PUBG
-
పట్టాలపై పబ్జీ..రైలు ఢీకొని యువకులు మృతి
పాట్నా:సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతూ ప్రపంచాన్ని మర్చిపోయి ప్రమాదానికి గురైన వాళ్లను చూశాం.. కానీ బీహార్‌లో ఏకంగా రైలు పట్టాలపైనే కూర్చొని ముగ్గురు యువకులు పబ్జీ ఆడారు. చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని మరీ గేమ్ ఆడారు. ఇంకేముంది పట్టాలపై దూసుకువస్తున్న రైలు శబ్దాన్ని ఆ యువకులు వినలేకపోయారు.వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టి ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ఘటన బీహార్‌లోని వెస్ట్ చంపారన్ జిల్లాలో జరిగింది.జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు నార్కటియాగంజ్-ముజఫర్‌పుర్ రైలు పట్టాలపై కూర్చొని పబ్జీ ఆడుతుండగా అదే మార్గంలో వచ్చిన రైలు వారిపై నుంచి వెళ్లింది.దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.మృతులను ఫర్కాన్ ఆలం,సమీర్ ఆలం, హబీబుల్లా అన్సారీగా గుర్తించామని పోలీసులు తెలిపారు. వారి మృతదేహాలను పోస్ట్‌మార్టంనకు తరలించామని దర్యాప్తు కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి భీకర ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండడంపై తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలని పోలీసులు సూచించారు.ఇదీ చదవండి: స్పీడ్ బ్రేకర్ ప్రాణం పోసింది -
ప్రాణం తీసిన పబ్జీ గేమ్.. ఏకంగా సెల్ టవర్ ఎక్కి.. పైనుంచి..
సాక్షి, ఆదిలాబాద్: పబ్జీ గేమ్‌కు బానిసై ఏడాది క్రితం మానసిక స్థితి కోల్పోయిన ఓ యువకుడు సెల్ టవర్ పైనుంచి పడి మృతిచెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, ఎస్సై సునిల్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన దుర్వ జగదీశ్–మోహన్‌బాయి దంపతుల కుమారుడు వికాస్(19) ఇంటర్ మధ్యలోనే మానేశాడు. పబ్జీ గేమ్‌కు అలవాటు పడి ఇంట్లోనే ఉంటూ ఏడాది క్రితం మానసిక స్థితి కోల్పోయాడు. శనివారం రాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కుటుంబసభ్యులు గ్రామంలో వెతికినా ఆచూకీ లభించలేదు. రాత్రి దేవాపూర్ నుంచి ముత్నూర్ గ్రామానికి చేరుకొని గ్రామ సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి పైనుంచి కింద పడి మృతిచెందాడు. గ్రామస్తులు ఆదివారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మానసిక స్థితి సరిగా లేక సెల్‌టవర్ ఎక్కి పైనుంచి పడిపోవడంతోనే మృతిచెందినట్లు నిర్ధారించారు. తల్లి మోహన్‌బాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మరో ‘పబ్జీ’ దారుణం: తల్లిదండ్రులపై దాడికి తెగబడి..
ఉత్తరప్రదేశ్‌లోని జాన్సీకి చెందిన ఒక యువకుడు పబ్జీ ఆడుతూ, తన మనసుపై నియంత్రణ కోల్పోయి, తల్లిదండ్రులను అత్యంత దారుణంగా చావబాదాడు. రోజూ పాలుపోసే వ్యక్తి వారి ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయం వెలుగుచూసింది. పాలుపోసే వ్యక్తి వారి ఇంటిలోకి వెళ్లి చూడగా ఇంటి యజమాని, అతని భార్య రక్తపు మడుగులో అతనికి కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందించిన పాలుపోసే వ్యక్తి ఈ దారుణ ఘటన జాన్సీ పట్టణంలోని నవాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గుమనాబాద్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మీప్రసాద్(60) అతని భార్య విమల(55) కుమారుడు అంకిత్(28) ఉంటున్నారు. ఉదయం పాలుపోసే వ్యక్తి వారి ఇంటి తలుపు తట్టాడు. లోపలి నుంచి ఎటువంటి సమాధానం వినిపించలేదు. దీంతో అతను ఇంటిలోనికి వెళ్లి చూశాడు. అక్కడ రక్తపుమడుగులో లక్ష్మీప్రసాద్, విమల అతనికి కనిపించారు. వారి పక్కనే అంకిత్ కూర్చుని ఉన్నాడు. ఆసుపత్రికి చేరుకునేలోగానే.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ దంపతులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోగానే లక్ష్మీప్రసాద్ మృతిచెందగా, చికిత్స పొందుతూ విమల కన్నుమూసింది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడు అంకిత్‌ను అరెస్టు చేసి, అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులపై కర్రతో తీవ్రంగా దాడి ఈ కేసు గురించి పోలీసు అధికారి రాజేష్ మాట్లాడుతూ నిందితుడు అంకిత్ తన తల్లిదండ్రులపై కర్రతో తీవ్రంగా దాడి చేశాడని, ఫలితంగానే వారు మృతి చెందారని తెలిపారు. మానసిక స్థితి దెబ్బతినడంతోనే తాను అలా చేశానని అంకిత్ పోలీసుల ముందు తన తప్పు ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిత్యం పబ్జీ గేమ్ ఆడుతూ.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అంకిత్‌కు రెండేళ్లుగా మానసిక స్థితి సరిగా లేదు. నిత్యం పబ్జీ గేమ్ ఆడుతుంటాడు. ఈ గేమ్ కారణంగా అతని మానసిక స్థితి మరింత దిగజారింది. ఈ ఘటనలో అంకిత్ తొలుత తండ్రిపై, తరువాత తల్లిపై దాడి చేశాడని సమాచారం. ఇది కూడా చదవండి: టమాటాలను వదలి అవకాడోలపై పడుతున్న జనం! -
పబ్జీ లవ్‌స్టోరీ: పాకిస్థాన్‌లో నిన్ను ప్రేమించేవాడే దొరకలేదా?
గ్రేటర్ నోయిడా: 'పాకిస్తాన్ ప్రియురాలు - భారత ప్రేమికుడు'.. ఈ కథ ఆ జంట దృష్టిలో సుఖాంతమైంది కానీ లోకం దృష్టిలో మాత్రం డైలీ సీరియల్లా సాగుతూనే ఉంది. చట్టం ఎలాగు తన పని తాను చేసుకుంటూ పోతుంది. వచ్చిన సమస్యల్లా ఇరుగుపొరుగు వారితోనే. మొన్నామధ్య వీరి ఇంటికి పొరుగున ఉండే ఒకామె సచిన్ పైనా సీమా హైదర్ పైనా వ్యాఖ్యలు చేసి ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె వీడియోనే హల్చల్ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఆమె ఆ వ్యాఖ్యలతో మీమర్లకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. తాజాగా ఆమె మరోసారి అదే అంశంపై సరికొత్త కామెంట్లతో తెరపైకి వచ్చింది. Anger issues comedy: "Lappu sa Sachin" & "Jhingur sa ladka" 😂😂pic.twitter.com/2DI4dliGls — Marathi Walter 🇮🇳 𝕏 (@dotnagpur) July 19, 2023 ఈసారైతే ఆమె ర్యాగింగ్ నెక్స్ట్ లెవెల్లో చేసింది... ఆ మహాతల్లికి ఒక తోడు కావాలి? వాడు మగవాడైతే చాలు. వీడు చూస్తే ఎండిపోయి మిడత పురుగులా ఉంటాడు, బలంగా గాలి వీస్తే చాలు, ఎంత దూరం వెళ్లి పడతాడో ఎవ్వరికీ తెలియదు. మీరంతా కలిసి వెతికినా వాడిని కనుగొనలేరు. ఇక ఆమె విషయానికి వస్తే ఆవిడకి పాకిస్థాన్‌లో ఎక్కడా ప్రేమ దొరకలేదు. వీడిని ప్రేమించి నలుగురు పిల్లలతో సహా వాలిపోయిందని ఆగకుండా మాట్లాడుతూనే ఉంది. Her kids learning alphabet: J for Jhingoor K for Keeda L for Lappu pic.twitter.com/TEmqGyp75A — Sagar (@sagarcasm) August 2, 2023 ఈ వీడియో కూడా మొదటి వీడియోలాగే ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. కామెంట్లు చేసేవారు పాకిస్తాన్ జోడీ గురించి పక్కనబెట్టి ఈమె గురించే కామెంట్లు పెడుతున్నారు. 'ఈ మహాతల్లిని ఆ మహానుభావుడు(మహిళ భర్త) ఎలా భరిస్తున్నాడో' అంటూ ఒకరు, 'నీ బాధ ఏంటమ్మా.. వాడి తల్లిదండ్రులు కూడా నీ అంత బాధపడి ఉండరు..' అని మరొకరు ఇలా సరదా కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా యాష్ రాజ్ ముఖతే అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఈమె చేసిన కామెంట్లనే పాటగా రాగం కట్టారు. ఈ వీడియో కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో సంచలనంగా మారింది. Haha haha. “Kya hai Sachin mey” has been immortalised 😂#SeemaHaider pic.twitter.com/8GFpat6V17 — Smita Prakash (@smitaprakash) August 4, 2023 ఇది కూడా చదవండి: సుప్రీం తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీకి లాలూ డిన్నర్ పార్టీ -
రాజకీయాల్లోకి పాక్ మహిళ సీమా హైదర్.. ఆమెకు టికెట్ ఇస్తాం.. కానీ
సీమా గులామ్ హైదర్.. ఇటీవల ఈ మహిళ పేరు వార్తల్లో నిలుస్తోంది. ఆన్లైన్ ప్రియుడి కోసం ఏకంగా పాకిస్తాన్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు తన నలుగురు పిల్లలను వెంటేసుకుని మరీ వచ్చిన ఈమె.. భారత్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే ఓ బాలీవుడ్ చిత్రంలో అవకాశం రాగా, ఆశ్చర్యకరంగా రాజకీయాల్లో కూడా ఆమెకు ఆహ్వానం దక్కింది. దీంతో నెటిజన్లు సైతం షాక్‌లో ఉన్నారు. తాజాగా దీనిపై ఆ పార్టీ చీఫ్, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే స్పందించారు. టికెట్ అక్కడికి ఇస్తాం పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ ఆర్పీఐలో చేరడంపై ఆయన మాట్లాడుతూ.. సీమాతో తమ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. పాక్ నుంచి భారత్‌కు వచ్చిన సీమా హైదర్‌ను తమ పార్టీలో ఎలా చేర్చుకుంటామన్నారు. మాసూమ్ కిషోర్ తనను సంప్రదించకుండానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఒకవేళ ఆమెకు టికెట్ ఇవ్వాల్సి వస్తే భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లేందుకు టికెట్ ఇస్తామని, ఎన్నికల్లో పోటీ కోసం కాదని తేల్చి చెప్పారు. కాగా కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) నేత మాసూమ్ కిషోర్ దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీమా హైదర్‌ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా చేస్తామని చెప్పారు. అలాగే సీమా హైదర్ హిందీ, ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడుతుండటంతో పార్టీ అధికార ప్రతినిధి అయ్యే అవకాశం కూడా ఉందన్నారు. అంతేగాక తమ పార్టీ తరుఫున ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం గురించి కూడా చర్చలు జరుగుతున్నాయని అన్నారు. సీమా హైదర్ గురించి దర్యాప్తు జరుగుతుండటంతో సంబంధిత సంస్థల నుంచి క్లీన్చిట్ కోసం తాము ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. ఇదిలా ఉండగా ..సీమా హైదర్ పాక్ ఐఎస్ఐ ఏజెంట్ అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆమె సోదరుడు అసిఫ్, మామ గులాం అక్బర్ కూడా పాక్ సైన్యంలో పని చేస్తుండటంతో సీమాపై అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం పోలీసులు కూడా ఆమెను పలుమార్లు విచారించారు. -
సినిమాల్లోకి సీమా హైదర్.. 'రా' ఏజెంట్‌గా పబ్జీ లవర్!
ఫోన్లో గేమ్స్ అనేవి కాలక్షేపానికి. కానీ ఇక్కడ వీళ్లిద్దరు మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు. పబ్జీ ఆటలో పరిచయమైన ఓ యువకుడి కోసం ఓ వివాహిత తన భర్తనే వదిలేసింది. ఆన్లైన్ ప్రియుడి కోసం ఏకంగా పాకిస్తాన్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు తన నలుగురు పిల్లలను వెంటేసుకుని మరీ వచ్చింది. అతడి పేరు సచిన్, ఆమె పేరు సీమా గులామ్ హైదర్. వీరి లవ్ స్టోరీ కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియానే షేక్ చేస్తోంది. భర్తకు గుడ్‌బై.. నా భార్యను పంపించండి మహాప్రభో అని అటు భర్త లబోదిబోమని మొత్తుకుంటుంటే ఇటు సీమ మాత్రం పాక్‌కు తిరిగి వెళ్లేదే లేదని భీష్మించుకుని కూర్చుంది. మే 13న ఆమె ఇండియాలోకి ప్రవేశించగా జూలై 4న పోలీసులకు ఈ విషయం తెలిసింది. అక్రమ చొరబాటు కేసు నమోదు చేసి సీమాను ఆమెకు నివాసం ఇచ్చిన సచిన్‌ను, అతడి తండ్రిని అరెస్ట్ చేయగా బెయిల్‌పై బయటకు వచ్చారు. సీమా హైదర్ పాక్ ఐఎస్ఐ ఏజెంట్ అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆమె సోదరుడు అసిఫ్, మామ గులాం అక్బర్ కూడా పాక్ సైన్యంలో పని చేస్తుండటంతో సీమాపై అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం పోలీసులు కూడా ఆమెను పలుమార్లు విచారించారు. ఆడిషన్స్ కూడా! ఇంత సీన్ చేసిన సీమా త్వరలో సినిమాల్లోకి రానుందట! ఎ టైలర్ మర్డర్ స్టోరీ అనే చిత్రం కోసం ఆమె ఆడిషన్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన రాజస్థాన్ ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న జానీ ఫైర్ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ గ్రేటర్ నోయిడాలో సీమాకు ఆడిషన్స్ నిర్వహించింది. ఈ క్రమంలో డైరెక్టర్స్ జయంత్ సిన్హా, భరత్ సింగ్‌ను ఆమె కలిసినట్లు సమాచారం. ఇప్పటికే ఆమె ఐఎస్ఐ ఏజెంటా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తను ఏకంగా రా ఆఫీసర్‌గా నటించేందుకు సిద్ధమవుతోందట! చదవండి: ఆర్ట్ డైరెక్టర్ ఆత్మహత్య.. అప్పుల బాధ తట్టుకోలేకే.. -
పబ్జీ ప్రేమకథ: వాడెలా నచ్చాడు తల్లీ.. వాడిలో ఏముంది?
గ్రేటర్ నోయిడా: పబ్జీలో పరిచయమైన వ్యక్తిని కలుసుకోవాలన్న ఆలోచనలో ముందు వెనుక చూడకుండా నలుగురు పిల్లలతో సహా ఇండియాలో ల్యాండ్ అయిపొయింది పాకిస్తాన్ వీర ప్రేమికురాలు సీమా గులామ్ హైదర్. అన్ని అడ్డంకులను జయించి ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అంతా సిద్ధం చేసే పనిలో పడింది. ఇదే క్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాస్తూ తనకు భారత పౌరసత్వం ఇప్పించమని కోరిన విషయం తెలిసిందే. మరోపక్క ఆమెకు తీవ్రవాద ముఠాలతో ఏమైనా సంబంధాలున్నాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు యూపీ యాంటీ టెర్రరిస్టు పోలీసులు. ఇదిలా ఉండగా గ్రేటర్ నోయిడాలో సచిన్ మీనా ఇంటిలో కొత్త కాపురాన్ని మొదలు పెట్టిన సీమా హైదర్ పై చుట్టుపక్కల వారు చిరుబుర్రుమంటున్నారు. ఓ మీడియా సంస్థ వీరిద్దరినీ పలకరించేందుకు వెళ్లి అక్కడ గుమికూడిన స్థానికులను కూడా కొన్ని ప్రశ్నలు అడగ్గా... అందులోని ఒకామె.. పాకిస్తాన్ మహిళను వెంటనే ఆమె దేశం పంపించాలి.. లేదంటే ఇటువంటి వారి వలన ఇక్కడివారి మనసుల్లో కొత్త ఆలోచనలు పుడతాయి. పాకిస్తాన్ నుంచి కోడళ్లను తెచ్చుకోవాలన్న కోరిక పుట్టినా పుడుతుందని అంది. అసలు నీకు వాడేలా నచ్చాడు తల్లీ.. వాడొక బద్ధకస్తుడు.. చూడటానికి కూడా చాలా సన్నగా పుల్లల ఉంటాడని ఎద్దేవా చేసింది. ఆ మహిళ వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తోంది. Seema haider ke Indian padosi 🤣 pic.twitter.com/0mFyZm54aW — SwatKat💃 (@swatic12) July 19, 2023 ఇది కూడా చదవండి: మణిపూర్‌లో బయటపడుతున్న దారుణాలు.. రోజుకొకటి.. -
ఒకరు వచ్చారు.. ఇంకొకరు వెళ్లారు.. భారత్-పాకిస్తాన్ ప్రేమకథలు..
ఇస్లామాబాద్: మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరమంటూ భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులను చెరిపేసి ప్రయత్నంలో ఉన్నారు ఇరుదేశాల ప్రేమికులు. పాకిస్తాన్ నుంచి ఒక మహిళ పబ్జీ పరిచయంతో తాను ప్రేమించిన యువకుడి కోసం భారతదేశం వచ్చినట్టే భారత దేశం నుండి కూడా ఒక మహిళ లెక్క సరిచేస్తూ ప్రేమించిన యువకుడి కోసం ఇటు నుండి పాకిస్తాన్‌కు ప్రయాణమైంది. కాకపొతే పాకిస్తానీ మహిళ సీమా హైదర్ లా కాకుండా అన్ని డాక్యుమెంట్లు పక్కాగా సిద్ధం చేసుకుని ప్రణాళిక ప్రకారం వెళ్ళింది భారత మహిళ. ఒక పధ్ధతి.. ఒక ప్లానింగ్.. యూపీలోని కైలార్ గ్రామంలో పుట్టి పెరిగి రాజస్థాన్‌లోని ఆళ్వార్ జిల్లాలో నివాసముంటున్న అంజు(34)కు పాకిస్తాన్ యువకుడు నస్రుల్లా(29)తో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. కొద్దిరోజులకి ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఎలాగైనా ప్రియుడిని కలవాలనుకుంది. అనుకుందే తడవు సాహసం చేసి సరిహద్దు దాటేసి డిర్ జిల్లాలోని పక్తుంక్వా చేరుకుని నస్రుల్లాను కలుసుకుంది. విషయం తెలుసుకున్న డిర్ పోలీసులు వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకుని సీనియర్ పోలీసు అధికారి ముస్తాక్ ఖాబ్ ఆధ్వర్యంలో అన్ని డాక్యుమెంట్లను పరిశీలించారు. అంతా సక్రమంగా ఉందని తెలిసిన తర్వాతే వారిని విడిచిపెట్టారు. జైపూర్ వెళ్తున్నట్లు చెప్పి.. రాజస్థాన్ పోలీసులకు ఈ సమాచారమందడంతో వారు భివాడిలోని అంజు ఇంటికి వెళ్ళి ఆరా తీశారు. విచారణ సమయంలో అంజు భర్త అరవింద్ మాట్లాడుతూ.. మాకు 2007లో పెళ్లి జరగగా 15 ఏళ్ల పాప, 6 ఏళ్ల బాబు ఉన్నారని తెలిపారు. నా భార్యకు సోషల్ మీడియాలో పరిచయాలున్నాయని నాకు తెలియదు. గురువారం తాను స్నేహితురాలిని కలిసేందుకు జైపూర్ వెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి వెళ్లిందని తర్వాత తన చెల్లెలికి ఫోన్ చేసి మాట్లాడుతుండగా లాహోర్ వెళ్లిన విషయం తెలిసిందన్నారు. ఎలాగైనా నా భార్యకు నచ్చజెప్పి తనను తిరిగి తీసుకొస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు అరవింద్. అంతా సేమ్ టు సేమ్.. ఇటీవల పబ్జీలో పరిచయాన్ని ప్రేమగా మలచుకుని భారత్ వచ్చిన మహిళ సీమా హైదర్- సచిన్ మీనాల ప్రేమకి అంజు-నస్రుల్లా ప్రేమకి కొన్ని సారూప్యతలున్నాయి. ఇద్దరూ పెళ్ళై పిల్లలున్నవారే.. ఇద్దరి ప్రేమలకూ సోషల్ మీడియానే వేదిక.. పొందికగా పొరుగు దేశాల వారినే ప్రేమించారు. కాకపొతే సీమా హైదర్ చట్టవిరుద్ధంగా భారత దేశంలో అడుగుపెట్టగా అంజు మాత్రం పూర్తి చట్టబద్ధంగా పాకిస్తాన్ వెళ్ళింది. అదొక్కటే వ్యత్యాసం. ఇది కూడా చదవండి: కూతురు అబార్షన్‌కు సాయం చేసిన తల్లి.. అలా పోలీసులకు దొరికిపోయింది! -
ప్రేమికురాలు కాదా..పాకిస్థాన్ గూఢాచారా..?
-
పబ్జీ ప్రేమకథలో మరో ట్విస్టు.. నువ్వు మాకొద్దు..
ఇస్లామాబాద్: పబ్జీ కారణంగా పరిచయమైన యువకుడిని వెతుక్కుంటూ పాకిస్తాన్ నుండి తన నలుగురు పిల్లలతో సహా వలసవచ్చిన మహిళ సీమా గులాం హైదర్ తిరిగి పాకిస్తాన్ వస్తే ఊరుకునేది లేదన్నారు ఆమె బంధువులు. హిందువైన యువకుడి కోసం వెళ్ళిపోయిన ఆమె ఇకపై ముస్లిం కాదని పిల్లల్ని మాత్రం వెంటనే పాకిస్తాన్ తిరిగి పంపించేయాలని డిమాండ్ చేశారు. కరోనా ప్రేమ.. కరోనా సమయంలో యావత్ప్రపంచమంతా బిక్కు బిక్కుమంటూ గడువుతోంటే పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్, భారత్ కు చెందిన సచిన్ మీనా మాత్రం హాయిగా ప్రేమలో మునిగి తేలారు. పబ్జీ ద్వారా మొదలైన పరిచయాన్ని ప్రేమగా మార్చుకున్నారు. అప్పటికే ఆ మహిళకు పెళ్ళై నలుగురు పిల్లలున్నా కూడా ప్రియుడిని కలుసుకునేందుకు భారత్ వచ్చే సాహసం చేసింది. వెళ్ళను గాక వెళ్ళను.. జులై 4న గ్రేటర్ నోయిడాలోని ప్రియుడు సచిన్ మీనాను చేరుకున్న సీమా హైదర్ పై అక్రమ చొరబాటు కేసు నమోదైన విషయం, ఆ కేసులో ఆమెకు బెయిల్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటికి కథ సుఖాంతమవడంతో సీమా ఇకపై నేను హిందువునని, తిరిగి పాకిస్తాన్ కు వెళ్ళేది లేదని తెగేసి చెప్పేసింది. మాక్కూడా నువ్వొద్దు.. తాజాగా ఆమె కుటుంబ సభ్యులు స్పందిస్తూ.. ఎప్పుడైతే హిందువుని వెతుక్కుంటూ వెళిపోయిందో అప్పుడే ఆమెతో సంబంధం తెగిపోయిందని, తను ఇప్పుడు ముస్లిం కాదని చెప్పారు. కానీ నలుగురు పిల్లలను వంటనే వెనక్కు పంపాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్లో ఆమె నివాసమున్న ఇంటి యజమాని కుమారుడు నూర్ మహమ్మద్ మాట్లాడుతూ.. గులాం హైదర్ అనే వ్యక్తితో సీమాకు పదేళ్ల క్రితం పెళ్లయిందని, ఆయన సౌదీలో పనిచేస్తుంటాడని ఆమె మాత్రం మూడేళ్ళుగా ఇక్కడ పిల్లలతో ఒంటరిగా ఉండేదన్నారు. వాళ్ళ మామయ్యగారు ఇక్కడికి చాలా దూరంగా ఉంటారని తెలిపారు. ఇది కూడా చదవండి: అసలు పుట్టేవాళ్లే తక్కువ.. మళ్లీ నియంత్రణ గోల ఏంటి? -
మరో ప్రేమకథ.. ప్రియుడిని వెతుక్కుంటూ బంగ్లాదేశ్ నుంచి వచ్చి...
కోల్‌కతా: సినిమా కథను తలపిస్తూ సాగిన పబ్జీ ప్రేమ జంట కథ మరువక ముందే అలాంటి మరో కథ పశ్చిమ బెంగాల్ సిలిగురిలో ఆవిష్కృతమైంది. ఆ కథలో ప్రియురాలు పాకిస్తాన్ నుంచి భారత దేశానికి వస్తే ఈ కథలో బంగ్లాదేశ్ నుంచి ప్రియురాలు ప్రియుడిని వెతుక్కుంటూ బెంగాల్ వచ్చింది. కాకపొతే ఆ కథ సుఖాంతమైంది ఈ కథ విషాదాంతమైంది. రెండున్నర నెలల క్రితం సప్లా అఖ్తర్ అనే మహిళ ఆన్లైన్ లో పరిచయమైన బాయ్ ఫ్రెండుని కలుసుకునేందుకు బంగ్లాదేశ్ నుండి భారత్ బయలుదేరి వచ్చింది. వెస్ట్ బెంగాల్ లోని సిలిగురికి చేరుకొని తన బాయ్ ఫ్రెండుని కలుసుకుంది కూడా. కానీ తన ప్రియుడు తనని నేపాల్‌లో ఎవరికో అమ్మేయాలని ప్రయత్నిస్తున్నాడన్న విషయం తెలుసుకుని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని అక్కడి నుండి తప్పించుకుంది. ప్రేమించిన వాడితో జీవితం రంగులమయంగా ఉంటుందని ఊహించుకుని దేశాలు దాటి వచ్చిన సప్లాకు బాయ్ ఫ్రెండ్ నిజస్వరూపం తెలుసుకుని షాక్‌లో ఉండిపోయింది. ఎలాగైనా తన దేశానికి తిరుగు ప్రయాణమవ్వాలన్న ఆలోచనతో సిలిగురి రైల్వే జంక్షన్ చేరింది. చేతిలో డబ్బులు లేక అక్కడ దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెను వివరం అడిగి తెలుసుకున్నారు ఓ స్వచ్చంద సంస్థ ప్రతినిధి. యువతికి సాయం చేసే ఉద్దేశ్యంతో విషయాన్ని స్థానిక ప్రధాన్ నగర్ పోలీస్ స్టేషన్ లో నివేదించగా పోలీసులు ఆమె మీద అక్రమ చొరబాటు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. పాపం సప్లా.. ప్రేమ గుడ్డిదని తెలుసుకునేసరికి తన జీవితమే తెల్లారిపోయింది. దిక్కుమాలిన ప్రేమ కోసం దేశాలు దాటి వచ్చి ఊచలు లెక్కపెడుతోంది. ప్రియుడు పరారీలో ఉండగా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌లో అద్భుతం.. తెగిన తలను అతికించారు.. -
పబ్జీ జంట ప్రేమ కథ: ముంబై పోలీసులకు బెదిరింపు కాల్
ముంబై: పబ్జీ పరిచయంతో భారత్ వచ్చి ప్రియుడిని కలుసుకున్న పాకిస్తాన్ మహిళ సీమ హైదర్ తిరిగి పాకిస్తాన్ చేరుకోకుంటే 26/11 ముంబై దాడుల తరహాలో మళ్ళీ మారణకాండకు పాల్పడాల్సి ఉంటుందని ముంబై కంట్రోల్ రూముకు ఎవరో అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి బెదిరించారు. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన భారతీయ యువకుడు సచిన్ మీనాను వెతుక్కుంటూ వచ్చింది పాకిస్తాన్ మహిళ సీమా హైదర్. తన నలుగురు పిల్లలతో సహా నోయిడా చేరుకున్న ఆమెపై నోయిడా పోలీసులు అక్రమ చొరబాటు కేసు, ఆశ్రయమిచ్చిన ప్రియుడిపై మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టు వీరిద్దరికి బెయిల్ ఇవ్వడంతో కథ సుఖాంతమైందని అనుకుంటున్న తరుణంలో ఈ ఫోన్ కాల్ మళ్ళీ వివాదాస్పదమైంది. అయితే ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్ నుంచి ఆమెకు సంబంధించినవారు ఎవరో ఈ కాల్ చేసి ఉంటారని.. దీన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని యూపీ పోలీసులకు తెలిపినట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి: చితిలో సగం కాలిన శవాన్ని తిన్న తాగుబోతులు.. -
మీ ఇంట్లో పిల్లలు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా?.. అయితే ఈ హెచ్చరిక మీకోసమే!
జైపూర్: ప్రస్తుత రోజుల్లో మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఏ ఇంట చూసినా స్మార్ట్‌ఫోన్ దర్శనమిస్తున్నాయి. ఈ మొబైల్ వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. ఇంట్లో పసిపిల్లలు ఉంటే వీటి వల్ల ఎదురయ్యే అనర్థాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొబైల్ తమకు ఇవ్వకపోతే పిల్లలు మారాం చేసి మరీ తల్లిదండ్రుల నుంచి తీసుకొంటున్నారు. చిన్నవయసులో వరకు ఇది ఆమోదమే గానీ కాస్త ఎదిగిన పిల్లలకు ఇది శాపంగా మారుతోంది. వాళ్లు ప్లేస్టోర్ల నుంచి వివిధ రకాల ఆటలు ఇన్స్టాల్ చేసి ఆడుతూ చాలా సమయం వాటితోనే గడుపుతున్నారు. ఇలా ఆడుతూ ఆడుతూ.. స్మార్ట్ఫోన్లకు బానిసైన పిల్లల్లో కొందరు అరుదైన వ్యాధుల బారినపడుతున్నారు. రాజస్థాన్‌లో అల్వార్‌కు చెందిన దాదాపు పదేళ్ల బాలుడు మతిస్థిమితం కోల్పోయాడు. ఏకంగా అతడి పరిస్థితి ఎలా మారిందంటే.. ఆన్లైన్ గేమ్ ఆడాలని పట్టుబట్టడం వల్ల చాలాసార్లు బలవంతంగా కట్టివేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఓ బాలుడికి అతని తల్లిదండ్రులు ఏడు నెలల క్రితం ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కొనిచ్చారు. జనవరి 2023 నుండి, అతను ఫోన్‌తో ఇంట్లోనే ఉంటాడు. తల్లిదండ్రులు ఉదయాన్నే తమ తమ పనులకు వెళ్లేవారు. ఆ తర్వాత 14 ఏళ్ల చిన్నారి ఇంట్లో ఒంటరిగా ఉంటూ మొబైల్లో 14 నుంచి 15 గంటల పాటు ఫైర్ ఫ్రీ అనే మొబైల్ గేమ్‌ను ఆడుతుండేది. గత ఆరు నెలలుగా పబ్జీ (PUBG) ఫ్రీ ఫైర్ ఆడుతున్న ఆ బాలుడు తీవ్రమైన మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అతను మానసిక స్థితి చాలా వరకు క్షీణించింది. చివరికి నిద్రలో కూడా గేమ్ ఆడుతున్నట్లు భావించడం మొదలుపెట్టాడు. మరలా ఆ బాలుడిని మామూలుగా మార్చేందుకే చికిత్సలో భాగంగా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎటువంటి పురోగతి కనిపించలేదు. చివరికి చేసేదేమిలేక బాలుడి కుటుంబం అతన్ని అల్వార్ మేధో వికలాంగుల రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చారు. అక్కడ అతని మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ కౌన్సెలర్లు అతనికి సహాయం చేస్తున్నారు. సైకియాట్రిస్ట్, ఇతర వైద్యుల బృందం కూడా దానిపై పని చేస్తోంది. చదవండి: ఫ్లైట్‌లో ప్రయాణికుడి వీరంగం.. సిబ్బందిపై దాడి చేసి.. బాత్రూం డోర్ పగులగొట్టి.. -
బాలీవుడ్ సినిమాను తలపిస్తోన్న పబ్జీ ప్రేమకథ..
గ్రేటర్ నోయిడా: పబ్జీ ప్రేమికుడిని కలుసుకునేందుకు భారత్ వచ్చిన పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ అనుకోని విధంగా ఇరకాటంలో పడింది. ప్రియుడిని కలుసుకుంది అంతలోనే పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అంతలో సౌదీ నుండి ఆమె భర్త తన భార్యను వెనక్కు పంపించమని వేడుకుంటూ మోదీ ప్రభుత్వాన్ని వీడియో ద్వారా వేడుకున్నాడు. ఇదిలా ఉండగా బెయిలుపై బయటకు వచ్చిన ఆ పాకిస్తానీ మహిళ తానెక్కడికీ వెళ్ళబోయేది లేదని.. ఇప్పుడు నాది భారత దేశమని తెగేసి చెప్పింది. ఫస్ట్ హాఫ్.. భారతీయ యువకుడితో పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ కు పబ్జీ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తన ప్రేమను గెలిపించుకోవడానికి సీమా అడ్డంకులన్నిటినీ జయించి తన నలుగురి పిల్లలతో కలిసి భారత్ కు ఉడాయించింది. దీనికోసం పాకిస్తాన్ లో తన ప్లాటును 12 లక్షలకు అమ్మేసి పిల్లలకూ తనకూ ఫ్లైట్ టిక్కెట్లు తీసుకుని మొదట దుబాయ్ వెళ్లి అక్కడ నుండి నేపాల్, ఢిల్లీ మీదుగా నోయిడా చేరుకుంది. ఇంటర్వెల్.. భారత్ చేరి తన ప్రియుడు సచిన్ మీనాను కలిసింది కానీ అక్రమంగా భారత దేశంలోకి చొరబడినందుకు ఆమెపైనా, ఆమెకు ఆశ్రయమిచ్చినందుకు సచిన్ పైనా కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు నోయిడా పోలీసులు. వారిని జెవార్ న్యాయస్థానంలో హాజరుపరచగా జడ్జి వారిద్దరికి బెయిల్ మంజూరు చేసి తదుపరి వాయిదాకు తప్పకుండా రావాలని సూచించారు. ప్రీ క్లైమాక్స్.. ఇదిలా ఉండగా సౌదీలో ఉంటోన్న సీమా హైదర్ భర్త గులామ్ హైదర్ తన భార్యను ఎలాగైనా తిరిగి పాకిస్తాన్ పంపించలని మోదీ ప్రభుత్వాన్ని కోరుతూ వీడియో సందేశం పంపాడు. క్లైమాక్స్.. బెయిలుపై వచ్చిన సీమా దీనిపై స్పందిస్తూ.. నా భర్త హిందువు కాబట్టి నేను కూడా హిందువునే.. ఇప్పుడు నేను భారతీయురాలిని. నాకు నా భర్తను కలవాలని లేదు. పాకిస్తాన్ కు వెళ్తే నా ప్రాణానికే ప్రమాదమని చెప్పింది. నేను నా పిల్లలతో ఇక్కడే ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసుకోబోతున్నట్లు కూడా తెలిపింది సీమా హైదర్. ఇది కూడా చదవండి: 3000 మీ ఎత్తులో ఆగిపోయిన కేబుల్ కార్.. తర్వాత ఏమైందంటే.. -
మోదీజీ.. ! ‘నా భార్యా, పిల్లల్ని వెనక్కి పంపించండి’
గ్రేటర్ నోయిడా: పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన భారత యువకుడిని కలిసేందుకు ఓ పాకిస్తాన్ మహిళ నలుగురు పిల్లలతో సహా భారత్‌లో చొరబడిన సంఘటన ఇటీవల గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. అక్రమంగా భారత్‌లో చొరబడినందుకు ఆ మహిళ పైనా, ఆమెకు ఆశ్రయమిచ్చినందుకు ఆ యువకుడి పైనా కేసు నమోదు చేసి పోలీసులు వారిని కోర్టులో హాజరుపరచగా విచారణ నడుస్తోంది. మీడియాలో ఈ సంఘటన బాగా వైరల్ కావడంతో సౌదీలో ఉంటున్న ఆ పాకిస్తాన్ మహిళ భర్తకు విషయం చేరింది. దీంతో తన భార్యను పిల్లలను తిరిగి పాకిస్తాన్ పంపించాల్సిందిగా భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు భారత ప్రభుత్వానికి ఓ సందేశాన్ని పంపించాడు. పబ్జీ గేమ్ చాలామందికి ఒక వ్యసనం. అందులో పడ్డారంటే చాలు గంటలపాటు పరిసరాలను మరచి పరధ్యానంగా గడుపుతుంటారు. తాజాగా ఈ పబ్జీ గేమ్ ఓ కొంపను కొల్లేరు చేసింది. యూపీలోని నొయిడాకు చెందిన 25 ఏళ్ల సచిన్ మీనాకు పాకిస్తాన్ కు చెందిన 30 ఏళ్ల సీమా హైదర్ పబ్జీ ద్వారా పరిచయమైంది. నాలుగేళ్ల ప్రయాణంలో ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో వారిద్దరూ ఒక్కటవ్వాలనుకున్నారు. అప్పటికే సీమాకు పెళ్ళై నలుగురు పిల్లలున్నారు. అయినా కూడా ప్రేమ గుడ్డితనాన్ని ప్రపంచానికి చాటుతూ సీమా హైదర్ నలుగురి పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా భారత్ చేరుకొని పబ్జీ ప్రియుడిని కలుసుకుంది. ఆమె రాకను గుర్తించిన స్థానిక పోలీసులు, అక్రమంగా భారత్ లో చొరబడినందుకు ఆమె పైన కేసు నమోదు చేశారు. ఆశ్రయమిచ్చినందుకు సచిన్ పైన కూడా కేసు నమోదు చేసి ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచారు. జెవార్ సివిల్ కోర్టు వారికి బెయిల్ కూడా మంజూరు చేసి తదుపరి వాయిదాకు తప్పక రావాల్సిందిగా కోరింది. ఇదిలా ఉండగా ఈ వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో సౌదీ అరేబియాలో ఉన్న సీమా హైదర్ భర్త గులామ్ హైదర్ కు ఈ విషయం చేరింది. దీంతో వెంటనే స్పందిస్తూ.. మొదటగా ఈ వార్త నాకు తెలిసేలా చేసిన భారత మీడియాకు కృతఙ్ఞతలు.. నా భార్యకు కల్లబొల్లి మాటలు చెప్పి, మభ్యపెట్టి భారత్ రప్పించారు. దయచేసి నా భార్యను, పిల్లలను తిరిగి పాకిస్తాన్ పంపించండి.. అంటూ భారత ప్రభుత్వానికి ఒక సందేశాన్ని పంపించాడు. ఇది కూడా చదవండి: కర్ణాటక అసెంబ్లీలోకి చొరబడ్డ ఆగంతకుడు.. ఎందుకొచ్చాడంటే.. -
పబ్జీ ప్రేమ.. ప్రియుడి కోసం నలుగురు పిల్లలతో ఇండియాకు.. చివరికి!
స్మార్ట్ ఫోన్లలో ఆన్లైన్ గేమ్‌లు పెరిగిపోయాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ గేమ్‌లకు అడిక్ట్ అవుతున్నారు. చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్ని మరిచిపోయి అందులో లీనమవుతున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా కొంతమంది ప్రాణాలు తీసుకునే వరకు వెళుతుంది. భారత్‌లో పబ్జీ వంటి గేమ్‌లను నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయిన పలువురు ఇతర మార్గాల ద్వారా గేమ్‌ను డౌన్లోడ్ చేసుకొని ఆడుతున్నారు. తాజాగా పబ్జీ గేమ్ ఓ కుటుంబంలో చిచ్చు పెట్టింది. పబ్జీలో పరిచమైన యువకుడి కోసం ఓ మహిళ తన పిల్లలతో కలిసి భర్తను వదిలేసి వచ్చింది. ఆన్లైన్ ప్రియుడి కోసం ఏకంగా పాకిస్తాన్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు ప్రయాణమైంది. ఈ వింత ఘటన నోయిడాలో చేసుకుంది. నోయిడాకు చెందిన యువకుడు సచిన్‌కు పాకిస్థాన్‌కు చెందిన మహిళ సీమా గులామ్ హైదర్‌తో పబ్జీ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటికే మహిళకు వివాహమై నలుగురు పిల్లలు ఉన్నారు. పబ్జీలో సీమా, సచిన్ రోజు చాటింగ్ చేసుకునేవారు. ఇలా వీరి పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. దీంతో ప్రియుడు కోసం కట్టుకున్న భర్తను విడిచిపెట్టేందుకు సిద్ధంమైంది. ఈ క్రమంలో గత నెల నేపాల్ మీదుగా తన నలుగురు పిల్లలతో ఉత్తర ప్రదేశ్ చేరుకుంది. అటు నుంచి బస్‌లో గ్రేటర్ నోయిడాకు వచ్చి తన ప్రియుడిని కలుసుకుంది. మహిళ, తన పిల్లలతో కలిసి సదరు యువకుడు రబుపెర ప్రాంతంలో అద్దె ఇంట్లో జీవించడం ప్రారంభించారు. అయితే పాకిస్తాన్ మహిళ నోయిడా అక్రమంగా నివసిస్తుందని స్థానిక పోలీసులకు సమాచారం అందింది. సీమా సంగతి పోలీసులకు పసిగట్టారన్న విషయం తెలుసుకున్న సచిన్ ఆమెతోపాటు పారిపోయాడు. ఎట్టకేలకు నోయిడా అక్రమంగా నివసిస్తున్న సీమా, తన పిల్లలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఆశ్రయం కల్పించిన నోయిడా యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ మహిళ, నలుగురు పిల్లలు, నోయిడా యువకుడి పోలీస్ కస్టడీలో ఉన్నట్లు నోయిడా డీసీపీ సాద్ మియా ఖాన్ పేర్కొన్నారు. ఇద్దరిని విచారిస్తున్నట్లు తెలిపారు. మే నెలలో ఇంటిని అద్దెకు తీసుకున్నారని, తమకు కోర్టు వివాహం జరిగిందని, నలుగురు పిల్లలున్నారని చెప్పినట్లు వారు నివసించిన అపార్ట్మెంట్ యజమాని బ్రిజేష్ పోలీసులకు తెలిపాడు. సదరు మహిళ పాకిస్తాన్‌కు చెందినామెలా కనిపించలేదని, ఆమె సల్వార్ సూట్, చీరలుధరించేదని యజమాని పోలీసులకు చెప్పాడు. -
ఆన్లైన్ గేమ్‌లతో ఆనందం ఆవిరి.!
విశాఖ విద్య: ‘పెదవాల్తేరుకు చెందిన అవినాష్ నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. రాత్రి వేళ నిద్రలో కూడా వింత వింత శబ్దాలు చేస్తున్నాడు. బాలుడి పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు ఏమైందోననే ఆందోళనతో వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. రెండు పర్యాయాల పరిశీలన అనంతరం బాలుడి అసలు సమస్యను వైద్యులు గుర్తించారు. గంటల తరబడి సెల్ఫోన్లో ఆన్లైన్ గేమ్‌లు ఆడడం వల్ల అబ్బాయి మొదడుపై ప్రభావం చూపిందని తేచ్చిచెప్పారు. స్మార్ట్ ఫోన్‌కు దూరంగా ఉంచి, కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు’. విశాఖ నగరంలోని ఒక్క అవినాషే కాదు.. వందలాది మంది విద్యార్థులు, యువత ఆన్లైన్ గేమ్‌లతో రేయింబవళ్లు కాలక్షేపం చేస్తూ మానసిక ఆనందానికి దూరమైపోతున్నారు. స్మార్ట్ ఫోన్‌తో ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగం బాగా పెరిగింది. పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాల్సిందే. దీంతో స్మార్టు ఫోన్లు వినియోగం తప్పనిసరైంది. అయితే స్మార్ట్ ఫోన్‌తో ఎంతటి లాభం ఉందో, అదే స్థాయిలో నష్టాన్ని చేకూరిస్తోంది. బెట్టింగ్‌కు బలైపోతున్న యువత గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. విశాఖ కేంద్రంగా సాగుతున్న బెట్టింగ్ మాఫియాను పోలీసులు సైతం గుర్తించారు. వివిధ యాప్స్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్లైన్ పేకాటకు అన్ని వర్గాల వారు బానిసలైపోతున్నారు. దీంతో పాటు డ్రీమ్ యాప్ ద్వారా క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్ ఆటలు ఉన్నాయి. గేమ్‌లో కొంత మందిని ఎంపిక చేసుకుని బెట్టింగ్ పెడతారు. వారు బాగా ఆడినట్లైతే వచ్చే పాయింట్లు బట్టి గెలుపును నిర్ధారిస్తారు. ప్రైజ్ మనీగా రూ.10 నుంచి రూ.లక్ష వరకు ఉండడంతో ఎక్కువ మంది ఈ గేమ్‌లోనే మునిగి తేలుతూ డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా, సమయం వృథా చేస్తూ వాటికి బానిసలైపోతున్నారు. పబ్జీతో మొద్దుబారుతున్న మెదడు కొన్నేళ్లు బ్యాన్ చేసిన పబ్జీగేమ్ మళ్లీ సరికొత్త గా స్మార్ట్‌ఫోన్‌లోకి వచ్చి చేరింది. పబ్జీతో పాటు, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ వంటి ఆన్లైన్ ఆటలు ఎక్కువ మంది ఆడుతున్నారు. వీటిని నలుగురు కలసి ఒకేసారి ఆడవచ్చు. వేర్వేరు ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారైనా సరే నలుగురు మాట్లాడుకుంటూ గేమ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో ఎక్కువగా పాఠశాల, కాలేజీ స్థాయి విద్యార్థులు పబ్జీ గేమ్‌లకు బానిసలవుతున్నారు. ఆన్లైన్ గేమ్‌లతో ప్రమాదం పిల్లలు, అందులోనూ చదువుకునే వారు ఆన్లైన్ గేమ్‌లు ఆడటం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఆన్లైన్ గేమ్‌ల వల్ల మానసిక ఆనందం కోల్పోతారు. మొదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శారీరకంగా అలసట కలిగే ఆటలు ఆడుకోవాలి. పుస్తక పఠనం మంచి పద్ధతి. ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకమైనదే. – డాక్టర్ రమేష్‌బాబు, మానసిక వైద్య నిపుణులు, విశాఖపట్నం తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి ఏదో కాలక్షేపం కోసమని కొద్దిసేపు ఆన్లైన్ గేమ్ ఆడితే పరవాలేదు. కానీ అదే పనిగా గంటల తరబడి స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోతుంటే, ఓ కంట కనిపెట్టాల్సిందే. ఈ విషయంలో తల్లిదండ్రులు బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. పిల్లాడి ఆనందం కోసమని స్మార్ట్‌ఫోన్ ఇచ్చేసి, వదిలేయకూడదు. వారితో రోజులో కొద్దిసేపు అయినా గడిపి, కబుర్లతో కాలక్షేపం చేయాలి. – డాక్టర్ జి.సీతారాం, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు -
బీజీఎంఐ లవర్స్‌కి అదిరిపోయే న్యూస్.. త్వరలోనే
10 నెలల సస్పెన్షన్ తర్వాత బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) ఈ నెల 29న భారత్‌లో పునఃప్రారంభం కానుంది. గేమర్స్ ఆడేందుకు వీలుగా గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ ప్లే స్టోర్‌లో లభ్యం కానుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెక్యూరిటీ మార్పులు చేసిన తర్వాత గేమ్‌కు మూడు నెలల ట్రయల్‌కు అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే బీజీఎంఐని డౌన్లోడ్ కోసం అందుబాటులోకి తెస్తామని గేమింగ్ సంస్థ క్రాఫ్టన్ తెలిపింది. ఈ సందర్భంగా బీజీఎంఐ ఇప్పుడు ప్రీలోడ్ కోసం అందుబాటులో ఉందని ప్రకటించినందుకు మేం సంతోషిస్తున్నాం. వినియోగదారులకు గేమ్‌ప్లే అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నామని’ అని క్రాఫ్టన్ ఇండియా సీఈవో సీన్ హ్యూనిల్ సోహ్న్ తెలిపారు. -
యూట్యూబ్, గూగుల్‌కి కోర్టు నోటీసులు.. ఆ గేమ్‌లు ఎలా వస్తున్నాయ్!
నిషేధించిన పబ్జీ, ఫ్రీ ఫైర్ తదితర గేమ్‌లు మళ్లీ ఆన్‌లైన్‌లోకి ఎలా వస్తున్నాయ్.. అని మద్రాసు హైకోర్టు.. మదురై ధర్మాసనం ప్రశ్నించింది. వివరణ ఇవ్వాలని యూ ట్యూ బ్, గూగుల్, కేంద్ర ప్రభుత్వానికి గురువారం నోటీసులు జారీ చేసింది. వివరాలు.. ఆన్లైన్ గేమింగ్‌పై దాఖలైన పిటిషన్ గురువారం మదురై ధర్మాసనంలో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే నిషేధించిన పబ్జీ, ఫ్రీ ఫైర్ వంటి గేమ్‌లు మళ్లీ అందుబాటులోకి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి గేమ్‌ల కారణంగా యువత, పిల్లల చదువులు కుంటుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశా రు. యువత మానసిక పరిస్థితి మరీ దారుణంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, పదేపదే నిషేధం విధించినా అనేక వెబ్ సైట్లు మళ్లీ పుట్టుకొస్తుండడంతో పెద్దలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని మండిపడ్డారు. ఇలాంటి వాటికి శాశ్వతంగా ముగింపు పలికే వరకు విశ్రమించేది లేదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. తాము సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని యూట్యూబ్, గూగుల్‌తో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ.. ఉత్తర్వులిచ్చారు. -
వీఎల్సీ మీడియా ప్లేయర్‌పై నిషేధం, వెబ్సైట్, డౌన్లోడ్ లింక్ బ్లాక్
ముంబై: పబ్జీ మొబైల్, టిక్‌టాక్, కామ్‌స్కానర్ సహా వందలాది చైనీస్ యాప్‌లను బ్లాక్ చేసిన కేంద్రం తాజాగా ప్రముఖ మీడియా ప్లేయర్ సాఫ్ట్వేర్, వీడియో స్ట్రీమింగ్ సర్వర్ వీఎల్సీ మీడియా ప్లేయర్‌ను కూడా బ్యాన్ చేసింది. ఇండియాలో వీఎల్సీ మీడియా ప్లేయర్ వెబ్సైట్, డౌన్లోడ్ లింక్‌ను కూడా బ్లాక్ చేసింది. మీడియా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయగానే ఐటీ చట్టం కింద నిషేధించిన సందేశం కనిపిస్తోంది. అంటే ఇకపై దేశంలో ఎవరూ ఏ పని కోసం ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయలేరన్నమాట. ఇటీవల బీజీఎంఐ అనే పబ్జీ మొబైల్ ఇండియన్ వెర్షన్‌ను బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. తాజా నివేదికల ప్రకారం IT చట్టం, 2000 ప్రకారం వీడియోలాన్ ప్రాజెక్ట్ వీఎల్సీ మీడియా ప్లేయర్‌కు చెక్ చెప్పింది కేంద్రం. అయితే చైనా-మద్దతు గల హ్యాకింగ్ గ్రూప్ సికాడా సైబర్ దాడులకు ప్లాట్‌ఫారమ్ అయినందున VLC మీడియా ప్లేయర్ దేశంలో బ్లాక్ చేసినట్టు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. దీర్ఘకాలంగా సైబర్ దాడులు, హానికరమైన మాల్వేర్ లోడ్ కోసం సికాడా వీఎల్సీ మీడియా ప్లేయర్‌ని ఉపయోగిస్తోందని కొన్ని నెలల క్రితం భద్రతా నిపుణులు కనుగొన్నారు. VideoLAN ప్రాజెక్ట్ ద్వారా తయారైన వీఎల్సీ ప్లేయర్ భారతదేశంలో దాదాపు రెండు నెలల క్రితం కేంద్రం బ్లాక్ చేసింది. (Kia Seltos:కియా మరోసారి అదరగొట్టింది,సెల్టోస్ కొత్త రికార్డు) అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు కంపెనీ నుంచి,ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ గగన్‌దీప్ సప్రా అనే ట్విటర్ యూజర్లలో ఒకరు వీఎల్సీ వెబ్సైట్ స్క్రీన్‌షాట్‌ను ట్వీట్ చేసారు, "ఐటి యాక్ట్, 2000 ప్రకారం ఎలక్ట్రానిక్స్ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆర్డర్ ప్రకారం వెబ్సైట్ బ్లాక్ చేయబడింది" అని చూపిస్తుంది. ప్యారిస్‌కు చెందిన వీడియోలాన్ సంస్థ వీఎల్సీ మీడియాని అభివృద్ధి చేసింది. (Maruti Suzuki Swift S-CNG వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్ అనాల్సిందే!) Anyone know why @NICMeity has banned VLC Downloads in India? @internetfreedom pic.twitter.com/lQubbyK0Yi — Gagandeep Sapra (@TheBigGeek) August 12, 2022 #blocked Videolan project’s website “https://t.co/rPDNPH4QeB” cannot be accessed due to an order issued by @GoI_MeitY. It is inaccessible for all the major ISPs in India including #ACT, #Airtel and V!. #WebsiteBlocking pic.twitter.com/LBKgycuTUo — sflc.in (@SFLCin) June 2, 2022 -
మళ్లీ భారత్‌లోకి రీ ఎంట్రీ కోసం ఆరాటం, టిక్‌టాక్ సరికొత్త వ్యూహం!
టిక్‌టాక్ యూజర్లకు శుభవార్త. దేశ భద్రత దృష్ట్యా భారత కేంద్ర ప్రభుత్వం జున్ 2020లో టిక్‌టాక్‌పై బ్యాన్ విధించింది. ఇప్పుడా ఆ యాప్ తిరిగి భారత్‌లో తన కార్యకలాపాల్ని కొనసాగించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టిక్‌టాక్ పరిచయం అక్కర్లేని పేరు. చైనాకి చెందిన బైట్ డ్యాన్స్ సంస్థ తయారు చేసిన ఈ యాప్ ప్రపంచ దేశాల్లో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. దీంతో భారత్‌లో చైనా వస్తువులు,యాప్స్‌పై నిషేధించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా పెరుగుతూ వచ్చింది. దీంతో కేంద్రం దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, ప్రజాభద్రత దృష్ట్యా మొత్తం 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. వాటిలో టిక్‌టాక్ యాప్ కూడా ఉంది. అయితే భారత్‌లో టిక్ టాక్‌కు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు బైట్ డ్యాన్స్ సంస్థ దేశీయ సంస్థలతో పలు మార్లు చర్చులు జరిపింది. ఆ ప్రయత్నాల్ని విఫలమయ్యాయి. ఈ తరుణంలో బైట్ డ్యాన్స్ సంస్థ భారత్‌లో టిక్‌టాక్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ముంబైకి చెందిన గేమింగ్ సంస్థ స్కైస్పోర్ట్స్‌తో, ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ హీరా నందిని గ్రూప్‌కు చెందిన పేరెంట్ సంస్థ యోటా ఇన్ ఫ్రాస్టక్చర్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తమతో బైట్‌డ్యాన్స్ సంప్రదింపులు జరుపుతుందన్నారు. ఆ చర్చలు జరుగుతున్నాయని..త్వరలో టిక్‌టాక్‌ను వినియోగంలోకి తెస్తామని స్కై స్పోర్ట్స్ సీఈవో శివ నంది తెలిపారు. దీంతో పాటు బీజీఎంఐ సైతం గేమింగ్ ప్రియులు వినియోగించే అవకాశం త్వరలో రానుందని ఇన్‌స్ట్రాగ్రామ్ స్టోరీస్‌లో వెల్లడించారు. భారత్‌లో బీజీఎంఐపై బ్యాన్ విధించడంపై శివ నంది స్పందించారు. బీజీఎంఐను నిషేధించాలని కేంద్రం అనుకోకుండా నిర్ణయం తీసుకోలేదని, ఇందుకోసం సుమారు 5నెలల సమయం తీసుకుందన్నారు. కేంద్రం నిర్ణయంపై బీజీఎంఐ మాతృ సంస్థ క్రాఫ్టన్‌కు నోటీసులు అందించినట్లు చెప్పారు. టిక్‌టాక్‌తో పాటు బీజీఎంఐని వినియోగించే అవకాశం త్వరలో రానుంది. కేంద్రం బీజీఎంపై శాశ్వతంగా బ్యాన్ చేయలేదని.. తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
భారత్ టార్గెట్‌గా చైనా మరో కుట్ర, బీజీఎంఐ ముసుగులో
భారత్ టార్గెట్‌గా చైనా చేస్తున్న కుట్రల్ని కేంద్రం తిప్పికొట్టింది. బీజీఎంఐ ముసుగులో..భారత్ యూజర్ల డేటాను తస్కరించి, ఆ డేటాతో సైబర్ దాడులు జరిపేందుకు ప్రయత్నించిందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. పబ్జీకి ప్రత్యామ్నాయంగా విడుదలైన బీజీఎంఐ గేమ్‌తో చైనా గూఢా చార్యానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో ప్లే అవుతున్న బీజీఎంఐ గేమ్‌కు చైనాతో సత్సంబంధాలు ఉన్నాయని, కాబట్టే అండర్ సెక్షన్ 69ఏ ఐటీ యాక్ట్ కింద యాప్ స్టోర్ల నుంచి ఆ గేమ్‌ను బ్లాక్ చేసినట్లు పేర్కొంది. భారత్ టార్గెట్‌గా చైనా మరో కుట్ర భారత్ బ్యాన్ విధించిన బీజీఎంఐ యాప్‌లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆ యాప్‌లో ప్రమాదకరమైన కోడ్లు ఉన్నాయి. వాటి సాయంతో చైనాలో ఉన్న సర్వర్లతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఆ కోడ్ సాయంతో కెమెరా/మైక్రోఫోన్, లొకేషన్ ట్రాకింగ్, హానికరమైన నెట్‌వర్క్‌ల నుంచి యూజర్లపై నిఘూ, వారి డేటాను దొంగిలించి దుర్వినియోగం చేసే అవకాశం ఉన్న అన్నీ మార్గాల్లో ఈజీగా యాక్సిస్ అయ్యేలా అనుమతి పొందినట్లు తమ విశ్లేషణలో తేలినట్లు దేశ భద్రత దృష్ట్యా పేరు చెప్పిందేకు ఇష్ట పడని ఓ ఏజెన్సీ తెలిపింది. బీజీఎంఐపై నిషేధం తొలగిస్తాం గేమ్ నిషేధంపై క్రాఫ్టన్ ఇండియా సీఈవో సీన్ హ్యూనిల్ స్నోన్ (Sean Hyunil Sohn) స్పందించారు. మేం భారతీయ నియమ, నిబంధనల్ని, చట్టాల్ని గౌరవిస్తాం. యూజర్ల డేటా భద్రత విషయంలో చట్టాల్ని ఫాలో అవుతున్నాం. వాటికి కట్టుబడి ఉన్నాం. గేమ్‌పై విధించిన నిషేధాన్ని తొలగించుకోవడం . కష్టమే అయినా సంబంధిత అధికారులతో చర్చలు జరిపి,సమస్యని పరిష్కరిస్తామని క్రాఫ్టన్ ఇండియా సీఈవో ధీమా వ్యక్తం చేశారు. మేం ఏం తప్పు చేశాం ప్లే స్టోర్లలో తమ గేమ్‌ను బ్యాన్ విధించేంత తప్పు తాము ఏం చేశామో గూగుల్ ,యాపిల్ సంస్థల్ని అడుగుతామని క్రాఫ్టన్ వెల్లడించింది. నిషేదంపై గత కారణాల్ని ఆ రెండు సంస్థల నుంచి సేకరిస్తామని స్పష్టం చేశారు. -
ఆ గేమ్ కూడా పాయే.. బ్యాన్ చేసిన గూగుల్, ఆపిల్ సంస్థలు!
దేశంలో యువతను ఎంతగానో ఆకర్షించి తన వైపుకు తిప్పుకుంది పబ్జీ గేమ్(PUBG Game). అయితే ఎంత ఆదరణ పొందిందో అంతే స్థాయిలోనే విమర్శలను ఎదుర్కొంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ గేమ్‌కు బానిసలా మారి కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ పబ్జీ గేమ్‌ను బ్యాన్ చేసింది. ఆ తరువాత ఈ గేమ్ తన పేరు మార్చుకొని బీజీఎంఐ(BGMI)గా మళ్లీ దేశంలోకి ప్రవేశించింది. అయితే యాప్ నిర్వాహకులకు తాజాగా మరో సారి కేంద్రం ప్రభుత్వం షాకిచ్చింది. అసలేం జరిగింది.. క్రాఫ్టాన్ కంపెనీ బ్యాన్ అయిన పబ్జీని బీజీఎంఐ (BGMI) గేమ్‌గా మార్పు చేసి జూన్ 2021 రీలాంచ్ చేసింది. అతి తక్కువ కాలంలో ఈ గేమ్ పాపులర్ కావడంతో పాటు గూగూల్ ప్లేస్టోర్‌లో టాప్ 10 గేమింగ్ యాప్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ నెల ప్రారంభంలో ఈ గేమ్ 100 మిలియన్ రిజిష్టర్డ్ యూజర్లను పొందినట్లు బీజీఎంఐ ప్రతినిధులు కూడా వెల్లడించారు. అంతలో కేంద్ర ప్రభుత్వం ఈ గేమ్‌ని కూడా బ్యాన్ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. గూగుల్, ఆపిల్ సంస్థలు బీజీఎంఐ గేమ్‌ని తమ సంబంధిత యాప్ స్టోర్ల నుంచి తొలగించాయి. ఈ వ్యవహారంపై గూగుల్ స్పందిస్తూ వివరణ కూడా ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఈ బ్యాన్‌కి గల కారణాన్ని ప్రభుత్వం ఇంతవరకు వెల్లడించలేదు. చదవండి: Swiggy: స్విగ్గీ కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ -
ప్రాణం తీసిన పబ్జీ!
మచిలీపట్నం క్రైమ్: పబ్జీ గేమ్‌లో ఓడిపోయినందుకు అక్కలు ఆటపట్టించడంతో మనస్తాపం చెందిన బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నం న్యూహౌసింగ్‌బోర్డుకాలనీకి చెందిన ఊటుకూరి శాంతిరాజ్‌కు భార్య లక్ష్మీనరసమ్మతో మనస్పర్థలు రావడంతో 15 ఏళ్ల కిందట విడిపోయారు. వీరికి హైనీ, జెన్నీఫర్, పృధ్వీరాజ్, ప్రభు (16) పిల్లలు ఉన్నారు. శాంతిరాజ్ 2008లో శ్రీరాధికను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి పాప, బాబు ఉన్నారు. మొదటి భార్య తన పెద్ద కుమారుడు పృధ్వీరాజ్‌తో కలిసి విజయవాడలో ఉంటుండగా మిగిలిన ముగ్గురు పిల్లలు శాంతిరాజ్‌తో ఉంటున్నారు. శనివారం రాత్రి పెద్ద పిల్లలు ముగ్గురూ ఇంట్లో కూర్చుని పబ్జీ గేమ్ ఆడారు. ఆటలో ప్రభు ఓడిపోయాడు, దీంతో అక్కలిద్దరూ ఆట పట్టించారు. దీన్ని అవమానంగా భావించిన ప్రభు పక్క గదిలో పడుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆదివారం ఉదయం పొద్దెక్కినా ప్రభు గదిలో నుంచి బయటికి రాకపోవటంతో శాంతిరాజ్ గది వద్దకు వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో తండ్రి శాంతిరాజ్ పోలీసులకు సమాచారం అందించారు. నా బిడ్డది హత్యే.. ప్రభు ఆత్మహత్య విషయం తెలుసుకుని మచిలీపట్నం చేరుకున్న తల్లి లక్ష్మీనరసమ్మ తన బిడ్డది ఆత్మహత్య కాదని, హత్యేనంటూ విలపించింది. తనకు అన్యాయం చేసినట్లే తన బిడ్డకు శాంతిరాజ్, శ్రీరాధిక అన్యాయం చేశారంటూ ఆరోపించింది. ఉరి వేసుకున్న ప్రభు మర్మావయవాల నుంచి రక్తస్రావం కావటంతో తన బిడ్డది ముమ్మాటికీ హత్యేనంటూ ఆందోళనకు దిగింది. పోలీసులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ప్రాధేయపడింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టంనిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
బాలుడి ప్రాణాలు తీసిన పబ్జీ గేమ్