అమెరికాలో అక్రమ వలసదారుల బెడద ఎక్కువగా ఉంది. ఇప్పటికే దాదాపు 17 మిలియన్ల మంది అక్రమ వలసదారులు నివసిస్తున్నట్లు హకీష్ ఇమ్మిగ్రేషన్ గ్రూప్ అంచనా వేసింది. 2021 ప్రారంభంలో అధ్యక్షుడు జో బైడెన్ బాధ్యతలు చేపట్టే నాటికే వారి సంఖ్య 16 శాతం పెరిగినట్లు నివేదికలో వెల్లడించింది. దాదాపు 16.8 మిలియన్ల మంది ఉన్నారని, జనవరి 2022లో 15.5 మిలియన్లకు పెరిగిందని వెల్లడించింది. అదికాస్త ఇటీవల సంవత్సరంలో దాదాపు 11 మిలియన్లకు చేరినట్లు అంచనా వేసింది.
బైడెన్ పరిపాలనలో మూడో ఏడాది నుంచి వలసల సంక్షోభాన్ని తీవ్రంగా ఎదుర్కొంటోంది. దీంతో ట్రంప్ హయాంలోని విధానాలను రద్దు చేసింది. సరిహద్దు వద్ద కఠినమైన చర్యలను అమలు చేసింది. అందుకోసం ఫెడరేషన్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ రిఫామ్ (ఎఫ్‌ఏఐఆర్) ఆ అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చింది కూడా.
దీనికి తోడు ఈ అక్రమ వలసలు కారణంగా దక్షిణ సరిహద్దులో సుమారు 2 లక్షలు పైగా ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఆర్థిక ఏడాదితో కలిసి ఇప్పటి వరకు సుమారు 1.6 మిలియన్లకు పైగా ఎన్‌కౌంటర్లు జరిగినట్లు అమెరికా ఓ నివేదిక తెలిపింది. అలాగే రెండు లక్షల మందిలో సగానికిపైగా వీసా గడువు ముగింపు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. అలాగే కరోనా కారణంగా వలస వచ్చిన వారిని కూడా వేగంగా బహిష్కరించే పనులు ముమ్మరంగా జరగుతున్నట్లు వెల్లడించింది.
చట్ట విరుద్ధంగా అమెరికాలో శాశ్వత నివాసం ఉండేందుకు యత్నించిన ఏ వ్యక్తిపైన అయినా కఠిన చర్యలు తప్పవని అమెరికా ప్రకటించింది కూడా. అదీగాక సుమారు 3 లక్షల మంది ఇటీవల తాత్కాలిక అనుమతి లేదా నిష్క్రమణ నుంచి మినహాయింపు పొందిన వారు ఉన్నట్లు ఇమ్రిగ్రేషన్ గ్రూప్ పేర్కొంది. వారి టీపీఎస్ (వీసా)ని కూడా పొడిగించినట్లు తెలిపింది. అక్రమ వలసదారుల జనాభాను కచ్చితంగా అంచనా వేయడం అసాధ్యం అని, అధికారులను తప్పించుకుని తిరుగుతున్న వారి వివరాలు తెలియాల్సి ఉందని సైన్సస్ బ్యూరో డేటా పేర్కొంది.
ఆ డేటా ఆధారంగానే అంచనా..
వార్షిక జనాభా గణన డేటాలో మార్పుల అధారంగా వారి సంఖ్యను అంచనా వేయడమే గానీ కచ్చితమైన గణాంకాలు లేవని తేల్చి చెప్పింది. ఆఖరికి ఫెడరేషన్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ రిఫామ్ (ఎఫ్‌ఏఐఆర్) సైతం ఆ సైన్స్ బ్యూరో డేటా ఆధారంగానే ఈ అక్రమ వలసలను అంచనా వేస్తునట్లు వెల్లడించడం గమనార్హం. బైడెన్ ప్రభుత్వం ఈ అక్రమ వలసలను నివారించేందుకు తీసుకున్న నిర్ణయాలు కారణంగానే ఆ డేటా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కొనసాగుతున్న అక్రమ వలసల సంక్షోభానికి కారణం కాంగ్రెస్‌లోని రిపబ్లికన్లే అంటూ వారు తీసుకున్న చర్యలను తప్పుబడుతోంది బైడెన్ ప్రభుత్వం.
(చదవండి: అభిమానంతో వచ్చే చిక్కులు..వారితో వ్యవహారం మాములుగా ఉండదు!)
Comments
Please login to add a commentAdd a comment