Illegal Immigrant
-
Lok Sabha Election 2024: బెంగాల్లోకి అక్రమ వలసలు
కాక్ద్వీప్/మయూర్భంజ్/బాలాసోర్: ‘వికసిత్ భారత్’ సాకారం కావాలంటే ‘వికసిత్ బెంగాల్’ కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశి్చమ బెంగాల్లోకి అక్రమ వలసలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో జనాభా స్థితిగతుల్లో మార్పులు వస్తున్నాయని, స్థానిక యువతకు దక్కాల్సిన అవకాశాలను చొరబాటుదార్లు కాజేస్తున్నారని ఆరోపించారు. ప్రజల భూములను, ఆస్తులను లాక్కుంటున్నారని, ఇది తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల కోసం పాకులాడుతోందని, అసలైన ఓబీసీల హక్కులను ముస్లింలకు కట్టబెడుతోందని మండిపడ్డారు. ముస్లింలకు ఓబీసీల పేరిట తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు జారిచేస్తోందని విమర్శించారు. బెంగాల్లోకి అక్రమ చొరబాట్లను ప్రోత్సహిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులు పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం పశ్చిమ బెంగాల్‌లోని కాక్ద్వీప్, ఒడిశాలోని మయూర్భంజ్, బాలాసోర్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి మాట్లాడారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... దేశ భద్రతను పణంగా పెడుతున్నారు ‘‘ఇతర దేశాల్లో మత హింస కారణంగా వలస వచి్చన హిందువులకు, మతువాలకు భారత పౌరసత్వం ఇవ్వడాన్ని తృణమూల్ కాంగ్రెస్ నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తోంది. సమాజంలో ఓ వర్గాన్ని మచి్చక చేసుకోవడానికి రాజ్యాంగంపై దాడి చేస్తోంది. ముస్లింలకు ఓబీసీ హోదా కలి్పంచడాన్ని కలకత్తా హైకోర్టు రద్దు చేసింది. కానీ, కోర్టు తీర్పును తృణమూల్ కాంగ్రెస్ అంగీకరించడం లేదు. ఈ తీర్పుపై తప్పుడు ప్రచారం చేస్తోంది. ముస్లింలను తప్పుదోవ పట్టిస్తోంది. దేశ భద్రతను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పణంగా పెడుతోంది. అక్రమ చొరబాట్లపై చర్యలు తీసుకోవడం లేదు. నవీన్ పటా్నయక్ అనారోగ్యం వెనుక కుట్ర! ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్ ఆరోగ్యంగా హఠాత్తుగా క్షీణించిందని చెబుతున్నారు. గత ఏడాది కాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారుతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనివెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవీన్ పటా్నయక్ తరఫున ప్రస్తుతం ఒడిశా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బలమైన లాబీ ఈ కుట్రకు తెరతీసిందా? అనే సందేహాలు లేకపోలేదు. నవీన్ బాబు ఆరోగ్యం క్షీణించడం వెనుక మిస్టరీ ఏమిటో బయటపడాలి. ఒడిశాలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నవీన్ పటా్నయక్ ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించడంపై కారణాలు తెలుసుకోవడానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం’’. అని మోదీ స్పష్టం చేశారు. నా ఆరోగ్యం భేషుగ్గా ఉంది: నవీన్ పటా్నయక్ తన ఆరోగ్యం క్షీణించడం వెనుక కుట్ర ఉందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్ ఖండించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నానని వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
ఒకరు వచ్చారు.. ఇంకొకరు వెళ్లారు.. భారత్-పాకిస్తాన్ ప్రేమకథలు..
ఇస్లామాబాద్: మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరమంటూ భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులను చెరిపేసి ప్రయత్నంలో ఉన్నారు ఇరుదేశాల ప్రేమికులు. పాకిస్తాన్ నుంచి ఒక మహిళ పబ్జీ పరిచయంతో తాను ప్రేమించిన యువకుడి కోసం భారతదేశం వచ్చినట్టే భారత దేశం నుండి కూడా ఒక మహిళ లెక్క సరిచేస్తూ ప్రేమించిన యువకుడి కోసం ఇటు నుండి పాకిస్తాన్‌కు ప్రయాణమైంది. కాకపొతే పాకిస్తానీ మహిళ సీమా హైదర్ లా కాకుండా అన్ని డాక్యుమెంట్లు పక్కాగా సిద్ధం చేసుకుని ప్రణాళిక ప్రకారం వెళ్ళింది భారత మహిళ. ఒక పధ్ధతి.. ఒక ప్లానింగ్.. యూపీలోని కైలార్ గ్రామంలో పుట్టి పెరిగి రాజస్థాన్‌లోని ఆళ్వార్ జిల్లాలో నివాసముంటున్న అంజు(34)కు పాకిస్తాన్ యువకుడు నస్రుల్లా(29)తో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. కొద్దిరోజులకి ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఎలాగైనా ప్రియుడిని కలవాలనుకుంది. అనుకుందే తడవు సాహసం చేసి సరిహద్దు దాటేసి డిర్ జిల్లాలోని పక్తుంక్వా చేరుకుని నస్రుల్లాను కలుసుకుంది. విషయం తెలుసుకున్న డిర్ పోలీసులు వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకుని సీనియర్ పోలీసు అధికారి ముస్తాక్ ఖాబ్ ఆధ్వర్యంలో అన్ని డాక్యుమెంట్లను పరిశీలించారు. అంతా సక్రమంగా ఉందని తెలిసిన తర్వాతే వారిని విడిచిపెట్టారు. జైపూర్ వెళ్తున్నట్లు చెప్పి.. రాజస్థాన్ పోలీసులకు ఈ సమాచారమందడంతో వారు భివాడిలోని అంజు ఇంటికి వెళ్ళి ఆరా తీశారు. విచారణ సమయంలో అంజు భర్త అరవింద్ మాట్లాడుతూ.. మాకు 2007లో పెళ్లి జరగగా 15 ఏళ్ల పాప, 6 ఏళ్ల బాబు ఉన్నారని తెలిపారు. నా భార్యకు సోషల్ మీడియాలో పరిచయాలున్నాయని నాకు తెలియదు. గురువారం తాను స్నేహితురాలిని కలిసేందుకు జైపూర్ వెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి వెళ్లిందని తర్వాత తన చెల్లెలికి ఫోన్ చేసి మాట్లాడుతుండగా లాహోర్ వెళ్లిన విషయం తెలిసిందన్నారు. ఎలాగైనా నా భార్యకు నచ్చజెప్పి తనను తిరిగి తీసుకొస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు అరవింద్. అంతా సేమ్ టు సేమ్.. ఇటీవల పబ్జీలో పరిచయాన్ని ప్రేమగా మలచుకుని భారత్ వచ్చిన మహిళ సీమా హైదర్- సచిన్ మీనాల ప్రేమకి అంజు-నస్రుల్లా ప్రేమకి కొన్ని సారూప్యతలున్నాయి. ఇద్దరూ పెళ్ళై పిల్లలున్నవారే.. ఇద్దరి ప్రేమలకూ సోషల్ మీడియానే వేదిక.. పొందికగా పొరుగు దేశాల వారినే ప్రేమించారు. కాకపొతే సీమా హైదర్ చట్టవిరుద్ధంగా భారత దేశంలో అడుగుపెట్టగా అంజు మాత్రం పూర్తి చట్టబద్ధంగా పాకిస్తాన్ వెళ్ళింది. అదొక్కటే వ్యత్యాసం. ఇది కూడా చదవండి: కూతురు అబార్షన్‌కు సాయం చేసిన తల్లి.. అలా పోలీసులకు దొరికిపోయింది! -
US: అంచనాకు మించి అక్రమ వలసదారులు..ఇరకాటంలో బైడెన్ పాలన
అమెరికాలో అక్రమ వలసదారుల బెడద ఎక్కువగా ఉంది. ఇప్పటికే దాదాపు 17 మిలియన్ల మంది అక్రమ వలసదారులు నివసిస్తున్నట్లు హకీష్ ఇమ్మిగ్రేషన్ గ్రూప్ అంచనా వేసింది. 2021 ప్రారంభంలో అధ్యక్షుడు జో బైడెన్ బాధ్యతలు చేపట్టే నాటికే వారి సంఖ్య 16 శాతం పెరిగినట్లు నివేదికలో వెల్లడించింది. దాదాపు 16.8 మిలియన్ల మంది ఉన్నారని, జనవరి 2022లో 15.5 మిలియన్లకు పెరిగిందని వెల్లడించింది. అదికాస్త ఇటీవల సంవత్సరంలో దాదాపు 11 మిలియన్లకు చేరినట్లు అంచనా వేసింది. బైడెన్ పరిపాలనలో మూడో ఏడాది నుంచి వలసల సంక్షోభాన్ని తీవ్రంగా ఎదుర్కొంటోంది. దీంతో ట్రంప్ హయాంలోని విధానాలను రద్దు చేసింది. సరిహద్దు వద్ద కఠినమైన చర్యలను అమలు చేసింది. అందుకోసం ఫెడరేషన్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ రిఫామ్ (ఎఫ్‌ఏఐఆర్) ఆ అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చింది కూడా. దీనికి తోడు ఈ అక్రమ వలసలు కారణంగా దక్షిణ సరిహద్దులో సుమారు 2 లక్షలు పైగా ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఆర్థిక ఏడాదితో కలిసి ఇప్పటి వరకు సుమారు 1.6 మిలియన్లకు పైగా ఎన్కౌంటర్లు జరిగినట్లు అమెరికా ఓ నివేదిక తెలిపింది. అలాగే రెండు లక్షల మందిలో సగానికిపైగా వీసా గడువు ముగింపు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. అలాగే కరోనా కారణంగా వలస వచ్చిన వారిని కూడా వేగంగా బహిష్కరించే పనులు ముమ్మరంగా జరగుతున్నట్లు వెల్లడించింది. చట్ట విరుద్ధంగా అమెరికాలో శాశ్వత నివాసం ఉండేందుకు యత్నించిన ఏ వ్యక్తిపైన అయినా కఠిన చర్యలు తప్పవని అమెరికా ప్రకటించింది కూడా. అదీగాక సుమారు 3 లక్షల మంది ఇటీవల తాత్కాలిక అనుమతి లేదా నిష్క్రమణ నుంచి మినహాయింపు పొందిన వారు ఉన్నట్లు ఇమ్రిగ్రేషన్ గ్రూప్ పేర్కొంది. వారి టీపీఎస్ (వీసా)ని కూడా పొడిగించినట్లు తెలిపింది. అక్రమ వలసదారుల జనాభాను కచ్చితంగా అంచనా వేయడం అసాధ్యం అని, అధికారులను తప్పించుకుని తిరుగుతున్న వారి వివరాలు తెలియాల్సి ఉందని సైన్సస్ బ్యూరో డేటా పేర్కొంది. ఆ డేటా ఆధారంగానే అంచనా.. వార్షిక జనాభా గణన డేటాలో మార్పుల అధారంగా వారి సంఖ్యను అంచనా వేయడమే గానీ కచ్చితమైన గణాంకాలు లేవని తేల్చి చెప్పింది. ఆఖరికి ఫెడరేషన్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ రిఫామ్ (ఎఫ్‌ఏఐఆర్) సైతం ఆ సైన్స్ బ్యూరో డేటా ఆధారంగానే ఈ అక్రమ వలసలను అంచనా వేస్తునట్లు వెల్లడించడం గమనార్హం. బైడెన్ ప్రభుత్వం ఈ అక్రమ వలసలను నివారించేందుకు తీసుకున్న నిర్ణయాలు కారణంగానే ఆ డేటా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కొనసాగుతున్న అక్రమ వలసల సంక్షోభానికి కారణం కాంగ్రెస్‌లోని రిపబ్లికన్లే అంటూ వారు తీసుకున్న చర్యలను తప్పుబడుతోంది బైడెన్ ప్రభుత్వం. (చదవండి: అభిమానంతో వచ్చే చిక్కులు..వారితో వ్యవహారం మాములుగా ఉండదు!) -
ఆర్టికల్ 371 జోలికి వెళ్లం
గువాహటి: ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 371 జోలికి వెళ్లబోమని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అక్రమంగా ఒక్క వలసదారున్ని కూడా దేశంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఆదివారమిక్కడ జరిగిన ఈశాన్య రాష్ట్రాల మండలి (ఎన్ఈసీ) 68వ ప్లీనరీ సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 371ని కూడా కేంద్రం రద్దు చేస్తుందన్న ప్రచారం జరుగుతోందని తెలిపారు. ‘దీనిపై నేను ఇదివరకే పార్లమెంటులో స్పష్టతనిచ్చాను. నేడు 8మంది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో మరోసారి చెబుతున్నా. కేంద్రం ఆర్టికల్ 371 జోలికి వెళ్లదు’ అని పునరుద్ఘాటించారు. ఆర్టికల్ 370ని తాత్కాలికంగా ఏర్పాటు చేసినందునే దాన్ని రద్దుచేశామని, అయితే ఆర్టికల్ 371 మాత్రం ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తుందని, ఈరెండింటి మధ్య చాలా తేడా ఉందని షా వివరించారు. ఎన్ఆర్సీ గురించి మాట్లాడుతూ..అక్రమ చొరబాటుదారులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదన్న విధానానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈశాన్య ప్రాంతంలోని వివిధ రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలకు ముగింపు పలకాల్సిన అవసరముందని షా అభిప్రాయపడ్డారు. -
అక్రమ వలసదారులపై అమెరికా కొరడా
-
అక్రమ వలసదారులపై అమెరికా కొరడా
వాషింగ్టన్: అక్రమ వలసదారులను సాధ్యమైనంత త్వరగా దేశం నుంచి పంపించేయాలని అమెరికా అంతర్గత భద్రత విభాగం(డీహెచ్ఎస్) కొత్త ఆదేశాలు జారీ చేసింది. పిల్లలు, మరికొందరిని మినహాయించి అక్రమ వలసదారులందర్నీ పంపించాలని డీహెచ్ఎస్ సెక్రటరీ జాన్ కెల్లీ.. సరిహద్దు గస్తీ, వలస అధికారులకు మంగళవారం రెండు కఠిన ఉత్తర్వులు జారీ చేశారు. నేరాల్లో దోషులుగా తేలిన, నేరారోపణలు ఎదుర్కొంటున్న, ఎదుర్కొనే అవకాశమున్న అక్రమ వలసదారులను ముందుగా తరలించాలన్న ప్రాధాన్యాన్ని అలాగే కొనసాగించనున్నారు. వలస చట్టాలను ఉల్లంఘించిన వారందరిపైనా చర్యలు తీసుకోనున్నట్లు డీహెచ్ఎస్ ఓ ప్రకటనలో పేర్కొంది. మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మాణానికి సంబంధించి వెంటనే చర్యలు ప్రారంభించాలని కెల్లీ ఆదేశించారు. కస్టమ్స్, బార్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీల్లోకి మరో 5వేల మంది, ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్లలోకి 10వేల మంది అధికారులను తీసుకోవాలన్నారు. ఈ ఆదేశాలతో అవసరమైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులు కష్టాలు ఎదుర్కోనున్నారు.