అక్రమ వలసదారులపై అమెరికా కొరడా | America's internal security attack on Illegal Immigrants | Sakshi
Sakshi News home page

అక్రమ వలసదారులపై అమెరికా కొరడా

Published Wed, Feb 22 2017 1:31 AM | Last Updated on Thu, Apr 4 2019 3:49 PM

America's internal security attack on Illegal Immigrants

వాషింగ్టన్‌: అక్రమ వలసదారులను సాధ్యమైనంత త్వరగా దేశం నుంచి పంపించేయాలని అమెరికా అంతర్గత భద్రత విభాగం(డీహెచ్‌ఎస్‌) కొత్త ఆదేశాలు జారీ చేసింది. పిల్లలు, మరికొందరిని మినహాయించి అక్రమ వలసదారులందర్నీ పంపించాలని డీహెచ్‌ఎస్‌ సెక్రటరీ జాన్‌ కెల్లీ.. సరిహద్దు గస్తీ, వలస అధికారులకు మంగళవారం రెండు కఠిన ఉత్తర్వులు జారీ చేశారు. నేరాల్లో దోషులుగా తేలిన, నేరారోపణలు ఎదుర్కొంటున్న, ఎదుర్కొనే అవకాశమున్న అక్రమ వలసదారులను ముందుగా తరలించాలన్న ప్రాధాన్యాన్ని అలాగే కొనసాగించనున్నారు.

వలస చట్టాలను ఉల్లంఘించిన వారందరిపైనా చర్యలు తీసుకోనున్నట్లు డీహెచ్‌ఎస్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మాణానికి సంబంధించి వెంటనే చర్యలు ప్రారంభించాలని కెల్లీ ఆదేశించారు. కస్టమ్స్, బార్డర్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీల్లోకి మరో 5వేల మంది, ఇమిగ్రేషన్, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లలోకి 10వేల మంది అధికారులను తీసుకోవాలన్నారు. ఈ ఆదేశాలతో అవసరమైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులు కష్టాలు ఎదుర్కోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement