
సాక్షి, న్యూఢిల్లీ: భద్రత ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని భారత్‌లో చైనాకు సంబంధించిన అనేక యాప్స్‌ను నిషేధించిన వాటిలో అత్యంత ప్రాచూర్యం పొందిన టిక్‌టాక్, పబ్జీ మొబైల్ వెర్షన్ కూడా ఉన్నాయి. అయితే పబ్జీ ప్రియులకు త్వరలోనే శుభవార్త రాబోతున్నట్లు అనిపిస్తోంది. పబ్జీ మొబైల్ ఇండియాకు తిరిగిరాబోతున్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి. ఎందుకంటే పబ్‌జీ కార్పొరేషన్ యాజమాన్య సంస్థ అయిన దక్షిణ కొరియాకు చెందిన కాఫ్రన్ ఇండియాలో నియామకాలు చేపట్టింది.
ఈ నెల 20వ తేదీన లింక్డ్ ఇన్ లో ఉద్యోగ నియామకాలను ప్రకటిస్తూ, పోస్ట్ పెట్టింది. కార్పొరేట్ డెవలప్ మెంట్ డివిజన్ మేనేజర్ స్థాయి పోస్టులు కూడా ఇందులో ఉన్నాయి. దీంతో గేమింగ్ యాప్ తిరిగి ఇండియాలో మొదలవుతుందన్న వార్తలకు బలం చేకూరుతోంది. అయితే, ఈ యాడ్ చైనా సంస్థ టెన్సెంట్ పేరిట కాకుండా, క్రాఫన్ పేరిట కనిస్తోంది. అయితే, ప్రస్తుతం పబ్ జీపై భారత్‌లో నిషేధం అమలవుతున్నా,ఇప్పటి వరకు డౌన్‌లోడ్ చేసుకున్నవారితో పాటు కంప్యూటర్లలలో కూడా ఈ గేమ్ అందుబాటులోనే ఉంది. అయితే కొత్తగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం లేదు. చదవండి: సడన్‌గా లేచి.. కాల్చండని కేకలు
Comments
Please login to add a commentAdd a comment