పబ్‌జీ గేమింగ్‌ ప్రియులకు మరో చేదువార్త | PUBG India Avatar Battlegrounds Mobile Should Be Banned | Sakshi
Sakshi News home page

పబ్‌జీ గేమింగ్‌ ప్రియులకు మరో చేదువార్త

Published Sun, May 23 2021 8:43 PM | Last Updated on Sun, May 23 2021 9:26 PM

PUBG India Avatar Battlegrounds Mobile Should Be Banned - Sakshi

పబ్‌జీ ఈ గేమ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి ఈ గేమ్ ఆడే ఉంటారు. అయితే, ఈ గేమ్ ని దేశ భద్రత కారణాల రీత్యా మన దేశంలో నిషేదించిన సంగతి తెలిసిందే. పబ్‌జీ మొబైల్ ఇండియా కొత్త పేరుతో తిరిగి భారత్ లోకి రాబోతున్న విషయం మనకు తెలుసు. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ పేరుతో ఇండియాలోకి రాబోతున్న పబ్‌జీని దేశంలోకి విడుదల చేయకుండా ఉండలని కోరుతూ అరుణాచల్ ప్రదేశ్ శాసన సభ సభ్యుడు నినోంగ్ ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన ఒక లేఖ రాశారు. 

ఈ కొత్త గేమ్ ను దేశంలోకి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్న క్రాఫ్ట్టన్ భారతీయ చట్టాలను పక్కదారి పట్టించినట్లు ఆయన ఆరోపించారు. “కేవలం చిన్న చిన్న మార్పులు చేసి అదే గేమ్ ని తిరిగి తీసుకొనిరావడానికి, పిల్లలతో సహా లక్షలాది మంది దేశీయ పౌరుల డేటాను ఇతర విదేశీ కంపెనీలకు, చైనా ప్రభుత్వానికి బదిలీ చేయడానికి కంపెనీ మోసం చేస్తున్నట్లు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పాసిఘాట్ వెస్ట్ అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న” ఎరింగ్ తన లేఖలో తెలిపారు. దీనికి సంబందించిన మూడు పేజీల లేఖ కాపీని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

దక్షిణ కొరియా కంపెనీ ఇటీవల ఇండియాలోకి బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ గేమ్ ను తిరిగి తీసుకురావడం కోసం గూగుల్ ప్లే స్టోర్ లో ప్రీ రిజిస్ట్రేషన్లు తీసుకోవడం ప్రారంభించింది. ఎప్పుడు మనం దేశంలో విడుదల చేస్తారో అనే దానిపై స్పష్టత లేదు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం నిషేధించిన పబ్జీ మొబైల్ ఇండియా మరో రూపమే ఈ గేమ్. ఈ నిషేదం తర్వాత భారతదేశంలో తిరిగి తీసుకొనిరావడనికి చైనా కంపెనీ టెన్సెంట్ గేమ్స్ నుంచి ప్రచురణ & పంపిణీ హక్కులను క్రాఫ్ట్టన్ తీసుకుంది. అందుకే ఈ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాని దేశంలోకి మళ్లీ తీసుకొని రాకుండా ఉండటానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఒకవేల దీనికి ఆమోదం లభిస్తే, టిక్ టాక్ వంటి ఇతర చైనీయ యాప్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాడు.

చదవండి:

ఫోన్‌లోనే శరీరంలోని ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోండిలా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement