అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 20 మిలియన్లలో ఒకరిని బాధిస్తుంది. 1995లో ఇటలీలోని వెనెటోలో జన్మించిన సమ్మీ బస్సోకు రెండేళ్ల వయసులో ప్రొజెరియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ నేపధ్యంలో అతని తల్లిదండ్రులు ఇటాలియన్ ప్రొజెరియా అసోసియేషన్‌ను స్థాపించారు. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీలో సమ్మీ బస్సో జీవితాన్ని చూపించిన నేపధ్యంలో ప్రొజెరియా వ్యాధి అంటే సమ్మీ బస్సో గుర్తుకు వచ్చేలా చేసింది.సమ్మీ బస్సో స్నేహితులలో ఒకరైన రికార్డో అతని మరణాంతరం తన ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘ఈ రోజు మా ఇంటి దీపం ఆరిపోయింది. నీ అద్భుతమైన జీవితంలో మమ్మల్ని భాగస్వాములను చేసినందుకు ధన్యవాదాలు సమ్మీ ’ అంటూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రాశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా క్లాసిక్ ప్రొజెరియా కేసులు 130 మాత్రమే నమోదయ్యాయి. వాటిలో నాలుగు ఇటలీలో ఉన్నాయి.ఇది కూడా చదవండి: హమాస్ చీఫ్ బతికే ఉన్నాడు: ఇజ్రాయెల్ మీడియా -
రూట్ బ్రిడ్జ్ యునెస్కో జాబితాలో...
మేఘాలయ రాష్ట్రంలో సర్వసాధారణంగా కనిపించే లివింగ్ రూట్ బ్రిడ్జీల గురించి మనకు తెలిసిందే. ఆ రాష్ట్రానికే మన దేశానికీ ప్రకృతి పరంగా గుర్తింపు తెచ్చిన ఈ రూట్ బ్రిడ్జ్‌లకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా ఇవ్వడం కోసం ప్రతినిధుల బృందం తరలి వచ్చింది. ప్రస్తుతం యునెస్కో తాత్కాలిక జాబితాలో ఉన్న లివింగ్ రూట్ బ్రిడ్జ్‌లను ప్రపంచ ప్రసిద్ధ వారసత్వ జాబితాలోకి చేరనుందని మేఘాలయ పర్యాటక మంత్రి పాల్ తెలియజేస్తున్నారు. 42వ యునెస్కో జనరల్ కాన్ఫరె ్స ప్రెసిడెంట్, రొమేనియా రాయబారి అయిన సిమోనా–మిరేలా మికులేస్కుతో లింగ్డో, జింగ్కీంగ్ జ్రీ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో గుర్తించడం కోసం సమావేశం జరి΄ారు. ఈ సమావేశంలో యునెస్కో భారత రాయబారి, శాశ్వత ప్రతినిధి కూడా ఉన్నారు. -
అచ్చం బిచ్చగాడిలా నమ్మించి..
అతనో నటుడు.. చిన్నచిన్న వేషాలు వేస్తుంటే వచ్చే డబ్బుతో ఇల్లు గడవట్లేదు. ఎలాగా అని ఆలో చించి ఓ కొత్త వేషం వేశాడు. అది సినిమాల్లోనో, సీరి యళ్లలోనో కాదు.. బయట జనం మధ్యలో నటించడం మొదలుపెట్టాడు. ఈ వేషం సూపర్ సక్సెస్ అయింది. నెలకు ఎనిమిది లక్షల రూపాయలకుపైనే సంపాదించి పెట్టేస్తోంది. అది కూడా ఆదాయ పన్ను వంటివేమీ కట్టాల్సిన అవసరం లేని సంపాదన. మరి ఆ వేషమేంటో తెలుసా..? ‘బిచ్చగాడు’. చైనాలో ని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన లు జింగాంగ్ కథ ఇది. అతను సుమారు పన్నెండేళ్ల కింద ఓ రోజు ‘నటన’ మొదలుపెట్టాడు. అక్కడ ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండే పర్యాటక ప్రదేశం ‘కిన్మింగ్ షాంగే గార్డెన్’ను ఎంచుకున్నాడు. ముఖానికి కాస్త మసి, చిరుగులు– అతుకులతో ఉన్న బట్టలు వేసుకుని.. ఓ చేతి లో కర్ర, మరో చేతిలో చిప్ప పట్టుకుని.. చూడగానే జాలి కలి గేలా అమాయ కపు మొహం వేసుకుని అడుక్కోవడం మొదలుపెట్టాడు. మనోడి నటనా కౌశలానికి పర్యాట కులు పడిపోయి దండిగానే డబ్బులు వేయడం మొదలుపెట్టారు. అలా నెలకు రూ.8లక్షలకుపైనే సంపాదిస్తున్నాడట. జింగాంగ్ అడుక్కోవడం మొదలుపెట్టిన కొత్తలో అతడి కుటుంబ సభ్యులు ఛీకొట్టి వదిలేసి పోయారట. కానీ బాగా డబ్బులు వెనకేశాక.. మళ్లీ అంతా తిరిగొచ్చేశారట. అంతా ‘నటన’!? -
Living Planet Index: ఐదో వంతు జీవ జాతులు... అంతరించే ముప్పు
ప్రపంచవ్యాప్తంగా పలు కారణాలతో ఏటా వలస బాట పట్టే అసంఖ్యాక జీవ జాతులపై తొలిసారిగా సమగ్ర అధ్యయనానికి ఐక్యరాజ్యసమితి తెర తీసింది. ఇందులో భాగంగా 1997 ఐరాస ఒప్పందం ప్రకారం రక్షిత జాబితాలో చేర్చిన 1,189 జీవ జాతులను లోతుగా పరిశీలించారు. పరిశోధనలో తేలిన అంశాలను 5,000 పై చిలుకు జీవ జాతుల తీరుతెన్నులను 50 ఏళ్లుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్), లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ సంస్థల గణాంకాల సాయంతో విశ్లేíÙంచారు. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 22 శాతం జీవ జాతులు అతి త్వరలో పూర్తిగా అంతరించనున్నట్టు తేలింది. మొత్తమ్మీద 44 శాతం జీవ జాతుల సంఖ్య నిలకడగా తగ్గుముఖం పడుతూ వస్తున్నట్టు వెల్లడైంది. ఈ వివరాలతో కూడిన తాజా నివేదికను ఐరాస ఇటీవలే విడుదల చేసింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఐదో వంతు వలస జీవజాతులు అంతరించే ప్రమాదంలో పడ్డాయి. జీవజాతుల వలసలు కొత్తగా మొదలైనవి కావు. అనాదిగా భూమ్మీదా, సముద్రంలోనూ అత్యంత కఠినతరమైన, భిన్న వాతావరణ పరిస్థితుల గుండా ఏటా వందల కోట్ల సంఖ్యలో సాగుతుంటాయి. ఇన్నేళ్లలో ఏనాడూ లేని ముప్పు ఇప్పుడే వచ్చి పడటానికి ప్రధాన కారణం మానవ జోక్యం, తత్ఫలితంగా జరుగుతున్న వాతావరణ మార్పులు, సాగుతున్న పర్యావరణ విధ్వంసమే’’ అని తేలి్చంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ఐరాస వలస జాతుల సంరక్షణ సదస్సు కార్యదర్శి అమీ ఫ్రాంకెల్ అన్నారు. గత వారం ఉబ్జెకిస్తాన్‌లోని సమర్ఖండ్లో జరిగిన సదస్సు భేటీలో ఈ అంశాన్నే ఆయన నొక్కిచెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా 30 శాతం భూ, సముద్ర భాగాల సమగ్ర పరిరక్షణకు కృషి చేస్తామంటూ 2022 గ్లోబల్ బయో డైవర్సిటీ సమిట్‌లో పాల్గొన్న దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. దాన్ని నెరవేర్చాల్సిన సమయం వచ్చింది’’ అన్నారు. ప్రమాదపుటంచుల్లో... 1979 ఐరాస రక్షిత జాబితాలోని 1,189 జీవ జాతులను నివేదిక లోతుగా పరిశీలించింది. అనంతరం ఏం చెప్పిందంటే... ► ప్రపంచవ్యాప్తంగా 44 శాతం వలస జీవ జాతుల సంఖ్య నానాటికీ భారీగా తగ్గుముఖం పడుతోంది. ► 22 శాతం అతి త్వరలో అంతరించేలా ఉన్నాయి. మొత్తమ్మీద ఐదో వంతు అంతరించే ముప్పు జాబితాలో ఉన్నాయి. ► ఇది జీవవైవిధ్యానికి తీవ్ర విఘాతం. మన జీవనాధారాలపైనా, మొత్తంగా ఆహార భద్రతపైనా పెను ప్రభావం చూపగల పరిణామం. ► ఆవాస ప్రాంతాలు శరవేగంగా అంతరిస్తుండటం మూడొంతుల జీవుల మనుగడకు మరణశాసనం రాస్తోంది. ► జంతువులు, చేపల వంటివాటిని విచ్చలవిడిగా వేటాడటం కూడా ఆయా జాతుల మనుగడను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ► కార్చిచ్చులు, గ్లోబల్ వారి్మంగ్ వంటివి ఇందుకు తోడవుతున్నాయి. ► భారీ డ్యాములు, గాలి మరలకు తోడు ఆకస్మిక వరదలు, అకాల క్షామాలు తదితరాల వల్ల వలస దారులు మూసుకుపోవడం, మారిపోవడం జరుగుతోంది. ఇది పలు జీవ జాతులను అయోమయపరుస్తోంది. ఏం చేయాలి? తక్షణం వలస జీవ జాతుల సంరక్షణ చర్యలకు పూనుకోవాల్సిన ఆవశ్యకతను నివేదిక నొక్కిచెప్పింది. అందుకు పలు సిఫార్సులు చేసింది... ► జీవావరణాల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. ► భారీ డ్యాములు తదితరాల పర్యావరణ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తగు నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. ► ఈ అన్ని సమస్యలకూ తల్లి వేరు పర్యావరణ విధ్వంసం. కార్చిచ్చులకైనా, అకాల వరదలు, క్షామాలకైనా, గ్లోబల్ వార్మింగ్కైనా అదే ప్రధాన కారణం. కనుక దానికి వీలైనంత త్వరలో చెక్ పెట్టేందుకు దేశాలన్నీ కృషి చేయాలి. ఆహారం, పునరుత్పాదన వంటి అవసరాల నిమిత్తం వేలాది జీవ జాతులు వలస బాట పట్టడం ప్రపంచవ్యాప్తంగా అనాదిగా జరుగుతూ వస్తున్న ప్రక్రియ. పలు జంతు, పక్షి జాతులైతే కోట్ల సంఖ్యలో వలస వెళ్తుంటాయి. ఈ క్రమంలో కొన్ని పక్షి జాతులు ఏటా 10 వేల కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటాయి! పర్యావరణ సంతులన పరిరక్షణకు కూడా ఎంతగానో దోహదపడే ప్రక్రియ ఇది. కానీ గ్లోబల్ వారి్మంగ్, వాతావరణ మార్పుల ప్రభావం జంతువులు, పక్షుల వలసపై కూడా విపరీతంగా పడుతోంది. ఈ ప్రమాదకర పరిణామంపై ఐరాస తీవ్ర ఆందోళన వెలిబుచి్చంది. దీనికి తక్షణం అడ్డుకట్ట వేయకపోతే కనీసం ఐదో వంతు వలస జీవులు అతి త్వరలో అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందని తాజా నివేదికలో హెచ్చరించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పైసా లేకుండా జీవించడం ఎలా? 15 ఏళ్లుగా ‘మార్క్ బాయిల్’ ఏం చేస్తున్నాడు?
ప్రపంచంలో అధికశాతం మంది జీవితంలో వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించి, సుఖంగా జీవించాలని కలలు కంటారు. పేదరికంలో మగ్గిపోవాలని ఎవరూ కోరుకోరు. ఉన్నత చదువులు చదువుకుని, మంచి ఉద్యోగం చేస్తూ, అధికంగా సంపాదించగలిగే అర్హత కలిగిన ఒక వ్యక్తి భిన్నమైన నిర్ణయం తీసుకుని, ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ కథ యునైటెడ్ కింగ్డమ్ నివాసి మార్క్ బాయిల్‌కి సంబంధించినది. 2008లోనే బాయిల్ డబ్బును వినియోగించడం మానుకుని ఆనందంగా కాలం వెళ్లదీస్తున్నాడు. సాంకేతికతలాంటి విషయాల జోలికి వెళ్లకుండా ప్రకృతితో మమేకమై జీవించడాన్ని అలవర్చుకున్నాడు. మార్క్ బాయిల్.. బిజినెస్ అండ్ ఎకనామిక్స్‌లో డిగ్రీ తీసుకున్నాడు. చదువు పూర్తయిన వెంటనే బ్రిస్టల్‌లోని ఒక ఫుడ్ కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం సంపాదించాడు. జీవితంలో విజయం సాధించేందుకు ఏళ్ల తరబడి కష్టపడ్డాడు. అయితే 2007లో ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా జరిగిన సంఘటన బాయిల్ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. హౌస్‌బోట్‌లో కూర్చున్న బాయిల్ అక్కడున్నవారు మాట్లాడుకున్న మాటలను విన్నాడు. అందరూ డబ్బు గురించే మాట్లాడుకుంటున్నారు. దీంతో అన్ని సమస్యలకు ఏకైక మూలం డబ్బు అని బాయిల్ గ్రహించాడు. అందుకే తాను డబ్బుకు అతీతంగా జీవించాలని, డబ్బు సంపాదించకూడదని, అలాగే ఖర్చు పెట్టకూడదని కఠినంగా నిర్ణయించుకున్నాడు. దీంతో మార్క్ బాయల్ తన ఖరీదైన హౌస్‌బోట్‌ను విక్రయించి, తన పాత కారవాన్‌లో నివసించడం మొదలుపెట్టాడు. డబ్బు లేకుండా జీవితాన్ని గడపసాగాడు. ఈ నేపధ్యంలో కొన్ని నెలలు పలు సమస్యలను ఎదుర్కొన్నాడు. టీ, కాఫీలతో పాటు ఇతర సౌకర్యాలను వదులుకున్నాడు. ప్రకృతి అందించేవాటిని మాత్రమే ఉపయోగించసాగాడు. ఇటువంటి ప్రకృతి సహజ జీవనం ప్రారంభించినప్పటి నుంచి తాను అనారోగ్యం బారిన పడలేదని, తనకు ఆరోగ్య రక్షణ అవసరం లేదని బాయిల్ తెలిపాడు. బాయిల్ జీవితాన్ని చూసిన చాలామంది అతనికి స్నేహితులుగా మారారు. తాను 2017లో టెక్నాలజీ జోలికి వెళ్లడాన్ని పూర్తిగా వదులుకున్నానని, సాంకేతికతతో ముడిపడిన పాత జీవితం కాకుండా, సహజసిద్దంగా ప్రకృతితో గడిపే భావి జీవితం గురించి నిరంతరం ఆలోచిస్తుంటానని బాయిల్ తెలిపాడు. ఇది కూడా చదవండి: ఎస్క్లేటర్పై నిషేధమున్న నగరం ఏది? గణాంకాలు ఎందుకు బెంబేలెత్తిస్తున్నాయి? -
వైఎస్సార్ స్మృతివనంలో ఆఫ్రికా వృక్షం
ఆత్మకూరు రూరల్ (నంద్యాల): ప్రపంచంలో అత్యంత ఎక్కువ సంవత్సరాలు జీవించే వృక్షజాతుల్లో అడెనేషియా సోనియా ఒకటి. ఆఫ్రికా ఖండంలో విస్తారంగా కనిపించే ఈ మహావృక్షం మనదేశంలోనూ అక్కడక్కడా కనిపిస్తుంది. కర్నూలు జిల్లా గార్గేయపురం గ్రామంలో ఒకటి, గ్రామ శివార్లలో కర్నూలు–గుంటూరు జాతీయ రహదారి పక్కన మరో రెండు వృక్షాలున్నాయి. అలాగే జిల్లా కేంద్రమైన నంద్యాలలో ఎస్పీజీ గ్రౌండ్స్ పక్కనున్న క్రైస్తవ శ్మశాన వాటికలో రెండు వృక్షాలు కనిపిస్తున్నాయి. గార్గేయపురంలో ఉన్న చెట్లలో ఒకదానిని ట్రీ ట్రాన్స్‌లొకేషన్ పద్ధతిలో అక్కడ నుంచి ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామ శివార్లలో ఉన్న వైఎస్సార్ స్మృతివనంలో పునఃస్థాపించారు. ఆఫ్రికాలోని టాంజానియాలో ఉన్న అడెన్ సోనియా చెట్టు వయస్సు 6వేల ఏళ్లుగా నిర్ధారించి ఇది ప్రపంచంలో ఎక్కువ కాలంగా జీవించిన చెట్టుగా చెబుతున్నారు. వీటిని ఇక్కడ బ్రహ్మమల్లిక, ఏనుగు చెట్టు, పారిజాతంగా పిలుస్తున్నారు. -
అది రహస్య కుటుంబం.. 40 ఏళ్లుగా దట్టమైన అడవుల్లోనే ఉంటూ..
ఇది ఒక విచిత్ర కుటుంబానికి చెందిన కథ. వారు బాహ్యప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా బతికారు. ప్రపంచంలో ఏమి జరుగుతోందో వారికి ఏమాత్రం తెలియదు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రపంచమంతా అల్లకల్లోలమైపోయింది. ఈ విషయం కూడా ఆ కుటుంబానికి తెలియదు. ఈ కుటుంబంలోని వారు సెర్బియాలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో గుడిసె వేసుకుని జీవించారు. వారిని ఒక శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. ఇది 1978 నాటి ఉదంతం. ఖనిజ సంపదను అన్వేషించే ప్రయత్నంలో.. డైలీ స్టార్ తెలిపిన వివరాల ప్రకారం భూవిజ్ఞాన శాస్త్రవేత్తల బృందం హెలికాప్టర్ ద్వారా సెర్బియాలోని దట్టమైన అడవులతో కూడిన ఒక ప్రాంతానికి వెళ్లింది. ఖనిజ సంపదను అన్వేషించే ఉద్దేశంతో వారి ప్రయాణం సాగింది. అనుకోని రీతిలో హెలికాప్టర్ పైలెట్ ఏదో నగరానికి 155 మైళ్ల దూరంలో ప్రత్యేకంగా కనిపిస్తున్న ఒక ప్రాంతాన్ని గమనించాడు. అది మనుషులు ఉంటున్న ప్రాంతంగా అతనికి అనిపించింది. 6 వేల అడుగుల ఎత్తైన పర్వతంపై.. దీంతో శాస్త్రవేత్తల బృందం ఆ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ వారికి ఈ విచిత్ర కుటుంబం కనిపించింది. కార్ప్ అనే వృద్దుడు, అతని నలుగురు పిల్లలు అక్కడ ఉన్నారు. ఆ వృద్ధుని భార్య అకులిన్ 1961లో విపరీతమైన చలి, ఆకలి కారణంగా మృతి చెందింది. ఈ కుటుంబం దట్టమైన అడవిలో 6 వేల అడుగుల ఎత్తున ఉన్న పర్వతంపై శాస్త్రవేత్తలకు కనిపించింది. ఇంత ఎత్తులో కేవలం ఎలుగుబంట్లు, తోడేళ్లు మొదలైన జంతువులు మాత్రమే జీవించగలవు. ఇది కూడా చదవండి: నయా దోపిడీ: సాధువు వేషంలో పాములను మనుషులపైకి వదులుతూ.. రెండవ ప్రపంచ యుద్ధం గురించి.. ఆ కుటుంబం ప్రపంచంతో సంబంధాలను తెగతెంపులు చేసుకుంది. రెండవ ప్రపంచయుద్ధం, టీవీ, ఆధునిక వైద్యం మొదలైనవాటి గురించి వారికి ఏమాత్రం తెలియదు. జియాలజిస్ట్ గలీనా పిస్మెన్స్కాయ ఇక్కడకు ఖనిజ పరిశోధన నిమిత్తం వచ్చారు. ఆయన ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ కుటుంబం గురించి తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ‘వారు ఎంతో భయస్తులుగా కనిపించారు. మేము ఆ వృద్దునికి నమస్కారం పెట్టాం. వెంటనే ఆ వృద్ధుడు ఏమీ స్పందించలేదు. తరువాత మెల్లగా మీరు ఇంత దూరం వచ్చారు. మీకు స్వాగతం అని అన్నాడు. తాత్కాలిక గృహాన్ని నిర్మించుకుని.. ఆ వృద్దుడు తెలిపిన వివరాల ప్రకారం.. స్టాలిన్ పాలనా కాలంలో 1936లో కమ్యూనిస్టులు అతని తమ్ముడిని తుపాకీతో కాల్చి చంపేశారు. అనంతరం కార్ప్ లైకోవ్ తన భార్య 9 ఏళ్ల కుమారుడు సావిన్, రెండేళ్ల కుమార్తె నటాలియాలతో పాటు ఈ దట్టమైన అటవీ ప్రాంతానికి వచ్చాడు. వారు ఇక్కడ తాత్కాలిక గృహాన్ని నిర్మించుకున్నారు. ఇక్కడే కార్ప్ దంపతులకు 1940, 1943లలో మరో ఇద్దరు పిల్లలు కలిగారు. ఆ పిల్లలకు ఈ ప్రాంతానికి బయట మరోప్రాంతం ఉందని కూడా తెలియదు. బయటకు రావాలని కోరినా.. శాస్త్రవేత్తలు ఆ కుటుంబ సభ్యులను తమతో పాటు తమ క్యాంపునకు తీసుకువెళ్లారు. అక్కడ వారి దగ్గరున్న పలు ఆధునిక పరికరాలను చూసి, ఆ కుటుంబ సభ్యులు తెగ ఆశ్చర్యపోయారు. 1981లో సావిన్, నటాలియాలు ఆహార సమస్యతో కిడ్నీలు ఫెయిలై మృతిచెందారు. మరో కుమార్తె నిమోనియాతో మృతి చెందింది. ఇలా ముగ్గురు సభ్యులు మరణించిన నేపధ్యంలో శాస్త్రవేత్తలు కార్ప్‌ను, అతని మరో కుమార్తెను ఆ అడవిని విడిచిపెట్టి బయటకు రావాలని కోరారు. అయితే అందుకు వారు నిరాకరించారు. 1988, ఫిబ్రవరి 16న కార్ప్ మృతి చెందాడు. ఈ ఏడాది మార్చి వరకూ అందిన సమాచారం ప్రకారం అతని కుమార్తె ఇంకా ఆ దట్టమైన అడవిలో ఒంటరిగానే ఉంటోంది. ఇది కూడా చదవండి: నాడు సీమా, నేడు సానియా.. ప్రేమ కోసం తరలివస్తున్న ప్రియురాళ్లు! -
కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ నగరం అడుగులు.. భారీ ప్రాజెక్టులతో కళకళ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అభివృద్ధిలో దూసుకెళుతున్న విశాఖ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగస్టు 1వతేదీన శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు నిర్వహించనున్నారు. నగర అభివృద్ధితో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన, గౌరవ ప్రదమైన జీవన ప్రమాణాల్ని అందించే లక్ష్యంతో ఇవి రూపుదిద్దుకున్నాయి. రూ.600 కోట్లతో రహేజా గ్రూప్ నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్‌కు మంగళవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్ అదేరోజు జీవీఎంసీ పరిధిలో మరో 50 పనులకు భూమి పూజ చేయనున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపాధి, నైపుణ్య అవకాశాల్ని కల్పించే నాలుగు ప్రాజెక్టులను కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. ఐటీ టవర్స్‌పై సానుకూలం.. ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతున్న విశాఖ నగరం కార్యనిర్వాహక రాజధానిగా అడుగులు వేస్తోంది. సిటీ ఆఫ్ డెస్టినీగా పిలిచే విశాఖను విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రణాళికలు, ప్రాజెక్టులను అమలు చేస్తోంది. ఐటీ హబ్‌గా మార్చేందుకు బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో దిగ్గజ సంస్థలను ఆహ్వనించిన ప్రభుత్వం పర్యాటక రంగంలోనూ అదే ఒరవడిని అనుసరిస్తోంది. ఇప్పటికే అన్నవరం సమీపంలో రూ.350 కోట్లతో ఒబెరాయ్ లగ్జరీ రిసార్టుల ప్రాజెక్టుకు భూమి పూజ జరిగింది. తాజాగా దిగ్గజ సంస్థ రహేజా గ్రూప్ భారీ మాల్ని నిర్వించనుంది. మాల్ శంకుస్థాపనకు ఆహ్వనించేందుకు రహేజా గ్రూప్స్ ప్రెసిడెంట్ నీల్ రహేజా ఇటీవలే ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న మాల్ని మూడేళ్లలోగా పూర్తి చేయాలని రహేజా లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనిద్వారా 5 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇనార్బిట్ మాల్ నిర్మాణంలో భాగంగా ఐటీ టవర్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ రహేజా గ్రూప్ ప్రతినిధులకు సూచించారు. దీనిపై కంపెనీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రూ.135.88 కోట్లతో జీవీఎంసీ ప్రాజెక్టులు ఇనార్బిట్ మాల్‌కు శంకుస్థాపన అనంతరం అదే ప్రాంగణంలో విశాఖ ప్రజలకు మౌలిక సదుపాయాలు, నగర సుందరీకరణ, వివిధ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు. అమృత్ 2.0, స్మార్ట్ సిటీ, 15వ ఆరి్థక సంఘం నిధులు రూ.135.88 కోట్లతో చేపట్టనున్న 50 పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. శివారు, జీవీఎంసీ విలీన ప్రాంతాలైన మధురవాడ, లంకెలపాలెం, గాజువాక, అనకాపల్లి తాగునీటి కష్టాలను తీర్చేలా పైప్‌లైన్ ప్రాజెక్టులు, మురికివాడల్లో అభివృద్ధి పనులు, రూ.30 కోట్లతో జీవీఎంసీ పరిధిలోని 10 చెరువుల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. రూ.6.4 కోట్ల స్మార్ట్‌సిటీ నిధులతో యూరోపియన్ స్టైల్లో సాగర్‌నగర్, డిఫెన్స్ కాలనీ వద్ద నిర్వించనున్న ఈట్ స్ట్రీట్స్తో పాటు రూ.6 కోట్లతో స్మార్ట్ స్ట్రీట్, రూ.12 కోట్లతో విశాఖ నగరంలోని పలు ప్రధాన రహదారులు, జంక్షన్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన జీవీఎంసీ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఉపాధి, నైపుణ్యాలను పెంచేలా.. ఉత్తరాంధ్ర విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా సీఎం జగన్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రూ.129 కోట్లతో చేపట్టిన కీలక ప్రాజెక్టులను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం ఏయూ విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఏయూలో రూ.21 కోట్లతో 30,000 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్వించిన ఏయూ స్టార్టప్ అండ్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ హబ్(అ–హబ్)ని సీఎం ప్రారంభించనున్నారు. ఇందులో ప్రస్తుతం 121 స్టార్టప్ కంపెనీలకు చోటు కల్పించారు. రూ.44 కోట్లతో 55 వేల చ.అడుగుల విస్తీర్ణంలో బయోటెక్, ఫార్మా, జెనోమిక్స్ ఇంక్యుబేషన్, టెస్టింగ్ ల్యాబ్ కోసం నిర్మించిన ఎలిమెంట్ (ఏయూ ఫార్మా ఇంక్యుబేషన్ అండ్ బయోలాజికల్ మానిటరింగ్ హబ్)ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. రూ.35 కోట్లతో 60 వేల చ.అడుగుల విస్తీర్ణంలో నిర్వించిన అల్గారిథమ్ (ఏయూ డిజిటల్ జోన్ అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ కాంప్లెక్స్)ని సీఎం జగన్ విద్యార్థులకు అందుబాటులోకి తేనున్నారు. ఐఐఎంతో ఒప్పందంలో భాగంగా రూ.18 కోట్లతో 25 వేల చ.అడుగుల విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ అనలిటిక్స్‌లో ప్రత్యేక కోర్సులందించేందుకు నిర్వించిన ఏయూ–సిబ్(ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్)ని సీఎం ప్రారంభించనున్నారు. రూ.11 కోట్లతో అవంతి సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రూ.11 కోట్లతో మెరైన్ అగ్రికల్చర్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్‌లో యువతకు నైపుణ్యం అందించేందుకు నిర్వించిన ఏయూ అవంతి ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ అండ్ స్కిల్ హబ్‌ని ముఖ్యమంత్రి జగన్ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇనార్బిట్ మాల్ ప్రత్యేకతలివీ.. నిర్మిస్తున్న సంస్థ : రహేజా గ్రూప్ విస్తీర్ణం : 17 ఎకరాలు (6 లక్షల చ.అడుగులు) ఎక్కడ : విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని సాలిగ్రామపురంలో ఎవరి స్థలం : విశాఖపట్నం పోర్టు అథారిటీ లీజు వ్యయం: 30 ఏళ్లకు రూ.125 కోట్లు శంకుస్థాపన : ఆగస్ట్ 1వ తేదీన పూర్తి : మూడేళ్ల వ్యవధిలో నిర్మాణం ఇలా: రెండు బేస్మెంట్ ప్లస్ 3 స్టిల్ట్ ఫ్లోర్స్, 5 ఫ్లోర్లు రీటైల్ కోసం, 6వ ఫ్లోర్ మల్టీలెవల్ కార్ పార్కింగ్ కోసం, 7, 8వ ఫ్లోర్లు ఆఫీస్ స్పేస్ కోసం, 9వ ఫ్లోర్లో హోటల్ నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు సరికొత్త విశాఖ ఆవిష్కృతం విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో సరికొత్త నగరం ఆవిష్కృతమవుతోంది. ఇప్పటికే భారీ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు కూడా మొదలయ్యాయి. పర్యాటక ప్రాజెక్టులతో పాటు ఐటీ సంస్థల రాకతో నగరం కళకళలాడుతోంది. ఆగస్ట్ 1 న దాదాపు రూ.865 కోట్ల విలువైన కీలక ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. – డా.మల్లికార్జున, జిల్లా కలెక్టర్ -
US: అంచనాకు మించి అక్రమ వలసదారులు..ఇరకాటంలో బైడెన్ పాలన
అమెరికాలో అక్రమ వలసదారుల బెడద ఎక్కువగా ఉంది. ఇప్పటికే దాదాపు 17 మిలియన్ల మంది అక్రమ వలసదారులు నివసిస్తున్నట్లు హకీష్ ఇమ్మిగ్రేషన్ గ్రూప్ అంచనా వేసింది. 2021 ప్రారంభంలో అధ్యక్షుడు జో బైడెన్ బాధ్యతలు చేపట్టే నాటికే వారి సంఖ్య 16 శాతం పెరిగినట్లు నివేదికలో వెల్లడించింది. దాదాపు 16.8 మిలియన్ల మంది ఉన్నారని, జనవరి 2022లో 15.5 మిలియన్లకు పెరిగిందని వెల్లడించింది. అదికాస్త ఇటీవల సంవత్సరంలో దాదాపు 11 మిలియన్లకు చేరినట్లు అంచనా వేసింది. బైడెన్ పరిపాలనలో మూడో ఏడాది నుంచి వలసల సంక్షోభాన్ని తీవ్రంగా ఎదుర్కొంటోంది. దీంతో ట్రంప్ హయాంలోని విధానాలను రద్దు చేసింది. సరిహద్దు వద్ద కఠినమైన చర్యలను అమలు చేసింది. అందుకోసం ఫెడరేషన్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ రిఫామ్ (ఎఫ్‌ఏఐఆర్) ఆ అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చింది కూడా. దీనికి తోడు ఈ అక్రమ వలసలు కారణంగా దక్షిణ సరిహద్దులో సుమారు 2 లక్షలు పైగా ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఆర్థిక ఏడాదితో కలిసి ఇప్పటి వరకు సుమారు 1.6 మిలియన్లకు పైగా ఎన్కౌంటర్లు జరిగినట్లు అమెరికా ఓ నివేదిక తెలిపింది. అలాగే రెండు లక్షల మందిలో సగానికిపైగా వీసా గడువు ముగింపు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. అలాగే కరోనా కారణంగా వలస వచ్చిన వారిని కూడా వేగంగా బహిష్కరించే పనులు ముమ్మరంగా జరగుతున్నట్లు వెల్లడించింది. చట్ట విరుద్ధంగా అమెరికాలో శాశ్వత నివాసం ఉండేందుకు యత్నించిన ఏ వ్యక్తిపైన అయినా కఠిన చర్యలు తప్పవని అమెరికా ప్రకటించింది కూడా. అదీగాక సుమారు 3 లక్షల మంది ఇటీవల తాత్కాలిక అనుమతి లేదా నిష్క్రమణ నుంచి మినహాయింపు పొందిన వారు ఉన్నట్లు ఇమ్రిగ్రేషన్ గ్రూప్ పేర్కొంది. వారి టీపీఎస్ (వీసా)ని కూడా పొడిగించినట్లు తెలిపింది. అక్రమ వలసదారుల జనాభాను కచ్చితంగా అంచనా వేయడం అసాధ్యం అని, అధికారులను తప్పించుకుని తిరుగుతున్న వారి వివరాలు తెలియాల్సి ఉందని సైన్సస్ బ్యూరో డేటా పేర్కొంది. ఆ డేటా ఆధారంగానే అంచనా.. వార్షిక జనాభా గణన డేటాలో మార్పుల అధారంగా వారి సంఖ్యను అంచనా వేయడమే గానీ కచ్చితమైన గణాంకాలు లేవని తేల్చి చెప్పింది. ఆఖరికి ఫెడరేషన్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ రిఫామ్ (ఎఫ్‌ఏఐఆర్) సైతం ఆ సైన్స్ బ్యూరో డేటా ఆధారంగానే ఈ అక్రమ వలసలను అంచనా వేస్తునట్లు వెల్లడించడం గమనార్హం. బైడెన్ ప్రభుత్వం ఈ అక్రమ వలసలను నివారించేందుకు తీసుకున్న నిర్ణయాలు కారణంగానే ఆ డేటా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కొనసాగుతున్న అక్రమ వలసల సంక్షోభానికి కారణం కాంగ్రెస్‌లోని రిపబ్లికన్లే అంటూ వారు తీసుకున్న చర్యలను తప్పుబడుతోంది బైడెన్ ప్రభుత్వం. (చదవండి: అభిమానంతో వచ్చే చిక్కులు..వారితో వ్యవహారం మాములుగా ఉండదు!) -
జీవన చలనం
చలనం ఉండాలి; మనకు చలనం అన్నది కావాలి. చలనంతో మనం సాగుతూ ఉండాలి. మనలోని రక్తంలో చలనం లేకపోతే మనం ఉండం. మన రక్తంలో ఉన్న చలనం మన తీరులోనూ ఉండాలి. చలనం లేకుండా ఆగిపోయిన నీరు బురద అయిపోతుంది. చలనం లేకపోతే ఎవరి జీవనం అయినా ఎందుకూ పనికి రాకుండా పోవడమే కాదు హానికరం అయిపోతుంది కూడా. చలనం పరంగా ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు మనకు తొలిపాఠాలు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల చలనం లేకపోతే మనం మనకే చెందం కదా? శ్వాసకు చలనం ఉండడంవల్లే మనం బతుకుతూ ఉన్నాం; మనకు ఉన్నవి ఉండడానికి కారణం శ్వాసకు చలనం ఉండడమే. మనం చలనంతో ఉండాలి అన్న ఆలోచన శ్వాసలాగా మనకు ఎప్పుడూ ఉంటూనే ఉండాలి. మనిషికి ప్రధానమైన వ్యాధి స్తబ్దత. ఈ స్తబ్దతకు వైద్యం, విరుగుడు చలనం. అడుగు వేస్తే పడిపోతాం అనుకుని స్తబ్దతలో ఉండిపోవడం సరికాదు. భద్రత కోసం అనో, జరిగిపోతోంది కదా అనో స్తబ్దతలో, స్తబ్దతతో ఉండిపోవడం పెనుదోషం. ఆ దోషం ముదిరితే అది పాపంగా కూడా పరిణమిస్తుంది. ‘జీవితం వెనక్కు వెళ్లదు; అది నిన్నటితో ఉండిపోదు’ అని కవి–తాత్త్వికుడు ఖలీల్ జిబ్రాన్ ఒక సందర్భంలో అంటారు. చలనం అన్నది ఉంటుంది, ఉండాలి కాబట్టి ఆయన అలా అన్నారు. చలనం లేకుండా స్తబ్దతలో ఉండిపోతే జీవితం వెనక్కు, ఆ వెనక్కు పడిపోతుంది, జీవితం నిన్నటితో ఉండిపోవడం కాదు మొన్నటికీ, అటు మొన్నటికీ జారిపోతుంది. జీవితం నుంచి జీవనం జారిపోకూడదు; జీవనానికి జీవితం లేకుండా పోకూడదు. అందుకు స్తబ్దత కాదు చలనం కావాలి; చలనం ఉండాలి. సేద తీరచ్చు కానీ స్తబ్దతలో ఉండిపోకూడదు. అలిసిపోవడం సహజమైందే కానీ బిగుసుకుపోవడం అసహజమైంది. స్తబ్దతకు మలిదశ బిగుసుకుపోవడం. స్తబ్దత, బిగుసుకుపోవడం మనుగడలో ఉన్న మనిషి లక్షణాలు కావు, కాకూడదు. మరణించిన వ్యక్తి లక్షణాలు స్తబ్దత, బిగుసుకుపోవడం. మరణించాక తప్పనిసరిగా వచ్చేవి అవి. కాబట్టి మరణం రానంత వరకూ అవి మన దగ్గరకు రాకూడదు. మనుగడ ఉన్నంతవరకూ మనం వాటిని రానివ్వకూడదు. స్తబ్దత కారణంగా మనుగడలో ఉన్న మనం మరణించిన వ్యక్తులంలాగా మారిపోకూడదు. మరణించాక కూడా జీవించి ఉండేందుకు మనం చలనాన్ని ఒంటపట్టించుకోవాలి. మెరుపు మెరుపయింది చలనం వల్లే. గాలికి చలనం లేకపోతే మన పరిస్థితి ఏమిటి? మేఘాలకు, భూమికి చలనం అన్నది లేకపోతే మనకు ఉండేది ఏమిటి? మనకు మనగడే ఉండదు. చలనం అన్నది లేకపోతే మనం ప్రపంచానికి ఉండం; మనకు ప్రపంచం ఉండదు. చలనం లేకపోతే గమనం ఉంటుందా? ఉండదు. జీవనం అంటేనే గమనం. గమనానికి ఆరంభం చలనం. గమనానికి మాత్రమే కాదు ఏ గమ్యానికైనా తొలిచుక్క చలనమే. జీవితానికి జీవనం ఉన్నప్పుడు జీవనానికి చలనం ఉండాలి. స్తబ్దతలో మనల్ని మనం మోసుకుంటూ ఉండిపోవడం జీవనం కాదు; స్తబ్దతతో మనం మనకే బరువైపోవడం జీవితం కాదు. చలనం ఇంధనం కాగా జీవితం పండాలి. జీవితానికి జ్వలనం కావాలంటే జీవనానికి చలనం కావాలి. నది నది అయ్యేది చలనం వల్లే. చలనమే లేకపోతే నది అన్నదే లేదు; నది లేకపోతే జరగాల్సిన మేలు జరగదు. చలనం వల్ల ఏం మేలు జరుగుతుందో, ఎంత మేలు జరుగుతుందో నది మనకు తెలియజెబుతునే ఉంది. నదిని మనం స్ఫుర్తిగానూ, ఆదర్శంగానూ తీసుకోవాలి. మనం చలనంతో నదిలాగా బతకాలి; బతుకే గెలుపై మనం మునుముందుకు నడుస్తూ ఉండాలి. జీవనం అంటేనే గమనం. గమనానికి ఆరంభం చలనం. గమనానికి మాత్రమే కాదు ఏ గమ్యానికైనా తొలిచుక్క చలనమే. – రోచిష్మాన్ -
ఆదిలాబాద్: ఉట్నూరులోని ఆదివాసీల జీవనం దయనీయం
-
ప్రపంచ రికార్డు: 50 ఏళ్ల వయసు, 500 రోజులు ఒక్కత్తే.. గుహలో...
స్పెయిన్ అథ్లెట్ 50 ఏళ్ల బీట్రస్ ఒక ఆరోగ్య ప్రయోగంలో భాగంగా 500 రోజులు గుహలో ఒక్కత్తే గడిపి మొన్న (శుక్రవారం) బయటకు వచ్చింది. బయట నుంచి మాత్రమే నిపుణుల పర్యవేక్షణ ఉన్నా 260 అడుగుల లోతు గుహలో అదరక బెదరక జీవించింది. ఎక్కువ రోజులు గుహలో ఒంటరిగా జీవించిన ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న బీట్రస్ కథా కమామీషు... ‘లోపలకు వెళ్లాక రెండు నెలల వరకూ లెక్క బెట్టాను. ఆ తర్వాత రోజుల్ని లెక్క బెట్టుకోవడం మానేశాను. సహాయక బృందం లోపలికి వచ్చి నన్ను బయటకు తెచ్చే వరకు ఏ 160 రోజులో ఉన్నాననుకున్నాను. కాని 500 రోజులు ఉన్నాను. కాలం ఇట్టే గడిచిపోయింది’ అంది బీట్రస్ ఫ్లెమినీ. తన 48వ ఏట నవంబర్ 21, 2021 తేదీన స్పెయిన్‌లోని గ్రనాడా పట్టణం సమీపంలో ఉన్న ఒక గుహలోకి బీట్రస్ అడుగుపెట్టింది. మళ్లీ 50వ ఏట ఏప్రిల్ 14, 2023న బయటకు వచ్చింది. ఒకటిన్నర సంవత్సరం గుహలో ఒక్కత్తే గడిపింది. ‘ఈ కాలంలో బయట ఏం జరిగిందో నాకు తెలియదు’ అందామె. గ్రనడా యూనివర్సిటీ, అల్మేరియా యూనివర్సిటీలోని శాస్త్ర నిపుణులు గుహలలో, పర్వతారోహణలో ఒక్కరిగా చిక్కుకుపోయినప్పుడు మనిషి ‘సర్కేడియన్ రిథమ్’ (వెలుతురు, చీకటిని బట్టి మానవ శరీర, మానసిక స్థితుల్లో 24 గంటల్లో వచ్చే మార్పు) అధ్యయనం చేయడానికి బీట్రస్ను గుహలోకి పంపారు. క్యాలెండర్, గడియారం ఏమీ ఇవ్వలేదు. 60 పుస్తకాలు, వెయ్యి లీటర్ల నీరు, స్టవ్, ఆమె కదలికలను బయటి నుంచి గమనించడానికి సెన్సర్స్‌ను తీసుకొని ఆమె లోపలికి వెళ్లింది. ‘నేను నాతో మాట్లాడుకుంటూ గడిపాను, వ్యాయామం, టోపీలు అల్లడం, పుస్తకాలు చదవడం, బొమ్మలు వేయడం... వీటితో టైమ్ సరిపోయింది. ఒక్కోసారి భ్రాంతి కలిగేది’ అని తెలిపింది. ఆమె ద్వారా వచ్చిన రీడింగ్స్‌ను శాస్త్రజ్ఞులు ఇప్పుడు క్రోడీకరించే పనిలో పడ్డారు. Athlete Beatriz Flamini spent almost two years alone in an underground cave. And she makes it sound pretty relaxing... Follow us on Gab: https://t.co/IuhLFQBQPc pic.twitter.com/e7nlKR9Kyc — RT (@RT_com) April 15, 2023 -
మంచి మాట: మెలకువలోనే మేలిమి
మనిషి మెలకువలో ఉండాలి; మనిషి మేలుకుని మసలాలి. మెలకువలో ఉండేందుకు, మేలుకుని మసలేందుకు మనిషి బతకాలి; మనిషి మేలుగా బతకాలి. నిద్రపొకూడదనీ, నిద్రవద్దనీ కాదు నిద్రపొతున్నప్పడు మాత్రమే మనిషికి నిద్ర ఉండాలి. నిద్ర అనేది మనిషికి కొంచెంసేపు వేసుకునే వస్త్రంగా మాత్రమే ఉండాలి. నిద్ర మనిషి పూర్తిగా కప్పుకునే దుప్పటి కాకూడదు; మనిషి తనను తాను నిద్రతో కప్పేసుకోకూడదు. మెలకువతో, మెలకువలో మనిషి తనను తాను చాటుకుంటూ ఉండాలి. ‘మెలకువలో కల నిజం కాదు; కలలో మెలకువ లేదు‘ అని ఆదిశంకరాచార్య చెప్పొరు. ఈ మాటల్ని మనసులోకీ, మెదడులోకీ ఎక్కించుకోవాలి. కలలు కనడానికి నిద్రపొతూ ఉండడంలోనూ, నిద్రలో కలలు కంటూ ఉండడంలోనూ కాలాన్ని వ్యర్థం చేసుకోకూడదు. కలలోనూ, నిద్రలోనూ మెలకువ ఉండదు. మనకు మెలకువ కావాలి ఎందుకంటే మెలకువలో కల నిజం కాదు. మనిషి కల కాకూడదు; మనిషి నిజం కావాలి. భద్రంగా ఉండాలని మనం నిద్రలోనే ఉండిపొకూడదు. నిద్రలో అటూ, ఇటూ ΄పొర్లుతూ ఉండడం జీవితవిధానం కాదు, ఎప్పటికీ కాకూడదు. నిద్రలో కలవరిస్తూ ఉండడంలోనూ, ఆ కలవరింతల్లో జరిగిపొయిన వాటిని వర్ణించుకుంటూ ఉండడంలోనూ మునిగిపొయిన మనిషి బతుకును పొడు చేసుకోవడం అనే నేరం చేస్తున్న నేరస్థుడు. ఎన్నో కలలు వస్తూ ఉంటాయి నిద్రలో. ఆ కలలు అన్నిటిలోనూ కల్లల్ని చూసుకుంటూ ఉండిపొవడం వయసును చిదుముకోవడమే అవుతుంది. కొందరు నిద్రపొతున్నప్ప్డుడు మాత్రమే కాదు మేలుకుని ఉన్నప్పుడు కూడా కలలకంటూ ఉంటారు; కొందరు మెలకువను కూడా కలల్లో గడిపేస్తూ ఉంటారు, కలల్లో కలిపేస్తూ ఉంటారు. ఇది అవాంఛనీయమైన స్థితి; ఇది బాధాకరమైన స్థితి. మెలకువను కూడా కలల్లో గడిపేస్తూ, కలిపేస్తూ ఉండేవాళ్లు కల్లలు అయిపొతారు. మనిషి కల్ల అయిపొకూడదు. అందుకే మనిషి వీలైనంత మెలకువలో ఉండాలి; అందుకే మనిషి వీలైనంత మేలుకుని ఉండాలి. పుట్టిన వ్యక్తికి తప్పకుండా మరణం ఉంటుంది. పుట్టుక, మరణం మధ్యలో ఉండే నిడివి జీవితం అవుతుంది. జీవితంలో మెలకువతో ఉండడమే జీవనం అవుతుంది. జీవి జీవితానికి మెలకువ జవ. ఆ జవ ఉన్న జీవనంలోనే చవి ఉంటుంది. జవ, చవి లేని మనిషి జీవితం చెక్కకో, చెత్తకో సమానం అవడం కాదు చెక్కకన్నా, చెత్తకన్నా హీనం ఆపై హేయం అవుతుంది. మనిషి చెక్కో, చెత్తో అవడం దుస్థితి, దుర్గతి. ‘యా మతిస్సా గతిర్భవేత్‘ అని అష్టావక్రగీతలో చెప్పడం జరిగింది. అంటే మతి ఎటువంటిదో గతి అటువంటిది అని అర్థం. మనిషి మతికి మెలకువ ఉంటే గతికి మెలకువ ఉంటుంది. మతికి, గతికి మెలకువ ఉంటే మనిషి చెక్కో, చెత్తో అయిపొయే దుస్థితి ఉండదు, రాదు. ప్రకృతి మెలకువలోనే ఉంటుంది. ప్రకృతి నిద్రపొతే ఏం అవుతుందో మనం ఒకసారి ఆలోచిద్దాం. ప్రకృతి నిద్రపొతే మన ఆలోచనలకు కూడా అందని పరిణామాలు సంభవిస్తాయి. గాలి మెలకువలో ఉండడం వల్లే మనం ఊపిరి పీల్చుకుంటూ ఉన్నాం. రాత్రుల్లో మొక్కలు మెలకువతో ఉండబట్టే పువ్వులు పూస్తూ ఉన్నాయి. నదులు మెలకువతోపొతూ ఉన్నాయి కాబట్టే మన అవసరాలు తీరుతూ ఉన్నాయి. ‘గచ్ఛ తీతి జగత్‘ అంటారు;పొతూనే ఉంది కాబట్టే జగత్ అయింది అని దానికి అర్థం. జగత్తు మొత్తం మెలకువతో ఉంది; మేలుకుని ఉంది. భూమి మెలకువతో ఉంది కాబట్టే సూర్యోదయం జరుగుతోంది; మనిషి మెలకువ తో ఉంటేనే జీవనోదయం జరుగుతుంది. ‘కంపనాత్‘ అని అంటూ ’కదలడంవల్ల అది బ్రహ్మం’ అని ఒక బ్రహ్మసూత్రం మనకు ఎరుకను ఇస్తోంది. ప్రకతి మాత్రమే కాదు బ్రహ్మం కూడా కదలిక ఉన్నదే. ప్రకృతి, బ్రహ్మం రెండూ మెలకువలో ఉండేవే; మేలుకుని ఉండేవే. ఎంత మెలకువ ఉంటే అంత మేలును ΄పొందుతాం. ఎంత మేలుకుని ఉంటే అంత మేలిమిని ΄పొందుతాం. మెలకువలో బతుకుతూ మనం మేలును ΄పొందుతూ ఉందాం; మేలుకుని బతుకుతూ మనం మేలిమికి మాలిమి అవుదాం. – రోచిష్మాన్ -
గురువాణి: ఒక్క చెట్టు పెట్టు... పుణ్యం మూటకట్టు
చెట్టు అనేది ఎంత గొప్పది... ఒక మొక్క నాటడం, దానికి నీళ్ళు పోయడం, చెట్టయ్యేదాకా దానిని సంరక్షించడం... అది చెట్టుగా మారిననాడు అది నాటినవాడికి, పెంచినవాడికి, సంరక్షించినవాడికి ఎంత ఫలితం లభిస్తుందనే దానికి మన శాస్త్రాలు ఏమని చెబుతున్నాయంటే... లోకంలో శరీరం కలిగిన ప్రాణులు ఎన్నో ఉన్నాయి. మనుష్యులే కానక్కరలేదు. శరీరం ఉన్న ప్రతి ప్రాణికీ దాని పోషణకు ఆహారం కావాలి. అది సమయానికి పడకపోతే ఆకలికి విలవిల్లాడిపోతాయి. ఆకలి గొప్ప బాధ.. క్షుత్ అగ్ని.. అది అగ్నిహోత్రం, మంట. ఆ మంట తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఆకలేస్తే మొదట ఏది పోతుంది... ధర్మం. ఆకలేసిన వాడికి ధర్మ విచక్షణ ఉండదు. అయ్యా! నా ప్రాణం పోయినా సరే ధర్మాన్ని కాపాడతాను, ఏదీ దొంగిలించను అనడు కదా ! చివరకు తెగించి దొంగతనానికి పాల్పడి అయినా ఆ బాధ తీర్చుకుంటాడు. ఆ మంట అటువంటిది. దహించి వేస్తుంది. అందుకే ఆకలి అన్నది ఎక్కడా ఉండడానికి వీల్లేదు. మనుష్యులకే కాదు, సమస్త ప్రాణులకూ ఆహారం కావాలి. పక్షులు, జంతువులు, క్రిమికీటకాదులు... ఆకలితో ఉన్న మనుష్యులకు వారి ఆర్తిని చూసి జాలిపడి ఎవరయినా ఆహారమిస్తారు.. వీటి ఆకలి ఎవరు తీరుస్తారు? చెట్టు. దానికి కాండం ఉంటుంది, ఆకులు ఉంటాయి, పూలు ఉంటాయి, కాయలు, పళ్ళను కూడా ఇస్తుంది. దానిని ఆశ్రయించి మనుష్యులే కాదు, క్రిమికీటకాదులు, జంతువులు, పక్షులు తమ ఆకలిని తీర్చుకుంటాయి. దాని బెరడులో చేరిన వందలాది క్రిములు వాటి ఆకలిని అక్కడ తీర్చుకొంటాయి. జంతువులు ఆకులు తింటాయి. పక్షులు గూళ్ళు కట్టుకోవడమే కాక కాయలు, పండ్లు తింటాయి. కొన్ని చిగుళ్ళను తింటాయి. ఎన్నో రెక్కల పురుగులు దాని పూలమీద వాలి ఆకలి తీర్చుకుంటాయి. రాలిన కొమ్మలు, ఆకులు, పూలు, పండ్లు భూమిలో కలిసి అక్కడున్న ఎన్నో పురుగులకు ఆహారమవుతాయి. ఒక చెట్టు... ఒక్క చెట్టే ఇన్నింటికి జీవాధారమవుతున్నది. మొక్కనాటిన వాడు, చెట్టుగా చేసినవాడు తరువాత కాలంలో శరీరాన్ని వదిలివేయవచ్చు గాక. కానీ అసంఖ్యాకమైన జీవులకు కేవలం ఆకలి తీర్చడమే కాక, వాటి ప్రాణాలను కూడా నిలబెట్టాడు, ఎన్నో జీవులు సేదదీరడానికి కారణమయ్యాడు. చెట్టు ప్రాణవాయువు వదులుతుంది. ప్రకృతి సమతౌల్యతను కాపాడుతుంది. అది మనుష్యులతోపాటూ అనేక జీవులకు ప్రాణాధారంగా నిలబడుతుంది. అటువంటి మంచి పనికి కారణమయ్యాడు కనుక వాడికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. వారి శరీరం పతనమయిన తరువాత దేవతలు స్వాగతం పలికి వారిని ఉన్నత లోకాలకు తీసుకువెడతారట. అంతేకాదు ఎన్నో ప్రాణులకు కొన్ని సంవత్సరాల పాటు ఆకలిబాధ తీర్చాడు కనుక వారిని మేం సేవిస్తాం అని దేవతలు అంటారట. చెట్లను పెంచే పనిని ప్రోత్సహించడానికి, మనుషులు తమకే కాకుండా సమస్త జీవకోటిపట్ల బాధ్యతాయుతంగా మెలగడానికి, ప్రకృతి సమతుల్యత కాపాడేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి మన పూర్వీకులు‘‘యావంతి ఖాసంతి ఫలాని వృక్షాత్ క్షుద్వహ్ని దగ్ధా ...’’ అంటూ ఒక శ్లోకం ద్వారా చేసిన ధర్మబోధ ఇది. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
దంపతులుగా జీవిస్తుంటే... జోక్యమొద్దు: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: పరస్పర అంగీకారంతో ఒక్కటిగా జీవిస్తున్న అమ్మాయి, అబ్బాయి మధ్యలోకి మూడో వ్యక్తి జోక్యం తగదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. వారి కుటుంబ సభ్యులు అయినా కూడా జోక్యం చేసుకోవద్దని పేర్కొంది. కుల, మతాలతో సంబంధం లేకుండా, ఒక్కటిగా బతికే జంటకు తగిన రక్షణ కల్పించాలని రాజ్యాంగం నిర్దేశిస్తోందని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుషార్ రావు గేదెల అన్నారు. రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది, అధికార యంత్రాంగానిదేనన్నారు. ఉత్తరప్రదేశ్‌లో తండ్రి అభీష్టానికి విరుద్ధంగా తనకు నచ్చిన వ్యక్తితో కలిసి ఉంటున్న ఓ యువతి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. యూపీలో తన తండ్రి చాలా పరపతి గల వ్యక్తి అని, ప్రాణభయంతో తరచూ వేర్వేరు హోటళ్లకు మారుతూ కాలం వెళ్లదీస్తున్నామని, రక్షణ కల్పించేదాకా మా దంపతులకు మనశ్శాంతి ఉండదని ఆమె కోర్టుకు నివేదించారు. -
చలో వియన్నా
పారిస్: భూమ్మీద అత్యంత నివాసయోగ్య నగరంగా ఆస్ట్రియా రాజధాని వియన్నా నిలిచింది. జీవన ప్రమాణాల్లో సుస్థిరత, మౌలిక సదుపాయాలు, మంచి ఆరోగ్య వ్యవస్థ, విస్తృతమైన ఉపాధి అవకాశాలు, వినోదం–విజ్ఞానం–సంస్కృతి తదితర ప్రామాణికాల ఆధారంగా ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈయూఐ) ఏటా ఈ ర్యాంకులిస్తుంది. గతేడాది టాప్‌లో ఉన్న అక్లండ్ (న్యూజిలాండ్)ను తోసిరాజని వియన్నా తొలి స్థానంలోకి వచ్చినట్టు ఎకనామిస్ట్ పత్రిక ప్రచురించింద కరోనా దెబ్బకు ఆక్లండ్ 34వ స్థానానికి పడిపోయింది. వియన్నా 2018, 2019 ల్లో నూ తొలి స్థా నంలో నిలిచింది. కరో నా వచ్చిన కొత్తల్లో రెస్టారెంట్లు, మ్యూజియంలు తదితరాలన్నీ మూతబడటంతో 2020లో 12వ స్థానానికి పడిపోయింది. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఈసారి మొదటి స్థానంలో నిలిచిందని నివేదిక వెల్లడించింది. డెన్మార్క్ రాజధాని కోపెన్హగెన్ రెండో స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యురిచ్, కెనడాలోని కేల్గరీ నగరాలు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. పారిస్ 19 స్థానంలో, లండన్ 33, మిలన్ (ఇటలీ) 49, న్యూయార్క్ 51వ స్థానంలో నిలిచాయి. టాప్ 10 నగరాలు 1. వియన్నా (ఆస్ట్రియా) 2. కోపెన్హగెన్ (డెన్మార్క్) 3. జ్యురిచ్ (స్విట్జర్లాండ్) 4. కాల్గరీ (కెనడా) 5. వాంకోవర్ (కెనడా) 6. జెనీవా (స్విట్జర్లాండ్) 7. ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ) 8. టొరంటో (కెనడా) 9. ఆమ్స్టర్డామ్ (నెదర్లాండ్స్) 10. ఒసాకా (జపాన్) మెల్బోర్న్ (ఆస్ట్రేలియా) -
వివక్షను బయటి నుంచి చూస్తే ఎలా?
ద్వేషాన్ని, వివక్షను స్వయంగా అనుభవించడం వేరు; బయటి నుంచి దాన్ని తెలుసుకోవడం వేరు. భారత్‌లో ఒక ముస్లింగా ఉండటం అనేది ఎలా ఉంటుందో స్వయంగా అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్న వారికే తెలుసు. నిరుపేదలూ, నిరక్షరాస్యులైన ముస్లింలు కూడా ఈరోజు ద్వేషాగ్ని బారిన పడుతున్నారు. అయినా మనలో చాలా మందిమి ఇంకా ముస్లింలను ఈ దేశంలో బుజ్జగిస్తున్నారని భావిస్తుండటమే దారుణం. మన దేశంలో ప్రతి రంగంలోనూ ముస్లింల ప్రాతినిధ్యం వారి జనాభాతో పోలిస్తే కింది స్థాయిలోనే ఉందన్నదే నిజం. ఆర్థిక, సామాజిక అంశాల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకంటే ముస్లింల పరిస్థితే ఘోరంగా ఉందని సచార్ కమిటీ దశాబ్దిన్నర కాలం క్రితమే తేల్చి చెప్పింది. నిజాలు ఇలా ఉండగా... ఇంత ద్వేషపూరిత వాతావరణాన్ని ఇన్నేళ్లుగా, నిరవధికంగా దేశీయ ముస్లింలు భరిస్తూ ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మంచివారు లేచి నిలబడి చెడుకు వ్యతిరేకంగా ఏమీ చేయనప్పుడే సమాజంలో దుష్టత్వం సంభవిస్తుంది. ఈ వారం నేను ఒక ప్రశ్న సంధించాలని అనుకుంటున్నాను. మీరు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించినట్లయితే, మన దేశంలో ఇవాళ జరుగుతున్న అత్యంత విషాదకరమైన, కలవరపెట్టేటటువంటి పరివర్తనలను మీరు అర్థం చేసుకోవడంలో నా ప్రశ్న మీకు సహాయపడుతుంది. ఈరోజు మన భారతదేశంలో ఒక ముస్లింగా ఉండటం అంటే ఎలా ఉంటుందో నన్ను కాస్త వివరించనివ్వండి. అలాగని నేను సంపన్నులను, ప్రభావశీలురను లేదా బాగా చదువుకున్న ముస్లింల గురించి మాట్లాడటం లేదు. ప్రత్యేకించి తమకు అందుతున్నదానితో బతకడం తప్ప మరేమీ చేయలేని నిరుపేద, నిరక్షరాస్యులైన ముస్లింల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ముస్లింలలో వీరి జనాభానే అధికంగా ఉంటోంది. వీరిలో ఒకరిగా ఉన్నట్లయితే మనకు ఏమనిపిస్తుంది అనేదే నా ప్రశ్న. అనుభవిస్తేనే బాధ తెలుస్తుంది! ద్వేషాన్ని, వివక్షను స్వయంగా అనుభవించడం వేరు; బయటినుంచి దాన్ని తెలుసుకోవడం వేరు. భారత్‌లో ఒక ముస్లింగా ఉండటం అనేది ఎలా ఉంటుందో స్వయంగా అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్న వారికే తెలుసు. కొన్ని నెలలుగా తమను ఊచకోత కోయాలనీ, ముస్లిం జాతినే లేకుండా చేయాలనీ చేస్తున్న పిలుపులను వాళ్లు వింటూ వచ్చారు. అల్లర్లకు తామే కారణమని ఆరోపణలకు గురయ్యారు. వారి ఇళ్లను కూల్చి వేశారు. ఈ చర్యలకు పాల్పడినట్లు రుజువైన వారిని బాధితులు చూస్తుండగానే క్షేమంగా పంపేశారు. ప్రధాని ఆవాస్ యోజన లబ్ధిదారులైన వితంతువులు కూడా బాధితులయ్యారు. పాకిస్తానీ పాటలను విన్నందుకు వారి మైనర్ పిల్లలను నిర్బంధించారు. హిందూ పూజారులం అని చెప్పుకున్న పురుషులు ముస్లింల మహిళలపై అత్యాచారం చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఇది ఏ రకంగానూ సమగ్రమైన జాబితా కాదు ఇది, ఈ కథనాన్ని రాయడం ప్రారంభించినప్పుడు నా దృష్టికి వచ్చిన అనేక ఘటనలకు సంబంధించిన వివరాల సేకరణ మాత్రమే! మరింత లోతుగా పరిశోధిస్తే ఇలాంటి ఘటనలు ఎన్నో బయటపడే అవకాశం ఉంది. నా ప్రశ్న ఏమిటంటే, ఇలాంటి అనుభవాలు మీకు ఎదురై ఉండి ఉంటే మీరు ఏ అనుభూతి పొంది ఉంటారు అన్నదే. వివక్షా, బుజ్జగింపా... ఏది సత్యం? నిజంగా విచిత్రమైన విషయం ఏమిటంటే, ఇంత ఘోరంగా ముస్లింల పట్ల వ్యవహరిస్తున్నప్పటికీ మనలో చాలామందిమి ఇంకా ముస్లింలను ఈ దేశంలో బుజ్జగిస్తున్నారని భావిస్తుండటమే! మనం వాస్తవాలను మాత్రమే తెలుసుకున్నట్లయితే, మన దేశంలో ప్రతి రంగంలోనూ ముస్లింల ప్రాతినిధ్యం వారి జనాభాతో పోలిస్తే కింది స్థాయిలోనే ఉందన్నదే నిజం. 2006 సంవత్సరంలోకి వెళ్లి చూసినట్లయితే, ఆర్థిక, సామాజిక అంశాల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకంటే ముస్లింల పరిస్థితే ఘోరంగా ఉందని సచార్ కమిటీ తేల్చి చెప్పింది. ఈ ఒక్క వాస్తవమే మనదేశంలో ముస్లింల అసలైన స్థితిగతులను తేటతెల్లం చేస్తోంది. నేను ఆకార్ పటేల్ రాసిన ‘అవర్ హిందూ రాష్ట్ర’ పుస్తకంపై ఆధారపడి ఈ విషయాలు చెబుతున్నాను. దేశ జనాభాలో ముస్లింలు 15 శాతంగా ఉన్నారు కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింల వాటా 4.9 శాతం మాత్రమే. పారామిలిటరీ సర్వీసులో 4.6 శాతం మంది ముస్లింలు ఉండగా, ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ ఉద్యోగాల్లో ముస్లింల వాటా 3.2 శాతం మాత్రమే. ఇక సైన్యం విషయానికి వస్తే 1 శాతం మంది మాత్రమే ముస్లింలు ఉన్నారు. దామాషా ప్రాతినిధ్యం ప్రకారం అయితే పార్లమెంటులో 74 సీట్లు ముస్లింలకే ఉండాలి. కానీ 27 మంది ముస్లింలు మాత్రమే ప్రస్తుత పార్లమెంటులో ఉన్నారు. భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఒక్క ముస్లిం ముఖ్యమంత్రి కూడా లేడంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 15 రాష్ట్రాల్లోని మంత్రివర్గాల్లో ఒక్క ముస్లిం మంత్రీ లేరు. 10 రాష్ట్రాల్లో ఒకే ఒక్క ముస్లిం మంత్రి ఉన్నారు. అది కూడా మైనారిటీ వ్యవహారాల ఇన్ చార్జ్ పదవి మాత్రమే వీరికి దక్కుతోంది. అందులోనూ అన్యాయమే... 2014లో గానీ, 2019లో గానీ భారతీయ జనతా పార్టీ తరçఫున ఒక్క ముస్లిం కూడా లోక్‌సభ ఎంపీగా లేరు. 1998 నుంచి గుజరాత్ రాష్ట్రం తరపున లోక్‌సభకు గానీ, విధాన సభకు గానీ ఒక్క ముస్లింను కూడా బీజేపీ పోటీలో నిలబెట్టలేదని ఆకార్ పటేల్ తన పుస్తకంలో రాశారు. అంటే గుజరాత్ జనాభాలో 9 శాతం మంది ముస్లింలు ఉన్నా, గత 24 సంవత్సరాలుగా ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా బీజేపీ అటు ఎంపీ స్థానానికి గానీ, ఇటు ఎంఎల్ఏ సీటుకు గానీ పోటీలో నిలపలేదు. ఇలాంటి పచ్చి నిజాలను నేను ఇంకా ఇంకా చెప్పగలను గానీ చెప్పను. నేను చెప్పదలుచుకున్నది చెప్పేశాను. మన రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా)లో ఒక్క ముస్లింను కూడా నియమించినట్లుగా నేనయితే వినలేదు. ఈ పరిస్థితుల్లో ‘రా’ సంస్థ ఒక ముస్లిం ఉద్యోగిని కలిగి ఉంటేనే మనం ఆశ్చర్యపడాల్సి ఉంటుంది. అయితే, ఈ వాస్తవాలన్నీ కూడా మనకు బోధపర్చని విషయం ఒకటుంది. ఇంత ద్వేషపూరిత వాతావరణాన్ని ఇన్నేళ్లుగా, నిరవధికంగా భరిస్తూ ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనకు ఈ విషయం నిజంగానే తెలీదు. ఎందుకంటే ఇదంతా మన అనుభవంలోకి రాలేదు కదా! రాజకీయనేతలు నన్ను చెదపురుగు అని పిలుస్తారనీ, బాబర్ సంతానం అని నన్ను వర్గీకరిస్తారనీ, పదేపదే నన్ను పాకిస్తాన్ వెళ్లిపొమ్మంటారనీ నేనయితే ఊహించలేను. కానీ ప్రతిరోజూ మన ముస్లిం సోదరులూ, సోదరీమణులూ ఈ అనుభవాలనే ఎదుర్కొంటున్నారు. మౌనమునిత్వం ఇంకా ఎన్నాళ్లు? మతద్వేషాన్ని రెచ్చగొడుతున్న వారి మాటలూ, చేతలకూ వ్యతిరేకంగా మాట్లాడాలని కోరుతూ గత వారమే 13 ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉత్తరం రాశారు. ప్రధాని అలా మాట్లాడతారో లేదో నాకయితే తెలీదు. వాస్తవానికి చాలా కాలంగా ప్రధాని మోదీ ఇలాంటి విద్వేష వాతావరణాన్ని రెచ్చగొట్టే వారి వ్యవహారానికి సంబంధించి మౌనం పాటిస్తున్నారని మాత్రం తెలుసు. కారణాలు ఏవయినా కావచ్చు... అత్యంత క్షుద్ర స్వరాలు మాట్లాడటాన్ని అనుమతిస్తూ వాటి ప్రభావం గురించి ప్రధాని పట్టించుకోకుండా ఉదాసీనతను పాటిస్తున్నారు. విజ్ఞానం అనేది తరచుగా వాట్సాప్ మీమ్స్ స్థాయికి కుదించుకుపోతున్న ఈ రోజుల్లో మనందరికీ ఒక విషయం వర్తిస్తుంది. మంచివారు లేచి నిలబడి చెడుకు వ్యతిరేకంగా ఏమీ చేయనప్పుడే సమాజంలో దుష్టత్వం సంభవిస్తుంది. ఈ వాస్తవాన్ని మరింత గంభీరంగా మీరు వర్ణించాలనుకుంటుంటే... జాన్ డానీ చెప్పిన సూక్తిని నన్ను చెప్పనివ్వండి. ‘‘ఏ మనిషీ ఒంటరి ద్వీపంలో లేడు. ముస్లింల జీవితాలపై ఈ రోజు మోగుతున్న మృత్యుఘంట రేపు మీ మీదకు కూడా మళ్లవచ్చు.’’ కరణ్ థాపర్,వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
ఆ వ్యక్తి విమానాశ్రయంలోనే 14 ఏళ్లుగా నివాసం....
Lives in airport for 14 years Says family interferes: ఏవోవే చిన్న చిన్న కారణాలతో కుటుంబంతో గొడవపడి ఇంటి నుంచి బయటకి వచ్చేసి నానాపాట్లు పడుతున్నవారు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా మాటమాట పెరిగి కోపంతో బయటకు వచ్చి అనాధలుగా బతుకు వెళ్లదీసేవాళ్లు కోకొల్లలు. మరికొంతమంది చెడుమార్గంలో పయనించి తమ జీవితాలను నాశనం చేసకున్నావాళ్లు ఉన్నారు. అచ్చం అలానే ఇక్కడోక వ్యక్తి ఇంటి నుంచి వచ్చేసి 14 ఏళ్లు అయ్యింది. అతను ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నాడో? ఎందుకు వచ్చేశాడో తెలుసా? వివరాల్లోకెళ్తే...వీ జియాంగువో అనే చైనీస్ వ్యక్తి బీజింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం టర్మినల్‌లోనే 14 ఏళ్లుగా నివసిస్తున్నాడు. అయితే అతనికి డ్రింక్ చేయడం, సిగరెట్ కాల్చడం వంటి చెడు అలవాట్లు ఉన్నాయి. అంతేగాదు అతను ఆ చెడు అలవాట్లకు బానిసై పోవడంతో అతని కుటుంబం అతన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో కాస్త కఠినంగా వ్యవహరించింది. ఈ మేరకు అతని కుటుంబం అతనికి ఒక షరతు కూడా పెట్టింది. అతను కుటుంబంలో ఉండాలనుకుంటే చెడు అలవాట్లను వదిలేయాలని ఒకవేళ అలా చేయలేకపోతే తన నెలవారి జీతం రూ.12 వేలు ఇచ్చేయాలని ఒక షరతు విధించారు. అలా ఇచ్చేస్తే తాను సిగరెట్, మందు కొనుక్కోవడం కష్టం అవుతుందని ఇంటి నుంచి వచ్చేశానని చెప్పాడు. 40 ఏళ వయసులో తనను ఉద్యోగం నుంచి తొలగించారని చెప్పుకొచ్చాడు. వృద్ధాప్యం కారణంగా తనకు మళ్లీ ఉపాధి లభించలేదని వీ చెప్పుకొచ్చాడు. అయితే అతను లాంటి మరో ఆరుగురు వ్యక్తులు ఆ టెర్మినల్‌లోనే నివశిస్తున్నారు. (చదవండి: మొసలితో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి... వీడియో వైరల్) -
భార్య కాపురానికి రావడం లేదని ... దివ్యాంగుడి బలవన్మరణం
శాలిగౌరారం: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో ఓ దివ్యాంగుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని అడ్లూరులో చోటు చేసుకుంది. ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్లూరు గ్రామానికి చెందిన వరికుప్పల ఉపేందర్(35)కు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం అతడికి భార్యతో పాటూ కుమారుడు ఉన్నారు. ఇదిలా ఉండగా మూడు నెలల క్రితం హైదరాబాద్‌లో ఉంటున్న తనతల్లిగారింటికి ఉపేందర్ భార్య వెళ్లింది. అప్పటినుంచి కాపురానికి రావడం లేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉపేందర్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి వరికుప్పల యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వివరించారు. -
3 నెలలుగా తండ్రి శవంతోనే జీవనం .. కారణం తెలిసి కంగుతిన్న పోలీసులు
కోల్‌కతా: చనిపోయిన వారి మృతదేహాలను ఇంట్లోనే పెట్టుకుని.. వాటితో కలిసి జీవించే దృశ్యాలను ఎక్కువంగా సినిమాలో చూసుంటాం. కానీ ఇటువంటి ఘటనే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరణించిన తన తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి మూడు నెలలుగా దానితో కలిసి జీవిస్తున్నాడు. చివరికి పోలీసుల రంగప్రవేశంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాలోని కేపీరాయ్ లేన్‌లో సంగ్రామ్ డే (70) బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో మాజీ ఉద్యోగి. గత కొన్ని నెలలుగా స్థానిక ప్రజలు సంగ్రామాన్ని చూడలేదు. అతని కొడుకు కౌశిక్ డే కూడా చుట్టు పక్కల వారితో పెద్దగా మాట్లాడడు కాబట్టి వారికి మొదట్లో అనుమానం రాలేదు. అయితే ఇటీవల కౌశిక్ ప్రవర్తన కాస్త వింతగ ఉండడం, అతని తండ్రి కనపడకపోవడంతో స్థానికులు గార్ఫా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు ఇంటికి వెళ్లగా కౌశిక్ తలుపులు కూడా బలవంతంగా తెరిచాడు. ఇంటిలోకి వెళ్లి చూడగా, కుళ్లిపోయిన స్థితిలో మంచంపై పడి ఉన్న సంగ్రామ్ మృతదేహాన్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు. అతని భార్య అరుణా డే పక్షవాతం కారణంగా మంచాన పడింది. మూడు నెలల క్రితం తన తండ్రి చనిపోయాడని, అయితే సంగ్రామ్ మళ్లీ మేల్కొంటాడని భావించానని కౌశిక్ పోలీసులకు చెప్పాడు. కౌశిక్ సమాధానాలు విన్న పోలీసులు అతను మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోందిని చెప్పారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. చదవండి: ‘మా పొట్ట కొట్టకండి సారూ.. గంజాయి పండించుకుంటాం’ -
కృత్రిమ కుజుడిపై నివాసానికి సిద్ధమా?.. నాసా అప్లికేషన్లు
మానవ జ్ఞానం అవధుల్లేకుండా పెరుగుతున్న కొద్దీ అంతరిక్షానికి ఆవల ఏముందో చూడాలన్న ఆతృత పెరిగిపోతోంది. అంతరిక్ష యానం, ఇతర గ్రహాలపై నివాసం మనిషి మేథస్సుకు విసిరిన సవాళ్లు కాగా, క్రమంగా వీటిని జయిస్తూ వస్తున్నాడు మానవుడు. ఈ క్రమంలో చంద్రుడితో మొదలెట్టిన గ్రహాంతర యానాలు ఇతర గ్రహాలకు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతానికి చంద్రుడిపైకి మాత్రమే మనిషి వెళ్లగలిగాడు. కానీ త్వరలో ఇతర గ్రహాలపై పాదం మోపే ప్రయోగాలు వేగవంతం అవుతున్నాయి. ఇదే జోరు కొనసాగితే కొన్ని తరాల అనంతరం మనిషి ఇతర గ్రహాలపై నివాసం ఏర్పరుచుకోవడం ఖాయమన్నది సైంటిస్టుల అభిప్రాయం. గ్రహాంతర నివాసం కల సాకారం చేసుకునే క్రమంలో పలు దేశాలు పలు ప్రయోగాలు చేపడుతున్నాయి. ఈ తరహాలోనే అమెరికాకు చెందిన నాసా ఒక ప్రయోగాన్ని చేపట్టింది. అంగారకుడిపై ఉండే వాతావరణాన్ని మనిషి తట్టుకుండాలో లేదో అధ్యయనం చేసేందుకు భూమిపైనే కృత్రిమంగా అంగారక వాతావరణాన్ని సిద్ధం చేస్తోంది. ఇందులో సంవత్సరం పాటు ఉండి ప్రయోగాలు చేసేందుకు ఉత్సాహం చూపే ఔత్సాహికుల నుంచి అప్లికేషన్లు ఆహ్వానిస్తోంది. వచ్చిన దరఖాస్తుల్లో నాసా ఎంపిక చేసుకున్నవారు ఈ కృత్రిమ అంగారక వాతావరణంలో ఉంటూ ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో, వాటికి ఎలా సిద్ధమవ్వాలో అధ్యయనం చేస్తారు. డ్యూన్ ఆల్ఫా మార్స్ డ్యూన్ ఆల్ఫాగా పిలిచే 1700 చదరపు అడుగుల ఈ కృత్రిమ నివాస స్థలాన్ని అంగారకుడి వాతావరణాన్ని అనుసరించి 3డీ ప్రింటింగ్ ద్వారా సృష్టిస్తున్నారు. హూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్లో ఈ కృత్రిమ కుజ నివాసం సిద్ధం చేస్తున్నారు. కుజుడిపై ఉండేలాగానే పరిమిత వనరులు, పరికరాలు ఫెయిల్‌కావడం, కమ్యూనికేషన్ తెగిపోవడం, ఇతర సహజసిద్ధ ప్రమాదాలు ఆల్ఫాలో ఉంటాయి. వీటన్నింటిని తట్టుకుంటూ అందులో ఉన్నవారు స్పేస్ వాక్ చేయడం, పరిశోధనలు చేయడం, వీఆర్ మరియు రోబోటిక్ కంట్రోల్స్ చేయడం వంటివి చేయాల్సిఉంటుంది. ఈ ప్రయోగంతో లభించే వివరాలు నిజమైన అంగారకుడిపైకి మనిషిని పంపేందుకు ఉపకరిస్తాయని నాసా భావిస్తోంది. అయితే ఇందులో ఒక చిన్న తిరకాసు ఉందండోయ్! కేవలం అమెరికా పౌరులకు మాత్రమే దరఖాస్తు చేసేందుకు అర్హులు. అది కూడా 30–55 సంవత్సరాల్లోపు వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ధూమపానం అలవాటు లేకపోవడం, ఆరోగ్యవంతంగా ఉండడం, ఇంగ్లీష్ బాగా తెలిసిఉండడం వంటి అదనపు నిబంధనలు కూడా ఉన్నాయి. స్టెమ్ ఫీల్డ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిఉండాలి. నాలుగేళ్లపాటు అనుభవం ఉంటే మంచిది. మనకు అవకాశం లేదని బాధపడాల్సిన పనిలేదు. త్వరలో మన ఇస్రో కూడా ఇటువైపుగా అడుగులు వేయవచ్చు. గతంలో రష్యా కూడా ఇలాంటి మార్స్ మిషన్ ఒకటి చేపట్టింది, కానీ సక్సెస్‌కాలేదు. మరి నాసా యత్నాలు ఎలాంటి ఫలితాలిస్తాయో చూడాల్సిందే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
బామ్మ జ్యూస్ స్టాల్: వావ్ అంటున్న నెటిజనులు, వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: వృద్ధాప్యంలో హాయిగా కృష్ణా రామా అనుకుంటూ కాలు మీద కాలు వేసుకుని జీవించే అదృష్టం ఎంతమందికి ఉంటుందో తెలియదు గానీ, తమకు ఏజ్ జస్ట్ ఒక నంబరు మాత్రమే. అసలు వయసు ఒక సమస్యేకాదు అని చాలామంది సీనియర్ సిటిజన్స్ నిరూపిస్తున్నారు. ఎనిమిది పదుల వయసు దాటినా మాకు మేమే సాటి అంటూ ఈమధ్య కాలంలో చాలామంది దర్శనమిస్తున్నారు. తమ టాలెంట్‌తో ఇంటర్నెట్లో సంచలనంగా మారుతున్నారు. తాజాగా పంజాబ్‌కు చెందిన జ్యూస్ స్టాల్ బామ్మ వార్తల్లో నిలిచారు. అమృత్‌సర్‌లోని 80 ఏళ్ల బామ్మ నడుపుతున్న జ్యూస్ స్టాల్ విశేషంగా నిలిచింది. చకాచకా బత్తాయి రసం తీసి యిస్తూ కస్టమర్లను భలే ఆకట్టుకుంటున్నారు. ముదిమి వయసులో కూడా చాలా కష్టపడుతూ జ్యూస్ బండి ద్వారా జీవనాన్ని సాగిస్తూ పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంతేకాదు యుక్తవయసులో కూడా పనీ పాటా లేకుండా తిరిగే ఆవారా బ్యాచ్‌కు ఈ బామ్మ పెద్ద సవాలే విసురుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేనా తన కష్టార్జితాన్ని నమ్ముకుని గౌరవంగా జీవించాలనుకునేవారికి ఆమె ఒక రోల్ మోడల్ అని అభిప్రాయపడుతున్నారు. ఈ వయసులో ఆమె చాలా కష్టపడుతున్నారు. దయచేసిన ఎవరైనా ఆమెకు సాయం చేయండి అంటూ ఒక ట్విటర్ యూజర్ వీడియోను ట్వీట్ చేశారు. అంతే అది క్షణాల్లో వైరల్ అయింది. ఆమెకు సాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. వీలైతే ఆమెకు ఒక ఎలక్ట్రానిక్ జ్యూసర్ ఇవ్వాలనుకుంటున్నానని ఒకరు ట్వీట్ చేయగా మరికొందరు భిన్నంగా స్పందించారు. పాశ్చాత్య దేశాలలో, సీనియర్లు సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు వీలుగా పెన్షన్లు పొందుతారు. కానీ మన దేశంలో మాత్రం వారికి నరకమే అంటూ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సులభంగా డబ్బు కావాలనుకునే యువత ఈమెను చూసి సిగ్గుపడాలని మరొకరు ట్వీట్ చేశారు. The bibiji in the video below has her juice stall in Amritsar. She is working hard in her old age. Please show some love and support to her. The address of her stall is Rani da bagh Amritsar, Opp SBI Bank, near Uppal Neuro Hospital. Please share with your contacts 🙏 pic.twitter.com/YTpjk4IIWm — A Sidhu (@asidhu_) July 27, 2021 -
బెంగళూరులో సులభతర జీవనం
సాక్షి, న్యూఢిల్లీ: ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ (సులభతర జీవన సూచీ) –2020 ర్యాంకుల్లో పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాల్లో బెంగళూరు నంబర్ 1గా నిలిచింది. విశాఖపట్నం 15వ స్థానంలో, హైదరాబాద్ 24వ స్థానంలో నిలిచాయి. పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాల్లో కాకినాడ నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే, మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ (పురపాలిక పనితీరు సూచీ) ర్యాంకుల్లో పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాల్లో విశాఖపట్నం 9వ స్థానంలో నిలవగా, పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాల కేటగిరీలో తిరుపతి నగరం రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గురువారం ఇక్కడ ఆన్లైన్ ద్వారా ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ ర్యాంకులను విడుదల చేశారు. జీవన నాణ్యత, పట్టణాభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాల ప్రభావాన్ని అంచనా వేసే సూచీ ఈ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. విభిన్న అంశాల ప్రాతిపదికన పౌరుల జీవన ప్రమాణాలను ఈ ఇండెక్స్ అంచనా వేస్తుంది. పౌరుల అవగాహన సర్వేకు ఈ ఇండెక్స్‌లో 30 శాతం వెయిటేజీ ఉంటుంది. జీవన నాణ్యత, ఆర్థిక సామర్థ్యం, సుస్థిరత, 13 రంగాల (విద్య, తదితర) అభివృద్ధి అంశాలకు 70 శాతం వెయిటేజీ ఇచ్చి ఈ ఇండెక్స్ రూపొందించారు. ఈ ర్యాంకులను రెండు కేటగిరీలుగా విభజించారు. పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాలను ఒక కేటగిరీలో, పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాలను మరో కేటగిరీలో విభజించి ఈ ర్యాంకులను ప్రకటించారు. మొత్తం 110 నగరాలు ఈ ఇండెక్స్ ర్యాంకులకు పోటీ పడ్డాయి. మిలియన్ ప్లస్ కేటగిరీలో టాప్–10 ఇవే.. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ పది లక్షలకు పైబడిన జనాభా గల నగరాల కేటగిరీలో బెంగళూరు మొదటి ర్యాంకు సాధించగా తరువాతి స్థానాల్లో వరుసగా పుణే, అహ్మదాబాద్, చెన్నై, సూరత్, నవీ ముంబై, కోయంబత్తూర్, వడోదర, ఇండోర్, గ్రేటర్ ముంబై టాప్–10లో నిలిచాయి. ఏపీ నుంచి విజయవాడ 41వ స్థానంలో నిలిచింది. నాలుగో ర్యాంకు సాధించిన కాకినాడ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ పది లక్షల లోపు జనాభా గల నగరాల కేటగిరీలో మొదటి స్థానంలో సిమ్లా నిలవగా, తరువాతి స్థానాల్లో వరుసగా భువనేశ్వర్, సిల్వాస, కాకినాడ, సేలం, వెల్లూర్, గాంధీనగర్, గురుగ్రామ్, దావన్‌గెరె, తిరుచిరాపల్లి టాప్–10 స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ నుంచి వరంగల్ 19వ స్థానంలో, కరీంనగర్ 22వ స్థానాల్లో నిలిచాయి. ఏపీ నుంచి తిరుపతి 46వ స్థానంలో నిలిచింది. మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ ఇలా.. దేశంలో తొలిసారిగా మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ రూపొందించారు. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఒక సూచిక యొక్క ఫలితాన్ని నిర్దేశిస్తుండగా.. మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్ ఆ ఫలితానికి గల కారణాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. సేవల డెలివరీ, ప్రణాళిక, ఆర్థిక వ్యవస్థ, పరిపాలన ప్రక్రియల్లో సమర్థవంతమైన స్థానిక పాలనను నిరోధించే అంశాలను గుర్తించేందుకు ఈ ఇండెక్స్ దోహదపడుతుంది. సేవలు, ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, ప్రణాళిక, పరిపాలన అన్న ఐదు అంశాల ప్రాతిపదికన 20 రంగాల్లోని 100 సూచికలను ర్యాంకులకు ప్రాతిపదికగా తీసుకున్నారు. విశాఖ –9.. తిరుపతి–2..! మున్సిపల్ పర్ఫామెన్స్ ఇండెక్స్‌లో 10 లక్షలకు పైబడిన జనాభా కేటగిరీలో ఇండోర్ మొదటి స్థానం దక్కించుకుంది. తరువాత వరుసగా సూరత్, భోపాల్, పింప్రీ చించ్వాడ్, పుణే, అహ్మదాబాద్, రాయ్‌పూర్, గ్రేటర్ ముంబై, విశాఖపట్నం, వడోదర టాప్–10లో నిలిచాయి. ఇక, తెలంగాణ నుంచి హైదరాబాద్ 17వ స్థానంలో నిలిచింది. ఏపీ నుంచి విజయవాడ 27వ స్థానంలో నిలిచింది. 10 లక్షల లోపు కేటగిరీలో న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి స్థానంలో నిలిచింది. తిరుపతి రెండోస్థానంలో నిలిచింది. తరువాత వరసగా గాంధీనగర్, కర్నాల్, సేలం, తిరుప్పూర్, బిలాస్పూర్, ఉదయ్‌పూర్, ఝాన్సీ, తిరునల్వేలి నిలిచాయి. ఏపీ నుంచి కాకినాడ 11వ స్థానంలో నిలిచింది. -
ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్: టాప్ ప్లేస్‌లో బెంగళూరు
న్యూఢిల్లీ: ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్-2020ను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. నగరాల్లో జీవనం సాగించేందుకు అనుకూల పరిస్థితులకు అనుగుణంగా ఈ ర్యాంకులను కేటాయించింది. మిలియన్‌కు(10 లక్షల) పైగా జనాభా ఉన్న నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా.. ఆ తరువాతి స్థానాల్లో పుణె, అహ్మదాబాద్ ఉన్నాయి. అయితే 13వ స్థానంలో ఢిల్లీ, 15వ స్థానంలో విశాఖ ఉంగా హైదరాబాద్ 24వ స్థానంలో నిలిచింది. మొదటి పది స్థానాల్లో ఉన్న నగరాలు ఒకసారి చూస్తే.. 1. బెంగళూరు 2. పుణె 3. అహ్మదాబాద్ 4. చెన్నై 5. సూరత్ 6. నవీ ముంబై 7. కోయంబత్తూర్ 8. వడోదర 9. ఇండోర్, 10. గ్రేటర్ ముంబై ఉన్నాయి అదే విధంగా 10 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న నగరాల్లో సిమ్లాకు టాప్ ప్లేస్‌లో స్థానం దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో భువనేశ్వర్, సిల్వాసా, కాకినాడ, సేలం, గాంధీనగర్, గురుగ్రామ్, దేవన్‌గిరి, తిరుచిరాపల్లి ఉన్నాయి. దీనికి సంబంధించి 2020లో సర్వే నిర్వహించారు. మొత్తంగా 111 నగరాలు ఇందులో పాల్గొన్నాయి. పట్టణాభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు, మెరుగైన జీవన ప్రమాణాల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించినట్లు పీఐబీ ఒక ప్రకటనలో వెల్లడించింది. చదవండి: పేరెంట్స్‌తో కలిసి వ్యాక్సిన్ తీసుకున్న ఢిల్లీ సీఎం -
క్షేత్ర స్థాయిలో ఈజ్ ఆఫ్ లివింగ్ సర్వే
సాక్షి, ఒంగోలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై క్షేత్ర స్థాయిలో సర్వే కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో గ్రామ పంచాయతీల వారీగా జీవన సౌలభ్యం(ఈజ్ ఆఫ్ లివింగ్) సర్వే చేపట్టారు. ఎంపీడీవోలు, ఈవోఆర్డీల ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీలు, డిజిటల్ అసిస్టెంట్లు, వలంటీర్లు సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 56 మండలాల్లో 1038 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. దాదాపుగా 36 లక్షల మంది జనాభా ఉన్నారు. మొత్తం 884 గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులను గంటల వ్యవధిలోనే మంజూరు చేస్తున్నారు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, కాపు నేస్తం, జగనన్న చేదోడు, ఆటోవాలాలు, టైలర్లు, బార్బర్లకు ఏటా రూ.పది వేలు.. ఇలా అనేక సంక్షేమ పథకాల నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన పథకాలు పేద కుటుంబాలకు వరంలా మారాయి. రైతులకు ఉచిత బోర్లు వేయించే పథకం ప్రారంభమైంది. అయితే ఈ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకు అందుతున్నాయా లేదా అనే విషయమై క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. 59 శాతంపైగా సర్వే పూర్తి ఈవోఎల్ సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్లి మొత్తం 17 అంశాలపై 32 ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నారు. కనీస అవసరాలైన గ్యాస్ కనెక్షన్, కరెంట్, రైస్ కార్డు, జాతీయ గ్రామీణా ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పన తదితర అంశాలపై సర్వే కొనసాగుతోంది. ఇంకా వైఎస్సార్ పెన్షన్ కానుక, ఆరోగ్యానికి సంబంధించిన పథకాలు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే వ్యాక్సిన్లు, మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలపై సర్వే జరుగుతోంది. యువతకు జీవనోపాధిని కల్పించే నైపుణ్యా శిక్షణ తరగతులు, జీవిత బీమా, ప్రమాద బీమా, జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు, గృహ నిర్మాణ సదుపాయంపై ప్రజలను ప్రశ్నలు అడుగుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు లబ్ధిదారుల ఫోన్ నంబర్లు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు సర్వే 59 శాతంపైగా పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం అందిస్తున్న సంక్షేమ పథకాలే కాకుండా ఇంకా ఎలాంటి పథకాలు అందిస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయో సరి చూసుకోవడానికి ఈ సర్వే చేపట్టినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 30వ తేదీలోగా సర్వే పూర్తి చేయాలని ఎంపీడీవోలు, ఈవోఆర్డీలు, పంచాయతీ సెక్రటరీలను జిల్లా పరిషత్ సీఈవో కైలాష్ గిరీశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి జీవీ నారాయణరెడ్డి ఆదేశించారు. -
ప్రకృతిని పరిరక్షించుకోకపోతే విపత్తులు తప్పవు
హరివిల్లులో ఏడు రంగుల స్థానంలో ఒక రంగు మాత్రమే ఉంటే? భూమ్మీద తెల్లటి పూలు మాత్రమే పూస్తే? పండ్లు అన్నింటి రుచి ఒకేలా ఉంటే? అబ్బే... ఏం బాగుంటుంది అంటున్నారా? నిజమే. అన్నీ ఒకేలా ఉంటే బోర్ కొట్టేస్తుంది! వైవిధ్యం అనేది మనసుకు ఆనందం కలిగిస్తుంది! ప్రయోజనాలూ బోలెడు! కానీ.. ఈ విషయం మనిషికి పూర్తిగా అర్థమైనట్లు లేదు. ఎందుకంటే.. మన మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందని తెలిసినా... వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్ తదితరాల పేరుతో.... అడవులు, నదులు, సరస్సులు, నేలలను నాశనం చేస్తూనే ఉన్నాడు! వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) సిద్ధం చేసిన లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ –2020 చెబుతున్నది ఇదే! కోవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కోట్ల కేసులు.. లక్షల్లో మరణాలు... ఆర్థిక వ్యవస్థ ఛిద్రం.. ఉద్యోగాల కోత. ఇలా ఎన్నెన్నో సమస్యలకు ఒక వైరస్ కారణమైందంటే ఆశ్చర్యం అనిపించక మానదు. కానీ.. కోట్ల సంవత్సరాలపాటు జంతువుల్లో నిక్షేపంగా బతికిన ఈ వైరస్లు ఈ మధ్య కాలంలో మనిషికి ఎందుకు సంక్రమిస్తున్నాయో.. కారణమేమిటో మీరెప్పుడైనా ఆలోచించారా? హెచ్1ఎన్1 కానివ్వండి, చికెన్ గున్యా కానివ్వండి. స్వైన్‌ఫ్లూ కానివ్వండి అన్నీ జంతువుల నుంచి మనిషికి సోకిన వ్యాధులే. ఇప్పుడు కోవిడ్–19 కూడా. మనిషి ఎప్పుడైతే అటవీ సంపదను తన స్వార్థం కోసం విచ్చలవిడిగా వాడటం మొదలుపెట్టాడో అప్పటి నుంచే ఈ సమస్య కూడా పెరగడం మొదలైందని అంటారు నిపుణులు. ప్రకృతిని, జీవజాలాన్ని పరిరక్షించుకోవడం ఇప్పటికైనా నేర్చుకోకపోతే కోవిడ్–19 తరహా విపత్తులు మరిన్ని ఎదుర్కోక తప్పదని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తన లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ –2020లో స్పష్టం చేసింది. రెండేళ్లకు ఒకసారి విడుదల చేసే లివింగ్ ప్లానెట్ రిపోర్ట్‌ను ఈసారి దాదాపు 125 మంది నిపుణులు కలిసి సిద్ధం చేశారు. 1970 నుంచి 2016 మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 21 వేల క్షీరదాలు, పక్షులు, జలచరాలు, సరిసృపాలు సంతతిని పరిశీలిస్తూ సిద్ధం చేసిన ఈ నివేదిక దాదాపు 164 పేజీల నిడివి ఉంది. ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ పరిశీలించిన వాటిల్లో మూడింట రెండు వంతుల జంతుజాలం క్షీణావస్థలో ఉంది. మొక్కల విషయానికొస్తే... ప్రతి ఐదింటిలో ఒకటి అంతరించిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు నివేదిక చెబుతోంది. గత ఏడాది ఉష్ణమండల ప్రాంతాల్లోని అడవులనే పరిగణనలోకి తీసుకుంటే.. ఆరుసెకన్లకు రెండు ఎకరాల చొప్పున నష్టపోయామని నివేదిక తెలిపింది. అడవులు నరికివేసి వ్యవసాయం చేయడం మొదలుకొని నదీజలాల కాలుష్యంతో జలచరాలకు ముప్పు తేవడం వరకూ అన్నింటి ఫలితంగా భూమి ఇప్పుడు అత్యవసర సాయం కోరుతూ ఆక్రందనలు చేస్తోందని వివరించింది. ఈ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేకపోతే ఇంకో పదేళ్లలో సరిచేసుకునేందుకు వీలు కానంత పెద్ద ప్రమాదంలో పడతామని హెచ్చరించింది. అయితే ఇప్పటికైనా పరిస్థితి మించిపోలేదని, దేశాలన్నీ కలిసికట్టుగా పచ్చ‘ధనం’ పండిస్తే.. వినియోగం విషయంలో మనల్ని మనం మార్చు కోగలిగితే భూమి మరికొన్ని కాలాలపాటు పచ్చగా ఉండేందుకు అవకాశం లేకపోలేదని చెబుతోంది ఈ నివేదిక. ఇవీ కారణాలు భూ వినియోగంలో మార్పులు. అటవీ విస్తీర్ణం వేగంగా తగ్గిపోతూ ఉండటం, జంతుజాలాల ఆవాస యోగ్య ప్రాంతాలు కుంచించుకుపోవడం జీవవైవిధ్యం తగ్గుదలకు ఒక కారణం. ప్రకృతి వనరుల విచ్చలవిడి వాడకం రెండో కారణం. ఇన్వేసివ్ స్పీషీస్ (ఇతర జీవావరణాల నుంచి వచ్చిన జంతువులు, పక్షులు, మొక్కలు) మూడో కారణం. నాలుగవ, ఐదవ కారణాలుగా కాలుష్యం, వాతావరణ మార్పులను పేర్కొనవచ్చు. భారత్‌తోపాటు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జీవ వైవిధ్యతలో తగ్గుదలకు ప్రధానంగా వాటి ఆవాస ప్రాంత నష్టం కారణం కాగా.. ఇన్వేసివ్ స్పీషీస్, వ్యాధులు, అతి వాడకం ఇతర కారణాలుగా కనిపిస్తున్నాయి. భారత్‌లో నగరీకరణ, వ్యవసాయ కార్యకలాపాలు, కాలుష్యం వంటి కారణాల వల్ల చిత్తడి నేలలు దాదాపు లేకుండా పోయాయని లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ రిపోర్ట్ స్పష్టం చేసింది. అటవీ ప్రాంతాలు తగ్గడంతో జంతు సమూహాల్లోని సంఖ్య కూడా తగ్గిపోతోందని, ఇది కాస్తా సంతానోత్పత్తిపై ప్రభావం చూపడంతోపాటు వ్యాధులు ప్రబలేందుకు కారణమవుతోందని ఈ నివేదిక తెలిపింది. గత ఏడాది భారత్‌లో అటవీ భూములను ఇతర అవసరాల కోసం మళ్లించాలన్న అభ్యర్థనలు దాదాపు 240 వరకూ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాగా.. సుమారు 99 శాతం ప్రతిపాదనలకు అనుమతి లభించిందని ఈ నివేదిక తెలిపింది. సమీకృత విధానంతోనే పరిష్కారం... వేగంగా తగ్గిపోతున్న జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించాలన్నా, తద్వారా మానవ మనుగడను మరింత సుస్థిరం చేసుకోవాలన్నా ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాల్సిందే. ఆహార ఉత్పత్తిని, వాణిజ్యాన్ని మరింత ప్రకృతి అనుకూలమైన పద్ధతుల్లో చేపట్టడం ఇందులో ఒకటి మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఆహారంలో కనీసం మూడో వంతు వృథాగా చెత్తబుట్టల్లోకి చేరుతుండటం జీవవైవిధ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఈ వృథా కారణంగా గాల్లోకి చేరుతున్న విషవాయువులు వైమానిక రంగ ఉద్గారాల కంటే ఎక్కువగా ఆరు శాతం వరకూ ఉండటం గమనార్హం. ఆహార రంగం ద్వారా వెలువడుతున్న విషవాయువుల్లో 24 శాతం సరఫరా నష్టాలు, వినియోగదారులు వృథా చేయడమేనని నివేదిక తెలిపింది. ఈ నష్టాలన్నింటినీ తగ్గించుకోగలిగితే జీవవైవిధ్యం పెంపునకు తోడ్పడినట్లే. భారత్ విషయానికి వస్తే.. ఉత్పత్తి అవుతున్న ఆహారంలో వృథా అవుతున్నది దాదాపు 40 శాతం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటివి ఈ నష్టాన్ని 10 నుంచి 15 శాతంగా మాత్రమే చెబుతున్నా అంతర్జాతీయ సంస్థలు 40 శాతంగా లెక్కవేస్తున్నాయి. జంతుజాలాన్ని, ప్రకృతిని పరిరక్షించడం జీవవైవిధ్యం కోసం కీలకమైనప్పటికీ కేవలం ఈ చర్యల ద్వారా మాత్రమే పరిస్థితిని పారిశ్రామిక విప్లవం మునుపటి స్థాయికి తీసుకువెళ్లలేమని వీటికి ఇతర అంశాలూ కూడా జోడిస్తేనే మేలు జరుగుతుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. -
అదే మన గొప్పతనం!
ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నాయంటుంది వేదం. ఈ జీవరాశులన్నింటినీ నాలుగు తరగతులుగా వర్గీకరించారు. జరాయుజములు-మావితోపుడతాయి: అండజములు-గుడ్డుబద్దలు కొట్టుకుని బయటికి వస్తాయి: స్వేదజములు-చెమటనుండి పుడతాయి..పేలవంటివి: ఉద్బుజములు-భూమిని చీల్చుకుని పైకి వస్తాయి..చెట్లవంటివి. ఈ నాలుగురకాలైన ప్రాణులలో కొన్ని కోట్ల జన్మలు తిరిగి తిరిగి... అంటే పుట్టీ చచ్చీ, పుట్టీచచ్చీ... దాన్ని సంసార చక్రం అంటారు. అంటే-జనన మరణ చక్రమందు తిరుగుట అని. దీనికి అంతుండదు. శరీరం తీసుకోవడం...విడిచిపెట్టడం, తీసుకోవడం.. విడిచిపెట్టడం.. ఈ సంసార చక్ర పరిభ్రమణం తాపం అంటే వేడితో ఉంటుంది. ఎందుచేత ? అమ్మ కడుపులో పడి ఉండడం అన్నది అంత తేలికయిందేమీ కాదు. భాగవతంలో ’కపిలగీత’ చదివితే పుట్టుక ఇంత భయంకరంగా ఉంటుందా! అనిపిస్తుంది. శుక్రశ్రోణితములు కలిసిన దగ్గర్నుంచీ తల్లి కడుపులో బుడగగా ఆకృతి ఏర్పడి, తర్వాత ఆ పిండం పెరిగి పెద్దదై, మెల్లమెల్లగా అవయవాలు సమకూరిన తరువాత తలకిందకు, కాళ్లు పైకీ పెట్టి గర్భస్థమైన శిశువు పడి ఉన్నప్పుడు దానికి నాభిగొట్టం ద్వారా ఆహారం అంది చైతన్యాన్ని పొంది జీవుడు అందులోకి ప్రవేశించిన తరువాత సున్నితమైన క్రిములు కరిచేస్తుంటే, తొమ్మిదినెలలు అమ్మ కడుపులో కటిక చీకట్లో కొట్టుకుని కొట్టుకుని పరమేశ్వరుని ప్రార్థన చేసి ఆయన అనుగ్రహించి ప్రసూతివాయువు బయటికి తోసేస్తే అమ్మకడుపులోంచి బయటికి వచ్చి పడిపోతాడు. ఈ మనుష్యజన్మ ఎత్తడానికి ముందు ఎన్ని కోట్ల జన్మలెత్తాడో! ఆఖరికి చేసుకున్న పాపాలన్నీ చాలా భాగం తగ్గిపోయిన తర్వాత జన్మపరంపరలో పూర్తి చేసుకోవడానికి అవకాశమివ్వబడే చిట్టచివరి శరీరం-మనుష్య శరీరం. ఇదే మనుష్య శరీరానికి ఉన్న గొప్పతనం అంటారు శంకరులు. జననమరణాలు పోగొట్టుకునే అవకాశం ఒక్క మనుష్య శరీరానికి తప్ప మరే శరీరానికీ ఉండదు. దానితో ఒక్క మనుష్యుడు మాత్రమే కర్మానుష్ఠానం చేయగలడు. మనుష్యజన్మ వైశిష్ట్యాన్ని అంతసేపు చెప్పి చివరన ’కురుపుణ్య మహోరాత్రం’ అన్నాననుకోండి. అంటే మంచి కర్మలు చేయండి అన్నప్పుడు మనుష్య శరీరం కానప్పుడు అదెలా సాధ్యం? మనుష్య శరీరం కానిది కేవలం నమస్కారం కూడా చేయలేదు. రెండు చేతులు కలిపి -అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు కలిపి తలమీద ఉంచి బుద్ధిస్థానాన్ని దానితో కలిపి పదకొండింటినీ భగవంతుని పాదాలవద్ద న్యాసం చేయడం నమస్కారం. ఇలా ఏ ఇతర ప్రాణీ చేయలేదు. అందుకే అలా కర్మలను చేయుటవలన భక్తితో జీర్ణించిన కారణంచేత ఈశ్వరుని అనుగ్రహం ఏదో ఒకనాటికి కలుగుతుంది, అప్పుడు మోక్షాన్ని పొందుతాడు. అందుకే ‘జంతూనాం నరజన్మ దుర్లభం’ అంటారు శంకరాచార్యులు. అంటే మనుష్యుడు కూడా జంతువే. మనుష్యుడు జంతువెలా అవుతాడు? జంతువును సంస్కృతంలో ‘పశు’ అంటారు. పాశంచేత కట్టబడినది కాబట్టి పశువు అయింది. నాలుగు కాళ్ళు, రెండు కాళ్ళు ఉన్నవే కాదు, శాస్త్రంలో మనుష్యుడు కూడా జంతువుగానే పరిగణింపబడతాడు. ఎందుకంటే తత్త్వాన్నిబట్టి మనకు కూడా ఆ మూడూ ఉంటాయి. అందువల్ల మనల్ని కూడా పశువులు అని పిలుస్తారు. అయితే అలా అంటే మనం చిన్నబుచ్చుకుంటామేమోనని... శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ అదేదో తనమీద పెట్టుకున్నారు.‘‘ఓ పరమేశ్వరా! నేను పశువుని. నీవు పశుపతివి.’’అన్నారు. మనకూ పశువుకులాగే ఒక శరీరం, మెడలో ఒక తాడు. ఆ తాడు కట్టడానికి ఒక రాయి. మెడలో తాడు అంటే కర్మపాశాలు. కర్మపాశాల చేత జన్మ అనే రాయికి కట్టబడతాడు. అలా కట్టబడి ఉంటాడు కనుక మనిషిని కూడా పశువు అని పిలుస్తారు. ఏ జంతువయినా పాశాలను విప్పుకుంటే... యజమానిపట్ల ధిక్కార ధోరణి ప్రదర్శించిందని గుర్తు. కానీ మనుష్యుడి విషయంలో ఇది భిన్నంగా ఉంటుంది. సాధన చేత మనుష్యుడి తాళ్ళు తెగిపడిపోతాయి. అంటే ఇక మళ్ళీ పుట్టనటువంటి స్థితిని పొందాడని గుర్తు. ఇది మిగిలిన జంతువులకు, మనిషికి ఉండే తేడా. కర్మపాశాల ముడి విప్పడం కాదు. కర్మపాశాన్ని పరమేశ్వరుడు తెంచేస్తాడు. అందుకే భగవంతుని స్వరూపాలన్నింటిలో ఏదో ఒక చేతిలో గొడ్డలి లేదా కత్తి కనిపిస్తుంది. దానితో కర్మపాశాలను తెంపి, భక్తి పాశం వేసి ఆయన తన దగ్గరకు లాక్కుంటాడు. తన పాదపంజరంలో కూర్చోబెట్టుకుంటాడు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరంలేని స్థితి కల్పిస్తాడు. ఇంత అదృష్టం ఒక్క మనుష్య శరీరానికే సాధ్యం. అందుకే శంకరుల వారు’ జంతూనాం నరజన్మ దుర్లభం’ అన్నది. -
21వ శతాబ్దపు 'కేవ్ మ్యాన్'..!
అర్జెంటీనాః టుకుమాన్ ప్రావిన్స్ ఎత్తైన గ్రొట్టో పర్వతప్రాంతంలో ఓ వ్యక్తి 40 ఏళ్ళుగా జీవనం సాగిస్తున్నాడు. మనిషి సంచారం ఉండని ఆ ప్రాంతంలోని గుహలో ఒంటరిగా ఉంటున్న అతడ్ని... ఇప్పుడంతా '21 సెంచరీ కేవ్ మ్యాన్' అని పిలుస్తున్నారు. పర్వతప్రాంతంలో ఏకాంతంగా గడుపుతున్న 79 ఏళ్ళ పెడ్రో ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా కనిపిస్తాడు. తనకు ప్రకృతి వనాలమధ్య ఒంటరిగా నివసించడం ఎంతో ఇష్టమని చెప్తున్నాడు. తాను ప్రస్తుతం నివసిస్తున్న గుహకు మూడు గంటలు నడిచి వెళ్ళే దూరంలో ఉన్న చిన్న పట్టణం శాన్ పెడ్రో డి కొలాలో లో పుట్టి పెరిగిన పెడ్రో... బొలీవియా బొగ్గు రావాణా కోసం 14 ఏళ్ళ వయసులోనే ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. అక్కడినుంచీ 40 ఏళ్ళ క్రితమే తిరిగి వచ్చేసిన అతడు.. ప్రకృతి మధ్య జీవించాలనే తన చిన్ననాటి కల సాకారం చేసుకోవడంలో భాగంగా గ్రోట్టో పర్వత ప్రాంతంలోని గుహలో శిబిరం ఏర్పాటు చేసుకున్నాడు. నాగరిక సమాజంలో బతికిన రోజులను గుర్తు చేసుకుంటూ... మద్యం, హింస మనిషిని నాశనం చేస్తాయని చెప్తున్నాడు. అందుకే తాను అడవిని ఇష్టపడతానని, అక్కడ నివసించే జంతువులే తన కుటుంబ సభ్యులని అంటున్నాడు. పర్వత ప్రాంతంలో నివసించే సింహాలు, ఇతర మాంసాహారుల బారినుంచీ రక్షణకోరే 11 కోళ్ళు, 2 మేకలకు తన గుహలో రాత్రిపూట ఆశ్రయం కల్పిస్తున్నాడు. అవి పగలంతా పర్వతప్రాంతంలో ఆహారంకోసం సంచరించి తిరిగి రాత్రి సమయంలో పెడ్రో గుహకు చేరుకుంటుంటాయి. తెల్లవారుజామున కాకుల కూతలు మొదలయ్యే 3 గంటల ప్రాంతంలోనే పెడ్రో కూడా నిద్రనుంచీ మేల్కొంటాడు. ముందుగా అక్కడ దొరికే కట్టెలతో మంటను రాజేసి, ఆ వెలుగులోనే అక్కడ దొరకే సేంద్రియ అల్పాహారాన్ని భుజిస్తాడు. తెల్లవారిన అనంతరం రైఫిల్ పట్టుకొని పర్వత ప్రాంతంలో వేటకు వెళ్ళడమో.. లేదంటే అక్కడకు మూడు గంటలు నడిచి వెళ్ళే దూరంలో ఉన్న చిన్న పర్యటక పట్టణం శాన్ పెడ్రో డి కొలాలో వెళ్ళడమో చేస్తుంటాడు. గుహనుంచీ పట్టణానికి వచ్చిన అతడ్ని అక్కడి ప్రజలే కాక పర్యటకులూ సాదరంగా ఆహ్వానిస్తారని, ఎవ్వరికీ హాని తలపెట్టని మంచి మనిషిగా పెడ్రోను గుర్తిస్తారని అతడి మేనల్లుడు జువాన్ కార్లోస్ పేర్కొన్నాడు. తనకు వచ్చే నెలవారీ పెన్షన్ 100 డాలర్లను తీసుకొని అతడు తనకు, తనతో ఉండే జంతుజాలానికీ కావలసిన వస్తువులను పట్టణంనుంచీ కొనుగోలు చేసి, తిరిగి కాలినడకన తన గుహకు తీసుకెడుతుంటాడు. మూడు గంటలపాటు కాలినడక అంటే కొంత కష్టమైనా.. పెడ్రో దాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేనిదే మనుగడ లేదని వాదిస్తున్న నేటి తరుణంలో పెడ్రోమాత్రం విద్యుత్, గ్యాస్, టెలిఫోన్ వంటి సౌకర్యాలేమీ లేకుండా జీవిస్తున్నాడు. అయితే పర్వతాల్లో కూడా సిగ్నల్ అందుకునే బ్యాటరీ శక్తి కలిగిన ఓ అరుదైన అలారంతో కూడిన పాత రేడియో మాత్రం అతని వద్ద ఉంటుంది. ఒంటరిగా జీవించడానికి ఇష్టపడే అతడ్ని సందర్శించేందుకు మాత్రం ఎంతోమంది పర్యటకులు వెడుతుంటారని, మోడ్రన్ కేవ్ మ్యాన్ గా పెడ్రోను పిలుస్తారని పెడ్రో మేనల్లుడు ఒకరు చెప్తున్నారు. అంతేకాక పాఠశాల విద్యార్థులు సైతం అతడ్ని చూసేందుకు, గుహకు ప్రత్యేక ట్రిప్ లు ఏర్పాటు చేసుకుంటారని తెలిపాడు. అయితే తనకు ప్రపంచం మొత్తం కాలి నడకన తిరగాలన్న కోరిక ఉందనీ, కానీ మధ్యలో ఎంతో సముద్రం ఉందని, సమయం వస్తే అదికూడా దాటే ప్రయత్నం చేస్తానని.. పెడ్రో 79 ఏళ్ళ వయసులోనూ యువకుడిలా తన ఆసక్తిని వ్యక్తబరుస్తున్నాడు. -
21వ శతాబ్దపు 'కేవ్ మ్యాన్'..!
-
భారత్ లో అదే అత్యంత చౌక నగరం!
కోల్ కతాః ప్రవాసితులు నివసించేందుకు వీలుగా, ఇండియలోని మిగిలిన నగరాలతో పోలిస్తే అతి తక్కువ ఖర్చు ఉండే నగరం కోల్ కతా అంటున్నాయి తాజా సర్వేలు. ఒకప్పుడు సామాన్యులు సైతం బతికేందుకు వీలుగా, చౌకగా ఉండే నగరంగా పేరొందిన ముంబై ప్రస్తుతం ఆస్థానాన్ని కోల్పోయి అత్యంత ఖరీదైన నగరంగా మారిపోయిందని సర్వేల్లో తేలింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలతో పోలిస్తే ప్రస్తుతం కోల్ కతా అతి చౌక నగరంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో హాంకాంగ్ అత్యంత ఖరీదైన నగరంగా గుర్తింపు పొందిన కొద్ది రోజుల్లోనే ముంబైలోని అద్దెలు ఢిల్లీతో పోలిస్తే సుమారు 18 శాతం పెరిగిపోయినట్లు సర్వేలద్వారా తెలుస్తోంది. భారతదేశంలో సామాన్యులకు, ప్రవాసితులకు అందుబాటులో, తక్కువ ఖర్చు ఉండే నగరం కోల్ కతా అంటున్నాయి తాజా సర్వేలు. ప్రముఖ గ్లోబల్ కన్సల్టెన్సీ నిర్వహించిన సంవత్సరాంతపు సర్వేల్లో ఈ కొత్త వివరాలు వెల్లడయ్యాయి. మెట్రో నగరాల్లో ఒకటైన బెంగళూరు విదేశీయులకు అందుబాటులో ఉంటుందని, అతి తక్కువ ఖర్చుతో కోల్ కతాలో సామాన్యులు సైతం జీవించేందుకు వీలుందని సర్వే చెప్తోంది. మెర్సర్స్ 2016 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం హాంకాంగ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, ఖర్చు ఎక్కువగా ఉండే నగరాల జాబితాలో టాప్ ర్యాంక్ లో నిలువగా, రెండో స్థానంలో లువాండా, అంగోలా రాజధాని మోపడం లు ఉన్నాయి. జురిచ్, సింగపూర్ లు మూడు, నాలుగు స్థానాల్లో నిలువగా, గతేడాది ఆరోస్థానంలో ఉన్న టోక్యో ఈసారి ఐదో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం ఇండియాలో అత్యంత ఎక్కువ ఖర్చుగల నగరాల్లో మొదటిస్థానాన్ని 82 వ ర్యాంకుతో ముంబై ఆక్రమించింది. ఆ తర్వాత ర్యాంకులు 130 ఢిల్లీ, 158 చెన్నై ఆక్రమించగా... కోల్ కతా 194, బెంగళూరు 180 ర్యాంకులతో తక్కువ ఖర్చుగల నగరాలుగా గుర్తింపు పొందాయి. మెర్సర్స్ సంస్థ ప్రతియేటా మార్చి నెల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ పై సర్వే నిర్వహించి, మే, జూన్ ప్రాంతాల్లో ర్యాంకులను వెల్లడిస్తుంది. ఏ నగరంలోనైనా వస్తువులు మరియు సేవలు, హౌసింగ్ ఆధారంగానే జీవన వ్యయాన్ని అంచనావేస్తామని, మూడేళ్ళుగా ముంబై, ఢిల్లీకన్నా ఐదు కేటగిరీల్లో అత్యంత ఖరీదైన నగరంగా ఉంటోందని మెర్సర్ సంస్థ గ్లోబల్ మొబిలిటీలో.. ప్రిన్సిపాల్ ఇండియా ప్రాక్టీస్ లీడర్ గా పనిచేస్తున్న రుచికా పాల్ తెలిపారు. -
అతిథిని చూసి పరుగులు తీశారు!
సిడ్నీ: అనుకోని అతిథి ఇంటికి వస్తే ఎంతో సర్ ప్రైజింగ్ గా ఫీలవుతాం. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు అంటూ ఆనందంగా ఆహ్వానిస్తాం. పైగా ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరికి పడితే వారికి కనిపించని అరుదైన అతిథి వస్తే... ఇక ఆనందానికి అవధులే ఉండవు. కానీ ఓ ఆస్ట్రేలియన్ దంపతులు వారింటికి అరుదుగా వచ్చిన అతిథిని చూసి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని భయంతో పరుగులు తీశారట. చుట్టుపక్కల వారి సహాయంతో పట్టుకొని బంధించేందుకు ప్రయత్నించారట. ఇంతకూ ఆ భయంకర అతిథి వివరాలేమిటో ఓసారి చూద్దామా...? ఆస్ట్రేలియాలో నార్త్ క్వీన్స్ ల్యాండ్ స్టేట్ లోని వాంగలింగ్ బీచ్ ప్రాంతంలో నివసించే పీటర్, సూ లీచ్ దంపతులు తమ ఇంటికి వచ్చిన జెయింట్ ఫ్లైట్లెస్ కాసోవరీ పక్షిని చూసి పరుగులు తీశారట. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షులుగా జెయింట్ ఫ్లైట్లెస్ కాసోవరీ జాతి పక్షులను చెప్తారు. అటువంటి పక్షి అనుకోకుండా ఆ దంపతుల ఇంటికి అరుచుకుంటూ రావడంతో ముందు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే అదో ప్రమాదకర పక్షి అని గుర్తించి పరుగులు తీశారు. రెండు మీటర్ల పొడవు.. సుమారు 70 కిలోల బరువుండే ఆ పక్షి.. నల్లని రెక్కలు, పొడవైన ముక్కు, మెడవద్ద నీలిరంగు, తలపై చిన్నపాటి పించంతో చూసేందుకు మాత్రం పెద్ద సైజు నెమలిని పోలి ఉంటుంది. ముందుగా పక్షిని చూసిన తన భర్త... ఇంటికి ఎవరొచ్చారో చూడు.. అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడని, తీరా అది ప్రమాదకర కాసోవరీస్ పక్షి అని గుర్తించి అతడు డైనింగ్ టేబుల్ వెనక దాక్కున్నాడని, తాను మాత్రం బయటకు పరుగు తీశానని సూలీచ్ తెలిపింది. విషయం తెలసిన పొరుగువారు ఆ పక్షి అత్యంత ప్రమాదకరమైన పక్షి అని, దగ్గరలోని రైన్ ఫారెస్ట్ నుంచి వచ్చి ఉంటుందని, ఇంతకుముందెప్పుడూ ఎవరింటికీ రాలేదని తెలిపారని సూలీచ్ అంటోంది. ఆ ప్రమాదకరమైన, అరుదైన కాసోవరీ పక్షి జాతి.. ఆస్ట్రేలియా ఈశాన్య క్వీన్స్ ల్యాండ్ ప్రాంతంలోని రైన్ ఫారెస్టుల్లోనూ, కొన్ని ఐస్ ల్యాండ్ ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి. అత్యంత బరువైన, పొడవైన ఆపక్షిని ప్రపంచంలోనే ప్రమాదకరమైన పక్షిగా గుర్తించారు. అది దాని పొడవైన కాళ్ళతో మనుషులు, పెంపుడు జంతువులపై దాడి చేస్తుంటుంది. 2003 లెక్కల ప్రకారం క్వీన్స్ ల్యాండ్ ప్రాంతంలో ఈ కాసోవరీ పక్షి దాడికి ఎనిమిదిమంది గురైనట్లు, 1926-1999 మధ్య ప్రాంతంలో తీవ్ర గాయాలైన ఒకరు మృతి చెందినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఆస్ట్రేలియాలో ఈ జాతి పక్షులు సుమారు 2 వేల వరకూ ఉండొచ్చని పదహారేళ్ళ క్రితంనాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తోంది. -
గ్రీనరీలకన్నా సీనరీలే ఆరోగ్యం!
అందమైన నగరాల్లో నివసించడం గ్రామజీవనం కన్నా ఆరోగ్యకరం అంటున్నారు అధ్యయనకారులు. నగరాల్లో ఉండే ఓ మంచి సీనరీ... గ్రామాలు, పట్టణాల్లోని గ్రీనరీ (పచ్చదనం) కన్నా సానుకూల వాతావరణాన్ని సృష్టించడంతోపాటు... మానసిక, శారీరక శ్రేయస్సును మెరుగు పరిచేందుకు, ఉపయోగపడుతుందని చెప్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని నదులు, పచ్చదనం కన్నా... నగరాల్లో అత్యంత సుందరమైన సీనరీల్లో ఉండే గోధుమ, బూడిద, నీలం రంగులు...వ్యక్తి భావాలను ఆకట్టుకుంటాయని అధ్యయనాలు తేల్చి చెప్తున్నాయి. థేమ్స్ నదిలో రవాణా జరిపే కార్గో ఓడలు, సెంయింట్ పాల్ కేథడ్రాల్ వ్యూ వంటివి... కొండలు, విస్తారమైన అడవుల్లో నడవటం కన్నా.. ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పెంచుతాయని నిపుణులు అంటున్నారు. వార్విక్ బిజినెస్ స్కూల్ విద్యావేత్తల సర్వేలో భాగంగా బ్రిటన్ కు చెందిన 212,000 చిత్రాలను చూపించి వాటిపై ప్రజలను రేటింగ్ చేయమని కోరారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆయా ప్రాంతాల్లో నివసించే 1.5 మిలియన్ల జనాభా వారి ఆరోగ్యం గురించి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీన్నిబట్టి పరిశోధకులు అత్యంత సుందరమైన, అభివృద్ధి చెందిన నగరాలతో పోలిస్తే పచ్చని గ్రామాల్లో ఆరోగ్యం, అనందం అంతగా లేవని తేల్చారు. కేవలం ఓ పచ్చని ప్రాంతం.. సీనరీల్లో ఉండే మంచి అనుభూతిని, ఆనందాన్ని ప్రేరేపించడం లేదని తమ సర్వే ద్వారా తెలిసినట్లు బిజినెస్ స్కూల్ పీహెచ్ డి విద్యార్థి ఛనూకి తెలిపారు. వాతావరణంలోని అందాన్ని పరిగణలోకి తీసుకోకుండా.. కేవలం పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంవల్ల ఉపయోగం ఉండదన్నారు. స్థానికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పట్టణాల్లో ప్రణాళికా బద్ధంగా పార్కులు, హౌసింగ్, రహదారులు వంటి నిర్మాణాలు చేపట్టాలని... పర్యావరణాన్ని అందంగా తీర్చి దిద్దడంవల్ల ఆరోగ్యంగా ఉండగల్గుతారని సర్వేలు సూచిస్తున్నట్లు తెలిపారు. తాము జరిపిన సర్వే ద్వారా సీనరీలు ఆరోగ్యం మధ్య చూసిన సంబంధం, ప్రయోజనకర ప్రభావాలు... హరిత ప్రదేశాల్లో కనిపించడం లేదని బిజినెస్ స్కూల్ కు చెందిన బిహావియరల్ సైన్స్ ల్యాబ్ సహదర్శకుడు, అసోసియేట్ ప్రొఫెసర్ సూజీ మాట్ వెల్లడించారు. గతంలో మనం నమ్మే పచ్చదనం ఆరోగ్యానికి శ్రేయస్కరం అన్న నమ్మకాన్ని వదిలి... దైనందిన జీవితంలో పర్యావరణ ప్రాముఖ్యతకే ప్రాధాన్యతను ఇవ్వవచ్చని తమ సర్వే ఫలితాలద్వారా తెలుస్తోందంటున్నారు. -
జీవించే హక్కు లేకుండా పోతోంది
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: దేశ ప్రజల భవిష్యత్ రాజ్యాంగ చట్టాలపై ఆధారపడి ఉందని, చట్టాలను అమలు చేసే వారు సక్రమంగా అమలు చేస్తే అందరికీ సముచిత న్యాయం లభిస్తుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బంధు సొసైటీ, సంత్ రవిదాస్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యంగ దినోత్సవం, మహాత్మజ్యోతిరావు పూలే వర్ధంతి సభ సందర్భంగా పూలే, అంబేద్కర్ల భావ జాలం - రాజ్యాంగం - సామాజిక న్యాయం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. పాలనలో ఉన్నవారు చేసిన దుర్మార్గాల వల్ల జీవించే హక్కు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ వై.బి.సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగంలో సవరణలు చేయవచ్చు కానీ ఎలాంటి మార్పులు లేకుండా చూడాలని ఆయన కోరారు. ప్రభంజన్‌యాదవ్, బంధు సొసైటీ అధ్యక్షులు పి. వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఇలా కూడా ఉండొచ్చు
వర్జీనియా: సామూహిక సహజీవనానికి ఆ గ్రామం నిలువెత్తు నిదర్శణం. అక్కడ ఎవరికి సొంత ఇళ్లు ఉండవు. సొంత కార్లు ఉండవు. సొంత పొలాలు ఉండవు. సొంత వ్యాపారం అంటూ ఉండదు. అందరూ అన్ని పంచుకోవాల్సిందే. సమష్టిగా కలసిమెలసి పనిచేయాలి. ఫలితాన్ని సమంగా పంచుకోవాలి. పిల్లల పెంపకం కూడా సమష్టి బాధ్యతగా చూసుకుంటారు. ఎవరి వ్యక్తిగత కుటుంబం వారికున్నప్పటికీ కమ్యూన్ ఇళ్లలోనే అందరు కలిసి మెలసి జీవిస్తారు. పరస్పరం సహాయ, సహకారాలు అందించుకున్నప్పటికీ ఎవరి ఇష్టం ప్రకారం వారు వంట చేసుకొని తింటారు. పండుగలు, పబ్బాలను మాత్రం సమష్టిగానే జరుపుకుంటారు. ఎవరైనాఇంటర్నెట్, టీవీలు చూడవచ్చు. వీడియో గేమ్స్ ఆడకూడదు. తుపాకుల లాంటి మారణాయుధాలు కలిగివుండరాదు. బిడ్డలను కనాలంటే కమ్యూనిటి అనుమతి తప్పనిసరి. ఆధునిక ప్రపంచానికి దూరంగా, ఎక్కడో అటవి ప్రాంతంలో ఆదిమ తెగవాళ్లు ఇలా సామూహిక సహ జీవితాన్ని అనుభవిస్తుండవచ్చని పొరపాటు పడవచ్చు. కానీ అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం, లౌసా కౌంటీలోని ఓ గ్రామం ప్రజలు అలా జీవిస్తున్నారంటే ఆశ్చర్యం కలగవచ్చు. ఆ గ్రామం పేరు 'ట్విన్ ఓక్స్'. లౌసా కౌంటీకి సరిగ్గా ఎనిమిది మైళ్ల దూరంలో ఉంది. గ్రామం మొత్తం జనాభా 105 మంది. అందులో పెద్దవాళ్లు 92 మందికాగా, పిల్లలు 13 మంది. సరిగ్గా 48 ఏళ్ల క్రితం ఆ గ్రామం ఏర్పడింది. ఆ గ్రామంలో అందరు కలసి సమష్టి వ్యవసాయం చేస్తారు. గ్రామానికి అవసరమైన మేరకు ధాన్యాలను భద్రపర్చుకొని మిగతావి సమీపంలోని మార్కెట్లో విక్ర యిస్తారు. ఆవులను పోషిస్తూ పాలను విక్రయిస్తారు. అలా వచ్చిన సొమ్ము కమ్యూనిటీ ఖాతాలోకి వెళుతుంది. గ్రామంలోని పాఠశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. యాభై ఏళ్లలోపున్న ప్రతి ఒక్కరు వారానికి 48 గంటలు కమ్యూన్ వ్యవసాయంలో పనిచేయాలి. యాభై ఏళ్ల పైబడిన వారు రోజుకు గంట చొప్పున కమ్యూనిటీ గార్డెనింగ్ లాంటివి చూసుకోవాలి. పిల్లల పోషణ సమష్టి బాధ్యత. ఒక్కో కమ్యూనిటీ ఇంట్లో దాదాపు 20 మంది నివసిస్తారు. గ్రామస్థులు జీవితంలో ఒక్కరినే పెళ్లి చేసుకుంటారు. వారిలో ఇప్పటి వరకు విడాకులంటూ లేవు. సంతానానికి వారిస్తున్న ప్రాధాన్యత తక్కువ. కమ్యూనిటీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి కావడం అందుకు కారణం కావచ్చు. కమ్యూనిటీలో పనిచేసే ప్రతి వ్యక్తికి ఆడ, మగ తేడా లేకుండా నెలకు దాదాపు ఆరువేల రూపాయలను జీవన భృతిగా చెల్లిస్తారు. సరైన ఉద్యోగంలేక దారిద్య్రంలో బతుకుతున్న వారంతా కలసి 48 ఏళ్ల క్రితం ఆ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారట. అప్పటి నుంచే ఈ కమ్యూనిటీ జీవితాన్ని ప్రారంభించారట. ఇప్పుడు వారికి దారిద్య్రం అంటే తెలియదు. అలాగని ధనవంతులయ్యే అవకాశం లేదు. తామంతా కమ్యూనిటీ జీవితాన్ని గడుపుతుండడం వల్ల తమకు డబ్బనేది అర్థంలేని విషయంగానే కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ సమష్టి సహ జీవనం తమకు ఎంతో ఆనందంగా ఉందని, తమ మధ్యనే ప్రేమలు, పెళ్లిల్లూ జరుగుతుండడం వల్ల బయటి ప్రపంచంతో తాము పెద్దగా సంబంధాలు కూడా కోరుకోవడం లేదని వారు తెలియజేస్తున్నారు. మొన్నటి వరకు ఓ కార్పొరేట్ కంపెనీలో సీఈవోగా పనిచేసిన మహిళ తన మాజీ భర్త, సాపో అనే తన ఎనిమిదేళ్ల పాపతో వచ్చి కొత్తగా వారి కమ్యూనిటీలో చేరింది. తనకు వారి కమ్యూనిటీ జీవితం ఎంతో నచ్చిందని, ఎంతోకాలం నిరీక్షణ తర్వాత తనకు కమ్యూనిటీలో చేరే అవకాశం చిక్కిందని ఆమె మీడియాకు తెలియజేశారు. కమ్యూనిటీలో చేరేందుకు ఇంకా చాలా మంది నిరీక్షణ జాబితాలో ఉన్నారట. ఈ కమ్యూనిటీ జీవితం పట్ల మొఖం చిట్లిస్తున్న వారూ లేకపోలేదు. 'నాతోటి పిల్లలు లేకపోవడం వల్ల నాకు ఇక్కడ బోర్ కొడుతోంది. ఎంతసేపు ఈ పొలాల మధ్య బతుకుతాను. బయటకెళ్లి పబ్లిక్ స్కూల్లో చేరాలనుకుంటున్నాను. అందుకు కమ్యూనిటీ అనుమతి కూడా తీసుకున్నాను' అని 22 ఏళ్ల ఇమాని కాలెన్ వ్యాఖ్యానించారు.