భారత్ టార్గెట్‌గా చైనా చేస్తున్న కుట్రల్ని కేంద్రం తిప్పికొట్టింది. బీజీఎంఐ ముసుగులో..భారత్ యూజర్ల డేటాను తస్కరించి, ఆ డేటాతో సైబర్ దాడులు జరిపేందుకు ప్రయత‍్నించిందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. పబ్జీకి ప్రత్యామ్నాయంగా విడుదలైన బీజీఎంఐ గేమ్‌తో చైనా గూఢా చార్యానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో ప్లే అవుతున్న బీజీఎంఐ గేమ్‌కు చైనాతో సత్సంబంధాలు ఉన్నాయని, కాబట్టే అండర్ సెక్షన్ 69ఏ ఐటీ యాక్ట్ కింద యాప్ స్టోర్‌ల నుంచి ఆ గేమ్‌ను బ్లాక్ చేసినట్లు పేర్కొంది.
భారత్ టార్గెట్‌గా చైనా మరో కుట్ర
భారత్ బ్యాన్ విధించిన బీజీఎంఐ యాప్‌లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆ యాప్‌లో ప్రమాదకరమైన కోడ్‌లు ఉన్నాయి. వాటి సాయంతో చైనాలో ఉన్న సర్వర్‌లతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఆ కోడ్ సాయంతో కెమెరా/మైక్రోఫోన్, లొకేషన్ ట్రాకింగ్, హానికరమైన నెట్‌వర్క్‌ల నుంచి యూజర్లపై నిఘూ, వారి డేటాను దొంగిలించి దుర్వినియోగం చేసే అవకాశం ఉన్న అన్నీ మార్గాల్లో ఈజీగా యాక్సిస్ అయ్యేలా అనుమతి పొందినట్లు తమ విశ‍్లేషణలో తేలినట్లు దేశ భద్రత దృష్ట్యా పేరు చెప్పిందేకు ఇష్ట పడని ఓ ఏజెన్సీ తెలిపింది.
బీజీఎంఐపై నిషేధం తొలగిస్తాం
గేమ్ నిషేధంపై క్రాఫ్టన్ ఇండియా సీఈవో సీన్ హ్యూనిల్ స్నోన్ (Sean Hyunil Sohn) స్పందించారు. మేం భారతీయ నియమ, నిబంధనల్ని, చట్టాల్ని గౌరవిస్తాం. యూజర్ల డేటా భద్రత విషయంలో చట్టాల్ని ఫాలో అవుతున్నాం. వాటికి కట్టుబడి ఉన్నాం. గేమ్‌పై విధించిన నిషేధాన్ని తొలగించుకోవడం . కష్టమే అయినా సంబంధిత అధికారులతో చర్చలు జరిపి,సమస్యని పరిష్కరిస్తామని క్రాఫ్టన్ ఇండియా సీఈవో ధీమా వ్యక్తం చేశారు.
మేం ఏం తప్పు చేశాం
ప్లే స్టోర్‌లలో తమ గేమ్‌ను బ్యాన్ విధించేంత తప్పు తాము ఏం చేశామో గూగుల్ ,యాపిల్ సంస్థల్ని అడుగుతామని క్రాఫ్టన్ వెల్లడించింది. నిషేదంపై గత కారణాల్ని ఆ రెండు సంస్థల నుంచి సేకరిస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment