ఇస్లామాబాద్: మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరమంటూ భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులను చెరిపేసి ప్రయత్నంలో ఉన్నారు ఇరుదేశాల ప్రేమికులు. పాకిస్తాన్ నుంచి ఒక మహిళ పబ్జీ పరిచయంతో తాను ప్రేమించిన యువకుడి కోసం భారతదేశం వచ్చినట్టే భారత దేశం నుండి కూడా ఒక మహిళ లెక్క సరిచేస్తూ ప్రేమించిన యువకుడి కోసం ఇటు నుండి పాకిస్తాన్‌కు ప్రయాణమైంది. కాకపొతే పాకిస్తానీ మహిళ సీమా హైదర్ లా కాకుండా అన్ని డాక్యుమెంట్లు పక్కాగా సిద్ధం చేసుకుని ప్రణాళిక ప్రకారం వెళ్ళింది భారత మహిళ.
ఒక పధ్ధతి.. ఒక ప్లానింగ్..
యూపీలోని కైలార్ గ్రామంలో పుట్టి పెరిగి రాజస్థాన్‌లోని ఆళ్వార్ జిల్లాలో నివాసముంటున్న అంజు(34)కు పాకిస్తాన్ యువకుడు నస్రుల్లా(29)తో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. కొద్దిరోజులకి ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఎలాగైనా ప్రియుడిని కలవాలనుకుంది. అనుకుందే తడవు సాహసం చేసి సరిహద్దు దాటేసి డిర్ జిల్లాలోని పక్తుంక్వా చేరుకుని నస్రుల్లాను కలుసుకుంది. విషయం తెలుసుకున్న డిర్ పోలీసులు వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకుని సీనియర్ పోలీసు అధికారి ముస్తాక్ ఖాబ్ ఆధ్వర్యంలో అన్ని డాక్యుమెంట్లను పరిశీలించారు. అంతా సక్రమంగా ఉందని తెలిసిన తర్వాతే వారిని విడిచిపెట్టారు.
జైపూర్ వెళ్తున్నట్లు చెప్పి..
రాజస్థాన్ పోలీసులకు ఈ సమాచారమందడంతో వారు భివాడిలోని అంజు ఇంటికి వెళ్ళి ఆరా తీశారు. విచారణ సమయంలో అంజు భర్త అరవింద్ మాట్లాడుతూ.. మాకు 2007లో పెళ్లి జరగగా 15 ఏళ్ల పాప, 6 ఏళ్ల బాబు ఉన్నారని తెలిపారు. నా భార్యకు సోషల్ మీడియాలో పరిచయాలున్నాయని నాకు తెలియదు. గురువారం తాను స్నేహితురాలిని కలిసేందుకు జైపూర్ వెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి వెళ్లిందని తర్వాత తన చెల్లెలికి ఫోన్ చేసి మాట్లాడుతుండగా లాహోర్ వెళ్లిన విషయం తెలిసిందన్నారు. ఎలాగైనా నా భార్యకు నచ్చజెప్పి తనను తిరిగి తీసుకొస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు అరవింద్.
అంతా సేమ్ టు సేమ్..
ఇటీవల పబ్జీలో పరిచయాన్ని ప్రేమగా మలచుకుని భారత్ వచ్చిన మహిళ సీమా హైదర్- సచిన్ మీనాల ప్రేమకి అంజు-నస్రుల్లా ప్రేమకి కొన్ని సారూప్యతలున్నాయి. ఇద్దరూ పెళ్ళై పిల్లలున్నవారే.. ఇద్దరి ప్రేమలకూ సోషల్ మీడియానే వేదిక.. పొందికగా పొరుగు దేశాల వారినే ప్రేమించారు. కాకపొతే సీమా హైదర్ చట్టవిరుద్ధంగా భారత దేశంలో అడుగుపెట్టగా అంజు మాత్రం పూర్తి చట్టబద్ధంగా పాకిస్తాన్ వెళ్ళింది. అదొక్కటే వ్యత్యాసం.
ఇది కూడా చదవండి: కూతురు అబార్షన్‌కు సాయం చేసిన తల్లి.. అలా పోలీసులకు దొరికిపోయింది!
Comments
Please login to add a commentAdd a comment